న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారమే వేగంగా సాగుతున్నాయి. 2023 సంవత్సరాంతం నుంచి అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తులను అనుమతించే అవకాశం ఉందని రామమందిరం ట్రస్టు వర్గాలు బుధవారం తెలిపాయి. మొత్తం నిర్మాణం 2025 నాటికి పూర్తవుతుందని వెల్లడించాయి. ప్రధాన ఆలయం మూడు అంతస్తులతో ఉంటుందని, ఐదు మండపాలు ఉంటాయని పేర్కొన్నాయి. రామమందిరం నిర్మాణం, దేవుడి దర్శనం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అంతకంటే ముందే మందిర నిర్మాణం పూర్తయి, దర్శనాలకు అనుమతి లభిస్తే అధికార బీజేపీకి గణనీయంగా లబ్ధి చేకూరడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి మరో ప్రచారాస్త్రం సిద్ధమవుతోందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment