వివిధ సేవలు పొందేందుకు, సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్లను నవంబర్ చివరి వారంలో రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆధార్ ఉన్నవారికి కూడా అనుసంధానం గడువును డిసెంబర్ 31 తర్వాత పొడిగించేందుకు కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయాన్ని వెలువరించింది.