అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరంలో ప్రతిష్టించబోయే రాముడి విగ్రహం ధనుర్ధారిగానే ఉండనుంది. పవిత్ర కృష్ణశిలలో 5 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని తొలుస్తారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజా భేటీలో విగ్రహం రూపురేఖలను ఖరారు చేశారు.
రాముడు విల్లుబాణాలు చేబూని నిలబడినట్లుగా విగ్రహం ఉంటుందని ట్రస్టు సభ్యుడు స్వామి తీర్థ ప్రసన్నాచార్య బుధవారం చెప్పారు. వచ్చే సంక్రాంతి నాటికి మందిర నిర్మాణం పూర్తవుతుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment