
ముంబై: అయోధ్యలో రామ మందిర నిర్మాణం మూడేళ్లలో పూర్తవుతుందని, దానికయ్యే ఖర్చు రూ. 1,100 కోట్లు దాటిపోతుందని రామ మందిరం ట్రస్టు కోశాధికారి వెల్లడించారు. ప్రధాన ఆలయం మూడేళ్లలో పూర్తయిపోతుందని దానికి రూ.300–400 కోట్లు ఖర్చు అవుతుందని, అయితే ఆలయం చుట్టూ 70 ఎకరాలను అభివృద్ధి చేయడానికయ్యే మొత్తం ఖర్చు రూ.1,100 కోట్లు దాటిపోతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ స్వామి గోవింద్ దేవ్ గిరి మహరాజ్ చెప్పారు.
రామ మందిర నిర్మాణంలో పాలుపంచుకుంటున్న నిపుణులు వేసిన అంచనాల మేరకు తాను ఈ వివరాలు వెల్లడించానని తెలిపారు. రామ మందిర నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుందో ఇప్పటివరకూ ఎవరూ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఒక మరాఠా న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ గోవింద్ దేవ్ ఈ వివరాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment