
బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాల్లేవు: మమత
పైలాన్: ఎన్నికల అనంతరం మోడీ ప్రధాని కావడం, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలను పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తోసిపుచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపడ స్థానాలు బీజేపీకి రావడం అంత తేలికేమీ కాదన్నారు.
దక్షిణ 24 పరగణాల జిల్లాలోని పైలాన్‌లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. తాను ఏడు సార్లు ఎంపీగా ఉన్నానని, రాజకీయాల గురించి తనకు బాగా తెలుసని, బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవన్నారు.