శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అయోధ్యలోని నూతన రామాలయ విశేషాలను మీడియాకు వివరించింది. ఆలయ సముదాయంలోని అన్ని విశేషాలు మొదలు కొని శ్రీరాముని గర్భగుడి వరకు గల ఆలయ వైభవాన్ని ట్రస్ట్ సవివరంగా తెలియజేసింది.
నూతన రామాలయం మూడు అంతస్తులతో నాగర్ శైలిలో నిర్మితమయ్యింది. ప్రధాన గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహం కొలువుదీరుతుంది. మొదటి అంతస్తులో శ్రీరామ దర్బారు ఉంటుంది. నూతన రామాలయంలో ఐదు మండపాలు (హాళ్లు) ఉంటాయి. అవి నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన, కీర్తనల మండపం.
దేవతా మూర్తుల శిల్పాలను ఆలయ స్తంభాలు, గోడలపై తీర్చిదిద్దారు. సింహద్వారం నుండి ప్రవేశించే భక్తులు 32 మెట్ల ద్వారా ఆలయం లోనికి చేరుకుంటారు. ఆలయం చుట్టూ దీర్ఘచతురస్రాకార ప్రహరీగోడ ఉంటుంది. ఆలయంలో దివ్యాంగులు, వృద్ధ యాత్రికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ర్యాంప్‌లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆలయానికి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప) ఉంది. 25 వేల మంది యాత్రికులకు సరిపడేలా సౌకర్యాల కేంద్రం (పీఎఫ్‌సీ)నిర్మిస్తున్నారు. యాత్రికులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యాలు కల్పించనున్నామని ట్రస్ట్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Pran Pratishtha: ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఎందుకంత విశిష్టత?
Comments
Please login to add a commentAdd a comment