![Ram Temple Is Expected To Be Ready In Next Two Years - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/9/ram-temple.jpg.webp?itok=9-_rd-sN)
సాక్షి, న్యూఢిల్లీ : మరో రెండేళ్లలో 2022 నాటికి అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతుందని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్ పేర్కొన్నారు. మందిర నిర్మాణ సన్నాహాలపై చర్చించేందుకు ఆలయ కమిటీ తొలిసారిగా ఈనెల 18న ఢిల్లీలో భేటీ కానుంది. ఈ సమావేశంలో మందిర నిర్మాణాన్ని ఎప్పటినుంచి ప్రారంభించే విషయాన్ని ఖరారు చేయనున్నారు. రామ మందిర నిర్మాణానికి కేటాయించిన 67 ఎకరాల స్థలాన్ని చదునుచేసి ఆపై శంకుస్ధాపన కార్యక్రమం చేపడతామని, మందిర నిర్మాణం పవిత్రమైన రోజున ప్రారంభిస్తామని చౌపాల్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర శంకుస్ధాపనకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కాగా మందిర నిర్మాణానికి 67 ఎకరాల భూమి సరిపోదని, మరింత భూమి అవసరమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment