లక్నో: జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెలవు ప్రకటించారు. ఈనెల 22నన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం దృష్టా రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రామజన్మభూమి ఆలయంలో శ్రీరామ్‌లల్లా 'ప్రాణ-ప్రతిష్ఠ' కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ఆదిత్యనాథ్ పరిశీలించారు.
అదే విధంగా జనవరి 22న రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండవని సీఎం తెలిపారు. ఆ రోజు అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. కాగా అయోధ్యలో జనవరి 22న నూతన రామాలయ ప్రారంభోత్సవంతో పాటు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఘనమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులను, 2,200 మంది ఇతర అతిథులను ఆహ్వానించారు. కాశీ విశ్వనాథుని ఆలయం, మాతా వైష్ణో దేవి ఆలయ ప్రతినిధులు, ఇస్రో శాస్త్రవేత్తల పేర్లు ఆహ్వానితుల జాబితాలో ఉన్నాయి. సినీ పరిశ్రమ, వ్యాపార, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు కూడా ఆహ్వానాలు పంపారు.
చదవండి: మాల్దీవుల వివాదం.. ప్రధాని మోదీకి మద్దతుగా శరద్ పవార్
Comments
Please login to add a commentAdd a comment