Ram temple in Ayodhya
-
అయోధ్యకు ప్రత్యేక చీర.. రామమందిర చిత్రాలతో తయారీ
సూరత్: సర్వాంగసుందరంగా నిర్మితమైన అయోధ్యలోని రామమందిర ప్రారంభోవత్సవ కార్యక్రామనికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన సురత్ నగరంలోని టెక్స్టైల్ అసోషియేషన్ ప్రత్యేకంగా ఓ చీరను తయారు చేసింది. ఈ చీరపై అయోధ్యలోని రామ మందిర్, భగవాన్ శ్రీరాముడి చిత్రాలను ప్రింట్ చేసింది. అయితే ఈ ప్రత్యేకమైన చీర అయోధ్యలోని సీతా మాతా విగ్రహానికి తయారు చేసినట్లు ఆదివారం సూరత్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధి లలిత్ శర్మా తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో ప్రపంచం అంతా ఆనందం ఉంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోంది. జానకీ మాత, భగవన్ హనుమాన్ కూడా మందిర నిర్మాణంపై ఆనందపడతారు’ అని శర్మా తెలిపారు. ఇప్పటికే ఒక చీరను స్థానిక శ్రీరాముని ఆలయంలో అందజేసినట్లు తెలిపారు. తాము తయారు చేసిన ప్రత్యేకమైన చీరను ఆయోధ్యకు పంపిస్తామని అన్నారు. చీర తయారు చేయాలని తమకు ఆర్డర్ వచ్చిందని, అయితే తాము ఉచితంగా తయారు చేసి పంపుతున్నామని పేర్కొన్నారు. మరిన్ని శ్రీరాముని ఆలయాల్లో కూడా సీతా మాతా విగ్రహాలకు ఉచితంగా ప్రత్యేక చీరను తయారు చేసి పంపిస్తామని తెలిపారు. ఇటీవల నేపాల్‌లోని జనాకీ మాతా జన్మస్థలం నుంచి పలు కానుకలు అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక.. జనవరి 22 తేదీన అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖలకు ఆహ్వానాలు అందించిన విషయం తెలిసిందే. చదవండి: Delhi: 22న దీపకాంతులలో ఢిల్లీ ఆలయాలు -
నేను కాలారామ్ దేవాలయంలో హారతి ఇస్తా: ఉద్ధవ్
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ఈ మహత్తర కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే చాలా మంది నేతలకు ఆహ్వానం అందలేదు. వీరిలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్దవ్ ఠాక్రే కూడా ఒకరు. తనకు ఇంకా ఎలాంటి ఆహ్వానం అందలేదని ఠాక్రే ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఉద్దవ్ తన తల్లి జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రామమందిర ఆలయం ప్రారంభోత్సవం రోజే తనతోపాటు తన పార్టీ నేతలు నాసిక్‌లోని కాలారామ్ ఆలయానికి వెళ్లి అక్కడ గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహించనున్నట్లు చెప్పారు. తనకు శ్రీరాముని దర్శనం కావాలని అనిపిస్తే అయోధ్యను సందర్శిస్తానని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన గర్వించదగ్గ విషయమని, ఆత్మగౌరవానికి సంబంధించినదని తెలిపారు. ఆ రోజు (జనవరి 22) సాయంత్రం 6.30 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సానే గురూజీ నిరసనలు చేసిన కాలారామ్ సదర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తాం’’ అని ఠాక్రే చెప్పారు. కాగా రామజన్మభూమి ఉద్యమం కోసం ‘శివసేన’ సుదీర్ఘ పోరాటం చేసిందని గతవారం ఉద్ధవ్ తెలిపిన విషయం తెలిసిందే. రాముడు కొలువై ఉన్న కాలారామ్ ఆలయం నాసిక్‌లోని పంచవటి ప్రాంతంలో ఉంది. నల్లరాతితో చెక్కిన రాముడి విగ్రహం ద్వారా ఆ ఆలయానికి ఆ పేరు వచ్చింది. రాముడు వనవాస సమయంలో భార్య సీత, సోదరుడులక్ష్మణుడితో పంచవటిలో ఉండేవారని భక్తులు విశ్వసిస్తారు. 1930లో దళితులను ఆలయంలోకి ప్రవేశించాలని కోరుతూ డాక్టర్ అంబేద్కర్ కాలారామ్ ఆలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. చదవండి: రామాలయం.. 1528 నుంచి నేటి వరకూ.. . -
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సోనియా వెళ్తున్నారా?
అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. జనవరి 22న జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిథుకు ఆహ్వానం అందింది. వీరిలో మత గురువులు, సినీ తారలు, రాజకీయనేతలు ఉన్నారు. అయితే ప్రతిపక్ష నేతల్లో ఎవరికి ఆహ్వానం అందిందనే విషయంపై స్పష్టత లేదు. విపక్ష నేతల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్, సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ఎంపీ అధిర్ రంజన్ చైదరీలకు మాత్రం ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. మరి సోనియా ఈ కార్యక్రమానికి వెళ్తారా.. లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. తాజాగా సోనియా అయోధ్య రామలయ ఆలయ ప్రారంభోత్సవానికి హాజరవ్వడంపై కాంగ్రెస్ స్పందించింది. సోనియా ఆయోద్య రామలయానికి వెళ్తారా లేదా అనేది సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. ‘తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటాం. తగిన సమయంలో తెలియజేస్తాం’ అని ఆపార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ వెల్లడించారు. అయితే రాజకీయంగా సున్నితమైనటువంటి ఈ అంశంపై మిత్రపక్షాలతో విస్తృత చర్చల తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా జనవరి 16 నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ పవిత్రోత్సవం జనవరి 22న రామ్ లాలా విగ్రహ ప్రతిష్టతో ముగుస్తుంది. ఈ వేడుక దేశవ్యాప్తంగా సందర్శకులను ఆకర్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 6,000 మందికి పైగా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అయితే మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామమందిర ఆలయ ప్రారంభోత్సవం కార్యక్రమం రాజకీయ వివాదాన్ని రేపింది. చదవండి: ‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు రామమందిర ఆలయ ప్రారంభోత్సవాన్ని కేంద్రంలోని అధికార బీజేపీ ఎన్నికల పావుగా వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో తమను ఆహ్వానించలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. సీపీఎం నాయకురాలు బృందా కారత్ కూడా ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని చెప్పారు. ఇక ఆహ్వానం అందిన పలువురు విపక్ష నేతలు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. మరోవైపు మతపరమైన కార్యక్రమాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారని విపక్ష నేతలు మండిపడుతున్నారు. రామ మందిరం పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందో, వ్యాపారం చేస్తుందో వారికే తెలియాలని విమర్శిస్తున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా, రాజకీయ ఎజెండాగా ఉపయోగించడం సరికాదని హితవు పలుకుతున్నారు. -
Ayodhya: అద్వానీకి అందని ఆహ్వానం.. ట్రస్ట్ వివరణ
ఢిల్లీ: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆలయ ట్రస్ట్ తరఫున ముగ్గురు సభ్యుల బృందం అధికారికంగా ఆహ్వానాలు అందిస్తోంది కూడా. అయితే బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషిలకు మాత్రం ఆహ్వానం అందలేదని ప్రచారం జరిగింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఉద్యమించిన వాళ్లలో ఈ ఇద్దరూ ముందు వరుసలో ఉన్నారు. అలాంటిది ఈ ఇద్దరికీ ఆహ్వానాలు వెళ్లకపోవడం ఏంటనే అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు. మరోవైపు రాజకీయంగా బీజేపీపై ఈ విషయంలో విమర్శలు వినిపించాయి. దీంతో రామ టెంపుల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ స్పందించారు. Shri Ram Janmabhoomi Mandir first floor - Construction Progress. श्री राम जन्मभूमि मंदिर प्रथम तल - निर्माण की वर्तमान स्थिति pic.twitter.com/Cz9zUS5pLe — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 15, 2023 రామ మందిర ప్రారంభోత్సవ విషయం వాళ్లకు తెలియజేశామని.. అయితే వృద్ధాప్యం, వాళ్లకు ఉన్న ఆరోగ్య సమస్యల రిత్యా ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక రావొద్దని చెప్పామని అన్నారాయన. అందుకు వాళ్లిద్దరూ, వాళ్ల కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు చంపత్ రాయ్ మీడియాకు తెలియజేశారు. అద్వానీ వయసు 96 ఏళ్లుకాగా, జోషి వయసు 90. జనవరి 22వ తేదీన రామ మందిర ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయనకు ఆహ్వానం అందజేశారు. श्री राम जन्मभूमि मंदिर में भगवान श्री रामलला सरकार के श्री विग्रह की प्राण प्रतिष्ठा दिनांक 22 जनवरी 2024 को माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी जी के कर कमलों द्वारा की जाएगी। Hon'ble Prime Minister Shri @narendramodi ji will perform Prana Pratishtha of Shri Vigraha of… pic.twitter.com/AMBUcYjtoS — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 25, 2023 జనవరి 15వ తేదీలోపు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని, ఆ మరుసటిరోజు ప్రాణ ప్రతిష్ట పూజ మొదలై.. జనవరి 22వ తేదీదాకా కొనసాగుతుందని చంపత్ రాయ్ తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయ పూజారులు, మఠాధిపతులు, రాజకీయ-సినీ ఇతర రంగాల ప్రముఖులకు సైతం అయోధ్య రామ మందరి ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు వెళ్తున్నాయి. श्री राम जय राम जय जय राम! Shri Ram Jai Ram Jai Jai Ram! pic.twitter.com/SZQlSwZl5X — Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) December 8, 2023 -
శరవేగంగా అయోధ్య రామ మందిర నిర్మాణం
-
2024 జనవరి 1 న అయోధ్య రామాలయం ప్రారంభం : అమిత్ షా
-
అయోధ్య.. అంత వీజీ కాదు
రామమందిరం–బాబ్రీ మసీదు సమస్యను సుప్రీంకోర్టు పరిష్కరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలో అయోధ్యలో ఎవరికి పట్టాభిషేకం జరగనుందన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రామమందిర క్షేత్రమైన అయోధ్య అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడక కాదని స్థానిక పరిస్థితులు చెపుతున్నాయి. రామాలయ అంశంలో తప్ప చాలా విషయాల్లో బీజేపీకి ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వేద ప్రకాశ్ గుప్తాను బీజేపీ మళ్లీ బరిలో నిలపగా, సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని బరిలో దించింది. 2012లో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌ను ఓడించిన తేజ్‌నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేకు టికెటిచ్చి పోటీని ఆసక్తికరంగా మార్చేసింది. అయోధ్య అంశాన్ని బీజేపీ ఎప్పుడూ వదిలి పెట్టలేదనే సానుకూలత ఈసారి కూడా కాషాయదళానికి కలిసి రానుంది. బీజేపీ, ప్రధాని మోదీ తప్ప మరెవరూ రామమందిర సమస్యను తమ పక్షాన పరిష్కరించలేకపోయేవారనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. బీజేపీ అభ్యర్థి గుప్తాపై మాత్రం ఇక్కడి వాళ్లలో వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో ఆయన మరోసారి మోది, సీఎం యోగి ఇమేజీనే నమ్ముకుని ప్రచారం చేశారు. ఫ్రీ రేషన్, గృహ నిర్మాణం లాంటి సంక్షేమ కార్యక్రమాల అమలు, మోదీ, యోగీ పాలనపైనే ఓట్లడిగారు. కానీ గత ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధేమీ లేదన్న అసంతృప్తి స్థానికుల్లో బాగా ఉంది. బీఎస్పీ మ్రాతం అయోధ్యలో కులసమీకరణలపై గట్టిగా దృష్టి పెట్టింది. సమాజ్‌వాదీకి అండగా నిలిచే యాదవులు, ముస్లింలు కలిపి అయోధ్యలో 92 వేల మంది ఓటర్లున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యూహాత్మకంగా బ్రాహ్మణ అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఈ ఎత్తుగడతో ఆ సామాజిక వర్గం ఓట్లు చీలి ఉంటాయని, ఇది ఎస్పీకి ఎంతో కొంత కలిసొస్తుందని భావిస్తున్నారు. ఐదో దశలో భాగంగా గత ఆదివారం ఇక్కడ పోలింగ్ జరిగింది. ఎస్పీ ప్రయత్నం ఏ మేరకు ఫలించిందన్నది ఈ నెల 10న కౌంటింగ్‌లో తేలనుంది. కాంగ్రెస్, ఆప్ పోటీలో ఉన్నా వాటి ప్రభావం నామమాత్రంగానే కన్పిస్తోంది. కూల్చివేతలపై గుర్రు అయోధ్య పట్టణానికి చుట్టుపక్కల వేల దుకాణాలను రోడ్ల వెడల్పు పేరుతో కూలగొట్టడం స్థానికుల ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వం పరిహారం ఇస్తామని చెప్తున్నా తరతరాలుగా ఈ దుకాణాలను నడుపుకుంటున్న దుకాణదారులు మాత్రం అధికార బీజేపీపై కోపంగానే ఉన్నారు. 2017లో బీజేపీ అభ్యర్థి గుప్తా 50 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక్కడ 1991 నుంచీ బీజేపీనే గెలుస్తోంది. 2012లో మాత్రం ఎస్పీ నుంచి పాండే కేవలం 5 వేల పై చిలుకు ఓట్లతో విజయం సాధించారు. రామమందిరంతో పాటు బ్రాహ్మణ, యాదవ, ముస్లిం కులాల సమీకరణలు, జాతీయ స్థాయిలో మోదీ పాలన, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను మెరుగుపర్చిన యోగి హయాంలో నెలకొన్న సుస్థిరత తదితరాలు అయోధ్యలో ఈసారి కీలక పాత్ర పోషించాయి. ఐదు దశలపై అంతటా ఆసక్తి దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి ఐదు దశల్లో 292 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. 6, 7 దశల్లో మిగతా 111 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఏడో తేదీతో పోలింగ్ ప్రకియ ముగుస్తుంది. మూడింట రెండొంతులకు పైగా స్థానాల్లో పోలింగ్ ముగియడంతో వీటిలో మెజారిటీ సీట్లు ఏ పార్టీకి దక్కనున్నాయన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలింగ్ పూర్తయిన 292 స్థానాల్లో బీజేపీ, సమాజ్ వాది–ఆర్ఎల్డీ కూటమి దాదాపు సమానంగా పంచుకోవచ్చని సర్వే పండితులు చెపుతున్నారు. మెజారిటీ ఎవరికి దక్కేదీ ఆరు, ఏడు దశల్లోనే తేలవచ్చని జోస్యం చెప్తున్నారు. ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన 292 సీట్లలో బీజేపీ కాస్త ముందున్నట్టు కన్పిస్తున్నా ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అనూహ్య విజయాలు సాధిస్తుందని హిందీ దినపత్రిక అమర్ ఉజాలా లక్నో అసోసియేట్ ఎడిటర్ సంపత్ పాండే అంచనా వేశారు. మొత్తంమీద ఏడో దశ పోలింగే విజేతను నిర్ణయించినా ఆశ్చర్యం లేదని ఆయన విశ్లేషించారు. తొలి రెండు దశల పోలింగ్‌లో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి సానుకూలత బాగా వ్యక్తమైందని ఓ ఎగ్జిట్ పోల్ సంస్థ అంచనా వేసింది. తర్వాతి మూడు దశల్లో కూటమికి, బీజేపీకి పోటీ రసవత్తరంగా సాగిందని విశ్లేషించింది. ఇక పశ్చిమ యూపీలో ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి ఆశించిన స్థాయిలో కాకున్నా గతంలో కంటే ఎక్కువ సీట్లే గెలవనుందని యూపీ పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం అంచనా వేసింది. ‘‘తొలి మూడు దశల పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో మేం ఒకటికి రెండుసార్లు పోస్టు పోల్ సర్వే చేయించాం. ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమికి స్వల్పంగా స్థానాలు పెరుగుతున్నాయి. మా అంచనా మేరకు చివరి నాలుగు దశల పోలింగే మెజారిటీ ఎవరికన్నది తేల్చనుంది’’ అని ఇంటలిజెన్స్ అధికారి ఒకరు సాక్షి ప్రతినిధులతో చెప్పారు. కంచర్ల యాదగిరిరెడ్డి, దొడ్డ శ్రీనివాసరెడ్డి: అయోధ్య (యూపీ) నుంచి సాక్షి ప్రతినిధులు -
2023 ఆఖరి నుంచి అయోధ్య రాముడి దర్శనం!
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ పనులు ప్రణాళిక ప్రకారమే వేగంగా సాగుతున్నాయి. 2023 సంవత్సరాంతం నుంచి అయోధ్యలో శ్రీరాముడి దర్శనానికి భక్తులను అనుమతించే అవకాశం ఉందని రామమందిరం ట్రస్టు వర్గాలు బుధవారం తెలిపాయి. మొత్తం నిర్మాణం 2025 నాటికి పూర్తవుతుందని వెల్లడించాయి. ప్రధాన ఆలయం మూడు అంతస్తులతో ఉంటుందని, ఐదు మండపాలు ఉంటాయని పేర్కొన్నాయి. రామమందిరం నిర్మాణం, దేవుడి దర్శనం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. అంతకంటే ముందే మందిర నిర్మాణం పూర్తయి, దర్శనాలకు అనుమతి లభిస్తే అధికార బీజేపీకి గణనీయంగా లబ్ధి చేకూరడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీకి మరో ప్రచారాస్త్రం సిద్ధమవుతోందని అంటున్నారు. -
రామమందిర నిర్మాణానికి 1,100 కోట్లు
ముంబై: అయోధ్యలో రామ మందిర నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని, దానికయ్యే ఖర్చు రూ. 1,100 కోట్లు దాటిపోతుందని రామ మందిరం ట్రస్టు కోశాధికారి వెల్లడించారు. ప్రధాన ఆలయం మూడేళ్లలో పూర్తయిపోతుందని దానికి రూ.300–400 కోట్లు ఖర్చు అవుతుందని, అయితే ఆలయం చుట్టూ 70 ఎకరాలను అభివృద్ధి చేయడానికయ్యే మొత్తం ఖర్చు రూ.1,100 కోట్లు దాటిపోతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ చెప్పారు. రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న నిపుణులు వేసిన అంచనాల మేరకు తాను ఈ వివరాలు వెల్లడించానని తెలిపారు. రామ మందిర నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుందో ఇప్పటివరకూ ఎవరూ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఒక మరాఠా న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ గోవింద్ దేవ్ ఈ వివరాలు వెల్లడించారు. -
కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్
-
‘భిన్నత్వంలో ఏకత్వానికి కట్టుబడాలి’
కోల్‌కతా : భారత్‌లో ఎప్పటినుంచో అనుసరిస్తున్న ఏకత్వంలో భిన్నత్వాన్ని అదే స్ఫూర్తితో మనం తుదిశ్వాస విడిచేవరకూ కొనసాగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం పేర్కొన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ జరిగేందుకు కొన్ని గంటల ముందు ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. తన ట్వీట్లో మమతా బెనర్జీ ఎక్కడా అయోధ్య, రామమందిరం అంశాలను ప్రస్తావించలేదు. దేశంలో హిందూ, ముస్లిం, సిక్కులు సహా అందరూ సోదరభావంతో మెలుగుతారని, మేరా భారత్ మహాన్..మహాన్ హమారా హిందుస్తాన్ అని దీదీ తన ట్వీట్లో పేర్కొన్నారు. రామ మందిర ఉద్యమంపై మమతా బెనర్జీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ తొలినుంచీ ఆచితూచి వ్యవహరిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వివాదాస్పద స్ధలంలో మందిర నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపైనా మమతా బెనర్జీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. మరోవైపు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తున్న క్రమంలో బెంగాల్ అంతటా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాజ్‌భవన్‌లో దీపాలు వెలిగించి వేడుక నిర్వహిస్తామని గవర్నర్ జగ్దీష్ దంకర్ తెలిపారు. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అత్యంత వైభవంగా భూమిపూజ కార్యక్రమం జరిగింది. చదవండి : కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత -
రామమందిరానికి భూమిపూజ
-
సంక్రాంతి తర్వాతే రామ మందిర ట్రస్ట్
అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు సంక్రాంతి తర్వాతే రామాలయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తామని రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్‌దాస్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా అయోధ్యలో రామ మందిరాన్ని చూసి తరించాలని తాము కూడా ఉవ్విళ్లూరుతున్నామన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. జనవరి 16 తర్వాత ఏ రోజైనా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసే అవకాశముందని పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే రామాలయ నిర్మాణ పనులు జరుగుతాయని వెల్లడించారు. ట్రస్ట్ పర్యవేక్షణ లేకుండా ఇంచు పని కూడా జరగదని వ్యాఖ్యానించారు. కాగా అయోధ్యలో రామనవమి నాడే రాముని ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. కానీ అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హిందూ, ముస్లిం పక్షాల మధ్య దశాబ్దాలుగా వివాదం నెలకొంది. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నందున ఆలయ నిర్మాణపనులను వాయిదా వేశారు. అనంతరం నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అయోధ్యపై సంచలన తీర్పును ప్రకటించింది. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలంలో రామాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ మందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ధర్మాసనం వివరించింది. అటు ముస్లింలకు మసీదును నిర్మించునేందుకు వీలుగా సున్నీ వక్ఫ్ బోర్డుకు అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో 5 ఎకరాలను ఇవ్వాలంటూ తీర్పు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పలు రివ్యూ పిటిషన్ దాఖలు కాగా న్యాయస్థానం వాటిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. చదవండి: ‘అయోధ్య’ రామయ్యదే..! ఆకాశాన్నంటే రామ మందిరం -
రామ మందిరంపై ఒవైసీ సవాలు..
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ప్రభుత్వానికి ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సవాలు విసిరారు. అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదస్పద ప్రాంతంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. అలాగే దీనిపై విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. అత్యున్నత ధర్మాసనం ఆదేశాలను స్వాగతించిన ఒవైసీ.. బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎందుకు ఆర్డినెన్స్ తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. ప్రధాని మంత్రి గిరిరాజ్ సింగ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించి.. ఆయన ద్వారా సుప్రీంలో ప్రభుత్వ వాదనలు వినిపించాలని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ప్రతిసారి, ప్రతి సందర్భంలో బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్‌పీ నాయకులు రామ మందిరం నిర్మాణం ఆర్డినెన్స్ తీసుకొస్తామని బెదిరింపులకు పాల్పడతారని.. కానీ వారు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీజేపీ రామ మందిరంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని సవాలు విసిరారు. సుప్రీం కోర్టు తీర్పుకు ముందు రామ మందిరం నిర్మాణంపై గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. రామ మందిరం నిర్మాణంపై ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి లేదా కోర్టు తీర్పును వెలువరించాలి అని కోరారు. లేకపోతే హిందూవులు సహనాన్ని కొల్పోయే అవకాశం ఉందని అన్నారు. దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు రామ మందిర నిర్మాణం ఇష్టం లేదని ఈ వివాదం ఇలాగే కొనసాగాలని కోరుకుంటుందని ఆరోపించారు. -
‘నేనలా అంటే.. మీడియా మరోలా రాసింది’
సాక్షి, న్యూఢిల్లీ : 'బాబ్రీ మసీదు స్థలంలో ఆలయాన్ని నిజమైన హిందువు ఎవరూ కోరుకోరు’ అనే వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వివరణ ఇచ్చారు. కొందరు పేరు మోసిన రాజకీయ నాయకుల సేవలో తరించే కొన్ని మీడియా సంస్థలు తన వ్యాఖ్యల్ని వక్రీకరించాయని ట్విటర్లో ఆరోపించారు. ‘రాముడు జన్మించిన చోట ఆలయం నిర్మించాలని చాలామంది హిందువులు కోరుకుంటారనీ, కానీ మరొక ప్రార్థనాలయాన్ని కూల్చి నిర్మించాలని నిజమైన హిందువు కోరుకోడు’ అని వ్యాఖ్యానించినట్టు చెప్పుకొచ్చారు. ఆదివారం చెన్నైలో జరిగిన 'ఇండియా: అంశాలు, అవకాశాలు' అనే అంశంపై హిందూ లిట్ ఫర్ లైఫ్ డైలాగ్ 2018 కార్యక్రమంలో అయోధ్యలో రామమందిర నిర్మాణంపై తన అభిప్రాయాలు మాత్రమే చెప్పానని థరూర్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యాఖ్యలతో సంబంధం లేదనీ, తాను పార్టీ అధికార ప్రతినిధిని కాదని స్పష్టం చేశారు. కాగా, శశిథరూర్ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ స్పందించారు. ఆలయ నిర్మాణాన్ని డిమాండ్ చేస్తూ అయోధ్యలో టెంట్లు వేసుకుని మరీ రామునికి పూజలు చేస్తున్న ప్రదేశాన్ని ఖాళీ చేయమంటారా? అని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడే హిందూ జపం చేసే కాంగ్రెస్ వైఖరి శశిథరూర్ వ్యాఖ్యలతో వెల్లడైందంటూ కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ చురకలంటించారు. I condemn the malicious distortion of my words by some media in the service of political masters. I said: “most Hindus would want a temple at what they believe to be Ram’s birthplace. But no good Hindu would want it to be built by destroying another’s place of worship.” — Shashi Tharoor (@ShashiTharoor) 15 October 2018 -
అందుకే బీజేపీకి ఓటేశారు: ఆరెస్సెస్
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయంపై ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్ స్పందించింది. యూపీలో బీజేపీ భారీ విజయాన్ని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి దక్కిన ప్రజామద్దతుగా భావించాలని ఆరెస్సెస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య పేర్కొన్నారు. బీజేపీ మ్యానిఫెస్టోలో సైతం అయోధ్యలో రామమందిర నిర్మాణ అంశాన్ని ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఈ భారీ విజయాన్ని ఇందుకు ప్రజామోదంగా భావించవచ్చునని ఆయన పీటీఐతో అన్నారు. అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో రామమందిరం ఉండేదని, ఆ ఆలయం శకలాలు తవ్వకాల్లో బయటపడ్డాయని అలహాబాద్ హైకోర్టు పేర్కొన్నదని ఆయన అన్నారు. రామమందిరం అంశాన్ని పరిష్కరించడంలో సుప్రీంకోర్టు విఫలమైనపక్షంలో మందిర నిర్మాణం కోసం ఎన్డీయే ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తేవాలని ఆయన సూచించారు. -
వారంలో రామ మందిరంపై నిర్ణయం: వీహెచ్‌పీ
మథుర: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా శనివారం అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారతీయులు ఇబ్బందులు పడుతుండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న హిందువులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేయాలని ఆయన కోరారు. గోరక్షకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధాలను వెనక్కు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గోవులను కోస్తున్న కసాయి వారికి శిక్ష వేయాలని గోరక్షకులు కేవలం ఆవులను రక్షిస్తున్నారని తొగాడియా అన్నారు. -
ఓ రామ మందిరం... 100 స్మార్ట్ సిటీలు
-
ఓ రామ మందిరం... 100 స్మార్ట్ సిటీలు
* బీజేపీ మేనిఫెస్టో విడుదల * అభివృద్ధి మంత్రంతోపాటు హిందుత్వ జపం * విధాన పక్షవాతాన్ని, పన్ను ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం * ఉమ్మడి పౌరస్మృతిని తెస్తాం.. ఆర్టికల్ 370ని తొలగిస్తాం * ‘రిటైల్’లో మినహా అన్ని రంగాల్లో ఎఫ్‌డీఐని ఆహ్వానిస్తాం * చవకైన సార్వజనీన జాతీయ ఆరోగ్య హామీ మిషన్ తెస్తాం * నల్లధనం వెనక్కు తేవటానికి టాస్క్ఫోర్సు ఏర్పాటుచేస్తాం * దేశమంతా ‘ఈ-గ్రామ్, విశ్వ గ్రామ్’ పథకం అమలుచేస్తాం * ‘అణు’ విధానాన్ని సమీక్షించి.. అనుగుణంగా సవరిస్తాం * లోక్‌సభ తొలి దశ ఎన్నికల రోజున మేనిఫెస్టో సాక్షి, న్యూఢిల్లీ: విధాన పక్షవాతాన్ని, అవినీతిని, పన్ను ఉగ్రవాదాన్ని రూపుమాపి.. సుపరిపాలన, అభివృద్ధిని అందిస్తామంటూనే.. రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావటం, ఆర్టికల్ 370 తొలగింపు వంటి తమ మూల ఎజెండానూ ప్రతిపక్ష బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా 100 కొత్త స్మార్ట్ నగరాల ఏర్పాటు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, ఒక్కటే జాతీయ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి, విద్యా రంగంపై ప్రభుత్వ వ్యయాన్ని స్థూల దేశీయోత్పత్తిలో ఆరు శాతానికి పెంచటం వంటి పలు హామీలను ఈ ఎన్నికల ప్రణాళికలో చేర్చింది. యూపీఏ పాలనలో దేశం దశాబ్ద కాలం పాటు లోపభూయిష్ట పరిపాలనకు గురైందని, నిర్ణయాలు, విధానాలు మంచమెక్కాయని ఈ మేనిఫెస్టో విమర్శించింది. ఈ పరిస్థితిని మారుస్తామని, ప్రభుత్వమనే ఇంజిన్‌ను బలమైన సంకల్ప బలంతో, ప్రజా ప్రయోజనాలకు కట్టుబాటుతో నడిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. పారదర్శకమైన, సమర్థవంతమైన, భాగస్వామ్యయుతమైన, ప్రోత్సాహకరమైన సుపరిపాలనను అందిస్తామని.. పాలనా యంత్రాంగం, న్యాయవ్యవస్థ, పోలీసు, ఎన్నికల సంస్కరణలను తీసుకువస్తామని పేర్కొంది. ప్రజలను చైతన్యం చేయటం, ఈ-పరిపాలన వంటి చర్యలతో అవినీతికి అవకాశాలు లేని వ్యవస్థను నెలకొల్పుతామని చెప్పింది. ఆర్థిక పునరుద్ధరణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి మార్గదర్శక పత్రమంటూ.. బీజేపీ 42 పేజీలతో కూడిన తన ఎన్నికల మేనిఫెస్టోను సోమవారం ఢిల్లీలో ఆవిష్కరించింది. దాదాపు వారం రోజుల కిందటే జరగాల్సిన బీజేపీ మేనిఫెస్టో విడుదల.. లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ రోజు వరకూ వాయిదా పడటానికి కారణం.. హిందుత్వ అంశాలను చేర్చే విషయమై పార్టీ అగ్రనేతల మధ్య భిన్నాభిప్రాయాలేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ, జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మురళీ మనోహర్జోషి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి అమెరికా వరకు లక్ష కన్నా ఎక్కువ సూచనలు అందాయని.. దేశంలోని అన్ని వర్గాల వారి నుంచి సమాచారాన్ని తీసుకుని మేనిఫెస్టోలో పొందుపరిచామని జోషి చెప్పారు. అమృత్‌సర్‌లో నామినేషన్ దాఖలు చేయడం వల్ల సీనియర్ నేత అరుణ్‌జైట్లీ, ఎన్నికల ప్రచారాల్లో ఉండటం వల్ల మాజీ అధ్యక్షులు ఎం.వెంకయ్యనాయుడు, నితిన్గడ్కారీలు రాలేకపోయారని వివరించారు. సీమాంధ్రకు పూర్తి న్యాయం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు పూర్తి న్యాయం చేస్తామని, సీమాంధ్రతో పాటు తెలంగాణలో అభివృద్ధి, పాలన సమస్యల పరిష్కారానికి బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీమాంధ్రకు పూర్తి న్యాయం చేయడానికి నిబద్ధతతో ఉన్నాం. సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను అభివృద్ధి చేయడం, పాలనకు సంబంధించిన అన్ని అంశాలకు పరిష్కారాన్ని చూపిస్తాం’ అని పేర్కొంది. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ... * అణు విధానాన్ని సమీక్షించటం, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సవరించటం * అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణానికి రాజ్యాంగ పరిధిలో గల అన్ని అవకాశాలనూ పరిశీలించటం * లింగ సమానత్వం కోసం ఏకీకృత పౌర స్మృతితేవటం. * జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణ తొలగించటం * ఉద్యోగాలను సృష్టించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు.. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో మినహా అన్ని రంగాల్లోనూ ఆహ్వానం * పెట్టుబడిదారులను ఆకర్షించటానికి పన్ను విధానంలో సంస్కరణలపై దృష్టి, జాతీయ సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ) తేవటం. * సార్వజనీనమైన అందుబాటులో ఉన్న, చవకౌన, సమర్థవంతమై న ఆరోగ్య సేవలు అందించేందుకు జాతీయ ఆరోగ్య హామీ మిషన్ * ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా సంస్థను నెలకొల్పటం * నల్లధనాన్ని వెనక్కు తీసుకురావటం కోసం టాస్క్ ఫోర్సు * ప్రధాని సహా ముఖ్యమంత్రులు, ఇతర అధికారులను టీం ఇండియాలో భాగస్వాములను చేస్తాం * అత్యంత వెనకబడిన 100 జిల్లాల్లో సమీకృత అభివృద్ధి * దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తయ్యే సరికి.. దేశంలో ప్రతి కుటుంబానికీ తక్కువ ధరతో పక్కా ఇల్లు నిర్మాణం * గ్రామీణ పునరుద్ధరణకు పూర్తిస్థాయి కార్యక్రమం. గ్రామీణ ఉపాధి పథకాలను సంపద సృష్టికి అనుసంధానించటం * గుజరాత్లో అమలుచేస్తున్న ‘ఈ-గ్రామ్, విశ్వ గ్రామ్’ పథకాన్ని దేశమంతా అమలుచేయటం. * ప్రతి గ్రామానికీ నీరు, ప్రతి పొలానికీ నీరు దేశాన్ని గట్టెక్కించే మార్గదర్శి: మోడీ ‘‘దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మా పార్టీ మేనిఫెస్టో ప్రతిబింబిస్తోంది. సుపరిపాలన, అభివృద్ధితో పాటు కేంద్రంలో బలమైన ప్రభుత్వం అన్నదే మా ప్రాధాన్యం. మాకు 60 నెలలు అధికారం ఇవ్వండి. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అంతటా నిరాశావాదం నిండివుంది. ఈ పరిస్థితిని బాగుచేసేందుకు దిశ, లక్ష్యం, నిబద్ధతను మా మేనిఫెస్టో వివరిస్తోంది. పేదలు, అణగారినవారి అవసరాలను తీర్చే ప్రధాన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మా లక్ష్యం ఒక భారత్.. ఉన్నత భారత్. అందరినీ కలుపుకు పోవడం - అందరినీ అభివృద్ధి చేయడం. ఈ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. పార్టీ నాపై ఒక బాధ్యతను ఉంచింది. నేను వ్యక్తిగతంగా మూడు హామీలు ఇవ్వాలనుకుంటున్నా. నేను కష్టపడి పనిచేయటంలో ఎన్నడూ లోటు కనిపించదు. నా కోసం ఎప్పుడూ ఏదీ చేయను. దురుద్దేశంతో ఎన్నడూ ఏ పనీ చేయను.’’ దోషాలు లేని మేనిఫెస్టో: అద్వానీ ‘‘ఇది వెతికినా లోపాలు దొరకని మేనిఫెస్టో. 1952 నుంచి ఎన్నికలను చూస్తున్నా. ఈ 16వ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరణ, ప్రచార స్వరూపం, పార్టీ భూమిక అపూర్వం. అప్పటి రాజకీయాలు వేరు. ఇప్పుడు మోడీ నేతృత్వంలో రాజకీయాలు చూస్తే అనందానుభూతి కలుగుతోంది. పార్టీ ప్రధాని అభ్యర్ధి ప్రకటన తరువాత జరిగిన ప్రచారం గత ఎన్నికల్లో ఎప్పుడూ జరగలేదు. అధికార బాధ్యత ఇస్తే రానున్న ఐదేళ్లలో దేశాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించి చూపిస్తాం.’’ హామీలన్నీ నెరవేరుస్తాం: రాజ్‌నాథ్ ‘‘మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక మేనిఫెస్టోలోని అంశాలే కాకుండా దేశంలోని సమస్యలు, సవాళ్లను పరిష్కరిస్తాం. కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే దేశం విశ్వశక్తిగా ఎదిగేది. దేశంలో సమగ్ర సమీకృత అభివృద్ధి జరగాలి.’’ దేశాన్ని పరుగెత్తిస్తాం: సుష్మాస్వరాజ్ ‘‘దేశాన్ని వర్తమాన స్థితి నుంచి గట్టెక్కించేందుకు ఒక మార్గాన్ని చూపించే పత్రం ఈ మేనిఫెస్టో. దేశంలో పాలన స్థంభించిపోయింది. అధికారంలోకి వచ్చాక స్థంభించిన ప్రభుత్వాన్ని నిల్చొబెడతాం. నడిపిస్తాం. కొద్ది రోజుల్లో పరుగెత్తిస్తాం.’’