‘దేవాలయాలు.. ప్రభుత్వ విధి కాదు’ కాంగ్రెస్‌ ఎంపీ విమర్శలు | Shashi Tharoor Attacks BJP Over Ayodhya Event: Temples Not Government's Business | Sakshi
Sakshi News home page

‘సమస్యలను పక్కదారి పట్టించడమే ఉద్దేశం’

Published Wed, Dec 27 2023 5:13 PM | Last Updated on Wed, Dec 27 2023 5:32 PM

Shashi Tharoor Attacks BJP over Ayodhya Event Temple Not Government Business - Sakshi

అయోధ్యలో జనవరి 22న ఘనంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తు‍న్నారు. మరోవైపు వేల మంది ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ  క్రమంలో  రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానంపై కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు  చేశారు.

రామ మందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేని తెలిపారు. మతం అనేది  వ్యక్తిగతమైన విశ్వాసమని, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని అన్నారు. అయితే రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీడియా విపరీతమైన ప్రచారం కల్పించడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల నుంచి పక్కదారి పడతాయని తెలిపారు.

దేవాలయాలను పర్యవేక్షించడం ప్రభుత్వం విధి కాదని అన్నారు.  నిరుద్యోగం, ధర పెరుగదల, ప్రజల సంక్షేమం, దేశ భద్రత మొదలైన వాటిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని తెలిపారు. అయితే మీడియా రామ మందిర ప్రారంభోత్సవం మీద దృష్టి పెట్టడంతో.. దేశంల్లో ఉన్న పలు సమస్యలు పక్కదారి పడతాయని ‘బీజేపీ’ పేరు ఎత్తకుండానే ‘ఎక్స్‌’ ట్వీటర్‌ వేదికగా  శశి థరూర్‌ విమర్శలు గుప్పించడం గమనార్హం.

చదవండి: ‘పార్లమెంట్‌ చీకటి గదిలా మారింది’

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement