
కోల్‌కతా: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉండనున్నట్లు సమచారం. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి ప్రతినిధిని పంపే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
2024లో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు బీజేపీ ఇప్పటికే ఆహ్వానాలను పంపించింది. దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సహా దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతలకు కేంద్రం ఆహ్వానాలు పంపించింది. ఈ క్రమంలో రామమందిర కార్యక్రమాన్ని లోక్‌సభ ఎన్నికల ప్రచారంగా బీజేపీ వాడుకోనుందని టీఎంసీ ఆరోపిస్తోంది. అటు.. రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని సీతారాం ఏచూరి తిరస్కరించారు.
జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు హాజరు కానున్నారు. వీరితో పాటు దాదాపు 6,000 మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: మోదీ యూట్యూబ్ సబ్‌స్రైబర్లు 2 కోట్లు