ram mandir construction
-
11నుంచి అయోధ్యలో వార్షికోత్సవాలు
అయోధ్య: అయోధ్య ఆలయంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జనవరి 11వ తేదీన సీఎం యోగి ఆదిత్యనాథ్ అభిషేకం జరిపించనున్నారు. ప్రతిష్ఠా ద్వాదశి వార్షికోత్సవాలు 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. రామాలయం సమీపంలోని ‘అంగద్ తిల’లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా సీఎం యోగి ప్రారంభించనున్నారు. ప్రముఖ గాయకుల భక్తి గీతాల రికార్డును కూడా ఆయన విడుదల చేస్తారని అధికారులు చెప్పారు. అంతేకాకుండా, అయోధ్యలోని లతా చౌక్, జన్మభూమి పథ్, శ్రింగార్ హాట్, రామ్ కీ పైడీ, సుగ్రీవ ఫోర్ట్, చోటి దేవ్‌కాళి ప్రాంతాల్లో యువ కళాకారులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, గీతా లాపన వంటివి ఉంటాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. ఆలయ గర్భగుడి వద్ద ‘శ్రీరామ్ రాగ్ సేవ’కార్యక్రమం కూడా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా దేశ వ్యాప్తంగా ఉన్న సాధువులు, భక్తులకు ఆహ్వానాలు పంపామని వెల్లడించారు. -
దేశ గౌరవం పెంచిన మోదీ: అమిత్ షా
మైసూరు: ‘‘అయోధ్యలో రామమందిర నిర్మాణంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు. తద్వారా అంతర్జాతీయ వేదికలపై దేశ సాంస్కృతిక గౌరవాన్ని ఇనుమడింపజేశారు. దేశాన్ని సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంతోపాటు యోగ, ఆయుర్వేద, భారతీయ భాషల పరిరక్షణకు మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆదివారం ఆయన మైసూరు సమీపంలోని సుత్తూరు జాతరలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మైసూరులోని చాముండి హిల్స్‌పై కొలువుదీరిన చాముండేశ్వరీ మాతను దర్శించుకుని పూజలు చేశారు. -
హిందూ కార్యకర్త పూజారికి బెయిల్
హుబ్బళ్లి: మూడు దశాబ్దాల క్రితం నాటి రామాలయ ఉద్యమ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న హిందూ కార్యకర్త శ్రీకాంత్ పూజారి శనివారం బెయిల్‌పై విడుదలయ్యాడు. పెండింగ్ కేసులను పరిష్కరిస్తున్న క్రమంలో 2023 డిసెంబర్లో పూజారి కేసు బయటకు వచి్చంది. 1992లో రామాలయం ఉద్యమంలో పాలుపంచుకున్న అతడిపై అక్రమ మద్యం విక్రయం తదితర 16 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. రెండు పోలీస్ స్టేషన్లలో అతడిపై రౌడీషీట్ కూడా ఉంది. పోలీసులు తనను మార్కెట్‌కు వెళదామంటూ తీసుకొచి్చ, కటకటాల వెనుక పడేసినట్లు పూజారి ఆరోపించాడు. తనపై ఎటువంటి కేసులు లేవన్నాడు. బెయిల్‌పై తన విడుదలకు సహకరించిన హిందూ సంస్థలకు రుణపడి ఉంటానని అన్నాడు. రామాలయం కోసం పోరాడిన తను తిరిగి అయోధ్యకే వెళతానని చెప్పాడు. -
‘దేవాలయాలు.. ప్రభుత్వ విధి కాదు’ కాంగ్రెస్ ఎంపీ విమర్శలు
అయోధ్యలో జనవరి 22న ఘనంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వేల మంది ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ క్రమంలో రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేని తెలిపారు. మతం అనేది వ్యక్తిగతమైన విశ్వాసమని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని అన్నారు. అయితే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీడియా విపరీతమైన ప్రచారం కల్పించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల నుంచి పక్కదారి పడతాయని తెలిపారు. Was interrogated by the waiting press, wanting to know if I would be going to Ayodhya on January 22. I told them I hadn’t been invited but I saw religion as a personal attribute and not one for political (mis)use. I also pointed out that by making such a major news story of the… pic.twitter.com/LQpybKbT3t — Shashi Tharoor (@ShashiTharoor) December 27, 2023 దేవాలయాలను పర్యవేక్షించడం ప్రభుత్వం విధి కాదని అన్నారు. నిరుద్యోగం, ధర పెరుగదల, ప్రజల సంక్షేమం, దేశ భద్రత మొదలైన వాటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని తెలిపారు. అయితే మీడియా రామ మందిర ప్రారంభోత్సవం మీద దృష్టి పెట్టడంతో.. దేశంల్లో ఉన్న పలు సమస్యలు పక్కదారి పడతాయని ‘బీజేపీ’ పేరు ఎత్తకుండానే ‘ఎక్స్’ ట్వీటర్ వేదికగా శశి థరూర్ విమర్శలు గుప్పించడం గమనార్హం. చదవండి: ‘పార్లమెంట్ చీకటి గదిలా మారింది’ -
రామ మందిర వేడుకకు మమతా బెనర్జీ దూరం?
కోల్‌కతా: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉండనున్నట్లు సమచారం. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి ప్రతినిధిని పంపే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు బీజేపీ ఇప్పటికే ఆహ్వానాలను పంపించింది. దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సహా దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతలకు కేంద్రం ఆహ్వానాలు పంపించింది. ఈ క్రమంలో రామమందిర కార్యక్రమాన్ని లోక్‌సభ ఎన్నికల ప్రచారంగా బీజేపీ వాడుకోనుందని టీఎంసీ ఆరోపిస్తోంది. అటు.. రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని సీతారాం ఏచూరి తిరస్కరించారు. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు హాజరు కానున్నారు. వీరితో పాటు దాదాపు 6,000 మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: మోదీ యూట్యూబ్ సబ్స్రైబర్లు 2 కోట్లు -
అయోధ్యలో ప్రతిష్టాపనకు ప్రధానికి ఆహ్వానం
అయోధ్య: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. జనవరిలో జరుగనున్న ఆలయ ప్రారంబోత్సవానికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. గర్భాలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహ ప్రతిష్టాపన వేడుకలో పాల్గొనాలని కోరుతూ ప్రధాని మోదీకి అధికారికంగా ఆహా్వనం పంపించినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 15 నుంచి 24వ తేదీల మధ్య సమయం ఇవ్వాలని కోరామని, ఈ మేరకు ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్ దాస్ సంతకంతో లేఖ రాశామని తెలిపారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి దేశ విదేశీ ప్రముఖులతోపాటు లక్షలాది మంది సామాన్య భక్తులు తరలివస్తారని, ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ట్రస్టు భావిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ 2020 ఆగస్టులో స్వయంగా భూమిపూజ చేశారు. -
‘అయోధ్య’ తొలి అంతస్తు దాదాపు పూర్తి
న్యూఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ పనులు వేగం పుంజుకున్నాయి. ఆలయాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మిస్తుండగా తొలి అంతస్తు నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. ఈ వివరాలను ఆలయ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘ ఈ ఏడాది అక్టోబర్‌కల్లా గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం పూర్తి అవుతుంది. నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా స్వయంగా ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణ పనులపై తాజా సమీక్షా సమావేశంలో నిర్మాణసంస్థలు లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ వారి నిపుణులు, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. రోజువారీగా పనుల పర్యవేక్షణ కొనసాగుతోంది. గర్భగుడితో ఉన్న ప్రధాన ఆలయంతోపాటు నృత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం ఇలా ఐదు మండపాలనూ నిర్మిస్తున్నారు. ఐదు మండపాలపై 34 అడుగుల పొడవు, 32 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తు ఉండే గుమ్మటాలను ఏర్పాటుచేస్తారు. ఇవి భక్తులకు ఆలయం ప్రాంగణం నుంచి 69 అడుగుల నుంచి 111 అడుగుల ఎత్తుల్లో గోచరిస్తాయి. ప్రధాన ఆలయం పొడవు 380 అడుగులుకాగా, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. మొత్తం గర్భగుడి నిర్మాణంలో మక్రానా మార్బుల్‌తో చెక్కిన స్తంభాలు, పైకప్పు, కుడ్యాలను వినియోగించనున్నారు. ఆలయ బరువు, అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకునేలా మొత్తంగా 392 భారీ స్తంభాలను ప్రధాన ఆలయం కోసం వాడుతున్నారు. గర్భగుడి ద్వారాలకు బంగారు పూత పూయనున్నారు. ఆలయ ప్రాకారంతో కలిపి రామాలయ విస్తీర్ణం 8.64 ఎకరాలు. ఆలయ ప్రాకారం పొడవు 762 మీటర్లుకాగా లోపలి ప్రాంగణంలో మొత్తం ఆరు ఆలయాలు నిర్మిస్తారు. భక్తుల కోసం విడిగా సదుపాయం కల్పిస్తారు’ అని ఆ ప్రకటన పేర్కొంది. -
అయోధ్యలో రామమందిరంలో.. ధనుర్ధారిగా రామయ్య విగ్రహం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరంలో ప్రతిష్టించబోయే రాముడి విగ్రహం ధనుర్ధారిగానే ఉండనుంది. పవిత్ర కృష్ణశిలలో 5 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని తొలుస్తారు. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తాజా భేటీలో విగ్రహం రూపురేఖలను ఖరారు చేశారు. రాముడు విల్లుబాణాలు చేబూని నిలబడినట్లుగా విగ్రహం ఉంటుందని ట్రస్టు సభ్యుడు స్వామి తీర్థ ప్రసన్నాచార్య బుధవారం చెప్పారు. వచ్చే సంక్రాంతి నాటికి మందిర నిర్మాణం పూర్తవుతుందని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. -
అసాధ్యాలను సుసాధ్యం చేసిన మోదీ: అమిత్ షా
సిమ్లా: ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం సహా గతంలో అందరూ అసాధ్యమని భావించిన వాటిని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుసాధ్యం చేసి చూపిందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం సిర్మౌర్ జిల్లాలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దవుతుందని మీలో ఎవరైనా ఊహించారా? అంటూ హాజరైన వారినుద్దేశించి ఆయన ప్రశ్నించారు. జవహర్ లాల్ నెహ్రూ తీసుకువచ్చిన ఆర్టికల్ 370ను గురించి ఎవరైనా ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు మిన్నకుండి పోతారని ఎద్దేవా చేశారు. అయోధ్యలో మందిర నిర్మాణం అసాధ్యమని కాంగ్రెస్ పెదవి విరిస్తే తాము బృహత్ రామాలయం పనులను ప్రారంభించామని చెప్పారు. ‘వంశ రాజకీయాలకు ప్రధాని మోదీ ముగింపు పలికారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌కు కర్తవ్యపథ్గా పేరు పెట్టి, సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు’అని అమిత్ షా అన్నారు. ప్రపంచంలోని ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్.. మోదీ నాయకత్వంలో ఐదో స్థానానికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. -
Gaurav Yatra: నెహ్రూ వల్లే కశ్మీర్ సమస్య
జంజార్కా/ఉనాయ్(గుజరాత్): కశ్మీర్ సమస్యకు దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూయే కారణమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నెహ్రూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 370ను రద్దు చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసినప్పటికీ అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ఆయన గురువారం అహ్మదాబాద్ జిల్లా జంజర్కా, ఉనాయ్లలో బీజేపీ ‘గౌరవ్ యాత్ర’ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా పైవ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370ను రాజ్యాంగంలో చేర్చుతూ నెహ్రూ చేసిన తప్పిదం వల్లే కశ్మీర్ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఆ ప్రాంతం దేశంతో సరిగ్గా విలీనం కాలేదు. దీంతో ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370ను తొలగించాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ 2019లో ఒక్క వేటుతో 370ను రద్దు చేసి, కశ్మీర్‌ను దేశంతో విలీనం చేశారు’అని అమిత్ షా చెప్పారు. ‘అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ బీజేపీ చేసిన వాగ్దానాన్ని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. కానీ, మందిరం ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతోంది’అని అన్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 ఎయిర్ స్ట్రైక్స్‌ను ఆయన ప్రస్తావిస్తూ.. సీమాంతర ఉగ్రవాదంపై మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందన్నారు. గతంలో యూపీఏ హయాంలో పాక్ ఆర్మీ మన సైనికుల తలలను నరికి, వెంట తీసుకెళ్లింది. 2014లో మన ప్రభుత్వం వచ్చాక కూడా అలాగే చేయాలని చూసింది. కానీ, ఇది మౌని బాబా (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశిస్తూ) ప్రభుత్వం కాదన్న విషయం వాళ్లు మరిచారు. ఉగ్రదాడులకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మోదీ ప్రభుత్వం గుణపాఠం చెప్పింది’అని అమిత్ షా అన్నారు. ‘గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఏడాదిలో 365 రోజులకు గాను 200 రోజులు కర్ఫ్యూయే అమలయ్యేది. కానీ, నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక గత 20 ఏళ్లలో అలాంటి పరిస్థితులు లేవు’అని చెప్పారు. దేశానికి భద్రత కల్పించడం, దేశాన్ని అభివృద్ధి చేసే సామర్థ్యం కాంగ్రెస్‌కు లేవని విమర్శించారు. ఇదీ చదవండి: ఉద్ధవ్ థాక్రే వర్గానికి భారీ ఊరట -
రామాలయం 40 శాతం పూర్తి
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు 40 శాతం దాకా పూర్తయ్యాయి. వాటికి రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తెలిసిందే. 2023 డిసెంబర్‌కల్లా పనులన్నీ పూర్తయి భక్తుల దర్శనానికి మందిరం సిద్ధమవుతుందని రామజన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ ఆదివారం తెలిపారు. మందిరం కనీసం వెయ్యేళ్లదాకా చెక్కుచెదరకుండా ఉండేలా పునాదులను సువిశాలంగా, భారీగా నిర్మిస్తున్నారు. మందిర నిర్మాణానికి దాదాపు 9 లక్షల క్యూబిక్ అడుగుల మక్రానా మార్బుల్ రాళ్లు వాడుతున్నారు. ప్రధానాలయ నిర్మాణంలో గులాబీ, గర్భాలయానికి, ఫ్లోరింగ్‌కు తెల్ల రాయి వాడుతున్నారు. మందిరానికి దారితీసే మార్గాల్లో రోడ్డు విస్తరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. -
2023 ఆఖరి నుంచి అయోధ్య రాముడి దర్శనం!
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారమే వేగంగా సాగుతున్నాయి. 2023 సంవత్సరాంతం నుంచి అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తులను అనుమతించే అవకాశం ఉందని రామమందిరం ట్రస్టు వర్గాలు బుధవారం తెలిపాయి. మొత్తం నిర్మాణం 2025 నాటికి పూర్తవుతుందని వెల్లడించాయి. ప్రధాన ఆలయం మూడు అంతస్తులతో ఉంటుందని, ఐదు మండపాలు ఉంటాయని పేర్కొన్నాయి. రామమందిరం నిర్మాణం, దేవుడి దర్శనం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అంతకంటే ముందే మందిర నిర్మాణం పూర్తయి, దర్శనాలకు అనుమతి లభిస్తే అధికార బీజేపీకి గణనీయంగా లబ్ధి చేకూరడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి మరో ప్రచారాస్త్రం సిద్ధమవుతోందని అంటున్నారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, జగిత్యాల: అయోధ్యలో చేపట్టనున్న రామమందిర నిర్మాణానికి ఎవ్వరూ విరాళాలు ఇవ్వవద్దంటూ కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో జరిగిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన గ్రామాల్లో రామాలయాలు ఉండగా అయోధ్య రామాలయం మనకెందుకు అంటూ ఆయన ప్రజలనుద్దేశంచి ప్రసంగించారు. రామమందిరం పేరుతో బీజేపీ నాయకులు బిచ్చమెత్తుకుంటున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. తామంతా శ్రీరాముడి భక్తులమేనని, బొట్టు పెట్టుకుంటేనే భక్తులమవుతామా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రతి హిందువు కల అని, ఇందులో భాగంగానే ప్రతి హిందువును భాగస్వామ్యం చేయాలని నిధులను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. రామాలయం నిర్మాణ నిధి కోసం తాము ఎవరిని ఒత్తిడి చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో మందిర నిర్మాణానికి అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. బీజేపీ నేతలు కలెక్షన్లు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, గత కొంత కాలంగా రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇందుకు మరింత ఆజ్యం పోశాయి. బీజేపీ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేస్తుంటే, టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. -
పొగుడుతూనే చురకలంటించిన ప్రధాని
-
నితీష్‌ని ఇరకాటంలో పడేసిన మోదీ
పట్నా: బిహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు మిథిలా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మందిర నిర్మాణ ప్రస్తావన తీసుకువచ్చి.. నితీష్ కుమార్‌పై పరోక్ష విమర్శలు చేశారు. వెంటనే ఆయన పాలనలో బిహార్ బాగా అభివృద్ధి చెందింది అంటూ పొగిడారు. వివరాలు.. బిహార్‌లో రెండో రోజు ఉమ్మడి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి నితీష్‌తో కలిసి హజరయ్యారు మోదీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘శతాబ్దాల తపస్సు తర్వాత చివరకు అయోధ్యలో ఒక గొప్ప రామ మందిరం నిర్మిస్తున్నాం. గతంలో ప్రతిపక్షాలు ఈ విషయంలో మమ్మల్ని ‘మందిర నిర్మాణం ఎప్పటి వరకు పూర్తి చేస్తారు.. తేదీ చెప్పండి’ అంటూ ఎద్దేవా చేసేవారు. కానీ ఇప్పుడు వారు కూడా ప్రశంసించవలసిన పరిస్థితి. బీజేపీ-ఎన్డీఏ కూటమి గుర్తింపు ఇదే. చెప్పింది చేయగల సత్త మాకు ఉంది. ఈ రోజు మాత సీత తన జన్మస్థలం మిథిలాతో పాటు అయోధ్య వైపు కూడా ఆనందంగా చూస్తుంది’ అన్నారు మోదీ. (చదవండి: తప్పుపట్టడమే కాంగ్రెస్ నైజం) అయితే మందిర నిర్మాణం గురించి మోదీ చేసిన వ్యాఖ్యలు నితీష్ కుమార్‌ని ఉద్దేశించే చేశారని భావిస్తున్నారు. ఎందుకంటే 2015 ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్‌తో భాగస్వామిగా ఉన్నారు. ఆ సమయంలో మందిర నిర్మణాన్ని ఉద్దేశిస్తూ.. ‘బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రామ్ లల్లా మేం అధికారంలోకి వస్తాం.. మందిరాన్ని నిర్మిస్తాం.. కానీ ఖచ్చితమైన తేదీని మాత్రం ప్రకటించలేము అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అంటూ నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. వీటిని దృష్టిలో పెట్టుకుని నేడు మోదీ ప్రతిపక్షాలతో పాటు స్వపక్షం నితీష్ కుమార్‌పై కూడా విమర్శలు చేశారు. (చదవండి: బిహార్ ఎన్నికలపై ‘మద్యం’ ప్రభావం!) ఆ తర్వాత వెంటనే నితీష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. గత 15 సంవత్సరాలలో నితీష్ జీ నాయకత్వంలో బిహార్ ఎంతో అభివృద్ధి సాధించింది అన్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి నితీష్ జీ ఎంతో కృషి చేశారని తెలిపారు. అలానే భావి ముఖ్యమంత్రి అంటూ నితీష్‌ను పిలిచారు. గత వారం మరో ఉమ్మడి ర్యాలీలో, ఆర్టికల్ 370 పై నితీష్ కుమార్ ప్రత్యర్థులు తేజస్వీ యాదవ్, చిరాగ్ పాశ్వాన్లు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు మోదీ. "ఎన్డీఏ ప్రభుత్వం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. కానీ (తేజస్వీ యాదవ్)వారు అధికారంలోకి వస్తే తిరిగి తీసుకువస్తామని చెప్పారు. ఇలాంటి ప్రకటనలు చేసిన తరువాత వారు బిహార్ నుంచి ఓట్లు అడగడానికి ధైర్యం చేస్తున్నారు. దేశ రక్షణ కోసం తమ బిడ్డలను సరిహద్దులకు పంపే రాష్ట్రానికి ఇది అవమానం కాదా" అని మోదీ ప్రశ్నించారు. (చదవండి: లాలూకి బెయిల్.. నితీష్‌కు ఫేర్వల్) ఈ రోజు బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభం అయ్యింది. 71 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. తదుపరి రెండు రౌండ్లు నవంబర్ 3, 7 తేదీలలో జరుగుతాయి. నవంబర్ 10 న ఫలితాలు వెలువడతాయి. -
తప్పుపట్టడమే కాంగ్రెస్ నైజం
డెహ్రీ/గయ/భగల్పూర్: దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా వ్యతిరేకించాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మూడు ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. రోహ్తస్, గయ, భగల్పూర్ సభల్లో పాల్గొని తన ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సభల్లో ప్రధానితో పాటు బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వేదికను పంచుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆర్జేడీ ప్రభుత్వం రాష్ట్రంలో నేరమయ, దోపిడీ పాలన సాగించిందని ప్రధాని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, సరిహద్దుల్లో మిలటరీ ఆపరేషన్లు.. ఇలా తమ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాతి ప్రయోజన నిర్ణయాలను కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకించాయని మోదీ పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 370 రద్దు కోసం దేశమంతా ఎదురు చూడలేదా? ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ ఆ అధికరణను అమల్లోకి తీసుకు వస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి తన పిల్లలను పంపించిన బిహార్ ప్రజలను ఇది అవమానించడం కాదా? అయినా, ఓట్లు వేయండంటూ మీ దగ్గరకే రావడానికి వారికి ఎంత ధైర్యం?’ అని ప్రధాని మండిపడ్డారు. గల్వాన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ‘దేశం కోసం బిహార్ బిడ్డలు ప్రాణాలర్పించారే కానీ.. దేశమాతను తలదించుకునేలా చేయలేదు’ అన్నారు. విపక్షాలు దళారుల తరఫున మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సమయంలోనూ అవి దళారులు, మధ్యవర్తుల తరఫుననే మాట్లాడాయని విమర్శించారు. మొదట పాల్గొన్న డెహ్రీ సభలో ఇటీవల మరణించిన ఎల్జేపీ నేత, కేబినెట్ సహచరుడు రామ్‌విలాస్ పాశ్వాన్, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్‌లకు నివాళులర్పిస్తూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. లాలు నేతృత్వంలో ఆ చీకటి పాలనను బిహార్ ప్రజలు మర్చిపోలేరన్నారు. సైనికులను ప్రధాని అవమానించారు తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని చెప్పి ప్రధాని మోదీ సైనికులను అవమానించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వచ్చారన్నది వాస్తమన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో జరిగిన ప్రచార సభలో శుక్రవారం రాహుల్ పాల్గొన్నారు. చైనా సైనికులను ఎప్పుడు వారి భూభాగంలోకి తరిమేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో బిహార్‌కు చెందిన వలస కార్మికులను ఇతర రాష్ట్రాల్లో తరిమేశారని, అయినా ప్రధాని ఏమీ మాట్లాడలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. -
సెప్టెంబర్ 17 నుంచి మందిర నిర్మాణం
లక్నో: అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులు సెప్టెంబర్ 17 తర్వాత ప్రారంభమవుతాయని రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ శనివారం తెలిపారు. హిందువులు తమ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలిపిన కాలం పిత్రు పక్షం ఈనెల 17 వరకు ముగియనుందని ఆ తరువాత పనులు ప్రారంభమై నిరాటంకంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. 12,879 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించడానికి దేశంలోని ప్రముఖ నిర్మాణ సంస్థలు లార్సెన్, టౌబ్రో సిద్ధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆలయ పునాది కోసం సుమారు 1,200 స్తంభాలను భూమి నుంచి 100 అడుగుల లోతులో వేయనున్నట్లు తెలిపారు. ఈ స్తంభాలు రాతి, ఇనుముతో చేయబడి ఉంటాయన్నారు. (చదవండి: మసీదు నిర్మాణానికి పిలుపు అందితే వెళ్తారా?) మందిర నిర్మాణం కోసం ఈ సంస్థలు ముంబై, హైదరాబాద్ నుంచి భారీ యంత్రాలను తీసుకు రానున్నట్లు తెలిపారు. సుమారు 100 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటారని.. వారందరికీ ముందే కరోనా పరీక్షలు చేయిస్తామన్నారు. థర్మల్ స్రీనింగ్ తర్వాతే విధుల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఈ వారం ప్రారంభంలో, అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ (ఏడీఏ) రెండు లేఅవుట్లను ఆమోదించింది. ఒకటి రామ మందిరానికి సంబంధించింది కాగా మరొకటి మొత్తం రామ జన్మభూమి క్యాంపస్ లే అవుట్. ఇప్పటికే ఏడీఏ బ్యాంక్ ఖాతాలో మందిర నిర్మణానికి అవసరమైన 2.11 కోట్ల రూపాయలను జమ చేసింది. సెప్టెంబర్ 4 న లే అవుట్లను ట్రస్ట్‌కు అప్పగించింది. ప్రతిపాదిత రామ్ మందిరం 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు మరియు 161 అడుగుల ఎత్తుతో ఐదు గోపురాలను కలిగి ఉంటుంది. ట్రస్ట్ ప్రకారం.. ఆధునిక పద్ధతులను ఉపయోగించి ఆలయ పునాది వేయబడుతుంది, తద్వారా ఇది 1,500 సంవత్సరాలకు పైగా మన్నికగా ఉండగా మందిర నిర్మాణం 1,000 సంవత్సరాల వరకు చెక్కు చెదరదు. భూకంపాలు, తుఫానులను తట్టుకోగలిగే విధంగా ఆలయ పునాదిని బలోపేతం చేయడానికి సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిబిఆర్ఐ), రూర్కీ, ఐఐటీ మద్రాసుల నిపుణులు ముందుకు వచ్చారు. దశాబ్దాల నాటి అయోధ్య వివాదాలో రామ్ మందిరానికి అనుకూలంగా 2019 నవంబర్ 9 న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. గత నెలలో అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆలయానికి పునాది వేశారు. -
ఆదిపురుష్.. జక్కన్న రియాక్షన్
‘బాహుబలి’ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన 21వ చిత్రం చేసేందుకు అంగీకరించారు ప్రభాస్. ఇది ఇలా ఉండగానే ఆకస్మాత్తుగా 22వ చిత్రం ‘ఆదిపురుష్’ని ప్రకటించారు డార్లింగ్. ఈ చిత్రానికి ‘తానాజీ’ ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదలయిన మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. (మరో మేకోవర్) ఇక ‘బాహుబలి’తో ప్రభాస్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిపురుష్’ ప్రాజెక్ట్ గురించి నాకు ముందే తెలుసు. పోస్టర్‌ను నేను అందరి కంటే ముందు చూశాను. అద్బుతంగా ఉంది. రాముడి పాత్రకు ప్రభాస్ సరిగ్గా సెట్ అవుతాడు. ప్రస్తుతం అయోధ్యలో మందిరం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ సినిమాను రూపొందించాలనే నిర్ణయం నిజంగా అభినందనీయం. దేశమంతటా రాముడి గురించి చర్చ జరుగుతున్న సమయంలో రాముడిపై సినిమా వస్తే మరింత బాగుంటుంది. ఈ సినిమా ప్రభాస్ స్థాయిని పెంచుతుంది. ఈ సినిమా కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారు. ఒక విజువల్ వండర్‌గా ఈ సినిమా ఉంటుందని ఆశిస్తున్నాను’ అన్నారు జక్కన్న -
అయోధ్యలో మందిర నిర్మాణం ప్రారంభం
అయోధ్య: అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. వచ్చే మూడు–మూడున్నరేళ్లలో మందిరం పూర్తవుతుందని నిర్మాణ పనుల్ని పర్యవేక్షించే ట్రస్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెల్లడించింది. భారత్‌కు చెందిన అత్యంత పురాతన నిర్మాణ శైలితో పటిష్టంగా మందిర నిర్మాణాన్ని చేస్తున్నట్టుగా తెలిపింది. దీనికి సంబంధించి ట్రస్ట్ వరుస ట్వీట్లు చేసింది. ‘‘ఎల్ అండ్ టీ సంస్థతో పాటుగా సీబీఆర్ఐ రూర్కీ, ఐఐటీ మద్రాస్ ఇంజనీర్లు మందిర నిర్మాణ స్థలంలో మట్టిని పరీక్షిస్తున్నారని, 36–40 నెలల్లో నిర్మాణం పూర్తయిపోతుందని ట్రస్ట్ తన ట్వీట్లో పేర్కొంది. భూకంపాలు, తుపాన్ బీభత్సాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునేలా ఆలయ నిర్మాణం సాగుతుంది. అందుకే ఈ నిర్మాణంలో ఇనుము వాడడం లేదు. వేల ఏళ్లయినా చెక్కు చెదరకుండా ఉండడానికి రాతితో నిర్మించే మందిరంలో ప్రతీ రాయికి మధ్య రాగి పలకల్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 18 అంగుళాల పొడవు, 30 మి.మీ. వెడల్పు, 3 మి.మీ. లోతు కలిగిన 10 వేల రాగి పలకలు అవసరమవుతాయి. ఈ రాగి పలకల్ని విరాళంగా అందివ్వాలని మందిరం ట్రస్ట్ రామ భక్తులకు పిలుపునిచ్చింది. దాతలు వాటిపై తమ కుటుంబ సభ్యుల పేర్లు, వంశం పేరు రాయవచ్చునని పేర్కొంది. -
శాంతి మన విధానం
న్యూఢిల్లీ: భారత్ శాంతికాముక దేశమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. అయితే, ఎవరైనా ఆక్రమణవాద దుస్సాహసానికి పాల్పడితే తగిన గుణపాఠం చెప్పగల సామర్థ్యం ఉన్న దేశమని స్పష్టం చేశారు. ‘పొరుగున ఉన్న కొందరు ఇటీవల విస్తరణవాద దుస్సాహసానికి ఒడిగట్టార’ని ఇటీవల తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంట ఘర్షణలకు పాల్పడిన చైనాను రాష్ట్రపతి పరోక్షంగా హెచ్చరించారు. ‘ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో మన పొరుగుదేశం విస్తరణవాద దుస్సాహసానికి పాల్పడింది’ అన్నారు. భారతీయ సైనికులు అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి, ప్రాణాలు పణంగా పెట్టి దేశ భూభాగాన్ని కాపాడుకున్నారని కొనియాడారు. నేడు 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి శుక్రవారం రాష్ట్రపతి ప్రసంగించారు. ‘భరతమాత ముద్దుబిడ్డలు వారు. దేశ గౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు. గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు దేశమంతా సెల్యూట్ చేస్తోంది’ అన్నారు. ఒకవైపు సరిహద్దులను, మరోవైపు అంతర్గత భద్రతను కాపాడుతున్న త్రివిధ దళాలు, పారామిలటరీ, పోలీసు బలగాలు మనకు గర్వకారణమన్నారు. గల్వాన్‌లోయ వద్ద చైనాతో సరిహద్దు ఘర్షణల్లో 20 మంది భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చెప్పిన స్వావలంబ భారత్‌ను రాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. భారతదేశ స్వావలంబన విధానం ప్రపంచాన్ని కలుపుకుని పోయేదేనని వివరణ ఇస్తూ విదేశీ పెట్టుబడుదారుల ఆందోళనలను తొలగించే ప్రయత్నం చేశారు. వైద్యులకు సెల్యూట్ కరోనా వైరస్‌పై ముందుండి అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి దేశమంతా రుణపడి ఉందన్నారు. ‘దురదృష్టవశాత్తూ వారిలోనూ చాలామంది ఈ మహమ్మారి సోకి ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఈ దేశ హీరోలు. వారిని ఎంత ప్రశంసించినా తక్కువే’ అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు విపత్తు నిర్వహణ దళాలు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రైల్వే, విమానయాన, విద్యుత్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్జీవోలు, ఇతర సేవల్లోని వారు అంతా ఈ మహమ్మారిపై అలుపెరగని పోరాటం చేస్తున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. ప్రపంచమంతా తలుపులు మూసుకున్నవేళ.. ప్రజలందరికీ ఆరోగ్య సేవలు, ఇతర వసతులు అందేలా వీరు ప్రజా సేవలో నిమగ్నమయ్యారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా లక్షలాది ప్రాణాలను బలిగొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా తలెత్తిన సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని ఆయన ప్రశంసించారు. కరోనా ముప్పును ముందుగానే పసికట్టి, సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. ‘భారీ జనాభా ఉన్న, విస్తారమైన, వైవిధ్యభరిత భారత్ లాంటి దేశంలో ఈ సవాళ్లను ఎదుర్కోవాలంటే మానవాతీత శక్తులుండాలని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచం గుర్తించాలన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కూడా సరైన చర్యలు తీసుకున్నాయని రాష్ట్రపతి ప్రశంసించారు. ‘ప్రజలంతా కలసికట్టుగా పోరాడారు. ప్రభుత్వాలు, ప్రజలు.. అంతా కలిసి చేసిన పోరాటం ఫలితంగానే ఈ మహమ్మారి విస్తృతిని సాధ్యమైనంతగా అడ్డుకోగలిగాం’ అన్నారు. 2020 నేర్పిన పాఠం 2020 సంవత్సరంలో కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి మానవాళికి గొప్ప పాఠాలు నేర్పించిందని ఆయన వ్యాఖ్యానించారు. మానవులు సర్వ శక్తిమంతులనే భ్రమను తొలగించిందని వివరించారు. ఇప్పటికైనా ప్రకృతిని నాశనం చేయకుండా, ప్రకృతితో కలిసి సహజీవనం చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. విభేదాలు పక్కనబెట్టి భూగోళ రక్షణ కోసం మానవాళి అంతా ఏకమైన శతాబ్దం ఇదని కోవింద్ వ్యాఖ్యానించారు. మానవ సమాజం ఏర్పర్చుకున్న కృత్రిమ అడ్డుగోడలను కరోనా కూల్చివేసిందన్నారు. ఆరోగ్య సేవల్లో మౌలిక వసతులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు గుర్తు చేసిందన్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వ వైద్యశాలలే ముందున్నాయన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా కారణంగా పేదలు, రోజు కూలీలు దారుణంగా దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన తదితర సంక్షేమ పథకాలను యుద్ధప్రాతిపదికన అమలు చేసిందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఆర్థిక పునరుత్తేజానికి లభించిన అవకాశంగా భావించాలన్నారు. రామాలయ నిర్మాణం గర్వకారణం అయోధ్యలో ఆగస్ట్ 5న రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయాన్ని రాష్ట్రపతి కోవింద్ ప్రస్తావించారు. అది భారతీయులందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు. ‘దశాబ్దాలుగా దేశప్రజలు గొప్ప సంయమనాన్ని, ఓపికను ప్రదర్శించారు. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంచారు. రామ మందిర వివాదాన్ని శాంతియుతంగా న్యాయవ్యవస్థ పరిష్కరించింది. సుప్రీంకోర్టు తీర్పును అన్ని వర్గాలు ఆమోదించి.. భారతీయ శాంతి, అహింస, ప్రేమ, సౌభ్రాతృత్వ భావనలను ప్రపంచానికి చూపాయి’ అని పేర్కొన్నారు. -
రామమందిర భూమిపూజ.. చెలరేగిన అల్లర్లు
గువాహటి : అయోధ్యలో ప్రతిష్టాత్మక రామమందిరం భూమి పూజ కార్యక్రమ వేడుకల సందర్భంగా అస్సాంలో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు చెలరేగడంతో కర్ఫ్యూ విధించారు. సోనిత్పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ అల్లర్ల సందర్భంగా దుండగులు ఓ కారు, మూడు మోటారు సైకిళ్లను దహనం చేసినట్లు అధికారులు గుర్తించారు. గువాహటిలోని పలు ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. నలుగురి కంటే ఎవరూ గుమికూడరాదని అధికారులు పేర్కొన్నారు. రామమందిర శంకుస్థాపన నేపథ్యంలో అస్సాంలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రత సమస్యలు ఏర్పడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సంబంధిత ప్రాంతాల్లో ప్రజలెవరూ ర్యాలీలు చేయరాదని హెచ్చరించారు. (భారత్‌ను హిందూదేశంగా మార్చే శంకుస్థాపన) -
చరిత్రలో ఆగస్టు5 నిలిచిపోతుంది : బాబా రాందేవ్
అయోధ్య : రామాలయానికి భూమి పూజ జరిగిన ఆగస్టు 5 ను చారిత్రకరోజుగా యోగా గురువు బాబా రాందేవ్ అభివర్ణించారు. తరతరాలు ఈ రోజును గర్వంగా గుర్తుంచుకుంటాయని అన్నారు. భారత్‌లో కొత్త చరిత్ర లిఖించబడిందని, ప్రజలందరూ ఈరోజును పరస్కరించుకొని సంబరాలు జరుపుకోవాలన్నారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన సందర్భంగా బాబా రాందేవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆలయ నిర్మాణంతో దేశంలో రాజరాజ్యానికి నాంది పలికినట్లయ్యిందన్నారు. ఈ చారిత్రక ఘట్టంతో సాంస్కృతిక, ఆర్థిక అసమానతలు తొలిగిపోతాయని రామరాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారన్నారు. రామ రాజ్యం అంటే ఆదర్శవంతమైన పరిపాలన అని రాందేవ్ అన్నారు. (లైవ్ అప్డేట్స్; అయోధ్యలో భూమిపూజ) రాముడికి, హనుమంతుడికి నరేంద్రమోదీ అపర భక్తుడని, అలాంటి ప్రధాని మనకుండటం ప్రజలందరి అదృష్టమని అన్నారు. హిందూ ధర్మం గర్వించేలా చేసిన ప్రధాని మోదీనే అని బాబా రాందేవ్ కొనియాడారు. అత్యంత భద్రత , కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 175 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయెధ్య రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయోధ్య నగరమంతా రామనామంతో మార్మోమోగిపోతుంది. (‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’) -
రాముని ఆశిస్సులతో..అత్యంత శక్తిమంతమైన దేశంగా
సాక్షి, ఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణం శంకుస్థాపన భూమి పూజ సందర్భంగా దేశ ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్ మారుతుందని కేజ్రివాల్ అన్నారు. రాముని ఆశీర్వాద బలంతో మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, పేదరికం నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచానికే దిశానిర్దేశంగా నిలవనుంది. జై శ్రీ రామ్! జై బజరంగ్ బళి అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందుభాగంలో నిలిచే నాయకుల్లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఒకరని గుర్తుచేశారు. (అయోధ్య రామాలయం : ఉద్వేగపూరిత క్షణం) శతాబ్దాల రామ భక్తుల కల సాకారమవుతున్న రామాలయ ఆలయ నిర్మాణ కార్యక్రమానికి మోదీతో సహా కేవలం 175 మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. కోవిడ్ నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ సందర్శకుల సంఖ్యను పరిమితం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అయోధ్య అంతటా రామనామంతో మార్మోగిపోతుంది. భారీగా మోహరించిన భద్రత నడుమ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. (‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’) भूमि पूजन के मौक़े पर पूरे देश को बधाई भगवान राम का आशीर्वाद हम पर बना रहे। उनके आशीर्वाद से हमारे देश को भुखमरी, अशिक्षा और ग़रीबी से मुक्ति मिले और भारत दुनिया का सबसे शक्तिशाली राष्ट्र बने। आने वाले समय में भारत दुनिया को दिशा दे। जय श्री राम! जय बजरंग बली! — Arvind Kejriwal (@ArvindKejriwal) August 5, 2020 -
గత 500 సంవత్సరాల్లో ఆ ఘనత మాత్రం మోదీకే
భోపాల్ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన వెబినార్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. 1990లో పార్టీ నాయకుడు ఎల్‌కె అద్వానీ రథయాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. లక్షలాదిమంది రామ భక్తుల 500 ఏళ్లనాటి సుదీర్ఘ పోరాటం సాకారమయ్యిందన్నారు. 1990లో ఎల్ కె అద్వానీ నాయకత్వంలో రథయాత్ర జరిగినప్పుడు తాను ఎమ్మెల్యేనని, కరసేవ కోసం అయోధ్యకు తరలివెళ్లామన్నారు. తమను అరెస్ట్ చేసి జౌన్పూర్ జైలులో ఉంచారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేయడం చరిత్రాత్మకమని అన్నారు. మత సామరస్యం కోసం ప్రధాని చూపిన సంకల్ప బలం ఈరోజు సాక్షాత్కరమవుతుందన్నారు. గత 500 సంత్సరాలలో భారతదేశపు అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా మోదీ నిలిచారని సీఎం శివరాజ్ సింగ్ కొనియాడారు. (28 ఏళ్ల ఉపవాసం ముగించనున్న ‘కలియుగ ఊర్మిళ’) ఇక కరోనానుంచి కోలుకున్న సీఎం శివరాజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గతనెల 25న సీఎంకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో స్థానిక చిరాయు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. మరో 7 రోజలు పాటు ఇంట్లోనే క్వారంటైర్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించినట్లు శివరాజ్ సింగ్ తెలిపారు. (మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత) Madhya Pradesh CM Shivraj Singh Chouhan discharged from Bhopal's Chirayu Hospital after recovering from #COVID19. He had tested positive for the disease on 25th July. The hospital has advised him to isolate himself at home and self monitor his health for a further 7 days. pic.twitter.com/quacfT4f3g — ANI (@ANI) August 5, 2020 -
‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’