సూరత్: సర్వాంగసుందరంగా నిర్మితమైన అయోధ్యలోని రామమందిర ప్రారంభోవత్సవ కార్యక్రామనికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధిగాంచిన సురత్ నగరంలోని టెక్స్‌టైల్ అసోషియేషన్ ప్రత్యేకంగా ఓ చీరను తయారు చేసింది. ఈ చీరపై అయోధ్యలోని రామ మందిర్, భగవాన్ శ్రీరాముడి చిత్రాలను ప్రింట్ చేసింది.
అయితే ఈ ప్రత్యేకమైన చీర అయోధ్యలోని సీతా మాతా విగ్రహానికి తయారు చేసినట్లు ఆదివారం సూరత్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ప్రతినిధి లలిత్ శర్మా తెలిపారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో ప్రపంచం అంతా ఆనందం ఉంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ సాకారం కాబోంది. జానకీ మాత, భగవన్ హనుమాన్ కూడా మందిర నిర్మాణంపై ఆనందపడతారు’ అని శర్మా తెలిపారు. ఇప్పటికే ఒక చీరను స్థానిక శ్రీరాముని ఆలయంలో అందజేసినట్లు తెలిపారు.
తాము తయారు చేసిన ప్రత్యేకమైన చీరను ఆయోధ్యకు పంపిస్తామని అన్నారు. చీర తయారు చేయాలని తమకు ఆర్డర్ వచ్చిందని, అయితే తాము ఉచితంగా తయారు చేసి పంపుతున్నామని పేర్కొన్నారు. మరిన్ని శ్రీరాముని ఆలయాల్లో కూడా సీతా మాతా విగ్రహాలకు ఉచితంగా ప్రత్యేక చీరను తయారు చేసి పంపిస్తామని తెలిపారు. ఇటీవల నేపాల్‌లోని జనాకీ మాతా జన్మస్థలం నుంచి పలు కానుకలు అయోధ్యకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇక.. జనవరి 22 తేదీన అయోధ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే రాజకీయ, సినీ ప్రముఖలకు ఆహ్వానాలు అందించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment