అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు 40 శాతం దాకా పూర్తయ్యాయి. వాటికి రెండేళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తెలిసిందే. 2023 డిసెంబర్‌కల్లా పనులన్నీ పూర్తయి భక్తుల దర్శనానికి మందిరం సిద్ధమవుతుందని రామజన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ ఆదివారం తెలిపారు.
మందిరం కనీసం వెయ్యేళ్లదాకా చెక్కుచెదరకుండా ఉండేలా పునాదులను సువిశాలంగా, భారీగా నిర్మిస్తున్నారు. మందిర నిర్మాణానికి దాదాపు 9 లక్షల క్యూబిక్ అడుగుల మక్రానా మార్బుల్ రాళ్లు వాడుతున్నారు. ప్రధానాలయ నిర్మాణంలో గులాబీ, గర్భాలయానికి, ఫ్లోరింగ్‌కు తెల్ల రాయి వాడుతున్నారు. మందిరానికి దారితీసే మార్గాల్లో రోడ్డు విస్తరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment