Mamatha benarji
-
మమతా బెనర్జీపై అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా: ఇండియా కూటమిలో చీలిక మరోసారి బయటపడింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సేవ చేయడంలో మమతా బెనర్జీ బిజీగా ఉన్నారని ఆరోపించారు. మమతా బెనర్జీతో కాంగ్రెస్ పొత్తు కోరుకోవడం లేదని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయగలదని చెప్పారు. "మేము భిక్ష అడగలేదు. మమతా బెనర్జీ స్వయంగా తనకు పొత్తు కావాలని చెప్పారు. మమతా బెనర్జీ దయ మాకు అవసరం లేదు. మేము సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ప్రధాని మోదీకి మమతా బెనర్జీ సేవ చేయడంలో బిజీగా ఉన్నందున ఆమెతో పొత్తులు కోరుకోవడం లేదు.' అని అధీర్ రంజన్ చౌధరి అన్నారు. ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, టీఎంసీ పొత్తు గురించి అడినప్పుడు అధీర్ రంజన్ చౌధరి ఈ మేరకు స్పందించారు. వివరాల ప్రకారం.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌కు టీఎంసీ రెండు సీట్లను ఆఫర్ చేస్తోంది. ఇండియా కూటమిలో ఉన్న ఈ రెండు పార్టీలు సీట్ల పంపకాల్లో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధీర్ రంజన్ చౌధరి వివాదాస్పద వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీజేపీని గద్దె దింపే ధ్యేయంతో ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలో టీఎంసీ కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పేరును టీఎంసీనే మొదట సూచించింది. అటు.. కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇదీ చదవండి: 'నెహ్రూ అలా చేసి ఉంటే..' చైనాతో బంధంపై జైశంకర్ వ్యాఖ్యలు -
రామ మందిర వేడుకకు మమతా బెనర్జీ దూరం?
కోల్‌కతా: అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభోత్సవానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉండనున్నట్లు సమచారం. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి ప్రతినిధిని పంపే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు బీజేపీ ఇప్పటికే ఆహ్వానాలను పంపించింది. దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలతో సహా దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేతలకు కేంద్రం ఆహ్వానాలు పంపించింది. ఈ క్రమంలో రామమందిర కార్యక్రమాన్ని లోక్‌సభ ఎన్నికల ప్రచారంగా బీజేపీ వాడుకోనుందని టీఎంసీ ఆరోపిస్తోంది. అటు.. రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని సీతారాం ఏచూరి తిరస్కరించారు. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ లు హాజరు కానున్నారు. వీరితో పాటు దాదాపు 6,000 మందికిపైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇదీ చదవండి: మోదీ యూట్యూబ్ సబ్స్రైబర్లు 2 కోట్లు -
మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా
-
బెంగాల్లో బీజేపీకి మరో భారీ షాక్!
-
రెండు నెలలకొకసారి ఢిల్లీ వస్తా.. దీదీ సంచలన ప్రకటన
-
మమతకు ఛాతినొప్పి.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు
కోల్‌కతా : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలయ్యింది. ఛాతినొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో మమత ఇబ్బందులు పడుతున్నట్లు డాక్లర్లు తెలిపారు. ఆమె ఎడమకాలుతో పాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని, మరో 48 గంటలపాటు మమతా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం మమతకు మరో రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దాడికి నిరసనగా టీఎంసీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఇక మమతపై దాడి నేపథ్యంలో ఇవాళ ప్రకటించాల్సిన మేనిఫెస్టో వాయిదా పడింది. మమత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిపై నేడు టీఎంసీ నాయకులు ఈసీని కలవనున్నారు. మమతా బెనర్జీపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ..రేపటిలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీకి ఆదేశించారు. పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌లో నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. నామినేషన్ వేసిన అనంతరం వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత సంచలన ఆరోపణలు చేశారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఒక్క పోలీసు కూడా లేడని, తనపై కుట్ర జరగుతోందని పేర్కొన్నారు. The condition of her (Mamata Banerjee) leg is serious. Doctors are treating her. A little more pressure could have resulted in spine injury: TMC MLA Paresh Pal outside SSKM hospital in Kolkata The CM sustained injuries in her left leg in Nandigram yesterday evening. pic.twitter.com/nHhzCoy0Q2 — ANI (@ANI) March 11, 2021 చదవండి : (నందిగ్రామ్ పర్యటనలో మమతపై దాడి!) (సీఎం మమతా బెనర్జీపై దాడి: కాలికి గాయం) -
మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్
-
నందిగ్రామ్ పర్యటనలో మమతపై దాడి!
నందిగ్రామ్/కోల్‌కతా: నందిగ్రామ్ పర్యటనలో తనపై దాడి జరిగిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. నందిగ్రామ్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచేందుకు బుధవారం ఆమె నామినేషన్ వేశారు. అనంతరం, వెనక్కు వెళ్తుండగా, తనపై నలుగురైదుగురు దాడి చేశారని, తనను నెట్టివేయడంతో ఎడమ కాలికి గాయమైందని మమత వివరించారు. సాయంత్రం 6.15 గంటల సమయంలో రేయపరా వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు. ‘నా కారు వెలుపల నిల్చుని ఉన్నా. కారు డోర్ తెరచి ఉంది. అక్కడి నుంచి కనిపిస్తున్న గుడివైపు చూస్తూ ప్రార్ధించాను. ఆ తరువాత కార్లోకి వెళ్దామనుకుంటుండగా, అకస్మాత్తుగా నలుగురైదుగురు నా దగ్గరకు వచ్చి, కారు డోర్‌ను నా వైపు గట్టిగా నెట్టారు. ఆ డోర్ తగిలి నా ఎడమ కాలికి గాయమైంది. నేను ఒక్కసారిగా ముందుకు పడిపోయాను’ అని వివరించారు. గాయంతో కాలు వాచిందని, జ్వరంగా అనిపిస్తోందని, ఛాతీలో నొప్పిగా ఉందని తెలిపారు. ‘కావాలనే కొందరు ఈ దాడికి పాల్పడ్డారు. ఇది కుట్ర. ఎస్పీ సహా స్థానిక పోలీసులెవరూ ఆ సమయంలో నా దగ్గర లేరు’ అని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన వెంటనే వ్యక్తిగత భద్రత సిబ్బంది మమతను కారులో వెనుక సీటులో కూర్చోబెట్టారు. నిజానికి, ఆమె బుధవారం రాత్రి నందిగ్రామ్‌లోనే ఉండాలనుకున్నారు. కానీ, ఈ ఘటన జరగడంతో కోల్‌కతా వెళ్లారు. వెంటనే, కోల్‌కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. మమతని స్ట్రెచర్‌పై ఆసుపత్రిలోకి తీసుకువెళ్తున్న సమయంలో భారీగా చేరుకున్న టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. కాలికి ఎక్స్‌రే తీస్తామని, గాయం తీవ్రతను బట్టి చికిత్స ఉంటుందని వైద్యులు తెలిపారు. మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, పలువురు రాష్ట్ర మంత్రులు ఆసుపత్రికి వెళ్లారు. గత రెండు రోజులుగా మమత నందిగ్రామ్‌లోనే ఉన్నారు. తమ పార్టీ అధినేత్రిని ఎన్నికల ప్రచారం నుంచి తప్పించే లక్ష్యంతో కొందరు ఈ దాడికి పాల్పడ్డారని టీఎంసీ ఆరోపించింది. మరోవైపు, మమతపై దాడిపై బీజేపీ స్పందించింది. చిన్న ప్రమాదాన్ని పెద్ద కుట్రగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్ఘియ డిమాండ్ చేశారు. ఇలాంటి ప్రచారాలతో సానుభూతి పొందాలనే ప్రయత్నాలు ఫలించబోవని కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురి వ్యాఖ్యానించారు. ‘రాష్ట్ర హోం మంత్రి కూడా ఆమెనే. అందువల్ల ఈ వైఫల్యానికి బాధ్యతగా ఆమె రాజీనామా చేయాలి’ అన్నారు. గవర్నర్ పరామర్శ ఎస్ఎస్కేఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి మమతను గవర్నర్ జగ్దీప్ ధన్కర్ పరామర్శించారు. ఆయన ఆసుపత్రిలోకి వెళ్తుండగా, ‘గో బ్యాక్’ అంటూ టీఎంసీ కార్యకర్తలు నినాదాలు చేశారు. మరోవైపు, సీఎంపై దాడి ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర పోలీసులను ఈసీ ఆదేశించింది. నందిగ్రామ్ నుంచి నామినేషన్ హల్దియా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ తరఫున బరిలో దిగుతున్న ఒకప్పుడు ఆమెకి అత్యంత సన్నిహితుడు, నందిగ్రామ్‌లో బాగా పట్టున్న నేత సువేందు అధికారితో ఆమె తలపడుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తనదేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ భూముల సేకరణకి వ్యతిరేకంగా ఉద్యమించిన తాను నందిగ్రామ్ నుంచి ఎప్పుడూ వట్టి చేతులతో వెళ్లలేదని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుబ్రతా బక్షి వెంట రాగా మమత 2.కిలోమీటర్ల మేర రోడ్డు షో నిర్వహించారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం హల్దియా సబ్ డివిజనల్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ‘‘నందిగ్రామ్ నుంచి నా గెలుపు ఖాయం. ఇక్కడి నుంచి సులభంగా నేను విజయం సాధించగలను. జనవరిలో ఇక్కడికి వచ్చినప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో నేత ఎవరూ లేకుండా నియోజకవర్గం ఉంది. అప్పుడు సాధారణ ప్రజల ముఖాలు చూసి నేను ఇక్కడ నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను’’ అని దీదీ విలేకరులకు చెప్పారు. నందిగ్రామ్ ఉద్యమ బావుటా నందిగ్రామ్ అన్నది ఒక పేరు కాదు. ఒక ఉద్యమ బావుటా అని మమతా బెనర్జీ ప్రశంసించారు. ‘‘ నేను అందరి పేర్లు మర్చిపోతానేమో, కానీ నందిగ్రామ్ పేరును ఎప్పటికీ మర్చిపోను. ఈ ప్రాంతానికి నేనిచ్చే ప్రాధాన్యత అలాంటిది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. తను ఎప్పుడూ ఇక్కడ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరగలేదని, తన గెలుపు ఇక్కడ ఖాయమన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రాంతాన్ని ఎవరూ విడగొట్టలేరని అన్నారు. నందిగ్రామ్ ఉద్యమ సమయంలో అన్ని వర్గాలు కలిసికట్టుగా పాల్గొన్నాయని ఆమె గుర్తు చేశారు. ఇన్నాళ్లూ భవానీపూర్ నియోజకవర్గం నుంచి గెలుస్తూ వచ్చిన మమతా బెనర్జీ, బీజేపీ చేసిన సవాల్‌తో కేవలం నందిగ్రామ్ నుంచి మాత్రమే పోటీకి దిగారు. ఒక అద్దె ఇంట్లో ఉంటూ తన ప్రచారాన్ని సాగించనున్నారు. మరోవైపు బీజేపీ అ«భ్యర్థిగా గురువారం నందిగ్రామ్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్న సువేందు అధికారి దీటుగా ప్రచారం చేస్తున్నారు. మమతా బెనర్జీ స్థానికురాలు కాదని, తానే ఈ భూమి పుత్రుడినంటూ ప్రచారం చేసుకోవడం విశేషం. -
నేడు మోదీ, మమత భేటీ
కోల్‌కతా: ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు శనివారం కోల్‌కతాలోని రాజ్‌భవన్ వేదికగా భేటీ కానున్నట్లు సెక్రెటేరియట్ అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి కోల్‌కతా చేరుకోగానే, సాయంత్రం 4 గంటల సమయంలో భేటీ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అయితే ఏ అంశాలపై భేటీ జరగనుందో ప్రభుత్వం చెప్పలేదు. ఈ నెల 12న కోల్‌కతాలో జరగనున్న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వసంతోత్సవ కార్యక్రమంలో వీరిరువురు మరలా ఒకే వేదికపై కలిసే అవకాశం ఉందని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తెలిపారు. ఇప్పటికే నౌకాయాన మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యక్తిగతంగా మమతను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఈ నెల 13న సోనియా గాంధీ తలపెట్టిన ప్రతిపక్షాల భేటీని కూడా వ్యతిరేకించారు. మోదీ, మమతల భేటీ గురించి సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి బయటపడిందని వ్యాఖ్యానించారు. -
ఒంటరిగానే పోరాడతాం
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా తాము ఒంటరిగానే పోరాడతామని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలవబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమత చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా పోరాడే అంశంపై ఈ నెల 13న కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ప్రతిపక్షాలతో నిర్వహిస్తున్న సమావేశానికి తాను వెళ్లట్లేనన్నారు. బెంగాల్లో బుధవారం ట్రేడ్ యూనియన్లు చేపట్టిన సమ్మెలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు పలు హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడ్డాయని ఆమె ఆరోపించారు. ఈ రెండు పార్టీలు పశ్చిమబెంగాల్లో ఒకలా, ఢిల్లీలో మరోలా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ తరహా ధోరణిని తాను సహించబోనని తేల్చిచెప్పారు. ఈ కారణంతోనే తాను సోనియా గాంధీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై ఆమె స్పందించారు. గత సెప్టెంబర్‌లో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన నేపథ్యంలో మరోసారి ఆమోదించాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించారు. సోనియా సమావేశానికి హాజరుకాకపోవడానికి సంబంధించి ఆమె ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో మాట్లాడారని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. -
2 కోట్లు.. ఓ పెట్రోల్ బంకు
కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తమ పార్టీలో చేరాలని, లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి చిట్‌ఫండ్ కుంభకోణంలో జైలుకు పంపిస్తామని టీఎంసీ ప్రజాప్రతినిధులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినాన్ని పురస్కరించుకొని టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారీగా హాజరైన ఈ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. కర్ణాటకలో అనుసరిస్తున్న వైఖరినే రాష్ట్రంలోనూ ప్రయోగించాలని బీజేపీ చూస్తోందని ఆమె విమర్శించారు. దీనికోసం తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.2 కోట్లతోపాటు పెట్రోల్ బంక్ ఇస్తామని ప్రలోభపెడుతోందని ఆరోపించారు. తమ పార్టీ గ్రామ నేతలకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపుతోందన్నారు. డబ్బుతో ఎవరినైనా కొనేయగలమనే అహంకారంలో బీజేపీ ఉందని మండిపడ్డారు. ఇలాగైతే మరో రెండేళ్లే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలిచిందని మమత ఆరోపించారు. ప్రస్తుత తీరుగానే వారి వ్యవహారం ఉంటే మరో రెండేళ్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని హెచ్చరించారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి టీఎంసీ నాయకులు వసూలు సొమ్మును తిరిగిచ్చేయాలని తాను అన్నట్లుగా తన గత ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల అమలుపై ఓ కన్నేసి ఉంచాలని తమ పార్టీ నాయకులకి తాను చెప్పానని, అయితే తన మాటలని వక్రీకరించి తమ నాయకులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ముందు బీజేపీ తరలించిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని, అలాగే ఆ పార్టీ నాయకులు ఉజ్వల పథకంలో వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇవ్వాలన్నారు. ఇదే డిమాండ్‌తో 26వ తేదీన నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఉచిత ఎల్పీజీ పేరుతో బీజేపీ నేతలు డబ్బు వసూలు చేయడంపై దర్యాప్తు జరుపుతామన్నారు. 18 లోక్‌సభ స్థానాలు గెలిచి.. మొత్తం రాష్ట్రాన్ని గెలిచేసినట్లుగా బీజేపీ భావిస్తోందని ఎద్దేవా చేశారు. గంటపాటు ర్యాలీలో ఆమె.. ఏ ఒక్క బీజేపీ నాయకుడి పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. -
బెంగాల్లో కొనసాగుతున్న జూడాల ఆందోళన
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన ఆరో రోజుకు చేరుకుంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బందికి రోగుల నుంచి భద్రత కల్పించాలన్న తమ డిమాండ్ నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు పట్టుబడుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆహ్వానం మేరకు చర్చలు జరపడానికి తాము సిద్ధమని పునరుద్ఘాటించారు. అయితే చర్చావేదిక ఎక్కడనేది గవర్నింగ్ బాడీలో చర్చించి తామే నిర్ణయం తీసుకుంటామన్నారు. కానీ, దానికన్నా ముందు ఆందోళన జరుగుతున్న ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్‌ను సీఎం మమతా బెనర్జీ సందర్శించాలని వారు కోరుతున్నారు. నిన్న జరిగిన చర్చలు విఫలమైన అనంతరం మమత మాట్లాడుతూ డాక్టర్ల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పుకుంటుందనీ, వారు వెంటనే విధుల్లోకి చేరాలని కోరారు. అలాగే వారిమీద ఎలాంటి చట్టాలను ప్రయోగించబోమనీ, అలా చేసి వారి భవిష్యత్తును ఇబ్బందిలో పెట్టదల్చుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై బెంగాల్ గవర్నర్ కె.ఎన్.త్రిపాఠి వైద్యుల భద్రతకు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. మరోవైపు డాక్టర్ల ఆందోళన విషయంలో ఆదేశాలు జారీచేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో డాక్టర్లు, వైద్యసిబ్బంది భద్రతపై దేశం నలుమూలల నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖలు అందుతున్నాయి. వైద్యుల భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి తెలపాలని హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశం
కోల్‌కతా: శాంతి భద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశమని, దానితో గవర్నర్‌కు సంబంధం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చించేందుకంటూ గవర్నర్ కేసరీనాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంపై మమత గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘గవర్నర్ ప్రయత్నం వెనుక బీజేపీ ప్రోద్బలం ఉందని మమత ఆరోపించారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినందునే ఆ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశానికి టీఎంసీ ప్రధాన కార్యదర్శి, మంత్రి పార్థ చటర్జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, కాంగ్రెస్, సీపీఎం రాష్ట్ర నేతలు సోమేన్ మిత్రా, సూర్య కాంత మిశ్రా హాజరయ్యారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో సీఎం మమత పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్ మజుందార్ అన్నారు. జూ.డా.ల సమ్మె వెనుక బీజేపీ, సీపీఎం రాష్ట్రంలోని ప్రభుత్వం ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం వెనుక రాజకీయ ప్రత్యర్థులైన సీపీఎం, బీజేపీల హస్తం ఉందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీపీఎం సాయంతో వైద్యుల సమ్మెకు మతం రంగు పులిమేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. -
మోదీ ప్రమాణానికి వెళ్లను
కోల్‌కతా: న్యూఢిల్లీలో గురువారం జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కావడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తృణమూల్ కార్యకర్తల చేతిలో హతమైన బీజేపీ కార్యకర్తల కుటుంబీకులను ప్రమాణస్వీకారోత్సవానికి తీసుకెళుతున్నట్టు బీజేపీ నేతలు ప్రకటించిన నేపథ్యంలో తాను ప్రమాణస్వీకారానికి రావట్లేదని మమత ట్వీట్‌చేశారు. మరోవైపు గత ఏడాది కాలంలో తృణమూల్ దాడుల్లో హతులైన 50కి పైగా బీజేపీ కార్యకర్తల కుటుంబాలను అమరుల గౌరవసూచికగా ప్రమాణస్వీకారానికి ఢిల్లీ తీసుకెళుతున్నట్టు బీజేపీ నేత ముకుల్ రాయ్ చెప్పారు. కాగా, బీజేపీ ఆరోపణలను తృణమూల్ ఖండించింది. తమ రాష్ట్రంలో రాజకీయ హత్యలేమీ లేవని టీఎంసీ వ్యాఖ్యానించింది. అమరుల కుటుంబాలను గౌరవించాలని బీజేపీ భావిస్తే ఘర్షణల్లో అమరుడైన తృణమూల్ కార్యకర్తల కుటుంబాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని టీఎంసీ నేత సవాల్ విసిరారు. ప్రమాణానికి వెళ్లొద్దని మరో ఇద్దరు సీఎంలతో మాట్లాడిన తర్వాత మమత ఈ ప్రకటన చేశారు. అయితే, 24 గంటల్లోనే ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. బీజేపీ ఆరోపిస్తున్నట్టు వారి కార్యకర్తలు తమ కార్యకర్తల దాడుల్లో చనిపోలేదని, కుటుంబ కలహాలు, వ్యక్తిగత కారణాల వల్ల మరణించారని మమత తెలిపారు. ప్రజాస్వామ్య ఉత్సవాన్ని బీజేపీ సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నందున ప్రమాణస్వీకారోత్సవానికి హాజరు కారాదని నిర్ణయించుకున్నానని మమత ట్వీట్ చేశారు.‘నూతన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారూ..శుభాకాంక్షలు. మీ ఆహ్వానాన్ని మన్నించి, ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలనుకున్నాను. అయితే, బెంగాల్లో తమ కార్యకర్తలు రాజకీయ హత్యకు గురయ్యారని బీజేపీ చెబుతున్నట్టు మీడియాలో చూశాను. ఇది అబద్ధం. వ్యక్తిగతకుటుంబ కలహాలు, ఇతరత్రా కారణాలు వారి మరణానికి కారణం కావచ్చు. ప్రమాణస్వీకారాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ కార్యక్రమం విలువను తగ్గించకూడదు. ఈ పరిస్థితుల్లో నేను మీ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను. క్షమించండి’ అని పేర్కొన్నారు. నేడు తృణమూల్ ధర్నా తృణమూల్ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం నైహతి మునిసిపల్ కార్యాలయం ముందు ధర్నా జరగనుంది. ఈ ధర్నాలో మమత పాల్గొననున్నారు. -
‘మోదీ గుంజిళ్లు తీయాలి’
మందిర్ బజార్/డైమండ్ హార్బర్: సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ద్వారా బీజేపీ బెంగాలీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఈ దుశ్చర్యకు బీజేపీ నేతలు తగిన ఫలితం అనుభవిస్తారనీ, బెంగాలీలు వారిని క్షమించబోరని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని మమత ఫాసిస్టుగా, ప్రజలను హింసించే వ్యక్తిగా అభివర్ణించారు. పంచలోహాలతో చేసిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని పాత విగ్రహం ఉన్నచోటే ప్రతిష్టిస్తామన్న మోదీ ప్రతిపాదనను మమత తిరస్కరించారు. మందిర్ బజార్, డైమండ్ హర్బర్‌ల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో మమత పాల్గొన్నారు. మోదీ గుంజిళ్లు తీయాలి.. బంగారం లాంటి పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో దివాళా తీసిందని బీజేపీ చీఫ్ అమిత్ షా చెప్పడంపై మమత మండిపడ్డారు. ‘బెంగాల్ దివాలా తీసిన రాష్ట్రంగా మారిందని చెప్పడానికి మీకు (బీజేపీ నేతలకు) సిగ్గుగా అనిపించడం లేదా? బెంగాల్‌కు బీజేపీ భిక్ష అక్కర్లేదు. కొత్తగా విద్యాసాగర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడానికి మా దగ్గర నిధులున్నాయి. ప్రధాని మోదీ ఓ అబద్ధాల కోరు. అలాంటి వ్యక్తిని దేశం ఇప్పటివరకూ చూడలేదు. విద్యాసాగర్ విగ్రహాన్ని బీజేపీ గూండాలు ఎలా ధ్వంసం చేశారో మీడియా స్పష్టంగా చూపింది. బెంగాల్ వారసత్వ సంపదను ధ్వంసం చేసినందుకు మోదీ గుంజిళ్లు తీయాలి’ అని మమత వ్యాఖ్యానించారు. ఈసీ అమ్ముడుపోయింది.. సామాజిక మాధ్యమాల్లో బీజేపీ నకిలీ వార్తలు, వదంతులు వ్యాప్తి చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుపోయిందని మమత విమర్శించారు. ఈ మాట అన్నందుకు తాను జైలుకు వెళ్లాల్సివచ్చినా అందుకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. -
మమతతో పోలీసుల కుమ్మక్కు
మథురాపూర్ / చందౌలీ / మిర్జాపూర్: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పశ్చిమబెంగాల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైన పోలీసులు సంఘసంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసానికి సంబంధించిన సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థం కావడంతో మమతా బెనర్జీ తనను జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలను వేధిస్తున్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) గూండాలే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని మోదీ పునరుద్ఘాటించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గురువారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ, విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆందోళనలో మమత.. టీఎంసీ నేతలు, ఆ పార్టీకి చెందిన గూండాలు బెంగాల్‌ను నరకంగా మార్చేశారని ప్రధాని మోదీ విమర్శించారు. ‘నారదా, శారదా చిట్‌ఫంట్ కుంభకోణాల్లో సాక్ష్యాలను మాయంచేసిన రీతిలోనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహ ధ్వంసం ఘటనలో సాక్ష్యాలను అదృశ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దుశ్చర్యకు కారకులైనవారిని కఠినంగా శిక్షించాలి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఖరారవడంతో మమతా బెనర్జీ కలవరపడుతున్నారు. ఆ ఆందోళనతోనే నన్ను జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారు. మమతా బెనర్జీ ఆమె మేనల్లుడు అభిషేక్‌లు బెంగాల్‌ను లూటీచేయడం, బలవంతపు వసూళ్ల సిండికేట్‌ను నడపడమే పనిగా పెట్టుకున్నారు. ఈ అత్తా–అల్లుడి ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నారు’ అని మోదీ ఆరోపించారు. ‘జై శ్రీరామ్’ అనడమూ నేరమే.. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. ‘పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్యం అపఖ్యాతిపాలైంది. దుర్గాపూజ, సరస్వతీపూజతో పాటు చివరికి జై శ్రీరామ్ అని నినదించడం కూడా బెంగాల్లో నేరమైపోయింది. రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయాలను కూడా స్వాధీనం చేసుకుంటామని మమతా బెనర్జీ బెదిరించారు. పశ్చిమబెంగాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ పోరాడుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలపై తన బొమ్మ వేసుకుంటూ మమతా బెనర్జీ స్టిక్కర్ దీదీగా మారిపోయారు. ఆమెకు భారత ప్రధానిపై నమ్మకం ఉండదు కానీ, పాక్ ప్రధానిని మాత్రం ఏ జంకూ లేకుండా ప్రశంసిస్తారు. ఓవైపు బీజేపీ కార్యకర్తలను జైలులో పెడుతున్న బెంగాల్ పోలీసులు, మరోవైపు టీఎంసీ గూండాలను మాత్రం స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు’ అని ఆరోపించారు. విపక్షాలు విఫలమయ్యాయి.. తనపై ప్రతిపక్షాల దూషణలు పెరిగేకొద్దీ ప్రజల ప్రేమ కూడా పెరుగుతూనే ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ‘ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతున్నామని మహాకల్తీ కూటమిలోని రాజకీయ పార్టీలన్నింటికి అర్థమైంది. ఇవన్నీ మోదీ హటావో(మోదీని తప్పించండి) అనే నినాదంతో ముందుకెళుతున్నాయి. బెంగళూరులో ఓ వేదికపై గ్రూప్ ఫొటో దిగిన ఈ పార్టీల నేతలంతా కలసికట్టుగా ప్రధాని పదవికి ఓ అభ్యర్థిని ఎన్నుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. ప్రధాని ఎవరు అవుతారన్న ప్రశ్న ఉదయించగానే, ఎవరి డబ్బావారు వాయించుకోవడం మొదలుపెట్టారు’ అని మోదీ ఎద్దేవా చేశారు. ‘10 సీట్లు, 20, 22, 30, 55 లోక్‌సభ సీట్లు ఉన్నవారంతా ప్రధాని అయిపోవాలని కలలు కంటున్నారు. కలలు కనడం తప్పుకాదు. కా నీ ఇప్పుడు దేశమంతా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్(ఈసారి కూడా మోదీ ప్రభుత్వమే) అంటోంది. మేం జాతీయ భద్రత విషయంలో రాజీపడం. ఉగ్రవాదులను ఏరివేయడంతో పాటు వేర్పాటువాదుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఈ సేవకుడు ప్రజల ఆశలు, ఆకాంక్షల సాధన దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు’ అని తెలిపారు. -
బెంగాల్ టైగర్ వర్సెస్ గుజరాత్ పైటర్
సాక్షి, సెంట్రల్ డెస్క్ : ఒకటా, రెండా ఏకంగా 42 లోక్‌సభ స్థానాలు.. దేశంలో అత్యధిక సీట్లున్న రాష్ట్రాల్లో మూడో స్థానం.. అందుకే అందరి దృష్టి ఆ రాష్ట్రంపైనే!. పట్టు నిలుపుకోవాలని ఒకరి పోరాటం.. పాగా వేయాలని మరొకరి ఆరాటం.. బెంగాల్‌పై మమత ఆధిక్యం ఇంకా కొనసాగుతోంటే.. నేనున్నానంటూ కమల దళం సవాల్ విసురుతోంది. బీజేపీతో చేతులు కలిపినదెవరైనా తనకు శత్రువేనని మమత నినదిస్తుంటే బెంగాల్లో అభివృద్ధికి మమతే స్పీడ్ బ్రేకర్ అంటూ మోదీ కౌంటర్ ఇస్తున్నారు. ఇంతకీ ‘బెంగాల్ దంగల్’లో విజేత ఎవరు?.. ‘పశ్చిమ బెంగాల్’ ఈ పేరు చెబితే విశ్వకవి రవీంద్రుడి జాతీయ గీతాలాపనే కాదు. ఆ రాష్ట్రంలో జరిగే రాజకీయ హింస కూడా అందరికీ గుర్తొస్తుంది. కొన్నాళ్ల క్రితం వరకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), వామపక్ష–కాంగ్రెస్ కూటమి మధ్య జరిగిన రాజకీయ యుద్ధం ఇప్పుడు టీఎంసీ వర్సస్ బీజేపీగా మారిపోయింది. ఈ పోరు రాజకీయం రంగు మార్చుకుంటోంది. 34 ఏళ్ల వామపక్షాల పాలనకు చరమగీతం పాడి, సీపీఎం కంచుకోటను బద్దలుగొట్టి పశ్చిమబెంగాల్లో చరిత్ర సృష్టించారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. ఎనిమిదేళ్లుగా రాష్టాన్ని తన కనుసన్నల్లోనే పాలిస్తున్నారు. బెంగాల్లో ఆమె మాటే శాసనం. ఆమెను ప్రశ్నించే వారు లేరు. ఎవరి మీదనైనా కన్నెర్ర చేస్తే చాలు ప్రసన్నం చేసుకోవాలనే అనుకుంటారు. మమత హయాంలో అభివృద్ధి ఆమడ దూరంలోనే ఉన్నా ఆమెను ఎదుర్కొనే ప్రత్యామ్నాయం ఇప్పటి వరకు రాలేదు. ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూటమి కట్టాలని మమత చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగారు. ఇద్దరూ ఇద్దరే నరేంద్రమోదీ, మమతా బెనర్జీ ఇద్దరూ ఇద్దరే. ఇద్దరి ఆలోచనలు ఒకటే. ఇద్దరివీ ఒంటరి జీవితాలే. అంతా తమ చుట్టూ తిరగాలని, తమ మాటే చెల్లుబాటు కావాలని అనుకుంటారు. తమకు ఎవరైనా ఎదురు తిరిగితే అణగదొక్కేస్తారు. ఒకే స్వభావం ఉన్న ఇద్దరూ ఇప్పుడు బెంగాల్లో పోటీ పడుతున్నారు. ప్రధానమంత్రి పీఠంపై కన్నేసిన మమత కేంద్రం పేరు చెబితేనే అపర కాళికావతారం ఎత్తుతారు. శారదా చిట్‌ఫండ్స్, రోజ్‌వ్యాలీ పోంజి పథకాలు ఆమె ప్రభుత్వం మెడకు చుట్టుకున్నా, కోల్‌కతా పోలీసు కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐనే ఎదుర్కొన్న ధైర్యం ఆమెది. మోదీనే నువ్వెంత అంటే నువ్వెంత అనగలరు. దీదీ ఇలాకాలో మోదీ ధమాకా కోల్‌కతాలో పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఎన్నికల ప్రచారం బీజేపీ శ్రేణులకు మంచి ఊపునిచ్చింది. మోదీ తన మాటల మాయాజాలంతో దీదీ నినాదాలకు కౌంటర్ నినాదాలిస్తూ సభను హోరెత్తించారు. మార్పు రావాలి. మార్పు కావాలి అంటూ తృణమూల్‌పై విరుచుకుపడుతూ బెంగాల్ రేసులో దూసుకుపోతున్నా బీజేపీ రన్నరప్‌గానే ఉంటుందని రాజకీయ విశ్లేషకుల భావన. పశ్చిమ బెంగాల్లో మమత దీదీ ఇంకా పట్టు కొనసాగుతోందని ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. అయితే బీజేపీ గతంలో కంటే మెరుగైన ఫలితాల్ని సాధిస్తుందని తేల్చి చెప్పాయి. బీజేపీ ‘తూర్పు పాలసీ’ ఫలిస్తుందా? దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్న బీజేపీ కేవలం ఉత్తరాదిని నమ్ముకుని ‘మేజిక్ ఫిగర్ 272’ని చేరుకోలేదు. అందుకే అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి తూర్పు రాష్ట్రాల్లో ఉన్న 143 ఎంపీ స్థానాలపై కన్నేసింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలపై పట్టు బిగించే ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక అమిత్ షా కనీసం ఆరుసార్లు పశ్చిమ బెంగాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టపరిచే వ్యూహాల్లో కొంత వరకు విజయం సాధించారు. కనీసం 22 స్థానాలైనా సాధించాలన్న పట్టుదలతో రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. నాయకత్వం కొరత 2014 ఎన్నికల్లో బెంగాల్లో 18 శాతం ఓట్లు సాధించిన బీజేపీ, ఆ తర్వాత రెండేళ్లకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 శాతం ఓట్లను మాత్రమే పొందింది. చాలాచోట్ల రెండో స్థానంలో నిలిచింది. అదే ఇప్పుడు బీజేపీకి బలంగా మారింది. అయితే నాయకత్వ సమస్య ఆ పార్టీని వెంటాడుతోంది. బీజేపీలో కీలక నేతలందరూ వలస పక్షులే. జనాల్లో చరిష్మా ఉన్న నేతలే లేరు. అందరూ కాంగ్రెస్, లెఫ్ట్ నుంచి వచ్చిన వారే. దిలీప్ ఘోష్‌కి పార్టీ పగ్గాలు అప్పగించాక, ఇతర పార్టీల నుంచి చిన్నా చితక నేతలు వచ్చి చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన టీవీ నటి రూపా గంగూలీకి మహిళా విభాగాన్ని అప్పగించారంటే నాయకత్వం సమస్య ఎంత ఉందో అర్థమవుతుంది. ఎన్నికల వేళ టీఎంసీలో టికెట్లు దక్కని ఎమ్మెల్యే అర్జున్‌సింగ్, మరో ఇద్దరు ఎంపీలు అనుపమ్ హజ్రా, సౌమిత్రా ఖాన్ బీజేపీ గూటికి చేరడం కొంతవరకు కలిసొచ్చే అంశం. బీజేపీలోకి వచ్చిన వారంతా మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ నియంతృత్వ పోకడల్ని దుయ్యబట్టడం దీదీలో కాస్త కలవరాన్ని పెంచుతున్నాయి. గత ఎన్నికల స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ స్థానాలను దక్కించుకోలేకపోయినా సంకీర్ణ సర్కార్ ఏర్పాటైతే ఆమె కేంద్రంలో చక్రం తిప్పుతారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. దీదీ మాట ‘జనని, జన్మభూమి, జనం (మా, మట్టి, మనుష్) గెలిస్తేనే, ప్రజాస్వామ్యం గెలుస్తుంది’ ఇది మమతకు అత్యంత ఇష్టమైన నినాదాల్లో ఒకటి. ‘2016 అసెంబ్లీ ఎన్నికల్లో 294 అసెంబ్లీ స్థానాల్లో నేనే అభ్యర్థిని’.. ఇది మమత నాటి ప్రచారం. ‘2019లో బీజేపీ ఫినిష్ అయిపోతుంది’. మమత ప్రచారం ‘బెంగాల్ గడ్డ మాదే..’ మోదీ తూటా ‘మమత పాలనలో జనని, జన్మభూమి, జనం సర్వనాశనం అయ్యారు. వారిని కాపాడే సత్తామాకే ఉంది’.. ఇది మమత నినాదానికి మోదీ కౌంటర్. ‘42 స్థానాల్లో పోటీ చేస్తున్నది చౌకీదారులే’.. ప్రస్తుత ఎన్నికల్లో మోదీ స్లోగన్. ‘ఈ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుంది’.. మోదీప్రచారం ‘మార్పు కావాలి..మార్పు రావాలి’. యుద్ధానికి సిద్ధం దీదీ నయా ఫార్ములా 2014 లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగా దేశవ్యాప్తంగా మోదీ హవా ప్రస్తుతం లేదనేది అంతటా వినిపిస్తున్న మాట. బీజేపీ ఎన్ని సీట్లు సాధిస్తుందన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ. దీనికి మమతా బెనర్జీ ఇటీవల జరిగిన విశాఖపట్నం సభలో తనదైన స్టయిల్లో ఒక కొత్త ఫార్ములా చెప్పారు.. బీజేపీ దాని మిత్రపక్షాలకు 125 సీట్లకు మించి రావని, మోదీతో చేతులు కలపని పార్టీలే నెగ్గుతాయన్నది ఆమె థియరీ. ఇదేదో అల్లాటప్పాగా ఆమె చెప్పలేదు. 2014 ఎన్నికల్లో ఓట్లు, సీట్లు, అంకెలు లెక్కలు అన్నీ వేసుకొని ఒక అంచనాకు వచ్చారు. గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనం వీచినప్పుడే పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మొత్తం 191 స్థానాల్లో బీజేపీ 21 సీట్లు సాధించింది. వాటిలో కర్ణాటకలోనే 17 సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో 71 స్థానాలు సాధించిన యూపీలో ఇప్పుడు త్రిముఖ పోటీ నెలకొనడంతో 15 నుంచి 20కి మధ్య బీజేపీ ఆగిపోతుందని ఆమె అంచనా. ఇక క్లీన్‌స్వీప్ చేసిన రాజస్తాన్, గుజరాత్, కాకుండా కొన్ని హిందీ రాష్ట్రాల్లో కూడా ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది. అలాంటప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు బీజేపీకి ఎక్కడ నుంచి వస్తాయనేది మమత వాదన. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైతే కనీసం 30 సీట్లు సాధించినా తాను చక్రం తిప్పేయొచ్చన్నది మమత ఆశ. ఎన్నికల్లో ఇవే ప్రచారాస్త్రాలు పౌర జాతీయ రిజిస్టర్ (ఎన్ఆర్సీ): అసోంలో అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి కేంద్రం తెచ్చిన పౌర జాతీయ రిజిస్టర్ ప్రకంపనలు బెంగాల్‌ను కూడా తాకాయి. బీజేపీ – టీఎంసీ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. మన దేశానికి వచ్చిన శరణార్థుల్ని గెంటేస్తారా అంటూ మమతా కేంద్రంపై కన్నెర్ర చేశారు. దీంతో బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌కు వచ్చిన వలసదారుల్లో ఒక రకమైన గందరగోళం, అభద్రతా భావం నెలకొంది. ఇది ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపించనుంది. అక్రమ వలసలు సరిహద్దు దేశాల నుంచి అక్రమ వలసల్ని ప్రోత్సహిస్తూ మమత బెంగాల్ గడ్డను వారికి స్వర్గధామంగా మారుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనినే బీజేపీ ఎన్నికల అంశంగా పదేపదే లేవనెత్తుతోంది. మమతను ఇరుకున పెడుతోంది. పౌరసత్వ సవరణ బిల్లు ఈ బిల్లు కూడా ఎన్నికల్లో ప్రధానాంశమే. ఈ బిల్లు ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వాన్ని ఇచ్చే బిల్లు. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది కానీ ఇంకా రాజ్యసభ ఆమోదం పొందలేదు. ఇది వివక్షతో కూడుకున్నదని దీదీ మండిపడుతున్నారు. నిరుద్యోగం నిరుద్యోగం అనేది ఇప్పుడు దేశవ్యాప్త ఎన్నికల అంశంగా మారింది. మమత తాము రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, గ్రామస్థాయిలో స్వయం సహాయక సంఘాల ద్వారా లక్షల్లో ఉద్యోగాలు కల్పించామని అంటున్నారు. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో చిన్నా చితక పరిశ్రమలు కుదేలైపోయాయంటూ అవకాశం వచ్చినప్పుడల్లా ప్రచారం చేస్తున్నారు. -
దీక్ష విరమించిన మమతా బెనర్జీ
-
ముగిసిన దీదీ ధర్నా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య నెలకొన్న వివాదం మంగళవారం సుప్రీంకోర్టు తీర్పుతో తాత్కాలికంగా సద్దుమణిగింది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించి సీబీఐ విచారణకు సహకరించాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే రాజీవ్ ను అరెస్టు చేయడం వంటి బలవంతపు చర్యలేవీ చేపట్టకుండా సీబీఐని కోర్టు నిలువరించింది. తీర్పు తమకు అనుకూలంగా ఉన్నందున ఆదివారం రాత్రి నుంచి తాను చేపట్టిన ధర్నాను విరమిస్తున్నట్లు మంగళవారం సాయంత్రం మమతా బెనర్జీ ప్రకటించారు. అయితే ఈ తీర్పు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంప పెట్టు అనీ, సీబీఐకి లభించిన నైతిక విజయమని బీజేపీ పేర్కొంది. మరోవైపు రాజీవ్ కుమార్‌పై సీబీఐ చర్యలను అడ్డుకోవాలంటూ బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పైన కలకత్తా హైకోర్టు కూడా విచారణ ప్రారంభించి, కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కారణంగా గురువారం వరకు వాయిదా వేసింది. అయితే రాజీవ్ తన ఉద్యోగ నియమాలను ఉల్లంఘించి క్రమశిక్షణ తప్పి ప్రవర్తించారనీ, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించడం మరో కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. మా నైతిక విజయమిది: మమత అరెస్టు చేయడం సహా రాజీవ్ కుమార్‌పై బలవంతపు చర్యలేవీ తీసుకోకుండా సీబీఐని సుప్రీంకోర్టు నిలువరించడం తమకు లభించిన నైతిక విజయమని మమత పేర్కొన్నారు. తీర్పు తమకు అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతిపక్షాల సలహా మేరకు మూడ్రోజులుగా చేపట్టిన ధర్నాను విరమించినట్లు ఆమె ప్రకటించారు. ‘కోర్టు ఉత్తర్వులు సామాన్యుడికి, ప్రజా స్వామ్యానికి, రాజ్యాంగానికి లభించిన విజయం. మాది ప్రజా ఉద్యమం. మేం ఐక్యంగా పోరాడతాం. మేం చట్టాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాం.’ అని మమత చెప్పారు. కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని బీజేపీ తమను వ్యతిరేకించే వారిని బ్లాక్మెయిల్ చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయననీ, మోదీని గద్దె దింపేవరకు పోరాడుతానని మమత శపథం చేశారు. ఇక తన పోరాటాన్ని ఢిల్లీలో కొనసాగిస్తానని చెప్పారు. సీబీఐ అంటే తనకు గౌరవం ఉందనీ, రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ పతకం దొంగతనం కేసును కూడా ఆ సంస్థ ఇంతే ఉత్సాహంతో దర్యాప్తు చేయాలని మమత కోరారు. అయితే ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలను మాత్రమే సీబీఐ పాటిస్తోందని మమత ఆరోపించారు. ‘దీని వెనుక ఓ కథ ఉంది. అదేంటంటే మోదీకి వ్యతిరేకంగా ఎవ్వరూ గొంతెత్తి మాట్లాడకూడదు. ఎవరైనా అలా చేస్తే వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయి. అదే వ్యక్తులు బీజేపీలో చేరగానే ఇక వాళ్ల జోలికి ఎవరూ వెళ్లరు’ అని మమత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వంపై పోరుకు ప్రణాళికలు రచించేం దుకు ఈనెల 13, 14 తేదీల్లో ఢిల్లీలో విపక్షాల సమావేశం ఉంటుందన్నారు. మమతకు చెంపపెట్టు: బీజేపీ సుప్రీం తీర్పు మమతకు చెంపపెట్టు లాంటిదనీ, సీబీఐకి ఇది నైతిక విజయమని బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కోర్టు తీర్పును స్వాగతిస్తూ ‘పోలీస్ కమిషనర్ సహా చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అని అన్నారు. ఇదిలాఉండగా, ఉద్యోగ నిమయాలను ఉల్లంఘించినందుకు రాజీవ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. కొందరు పోలీసు అధికారులతో కలిసి మమత ధర్నాలో రాజీవ్ కూడా పాల్గొన్నట్లు తమకు సమాచారం వచ్చిందనీ, ఇది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని బెంగాల్ ప్రధాన కార్యదర్శి మలయ్ కుమార్‌ను కోరింది. చల్లగా ఉంటుంది.. షిల్లాంగ్‌లో విచారించండి అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండేందుకు రాజీవ్ కుమార్‌ను తటస్థ ప్రదేశమైన మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో విచారించాలని సుప్రీం కోర్టు సీబీఐకి సూచించింది. సీబీఐ పిలిచిన తేదీల్లో షిల్లాంగ్‌కు వెళ్లి విచారణకు హాజరు కావాల ని రాజీవ్‌ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌తోపాటు జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిల్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ ఈ తీర్పు చెప్పింది. ‘షిల్లాంగ్‌కు వెళ్లండి. అక్కడ చల్లగా ఉంటుంది. ఇరుపక్షాలూ ప్రశాంతంగా ఉంటారు’ అని న్యాయమూర్తులు సరదాగా అన్నారు. రాజీవ్ కుమార్ విచారణకు గైర్హాజరవడానికి కారణమేమీ లేదనీ, కాబట్టి ఆయనపై బలవంతపు చర్యలేవీ వద్దని కోర్టు పేర్కొంది. శారదా చిట్‌ఫండ్ కుంభకోణం దర్యాప్తుకు సంబంధించిన కీలక ఆధారాలు, సాక్ష్యాలను రాజీవ్ నాశనం చేశారనీ ఆరోపిస్తూ, ఆయనను విచారించేందుకు అనుమతించాల్సిందిగా సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే. ఈ కేసులను ఓ ప్రత్యేక బృందం (సిట్) అప్పట్లో రాజీవే పర్యవేక్షణలోనే దర్యాప్తు చేసింది. రాజీవ్ సాక్ష్యాలను నాశనం చేయడానికి ఏ కొంచెమైనా ప్రయత్నించినట్లు తేలితే ఆయన పశ్చాత్తాప పడేలా తమ చర్యలుంటాయని సుప్రీంకోర్టు సోమవారమే హెచ్చరించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ రాజీవ్‌తోపాటు బెంగాల్ ప్రధాన కార్యదర్శి, డీజీపీల పేర్లను కూడా సీబీఐ పిటిషన్లో పేర్కొంది. దీంతో వీరంతా ఫిబ్రవరి 18లోపు తమ స్పందన తెలియజేయాలనీ, ఆ తర్వాత అవసరమైతే ఫిబ్రవరి 20న వ్యక్తిగతంగా కోర్టుకు రావాల్సి ఉంటుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాలు, బెంగాల్ పోలీస్ తరఫున ఏఎం సింఘ్వీ వాదనలు వినిపించారు. చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించి సీబీఐకి బెంగాల్ పోలీసులు ఇచ్చిన సాక్ష్యాలు, ఆధారాలు అసలైనవి కాదనీ, కాల్‌డేటాలో కొంత సమాచారాన్ని తొలగించడం వంటి అక్రమాలు జరిగాయని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. అధికార తృణమూల్‌కు సన్నిహితులు, లేదా సంబంధీకులు చిట్‌ఫండ్ కుంభకోణాల కేసుల్లో అరెస్టయ్యారని వేణుగోపాల్ కోర్టుకు తెలిపారు. విచారణకు హాజరు కావాలని రాజీవ్‌కు మూడుసార్లు సీబీఐ నోటీసులు పంపినా ఆయన స్పందించలేదని ఏజీ తెలిపారు. -
మోదీకి ట్రిపుల్ సవాల్!
వాళ్లు ముగ్గురూ ముగ్గురే. ఒక్కొక్కరు ఒక్కో సామాజిక వర్గానికి చెందినవారు. అయితేనేం అత్యంత శక్తిమంతమైన మహిళలు. పశ్చిమబెంగాల్లో ఎర్రకోటను బద్దలు కొట్టి 34 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనకు తెరదించి, ఫైర్ బ్రాండ్‌గా ఎదిగిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎవరి ఊహకూ అందని విధంగా దళితులు, అగ్రవర్ణాల అరుదైన సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్ని శాసించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిగా ప్రధాన కార్యదర్శి హోదాలో రాజకీయ రణక్షేత్రంలోకి దిగుతున్న ప్రియాంక గాంధీ.. ఈ ముగ్గురమ్మలు ఈసారి ఎన్నికల్లో ప్రధాని మోదీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తారా? ఈ ముగ్గుర్నీ ఎదుర్కోవడమే మోదీ ముందున్న అతి పెద్ద సవాలా? ఇప్పుడివే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మమత, మాయావతిలు ప్రత్యర్థులు విలవిల్లాడేలా రాజకీయ వ్యూహాలను రచించడంలో దిట్టలు. ఎన్డీయేతర ప్రభుత్వం ఏర్పాటైతే ప్రధాని పదవి రేసులో ముందున్నవారు. ప్రియాంకకు రాజకీయ అనుభవం అంతగా లేకపోయినప్పటికీ నాన్నమ్మ ఇందిరాగాంధీ పోలికల్ని పుణికిపుచ్చుకోవడంతో ప్రజల్లో ఆమెకున్న ఛరిష్మా వేరు. మాయావతి ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా భావించే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ 2014 ఎన్నికల్లో ఏకంగా 71 స్థానాలను గెలుచుకుంది. ఈస్థాయి విజయాన్ని ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలైన బీఎస్పీ, ఎస్పీ జీర్ణించుకోలేకపోయాయి. ఈసారి మోదీని గద్దె దించడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. కాంగ్రెస్ కూడా తమకు మిత్రపక్షమేనన్న పరోక్ష సంకేతాలు పంపుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో పోటీకి కూడా దిగడం లేదు. ఎన్నికల అనంతరం పొత్తులపై కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ మధ్య స్పష్టమైన అవగాహన ఉంది. పైపెచ్చు మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఎస్పీ మద్దతు కూడా తెలుపుతోంది. 63 ఏళ్ల వయసున్న మాయావతి.. మోదీకి చెక్ పెట్టడం కోసం తనకు ఆగర్భ శత్రువైన ఎస్పీతో కూడా చేతులు కలిపారు. మమతా బెనర్జీ ఇక అన్నీ కలిసి వస్తే ప్రధాని పీఠంపై కూర్చోవాలని కలలు కంటున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఒకప్పుడు బీజేపీతో కలిసి పోటీచేసి రైల్వే మంత్రిగా కూడా పనిచేసిన మమత ఈ ఎన్నికల్లో బీజేపీపై ఏ మాత్రం మమత చూపించడం లేదు. గత నెలలోనే కోల్‌కతాలో బీజేపీ వ్యతిరేక ర్యాలీ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎన్డీయే వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. కాంగ్రెస్‌తో నేరుగా ఎలాంటి పొత్తు లేకపోయినప్పటికీ మోదీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఆమె ఎవరితో చేతులు కలిపేందుకైనా సిద్ధమవుతున్నారు. ప్రియాంక గాంధీ ఇక రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలతో మంచి జోష్ మీదున్న కాంగ్రెస్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో మోదీ హవాకు చెక్ పెట్టడం కోసమే తమ పార్టీ తురుపు ముక్క ప్రియాంకను రంగంలోకి దించుతోంది. యూపీలో ఒకప్పుడు కాంగ్రెస్‌కు సంప్రదాయంగా మద్దతునిచ్చే బ్రాహ్మణులు, ఠాకూర్లు ఇటీవల కాలంలో బీజేపీ వైపు మళ్లిపోయారు. ప్రియాంక రాకతో వారు కాంగ్రెస్ గూటికి తిరిగి వస్తారన్న ఆశలు పార్టీ నేతల్లో ఉన్నాయి. ఇక ఎస్పీ, బీఎస్పీ పొత్తుతో దళితులు, ముస్లింలు ఆ కూటమికే మద్దతు పలికే అవకాశం ఉంది. ఇవన్నీ బీజేపీ విజయావకాశాల్ని దెబ్బ తీస్తుందనే అంచనాలున్నాయి. విపక్షాల్లోనే ఎక్కువ ఎన్డీయేతో పోల్చి చూస్తే విపక్షపార్టీల్లోనే శక్తిమంతమైన మహిళా నేతలు ఉన్నారు. సహజంగానే వారివైపు మహిళా ఓటర్లు మొగ్గు చూపించే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న మహిళలు ఎటువైపు మొగ్గు చూపిస్తారో వారే అధికార అందలాన్ని అందుకునే అవకాశమైతే ఉంది. ‘‘బీజేపీ చాలా ఆందోళనలో ఉంది. మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడంతో ఆత్మవిశ్వాసం కోల్పోయింది. విపక్షాల్లో ఉన్న శక్తిమంతమైన మహిళలే మోదీకి ఈ ఎన్నికల్లో ముప్పుగా మారుతారు‘‘ అని బీజేపీకి గుడ్ బై కొట్టేసిన యశ్వంత్ సిన్హా అభిప్రాయపడ్డారు. మాయావతి, మమతా బెనర్జీ వంటి నేతల పట్ల కేవలం మహిళా ఓటర్లే మొగ్గు చూపిస్తారనుకోవడం సరికాదని అంటున్నారు బీఎస్పీ అధికార ప్రతినిధి సుధీంద్ర భదోరియా. బీజేపీవైపే ఉన్నారా? పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో కొంత అపప్రధను మూటకట్టుకున్నప్పటికీ మోదీ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడే. ఓ ముగ్గురు మహిళలు చేతులు కలిపినంత మాత్రాన మోదీకి వచ్చే ముప్పేమీ లేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన ఆడవాళ్ల కోసం టాయిలెట్ల నిర్మాణం, సబ్సిడీ రేట్లకే గ్యాస్ సిలిండర్లు వంటివి మోదీ సర్కార్ పట్ల మహిళల్లో సానుకూలతనే పెంచాయి. అంతే కాకుండా మోదీ తన కేబినెట్లో కూడా మహిళలకు సముచిత స్థానాన్ని కల్పించారు. మొత్తం 26 మంది మంత్రులున్న కేబినెట్లో ఆరుగురు మహిళలున్నారు. ఇవన్నీ మోదీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశాలేనని మహిళలు తమవైపే ఉంటారన్న ధీమాలో బీజేపీ ఉంది. -
యోగి హెలికాప్టర్‌కు అనుమతి నిరాకరణ
బలూర్ఘాట్/లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పశ్చిమబెంగాల్లో చుక్కెదురైంది. ఆయన ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు అక్కడి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఆదివారం బీజేపీ చేపట్టిన రెండు సభలకు సీఎం యోగి హాజరు కాలేకపోయారు. అందుకు బదులుగా ఫోన్ ద్వారా ఆయన రెండు సభలకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న మమతా బెనర్జీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో సత్తా చూపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ ‘గణతంత్ర బచావో’ పేరిట ర్యాలీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లా బలూర్ఘాట్, ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా రాయ్గంజ్లో నిర్వహించే సభలకు యూపీ సీఎం ఆదిత్యనాథ్‌తోపాటు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆదిత్యనాథ్ ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు ఈ రెండు చోట్లా మమతా బెనర్జీ రాష్ట్ర యంత్రాంగం అనుమతి నిరాకరించింది. దీంతో ఆయన లక్నో నుంచే ఫోన్ ద్వారా ఈ రెండు సభలకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
‘వారి చేతులు రక్తపు మరకలతో తడిశాయి’
కోల్కత్తా : బీజేపీ ప్రభుత్వం తాలిబన్ గ్రూపులను తయారుచేసి దేశంలో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పార్టీ వార్షిక దినోత్సవం సందర్భంగా శనివారం కోల్‌కత్తాలో మెగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. మతకల్లోలాలు సృష్టించి వారి చేతులు రక్తపు మరకలతో తడిసిపోయాయని మమతా ధ్వజమెత్తారు. బీజేపీ నేతల అహంకార, బెదిరింపులు మాటలకు ప్రజలు భయపడవద్దని సూచించారు. ప్రజల క్షేమం కోసం సరిగ్గా టెంట్ కూడా నిర్మించలేని వారు దేశాన్ని ఏం నిర్మిస్తారని ప్రశ్నించారు. ఇటీవల మిద్నాపూర్‌లో మోదీ సభలో టెంట్ కూలి 90 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. దేశాన్ని మతతత్వ బీజేపీ నుంచి రక్షించేందుకు ‘బీజేపీ హఠావో దేశ్ బచావో’ అనే నినాదాన్ని ఆగస్ట్ 15 నుంచి ప్రచారం చేస్తామని మమత ప్రకటించారు. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో తృణమూల్ విజయం సాధించి తీరుతుందని మమత ఆశాభావం వ్యక్తం చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 32 స్థానాల్లో టీఎంసీ విజయం సాధించిన విషయం తెలిసిందే. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు జనవరిలో అన్నిపార్టీల నేతలతో కోల్‌కత్తాలో భార్యీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు మమతా ప్రకటించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల్లో కొందరూ మంచివారు ఉన్నారని, వారిని గౌరవిస్తానని పేర్కొన్నారు. కొందరూ మాత్రం మతకల్లోలు సృష్టించి దేశంలో అల్లర్లు రేపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సీనియర్ నేత చందన్ మిత్రా బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్‌లో చేరుతున్నట్లు మమతా ప్రకటించారు. వీరితో పాటు నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఎంసీలో చేరారు. -
స్టాలిన్‌తో మమత మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు విపక్షాలను ఏకం చేసే పనిలో నిమగ్నమైన తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తో ఫోన్లో చర్చలు జరిపారు. ఎన్డీఏపై పార్లమెంట్ లోపల, వెలుపల సమిష్టి కార్యాచరణతో పోరాడటంపై ఇరువురు నేతలు చర్చించారు. భావసారూప్య పార్టీలతో సంప్రదింపులు జరిపి బీజేపీ ఓటమి లక్ష్యంగా వాటిని ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రక్రియ జరుగుతోందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు. టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఫోన్లో సంప్రదించిన మీదట మమతా బెనర్జీ..స్టాలిన్‌తోనూ మాట్లాడారన్నారు. పార్లమెంట్లో సోమవారం పలు అంశాలపై టీఆర్ఎస్, టీడీపీ, ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, డీఎంకే సభ్యుల మధ్య మెరుగైన సమన్వయం నెలకొందని చెప్పారు. ఈశాన్యరాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తృణమూల్ ఎంపీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
మమతా బెనర్జీతో అఖిలేశ్ భేటీ
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భేటీ అయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకే వారు భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మతతత్వ శక్తులపై పోరాటంలో మద్దతుగా నిలుస్తామని అఖిలేశ్ ఆమెకు తెలిపారు. ఈ విషయంలో లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. టీఎంసీతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అఖిలేష్ సమాధానం దాటవేశారు. -
నిరసనలపై మమత ఫైర్
సాక్షి,న్యూఢిల్లీ: పద్మావతి మూవీపై ముసురుకున్న వివాదంపై సినీ, రాజకీయ ప్రముఖులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పద్మావతి వివాదంపై స్పందించారు. పద్మావతి మూవీపై వ్యక్తమవుతున్న నిరసనలను దీదీ తోసిపుచ్చారు. మొత్తం వ్యవహారాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోవడంతో దేశంలో సూపర్ ఎమర్జెన్సీ నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పద్మావతి వివాదం దురదృష్టకరం...ఓ రాజకీయ పార్టీ భావప్రకటన స్వేచ్ఛను హరించే క్రమంలో వ్యూహాత్మక ప్రణాళికతో వ్యవహరిస్తుండటంతోనే దేశంలో అత్యయిక పరిస్థితి నెలకొంది‘ అన్నారు. చిత్ర పరిశ్రమలోని వారంతా ఏకమై దీనిపై గళమెత్తాలని మమతా బెనర్జీ పిలుపు ఇచ్చారు. మరోవైపు పద్మావతి మూవీని తమ రాష్ట్రంలో నిషేధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. చౌహాన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పాలిత పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సమర్ధించడం గమనార్హం.చరిత్రను వక్రీకరిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు.