సాక్షి, ఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణం శంకుస్థాపన భూమి పూజ సందర్భంగా దేశ ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్ మారుతుందని కేజ్రివాల్ అన్నారు. రాముని ఆశీర్వాద బలంతో మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, పేదరికం నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచానికే దిశానిర్దేశంగా నిలవనుంది. జై శ్రీ రామ్! జై బజరంగ్ బళి అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందుభాగంలో నిలిచే నాయకుల్లో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఒకరని గుర్తుచేశారు. (అయోధ్య రామాలయం : ఉద్వేగపూరిత క్షణం)
శతాబ్దాల రామ భక్తుల కల సాకారమవుతున్న రామాలయ ఆలయ నిర్మాణ కార్యక్రమానికి మోదీతో సహా కేవలం 175 మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. కోవిడ్ నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ సందర్శకుల సంఖ్యను పరిమితం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అయోధ్య అంతటా రామనామంతో మార్మోగిపోతుంది. భారీగా మోహరించిన భద్రత నడుమ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. (‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’)
भूमि पूजन के मौक़े पर पूरे देश को बधाई
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 5, 2020
भगवान राम का आशीर्वाद हम पर बना रहे। उनके आशीर्वाद से हमारे देश को भुखमरी, अशिक्षा और ग़रीबी से मुक्ति मिले और भारत दुनिया का सबसे शक्तिशाली राष्ट्र बने। आने वाले समय में भारत दुनिया को दिशा दे।
जय श्री राम! जय बजरंग बली!
Comments
Please login to add a commentAdd a comment