అయోధ్య: 500 ఏళ్ల కల నెరవేరిందన్నారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా భారతీయులు ఎదురు చూశారన్నారు. దేశమంతా రామ నామమే మార్మోగుతోందని.. రాంనగరికి వచ్చిన వారందరికీ స్వాగతం చెప్పారు. అన్న్ని దారులూ రామ మందిరానికే దారి తీస్తున్నాయన్నారు. ప్రాణ ప్రతిష్టకు హాజరైన వారి జీవితం ధన్యమైందన్న యోగి.. మనమంతా త్రేతా యుగంలోకి వచ్చినట్లుందని తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు..
ఈ రోజు ప్రతి రామ భక్తుడు సంతోషం, గర్వం, సంతృప్తితో ఉన్నాడని అన్నారు యోగి ఆదిత్యనాథ్. తన ఆలయం కోసం సాక్ష్యాత్తూ శ్రీరాముడే పోరాడాల్సి వచ్చిందన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించామని తెలిపారు. కాగా అయోధ్య భవ్య మందిరంలో దివ్య రామయ్య విగ్రహం ఆవిష్కృతం. వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగింది. అభిజిత్ ముహూర్తంలో రాముడు తొలి దర్శనం ఇచ్చారు. పసిడి కిరీటం, పట్టువస్త్రం, ముత్యాల కంఠాభరణంతో రాముడిని సుందరంగా అలంకరించారు. రమణీయంగా రామయ్య ప్రాణ ప్రతిష్ట మహోజ్వల ఘట్టం జరిగింది.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రామ్‌లల్లాలకు ప్రధాని మోదీ తొలి హారతి ఇచ్చారు. అయోధ్య రామాలయంపై హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపించారు. సామాన్య భక్తులకు రేపటి నుంచి దర్శనం ఖరారైంది. ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు బాలరాముడి దర్శించుకోవచ్చు. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచిరాత్రి 7 గంటల వరకు దర్శన అవకాశం కల్పించారు.
చదవండి: అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక.. అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment