ములాయంతో అఖిలేశ్‌ భేటీ | Akhilesh met with Mulayam | Sakshi
Sakshi News home page

ములాయంతో అఖిలేశ్‌ భేటీ

Published Fri, Sep 29 2017 3:06 AM | Last Updated on Mon, Jul 30 2018 8:10 PM

Akhilesh met with Mulayam - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తన తండ్రి ములాయంను గురువారం ఆయన స్వగృహంలో కలుసుకున్నారు. అక్టోబర్‌ 5న ఆగ్రాలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకావాల్సిందిగా ఆయన్ను అఖిలేశ్‌ ఆహ్వానించినట్లు ఎస్పీ ఎమ్మెల్సీ సునీల్‌ సింగ్‌ యాదవ్‌ తెలిపారు.

త్వరలోనే ములాయం మరో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆయనతో అఖిలేశ్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 23న జరిగిన ఎస్పీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశాలకు ములాయం, ఆయన సోదరుడు శివపాల్‌కు ఎలాంటి ఆహ్వానం అందలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement