అయోధ్యలోని రామమందిరంలోకి శ్రీరామ్‌లల్లా అడుగుపెట్టారు. శ్రీరామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22న జరగనుంది. జనవరి 16 నుంచి ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో అయోధ్య నగరమంతా రామమయంగా మారిపోయింది. ప్రతిచోటా ‘జై శ్రీరామ్’ నినాదాలు వినిపిస్తున్నాయి. దీనిని చూస్తుంటే అయోధ్యకు నాటి త్రేతాయుగం వచ్చినట్టున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం అయోధ్యలోని ప్రతి ఇంట్లో, ప్రతి దుకాణంలో ప్రతి చౌరస్తాలో రామనామం తాండవమాడుతోంది. జనవరి 16న నిర్మోహి అఖారాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పండితులు సునీల్ దాస్ అయోధ్య రామమందిరంలోని గర్భాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు కలశ యాత్ర చేపట్టారు. జనవరి 17న శ్రీరామ్‌లల్లా నూతన విగ్రహాన్ని మొదటిసారిగా ఆలయంలోనికి తీసుకువచ్చారు.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్గదర్శకత్వంలో అయోధ్యలో ‘త్రేతా యుగం’నాటి రోజులు కనిపిస్తున్నాయి. అయోధ్యలోని అన్ని దుకాణాలపై రాములవారి జెండాలు రెపరెపలాడుతున్నాయి. రామ్‌ఘాట్ నుండి అయోధ్యలోకి ప్రవేశిస్తున్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ దీపావళి వేడుకలను గుర్తు చేసేలా ఉంది. రామభజన, రామాయణానికి సంబంధించిన పాటలు వాడవాడలా ప్రతిధ్వనిస్తుండంతో అవి రామభక్తులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తున్నాయి.
శ్రీరామ్‌లల్లాకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్యవాసులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బుధవారం నుంచి అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ విమానం అయోధ్యతో కోల్‌కతా, బెంగళూరులను కలుపుతుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ విమానాలను ప్రారంభించారు.
అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రామ జన్మభూమి మార్గంలోని ఎంట్రీ పాయింట్ దగ్గర రెండు పెద్ద స్తంభాలు నిర్మితమయ్యాయి. అవి త్రేతాయుగాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడి గోడలపై రామ్‌లల్లా జీవితానికి సంబంధించిన పలు దృశ్యాలు కనిపిస్తాయి. నూతన రామాలయం రాకతో ప్రముఖ స్టార్ హోటళ్లు అయోధ్యలో అడుగిడేందుకు సిద్ధమవుతున్నాయి. దీనికితోడు ప్రధాన రహదారిపై గృహాలు కలిగినవారు తమ ఇళ్లను హోటళ్లుగా మారుస్తున్నారు.
ప్రస్తుతం అయోధ్యలో రూ.30,923 కోట్ల విలువైన 200కు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 37 శాఖలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. యూపీ హౌసింగ్ అండ్ డెవలప్‌మెంట్ బోర్డ్ 1200 ఎకరాల్లో న్యూ అయోధ్య టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించింది.
ఇది కూడా చదవండి: ఇనుమూ లేదు.. సిమెంటూ లేదు.. రామాలయం ఎలా నిర్మించారు?
Comments
Please login to add a commentAdd a comment