కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ భేటీ అయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకే వారు భేటీ అయ్యారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మతతత్వ శక్తులపై పోరాటంలో మద్దతుగా నిలుస్తామని అఖిలేశ్ ఆమెకు తెలిపారు. ఈ విషయంలో లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. టీఎంసీతో కలిసి ఫ్రంట్ ఏర్పాటు చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు అఖిలేష్ సమాధానం దాటవేశారు.
Comments
Please login to add a commentAdd a comment