Bhumi puja
-
తెలంగాణలో రూ.621 కోట్ల రైల్వే అభివృద్ధి పనులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రూ.621 కోట్ల విలువ చేసే పలు రైల్వే అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన, ప్రారంబోత్సవం చేయనున్నారు. ఈ నెల 26న దేశవ్యాప్తంగా 500కు పైగా అమృత్ భారత్ స్టేషన్లు, దాదాపు 1,500 రైల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లలో నిర్మాణం పూర్తయిన వాటిని జాతికి అంకితం చేయనుండగా, కొత్తవాటికి భూమిపూజ చేయనున్నారు. అందులో తెలంగాణలో రూ.230 కోట్లకు పైగా నిధులతో 15 అమృత్ భారత్ స్టేషన్లు, రూ.169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న 17 రైల్ ఫ్లైఓవర్, అండర్ పాస్‌లకు ప్రధాని భూమి పూజ చేయనున్నారు. వీటితోపాటు రూ.221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్, రైల్ అండర్ పాస్‌లను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. 17 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం అమృత్ భారత్ స్టేషన్లతో పాటు మోదీ రాష్ట్రంలో రూ.169 కోట్లకు పైగా నిధులతో నిర్మించనున్న ఒక రైల్ ఫ్లై ఓవర్‌కు, 16 రైల్ అండర్ పాస్‌లకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అందులో హైదరాబాద్ డివిజన్లోని బోధన్ వద్ద రైల్ ఫ్లై ఓవర్, మేళ్ల చెరువు, కురుముర్తి వద్ద రెండు రైల్ అండర్ పాస్‌లు, చిలకమర్రి, గౌడవల్లి, కీసర, రామాంతపూర్, పాలాట, కూచవరం వద్ద, మదనపూర్, గద్వాల్ వద్ద రైల్ అండర్ పాస్‌లు... సికింద్రాబాద్ డివిజన్లోని కురచపల్లి, వెలమల, చాగల్ వద్ద రైల్ అండర్ పాస్‌లు, గుంతకల్ డివిజన్లోని నారాయణపేట వద్ద రైల్ అండర్ పాస్‌ల నిర్మాణం జరగనుంది. వీటితోపాటు ఆయా డివిజన్లలో రూ.221 కోట్ల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న 3 రైల్ ఫ్లై ఓవర్లను, 29 రైల్ అండర్ పాస్‌లను మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అందులో హైదరాబాద్ డివిజన్లోని మహబూబ్‌నగర్ రూరల్, పెద్దదిన్నె, తిప్పాపూర్, గద్వాల్, సిద్దరామేశ్వర్నగర్, బైరవాపురం, తలమడ్ల, ఇటిక్యాల, అడ్లూర్, నవీపేట్, ఉండవల్లి వద్ద రైల్ అండర్ పాస్‌లను... సికింద్రాబాద్ డివిజన్లోని ఎర్రగుంట, ఉంకిచర్ల/నిరుపమకొండ, చర్లపల్లి వద్ద రైల్ ఫ్లై ఓవర్లు, విలాసాగర్, బిస్‌బాగ్, శివపురం, కాశీపేట్, మంచిర్యాల, బూడ, కాజీపేట్, గరిడపల్లి, మీనవోలు, బయ్యారం, దెందుకూరు, ముత్యాలగూడెం, రాజనెల్లి, ఉప్పరపల్లి వద్ద రైల్ అండర్ పాస్‌లను... గుంటూర్ డివిజన్లోని నార్కట్‌పల్లి, కీసరజూపల్లి, బుదారం వద్ద అండర్ పాస్‌లను... గుంతకల్ డివిజన్లోని తంగడి వద్ద ఉన్న అండర్ పాస్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. మోదీ, రైల్వేమంత్రికి ధన్యవాదాలు: కిషన్‌రెడ్డి రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి పెద్ద ఎత్తున సహకరించడంపై ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతవరకూ ఎలాంటి రైలు సౌకర్యం లేని మెదక్, సిద్ధిపేట వంటి ప్రాంతాలకు కొత్తగా రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, ఆదాయపరంగా అనుకూలం కాకపోయినా మల్లన్న భక్తుల కోసం కొమురవెల్లిలో నూతన రైల్వే హాల్ట్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మార్చిలో చర్లపల్లి రైల్వే టర్మి నల్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి రైల్వే టర్మి నల్ మార్చిలో అందుబాటులోకి రానుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. టర్మినల్ పనులు చివరిదశలో ఉన్నాయని చెప్పారు. ఈ టర్మి నల్ అప్రోచ్ రోడ్డును విస్తరించడంతోపాటు టర్మి నల్కు చేరేందుకు అవసరమైన బస్సుల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. శనివారం రైల్ నిలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు రూ.925 కోట్లతో చేపట్టే 57 స్టేషన్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని చెప్పారు. గత నాలుగేళ్లలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 415 మ్యాన్ లెవల్ క్రాసింగ్లను తీసేసినట్టు జైన్ పేర్కొన్నారు. -
బంగారు జగనన్నకి బంగారం రాఖీ కట్టిన శైలజాచరణ్ రెడ్డి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు డెయిరీ పునరుద్ధరణలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు భూమి పూజ చేసి ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఈ మేరకు ఆయన నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. దీనిలో భాగంగా సీఎం జగన్‌కు మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్పర్సన్, చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకురాలు శైలజా చరణ్ రాఖీ కట్టారు. అది కూడా బంగారంతో చేసిన రాఖీ కట్టారు. బంగారంలాంటి మనసున్న జగనన్నకు ఏమిచ్చినా తక్కువ కాబట్టి మహిళా లోకం తరఫు నుంచి బంగారం రాఖీ కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు శైలజా చరణ్‌రెడ్డి. చదవండి: బాబు వెన్నుపోటు వీరుడు.. పవన్ ప్యాకేజీ శూరుడు: సీఎం జగన్ -
చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు సీఎం జగన్ భూమి పూజ (ఫొటోలు)
-
హెరిటేజ్ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారు: సీఎం జగన్
Updates: ►సీఎంసీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ►300 బెడ్స్ కెపాసిటీతో అత్యాధునిక సీఎంసీ హాస్పిటల్ నిర్మాణం ►చిత్తూరు డెయిరీ నష్టాల్లో ఉంటే హెరిటేజ్ డెయిరీ లాభాల్లోకి వెళ్లడం ఆశ్చర్యమేసింది: సీఎం జగన్ ►చంద్రబాబు హయాంలో అతిపెద్ద చిత్తూరు డెయిరీ దోపిడీకి గురైంది ►పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేర్చా ►182 కోట్ల బకాయిలను తీర్చి డెయిరీ రీఒపెన్ చేస్తున్నాం ►అమూల్ రూ.325 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ►హెరిటేజ్ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు. మూతపడిన చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామన్నారు. ►చిత్తూరు డెయిరీ వద్ద అమూల్ ప్రాజెక్ట్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించారు. కాసేపట్లో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. చదవండి: పచ్చని చిత్తూరు విజయా డెయిరీపై ‘పచ్చ’ కుట్ర.. పక్కాగా ప్లాన్ అమలు చేసిన చంద్రబాబు ►రేణిగుంట ఎయిర్‌పోర్టుకు సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో చిత్తూరుకు బయలుదేరారు. కాసేపట్లో అమూల్ డెయిరీని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఫొటో సెషన్, ఎగ్జిబిషన్ పరిశీలించిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సీఎంసీ ఆసుపత్రి ఆవరణలో 300 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. సాక్షి, అమరావతి\చిత్తూరు: రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పాడి రైతులకు శుభ గడియ రానేవచ్చింది. దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ. 385 కోట్లతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ చేయనున్నారు. ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన మరో కీలకమైన హామీ ఆచరణకు నోచుకోబోతోంది. 2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమైంది. తొలి దశలో లక్ష టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యూనిట్ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలిదశలో రూ. 150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పన్నీర్, యోగర్ట్, స్వీట్లు తయారీ విభాగాలతో పాటు అల్ట్రా హై ట్రీట్మెంట్ (యూహెచ్‌టీ) ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఈ డెయిరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. సహకార డెయిరీలకు పాతరేసిన బాబు రైతుల నుంచి గిట్టుబాటు ధరకు పాలు సేకరించి, వినియోగదారులకు సరసమైన ధరకే నాణ్యమైన పాల సరఫరా లక్ష్యంతో 6 వేల లీటర్ల సామర్థ్యంతో చిత్తూరు డెయిరీని ఏర్పాటు చేశారు. దశల వారీగా విస్తరించడంతో రోజుకు 2.5 లక్షల లీటర్ల సామర్థ్యంతో దేశంలోనే రెండో అతిపెద్ద డెయిరీగా అవతరించింది. 1992–93 వరకు విజయవంతంగా పనిచేసిన ఈ డెయిరీని 1995లో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు తన హెరిటేజ్ డెయిరీ కోసం నిర్వీర్యం చేయడంతో చిత్తూరు డెయిరీ తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. లాభాల్లో కొనసాగుతున్న డెయిరీని స్వార్థ ప్రయోజనాలతో నిరీ్వర్యం చేసి ఆర్థిక నష్టాలకు గురిచేయడం ద్వారా 2002లో మూతపడేటట్టు చేశారు. చిత్తూరు డెయిరీనే కాదు.. బాబు హయాంలో 2017 జనవరి 23న పులివెందుల డెయిరీ, 2018 జూలై 31న రాజమండ్రి డెయిరీ, 2018 నవంబర్ 30న కృష్ణా జిల్లాలోని మినీ డెయిరీ, 2019 మార్చి 15న చిత్తూరులోని మదనపల్లి డెయిరీతో సహా మరో 8 సహకార డెయిరీలను మూతపడేటట్టు చేశారు. అంతేకాదు అన్నమయ్య జిల్లాలోని యూహెచ్‌టీ ప్లాంట్, ప్రకాశం జిల్లాలోని మిల్క్ పౌడర్ ప్లాంట్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఎంసీసీతో పాటు 141 బీఎంసీయూలు మూతపడ్డాయి. తద్వారా సహకార రంగంలోఉన్న పాల డెయిరీలన్నీ ప్రొడ్యూసర్ కంపెనీల చేతుల్లోకి వెళ్లేటట్టు చేశారు సహకార రంగం బలోపేతమే లక్ష్యంగా.. సహకార డెయిరీ రంగం బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మేరకు జగనన్న పాల వెల్లువ కింద రాష్ట్రంలో 3,551 మహిళా పాడి రైతుల సంఘాలకు చెందిన 3.07 లక్షల మంది పాడి రైతుల నుంచి రోజుకు సగటున 1.72 లక్షల లీటర్ల పాలను అమూల్ సేకరిస్తోంది. రెండేళ్లలో 8.78 కోట్ల లీటర్ల పాలు సేకరించగా, రూ.393 కోట్లు చెల్లించారు. అమూల్ రాకతో గత రెండేళ్లలో పెంచిన పాలసేకరణ ధరల వల్ల ప్రైవేటు డెయిరీలకు పాలు పోసే రైతులకు రూ.4,243 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరింది. మూతపడిన డెయిరీల పునరుద్ధరణలో భాగంగా ఇప్పటికే మదనపల్లి డెయిరీని అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా మరో అడుగు ముందుకేసి చిత్తూరు డెయిరీని పునరుద్ధరిస్తున్నారు. ఇందుకోసం డెయిరీకు ఉన్న రూ.182 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. మంగళవారం చిత్తూరులో జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ షమల్బాయ్ బి.పటేల్, కైరా జిల్లా కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ విపుల్ పటేల్, రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ, సహకార శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొననున్నారు. ఒక్క చిత్తూరు డెయిరీకే నష్టాలు ఎందుకు? ఒకే జిల్లాలో ఒకే సమయంలో ఉన్న రెండు డెయిరీల్లో ఒకటి ఏటా లాభాలను పెంచుకుంటూ పోతే.. మరో డెయిరీ నష్టాలను పెంచుకుంటూ పోయింది. రైతులు అందరూ కలిసి నిర్వహించుకుంటున్న చిత్తూరు డెయిరీ చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత క్రమంగా నష్టాలను పెంచుకుంటూ పోతే.. అదే సమయంలో ఆయన సొంత డెయిరీ మాత్రం లాభాలను రెట్టింపు చేసుకుంటూ పోయింది. ఇదే సమయంలో దేశంలోని అమూల్ వంటి పలు సహకార డెయిరీలు లాభాల్లో నడుస్తుంటే ఒక్క చిత్తూరు డెయిరీ మాత్రమే నష్టాలను మూటకట్టుకుంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేసి చివరకు 2002లో ఆ డెయిరీని మూసివేయించారు. ఇందుకోసం తనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు చిత్తూరు డెయిరీని మూసేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికే హెరిటేజ్ పెట్టి 10 ఏళ్లు దాటింది. తన సొంత డెయిరీ కోసం సొంత జిల్లా రైతుల నోటిలో మట్టి కొడుతూ చిత్తూరు సహకార డెయిరీని మూయించేశారు అనడానికి ఇంతకంటే ఉదాహరణలు ఏమి కావాలి. చిత్తూరు డెయిరీ మూసివేత గురించి ఎవరైనా మాట్లాడుతుంటే వెంటనే హెరిటేజ్ డెయిరీ ఉలిక్కిపడటం చూస్తుంటే.. చేసిన తప్పును చెప్పకనే చెపుతోంది అని అర్థమవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ముంబైలో 10 ఎకరా లో శ్రీవారి ఆలయానికి భూమి పూజ
-
ఏయూలో ‘మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్’
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ దమ్మ’ నిర్మాణానికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి భూమి పూజ చేశారు. శనివారం ఉదయం ఏయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసెంబ్లీ మందిరం వెనుక భాగంలో నూతనంగా మహాబోధి సొసైటీ నిర్వహించే ఈ కేంద్రం నిర్మాణాన్ని భూమి పూజతో ప్రారంభించారు. భవనం నిర్మాణానికి అవసరమైన రూ.1.4 కోట్లను రాజమోహన్‌రెడ్డి అందించనున్నారు. భూమి పూజ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏయూలో ఏర్పాటవుతున్న ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. నగరం మధ్యలో విశాఖ ప్రజలకు ఉపయుక్తంగా ఇంతటి సువిశాల ప్రాంగణంలో మెడిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన గొప్పదన్నారు. దీనికి తన కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి పేరు పెట్టడం సంతోషకరమన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ధమ్మ చార్య విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే అంతర్జాతీయ ఖ్యాతి విశాఖ మన రాజధాని అయ్యేలా అందరూ చూడాలని మాజీ ఎంపీ మేకపాటి కోరారు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడే విశాఖ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసి ఉంటే ప్రజలంతా సంతోషించేవారని చెప్పారు. అలా జరిగి ఉన్నట్లయితే అంతర్జాతీయ నగరంగా విశాఖ ఈ పాటికే రూపుదిద్దుకునేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేయడం మంచి పరిణామమన్నారు. బహుశా న్యాయ వ్యవస్థ సైతం దీనికి సహకరిస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. -
విశాఖ ఐటీ పార్క్ నిర్మాణ పనులకు శంకుస్థాపన
సీఎం జగన్ పర్యటన.. లైవ్ అప్డేట్స్ ► ఈ సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతుంది : సీఎం జగన్ ►విశాఖకు డేటా సెంటర్ రావడం ఆనందంగా ఉంది, డేటా సెంటర్‌తో ప్రగతి పథంలో విశాఖ దూసుకుపోతోంది, విశాఖకు ఇది గొప్ప ప్రోత్సాహకంగా నిలుస్తుంది ►విశాఖ వాసులకు డేటా సెంటర్ గొప్ప వరం, డేటా సెంటర్‌తో 39 వేల మందికి ఉద్యోగాలు ►దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖకు వస్తోంది, ఇంత పెద్ద డేటా సెంటర్ దేశంలో ఎక్కడా లేదు ►డేటా సెంటర్ ఏర్పాటు చేసినందుకు అదానీ గ్రూప్‌నకు కృతజ్ఞతలు ►డేటా సెంటర్‌తో ఇంటర్నెట్ డౌన్ లోడ్ స్పీడ్ పెరుగుతుంది, డేటా సెంటర్‌తో విశాఖ ఏ1 సిటీగా మారనుంది ► గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా చూడండి. మంచి జరిగిందని భావిస్తే నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మీ ముందుకు వచ్చే అర్హత ఉంది. మరి చంద్రబాబు నాయుడికి అలా అడిగే దమ్ముందా?.. చేసింది చెప్పడానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఏం లేదు. చంద్రబాబు ముఠా దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేసింది. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్త పుత్రుడు ఎందుకు సహకరిస్తున్నాడు. ► దేశ చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఈ 47 నెలల కాలంలో 2.10లక్షల కోట్ల రూపాయలు డీబీటీ చేశాం, గతానికి, ఇప్పటికీ తేడాను గమనించమని కోరుతున్నాం ► సీఎం జగన్ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. తారకరామ తీర్థ సాగర ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నాం. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్‌గా మారనుంది. ► చింతపల్లిలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను ప్రారంభించాం. అదానీ డేటా సెంటర్‌తో ఉత్తరాంధ్ర ముఖచిత్రమే మారుతుంది. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడు. ఎయిర్‌పోర్టు తీసుకురావడానికి చిత్తశుద్ధితో పనిచేశాం. ► కేవలం ఎన్నికలకు రెండు నెలల ముందే ఏ అనుమతులు లేకుండా శంకుస్థాపన చేశామని చెప్పుకున్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరు. కోర్టులో కేసు వేసి అడ్డుకోవాలని చూశారు. 2026 నాటికి రెండు రన్‌వేలతో ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది. ► మొదటి ఫేజ్‌లో 60 లక్షల మంది రవాణాకు సదుపాయాలు సమకూరుస్తాం. చివరి దశకు వచ్చే సరికి 4కోట్ల మంది ప్రయాణిస్తారు. ఏ380 డబుల్ డెక్కర్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే ఏర్పాట్లు చేస్తాం. ఉత్తరాంధ్ర అంటే మన్యం వీరుడి పౌరుషం గుర్తొస్తుంది. అందుకే ఉత్తరాంధ్రలోని కొత్త జిల్లాకు అల్లూరి పేరు పెట్టాం. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను ఆరు జిల్లాలుగా చేశాం. ► ఉద్ధానంలో కిడ్నీ రీసర్చ్ సెంటర్ పనులను పూర్తి చేశాం. జూన్ నెలలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను జాతికి అంకితం చేస్తాం. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. ► రూ. 23.73కోట్లతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం. ► భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ ► విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరపల్లి వద్ద భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్రీడీ మోడల్‌ను పరిశీలించిన సీఎం జగన్. కాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ► సీఎం జగన్ భోగాపురం చేరుకున్నారు.. మరికాసేపట్లో ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ► విజయనగరం భోగాపురం మండలం సవరవిల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ► విశాఖ, విజయనగరం జిల్లాల పర్యటనలో భాగంగా.. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు బయల్దేరారు సీఎం వైఎస్ జగన్. ► విశాఖ పట్నంలో అదానీ డేటా సెంటర్, విజయనగరం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ► ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం భూమి పూజ చేస్తారు. ► దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు. విజయనగరం పర్యటనలో.. మరో రెండు కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు ► తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్.. జలయజ్ఞంలో భాగంగా విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. ఆయన హఠాన్మరణంతో ఈ ప్రాజెక్టు పనులు మందగించాయి. పెండింగ్ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు సీఎం జగన్ సంకల్పించారు. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ చేపట్టారు. 2024 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. ► చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్.. విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేస్తూ పూసపాటిరేగ మండలం చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. తుపాన్లు, విపత్తుల సమయాల్లో సురక్షితంగా ఒడ్డుకు చేరేందుకు, అలల తాకిడికి పడవలు దెబ్బ తినకుండా లంగర్ వేసే సదుపాయం ఉంటుంది. తద్వారా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేలా చర్యలు చేపట్టారు. ► విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి అదానీ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీ హాజరు కానున్నారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోనుంది. ► అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సాగరతీరాన్నిశోధిద్దాం..
సాక్షి, విశాఖపట్నం: ఉష్ణమండల తుపాన్లు, రుతుపవన సీజన్లో వచ్చే వరదలు, సముద్ర మట్టాల పెరుగుదల, మడ అడవుల విస్తీర్ణం తగ్గుదల, కాలుష్య కారకాలు పెరుగుతున్న నేపథ్యంలో సాగర తీరంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఇటీవల కాలంలో దేశంలోనే రెండో అతి పెద్ద తీర రేఖ కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీరం కోతకు గురవుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. వీటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశోధనలు చేస్తోంది. ఈ తరుణంలో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్(ఎన్‌సీసీఆర్) ఏపీ తీర ప్రాంత పరిరక్షణకు నడుం బిగించింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తీరంలో తలెత్తుతున్న అలజడులపై పరిశోధనలు నిర్వహిస్తూ.. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు ఉపక్రమించేలా పక్కా ప్రణాళికలతో అడుగులేస్తోంది. డాల్ఫిన్ నోస్‌పై 5.5 ఎకరాల విస్తీర్ణంలో.. విశాఖ నగరానికి పెట్టని కోటలా.. రక్షణ వ్యవస్థకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న డాల్ఫిన్ నోస్‌పై ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రూ.62 కోట్ల వ్యయంతో 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. పరిశోధన కేంద్రంతో పాటు ఎర్త్‌సైన్స్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని కూడా నిర్మస్తున్నారు. లేబోరేటరీ భవనం, పరిశోధన భవనం, వర్క్‌షాప్, ఆడిటోరియం, సెమినార్‌హాల్, గెస్ట్ హౌస్, హాస్టల్‌తో పాటు ఇతర భవనాలను నిర్మించనున్నారు. మన తీరంలో ఉన్న సమస్యలపై ముఖ్యంగా ఈ కేంద్రం పరిశోధనలు చేయనుంది. ప్రతి సమస్యపై పరిశోధనలు నిర్వహించి వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి.. సమస్య నివారణకు తగిన చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా షోర్లైన్ మేనేజ్మెంట్ అట్లాస్ సిద్ధం చేసిన ఎన్‌సీసీఆర్.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ షోర్లైన్ మేనేజ్మెంట్ ప్లాన్‌ను తయారు చేయనుంది. దీని ద్వారా ఏఏ తీర ప్రాంతాలు కోతకు గురవుతున్నాయి? వాటిని ఎలా పరిష్కరించాలనే విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. తీరంలో ఎక్కడెక్కడ ఎంత మేర కాలుష్యం ఉంది? దీనివల్ల మత్స్య సంపద, జీవరాశులకు ఎలాంటి విఘాతం కలుగుతోంది? దీని వల్ల సముద్రాల్లో వస్తున్న మార్పులు, మడ అడవులు విస్తీర్ణం తగ్గడం వల్ల తలెత్తుతున్న ప్రమాదాలు.. తదితర వాటిపై నిరంతరం పరిశోధనలు ఇకపై విశాఖ కేంద్రంగా జరగనున్నాయి. ఏపీ సముద్ర జలాల పరిరక్షణకు కృషి విశాఖలో నిర్మిస్తున్న పరిశోధన కేంద్రం ద్వారా సముద్రజలాల నాణ్యత మానిటరింగ్, ప్రిడిక్షన్ ఆఫ్ కోస్టల్ వాటర్ క్వాలిటీ(పీడబ్ల్యూక్యూ), ఎకోసిస్టమ్ సర్వీస్ , సముద్ర తీర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు.. తదితర అంశాలపై పరిశోధనలు చేస్తాం. సముద్రంలో చేరుతున్న కాలుష్య కారకాలు, పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలపైనా దృష్టి సారిస్తాం. ఈ కేంద్రం ద్వారా ఏపీ సముద్ర జలాల పరిరక్షణకు ఎన్‌సీసీఆర్ పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని విశ్వసిస్తున్నాం. – డా.ఎంవీ రమణమూర్తి, ఎన్‌సీసీఆర్ డైరెక్టర్ -
బీసీల చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం
ఉప్పల్: దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రులు గంగుల కమాలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, చామకూర మల్లా రెడ్డిలు అన్నారు. వెనుకబడిన వర్గాల చరిత్రలో ఈ రోజు సువర్ణాధ్యాయమని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో 38 ఎకరాలలో 13 బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు భూమి పూజ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు వివిధ కులసంఘాల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ గత 75 ఏళ్లలో ఇంతవరకు ఏ ప్రధాని, ముఖ్యమంత్రి చేయని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మేలు చేస్తున్నారని అన్నారు. ఈ ఆత్మగౌరవ భవనాలను తమ కులం ప్రతిష్టను ఇనుమడించేలా, సంస్కృతి వెళ్లి విరిసేలా డిజైన్లు చేసి నిర్మించుకునే ఆవకాశం వారికే ఇచ్చారన్నారు. ఆత్మగౌరవ భవనాల్లో దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి వసతి, తమ సంస్కృతిని చాటేలా కమ్యూనిటీ హాళ్లు, పిల్లల చదువు కోసం లైబ్రరీలు, రిక్రియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆత్మగౌరవ భవనాలకు రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్పారు. తెలంగాణ రావడంతోనే వెనుకబడిన కులాల్లో పెద్ద మార్పు వచ్చిందన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ..వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవాన్ని పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు. కుల వృత్తులకు చేయూత ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుందని, బీజేపీ మతం మత్తులో ముంచుతుందని విమర్శిస్తూ కేవలం బీఆర్ఎస్ మాత్రమే అభివృద్ధి చేస్తుందని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కుల వ్యవస్థపై జోతిబాపూలే అద్భుత పరిశోధన చేసి మనమంతా ఒక్కటే అని, కేవలం వృత్తిపరంగా కులాలకింద విభజితులైనట్లు చెప్పారని పేర్కొన్నారు. అయితే అందరినీ కలపడానికి పూలే పడ్డ ఆవేదన నేడు కేసీఆర్‌లో కనబడుతోందన్నారు. సమూహంగా ఎదగడానికి ఈ భవనాలు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరి శంకర్, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, ఉప్పల్ తహసీల్దార్ గౌతం కుమార్, బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం: మంత్రి గంగుల
ఉప్పల్ (హైదరాబాద్): తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉప్పల్ బగాయత్‌లో శనివారం సోమవంశ సహస్రార్జున క్షత్రియ కులసంఘం ఆత్మ గౌరవ భవనం భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే భేతి సుభాశ్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ 41 కుల సంఘాలకు రూ.95.25 కోట్ల విలువ గల 82.3 ఎకరాల స్థలాన్ని కేటాయించిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. దీంతో పాటు 25 కుల సంఘాలకు ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిపోయిన బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని ప్రశంసించారు. 19 నుంచి 281 అత్యున్నత స్థాయి బీసీ గురుకులాలు, 791 బీసీ హస్టళ్లు, కల్యాణలక్ష్మి అందజేసి అందరికీ మేనమామగా గుర్తింపు పొందారన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం దూసుకుపోతోందని తెలిపారు. క్షత్రియ సమాజ ప్రతినిధులు మంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్షత్రియ సమాజ అధ్యక్షుడు విశ్వనాథ్, రవీందర్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి, సుధాకర్, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కల సాకారం దిశగా.. రామాయపట్నం పోర్టుకు సీఎం జగన్ భూమిపూజ (ఫొటోలు)
-
40వేల మందికి ఉపాధికల్పనే లక్ష్యంగా నిర్మాణం
-
సీఎం జగన్ పర్యటన సందర్భంగా పోర్టు ఏరియాలో భారీ బందోబస్తు
-
రామాయపట్నం పోర్టుతో యువతకు ఉపాధి: సీఎం జగన్
నెల్లూరు రామాయపట్నం పోర్ట్ భూమి పూజ కార్యక్రమం అప్డేట్స్ 13:10PM ► రామాయపట్నం పర్యటన ముగించుకొని తాడేపల్లి బయలు దేరిన సీఎం వైఎస్ జగన్. 12:40PM ► స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన సీఎం జగన్. హామీలను నెరవేరుస్తానని వెల్లడి. 12:38PM ► పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు, లోన్లు ఇచ్చిన బ్యాంకులకు కృతజ్ఞతలు: సీఎం జగన్. 12:33PM ► రామాయపట్నం పోర్టు రావడం వల్ల ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది: సీఎం జగన్ ► రామాయపట్నం పోర్టుతో రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది: సీఎం జగన్ ► ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. రవాణా ఖర్చుకూడా గణనీయంగా తగ్గుతుంది. ► ప్రత్యక్షంగా వేల మందికి.. పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. 12:10PM పోర్టు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన నిర్వాసితులు. పోర్టు కలను నెరవేర్చిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. 12:00PM చంద్రబాబు వేసింది పోర్టు పునాదా?: మంత్రి గుడివాడ దేశంలోనే రెండో అతిపెద్ద తీరం కలిగిన రాష్ట్రం మనది.. రామాయపట్నం పోర్టు భూమి పూజ.. చరిత్రలో నిలిచిపోయే రోజు అని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు గతంలో చంద్రబాబు హయాంలో శంకుస్థాపన అంటూ డ్రామాలాడారు. అదసలు పునాదా? అని ప్రశ్నించారు. అనుమతులు లేకున్నా చేసిన పనిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ అధినేతకు చురకలు అంటించారు మంత్రి గుడివాడ. సీఎం జగన్ సారథ్యంలో.. ప్రజల సంక్షేమంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతోందని పేర్కొన్నారు. 11:47AM గ్రామస్తులకు హృదయపూర్వక వందనాలు ► కందుకూరు నిజయోకవర్గ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఇది అని స్థానిక ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి అభివర్ణించారు. దశాబ్ద కాలంగా మాటలతో, శిలాఫలకాలతో కాలం గడిపిన నేతలను చూశాం. ఇప్పుడు.. ఆ కలను నిజం చేసే నాయకుడిని చూస్తున్నాం అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన అన్నారు. పోర్టు మాత్రమే కాకుండా.. పోర్టు ఆధారిత పరిశ్రమలు కూడా తరలి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, చేవూరు, రావూరు, సాల్పేట గ్రామస్తులకు హృదయ పూర్వక వందనాలు తెలియజేశారు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేకూర్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటూ ఆయన మరోమారు స్పష్టం చేశారు. 11:35AM ► రామాయపట్నం పోర్ట్ కార్యక్రమం వేదికగా.. ఏపీ మారిటైం విజన్ స్టేట్మెంట్ను ఆవిష్కరించిన సీఎం జగన్. భవిష్యత్ తరాలకు ఉద్యోగాల వంటిదని అధికారుల వర్ణన. 11:21AM ► రామాయపట్నం ఓడరేవుపై స్పెషల్ ఏవీ ప్రదర్శన.. పలు విశేషాలు. 11:18AM ► రామాయపట్నం స్కూల్ పిల్లలతో కలిసి వందేమాతర గీతాలాపనలో సీఎం జగన్, ఇతరులు పాల్గొన్నారు. అనంతరం పిల్లలతో ఫొటో దిగారు. ► కేవలం ఏపీకి మాత్రమే కాదు.. పక్కనున్న రాష్ట్రాలకు.. మొత్తం దేశం అభివృద్ధికి ఉపయోగపడనుంది. ఏపీతో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి. 11:16AM ► జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన సీఎం జగన్. ► మంత్రులు, స్థానిక నేతలు, అధికారులతో కలిసి పోర్టు ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించిన సీఎం జగన్. 36 నెలల్లోనే తొలిదశ పనులు ► రామాయపట్నం పోర్టు తొలిదశ పనులను 36 నెలల్లోనే పూర్తి చేయిచాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ► ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి కేవలం నాలుగున్న కిలోమీటర్ల దూరంలోనే పోర్టు. 11:06AM ► ప్రగతి తీరంగా.. రామాయపట్నం పోర్టు పనుల ప్రారంభంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాసుల కల నెరవేరనుంది. 10:53AM ► రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్ రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజాకార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రామాయపట్నం పోర్టు పైలాన్‌ను ఆవిష్కరించారు. 10:30AM ► నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు హెలిప్యాడ్‌కు చేరుకొన్న సీఎం వైఎస్ జగన్. స్వాగతం పలికిన మంత్రులు ,ఎమ్మెల్యేలు, అధికారులు. 9:43 AM ► రామాయపట్నం పోర్టు భూమి పూజ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి బయలుదేరిన సీఎం వైఎస్ జగన్. సీఎం వెంట మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు ఉన్నారు. ► రామాయపట్నం పోర్టుతో ఏపీలో మౌలిక సదుపాయాల రంగానికి కొత్త ఊపు రానుంది. ► సహాయ, పునరావాసానికి రూ. 175.04 కోట్ల వ్యయం భరించనుంది ప్రభుత్వం. ► రెండు దశల్లో రూ.10,640 కోట్లతో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టింది ఏపీ ప్రభుత్వం. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి రామాయపట్నం చేరుకుంటారు. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి.. మధ్యాహ్నాం తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ► పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. రెండు దశల్లో 19 బెర్త్‌లతో.. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. ► రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. ► రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ► ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. రామాయపట్నం పోర్టుతో ప్రయోజనాలు ► వెనకబడ్డ ప్రాంతంలో అభివృద్ధికి ఊతం కానుంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం జాతీయరహదారికి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో పోర్టు నిర్మాణం జరగనుంది. ► పోర్టు తొలిదశ పనులు 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ. 3736.14 కోట్లతో పోర్టు తొలిదశ పనులు చేపట్టనున్నారు. ► రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. ► తొలిదశలో మొత్తం నాలుగు బెర్తుల నిర్మాణం. ఏడాదికి 25 మిలియన్ టన్నుల ఎగుమతి. కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం ► రెండో దశలో 138.54 మిలియన్ టన్నులకు విస్తరణ, మొత్తంగా 15 బెర్తుల నిర్మాణం. ► ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్‌నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానున్న రామాయపట్నం పోర్టు. ► తెలంగాణ, ఛత్తీస్‌గఢ్,మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సుభతరం. ► రూ.3500 కోట్లతో మొత్తంగా 9 షిఫింగ్ హార్బర్ల నిర్మాణం. ► ఫేజ్–1లో 4 హార్బర్ల నిర్మాణం.జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో తొలిదశలో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. ► రెండో దశ కింద మొత్తం 5 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్ల పాలెం, పూడిమడక, బియ్యపు తిప్ప, వాడరేవు, కొత్తపట్నంల్లో రెండోదశలో షిఫింగ్ హార్బర్ల విస్తృతంగా ఉపాధి అవకాశాలు. పెరగనున్న ఆర్థికవ్యవస్థ. ► వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ► చంద్రబాబు ఉత్తుత్తి పునాది రాయి గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ► ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. ► రామాయపట్నం ఓడ రేవు కలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. -
రామాయపట్నం పోర్టుకు భూమి పూజ.. సీఎం జగన్ పర్యటన వివరాలిలా..
సాక్షి, అమరావతి: గత సర్కారు పునాది రాయికే పరిమితం చేసిన రామాయపట్నం ఓడ రేవును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. ఓడరేవుకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేయడంతో పాటు కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులన్నీ వైఎస్సార్సీపీ ప్రభుత్వమే సాధించింది. అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలోసీఎం ప్రసంగించనున్నారు. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి. యువతకు భారీగా ఉపాధి లక్ష్యంతో.. గత ఎన్నికలకు ముందు 2019 జనవరి 9వ తేదీన భూ సేకరణ చేయకుండా, పర్యావరణ, అటవీ అనుమతులు లేకుండా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు ఉత్తుత్తి పునాది రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఓడరేవులను చేపట్టడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఓడరేవుల నిర్మాణం ద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రామాయపట్నానికి అవసరమైన 255.34 ఎకరాల సేకరణను ప్రభుత్వం చేపట్టింది. మరోపక్క ఓడరేవు నిర్మాణంతో నిర్వాసితులయ్యే పరిసర గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలను ప్రారంభించి రూ.175.04 కోట్లు వ్యయం చేస్తోంది. రెండు దశల్లో 19 బెర్త్‌లతో.. రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన కీలక పర్యావరణ అనుమతులను వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తెచ్చింది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ఏరియా అనుమతులతో పాటు అటవీ అనుమతులను కూడా సాధించింది. రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. 40,000 మందికి ఉపాధి రెండో దశలో రూ.6,904 కోట్లు వ్యయం కానుంది. మొదటి దశలో 24.91 మిలియన్ టన్నులు, రెండో దశలో 113.63 మిలియన్ టన్నుల కార్గోతో కలిపి మొత్తం 138.54 మిలియన్ టన్నుల కార్గో సామర్థ్యం అందుబాటులోకి రానుంది. పోర్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. నేడు సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.40 గంటలకు రామాయపట్నం చేరుకుంటారు. 11.00 నుంచి 12.30 గంటల వరకు రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడి నుంచి తిరిగి బయలుదేరి 2 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. -
గరీబుకూ ..ఖరీదైన వైద్యం
సాక్షి, హైదరాబాద్: ఖరీదైన వైద్యసేవలు పూర్తిగా అందరికీ అందుబాటులోకి రావాలని, నిరుపేదలు దోపిడీకి గురికాకూడదనే ఆలోచనతో హైదరాబాద్ నలు దిక్కులా ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యాధునిక ఆసుపత్రులను నెలకొల్పుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 1.64 కోట్ల జనాభా నివసిస్తోందని, అంతేకాక చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా బాగా పెరుగుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరం మీద మాత్రమే వైద్య సేవల భారం మొత్తం పడకూడదనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్) పేరుతో హైదరాబాద్ గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ, అల్వాల్ ప్రాంతాల్లో నిర్మించనున్న మూడు ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అందుబాటులో ఖరీదైన వైద్య సేవలు ‘ఏ సమస్య వచ్చినా గాంధీకో, ఉస్మానియాకో, నీలోఫర్కో పరిగెత్తకుండా ఈ ఆసుపత్రుల నిర్మా ణం ద్వారా నగరానికి నలువైపులా (ఇప్పటికే గచ్చిబౌలిలో టిమ్స్ ఉంది) నిరుపేదలకు ఖరీదైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. కొత్త ఆసుపత్రు లతో కలిపి మొత్తం 6 వేలకు పైగా పడకలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో 1,000 నుంచి 1,500 వరకూ ఐసీయూ పడకలు ఉండేలా చూస్తున్నాం. నిమ్స్‌లో కూడా 2 వేల పడకలను పెంచుతు న్నాం. టిమ్స్‌లో అన్ని సేవలతో పాటు వందో, రెండు వందల పడకలతోనో ప్రత్యేకమైన ప్రసూతి కేంద్రం కూడా ఇక్కడే నిర్వహించినట్లైతే మళ్లీ వేరేచోటికి పోయే అవసరం రాదు. ఆరోగ్య శాఖ ఈ మేరకు చర్యలు తీసుకోవాలి..’అని సీఎం అన్నారు. పటిష్టమైన వైద్య వ్యవస్థతో తక్కువ నష్టం ‘మానవులు ఈ భూగోళం మీదకు 4 లక్షల ఏళ్ల క్రితం వచ్చారు. కానీ వైరస్‌లన్నీ మనుషులు రావడానికి 4 లక్షల ఏళ్ల క్రితమే వచ్చాయని ఎంటమాలజిస్టులు చెప్పారు. అవి ఎప్పుడెప్పుడు ప్రకోపం చెందుతాయో అప్పుడు వ్యాప్తి చెందుతాయి అని చెప్తే.. నేను బేజారై కరోనా అయిపోదా అంటే కరోనా తాతలు కూడా భవిష్యత్తులో రానున్నాయన్నారు. కాబట్టి కరోనా లాంటి వ్యాధులు మళ్లీ మళ్లీ విజృంభించే అవకాశాలున్నాయి. వైరస్లు లేకుం డా చేసే వ్యవస్థ లేదు. కానీ అవి వచ్చినప్పుడు ఎవరికైతే పటిష్టమైన వైద్య వ్యవస్థ ఉంటుందో వారు తక్కువ నష్టంతో బయటపడతారు. ఎక్కడైతే వైద్య వ్యవస్థ బాగా ఉండదో అక్కడ లక్షల మంది చనిపోతారు. విద్య, వైద్యం పేదలకు అందాలనేదే మా లక్ష్యం. వైద్య విద్య మీద బాగా దృష్టి పెట్టనున్నాం. కొత్తగా మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నాం’ అని కేసీఆర్ తెలిపారు. టీకా సెంటర్‌గా హైదరాబాద్ ‘ఎక్కడెక్కడ నుంచో ఇక్కడకి వచ్చి తమ సంస్థలు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తుండడం వల్లే హైదరాబాద్‌లో 7 ఏళ్లలో 2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. వీటి ద్వారా 10–15 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. హైదరాబాద్‌లో 14 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ, యూనివర్సిటీ తేనున్నాం. ప్రపంచంలోనే 33% టీకాలు తయారు చేసే సెంటర్ హైదరాబాద్..’అని సీఎం పేర్కొన్నారు. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం ‘మనది కొత్త రాష్ట్రం. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ఇవన్నీ ఎప్పటినుంచో పెద్ద రాష్ట్రాలుగా కొనసాగుతున్నాయి. కానీ మన తలసరి ఆదాయం వీటన్నింటినీ మించి నమోదైంది. సంపద సృష్టిస్తున్నాం.. పేదలకు పంచుతున్నాం. తెలంగాణ పచ్చబడాలె, ఇంకా ముందుకు పోవాలె. దేశానికి తలమానికంగా ఉండేలా మారాలె. దాని కోసం ఎంతధైర్యంగానైనా ముందుకు పోతాం. ఎవరితోనైనా పోరాడతాం..’అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, వేముల, సబిత, తలసాని, మల్లారెడ్డి, ఎంపీలు కేకే, సంతోశ్, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. టిమ్స్ అంటే మామూలుగా ఏదో చిన్న దవాఖానా కట్టరు. ఇక్కడ 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయి. ఎయిమ్స్ తరహాలో టిమ్స్‌కు రూపకల్పన చేస్తున్నాం. వీటి ద్వారా నూటికి నూరు శాతం ప్రభుత్వ ఖర్చుతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుంది. కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు.అన్ని మతాలు, కులాలని సమానంగా ఆదరించే గొప్ప దేశం మనది. ఈ సామరస్య వాతావరణం చెడిపోతే ఎటూ గాకుండా పోతాం. సామరస్యతను దెబ్బతీసే కేన్సర్ లాంటి జబ్బు మనల్ని పట్టుకుంటే చాలా ఇబ్బందులు పడతాం. ఇవాళ తెలంగాణలో కరెంటు పోతే వార్త. కానీ దేశంలో కరెంటు ఉంటే వార్త. ప్రధాని ప్రాతినిధ్యం వహించిన గుజరాత్లో కూడా రైతులు రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నారు. కానీ ఏడేళ్ల క్రితం పుట్టిన పసికూన తెలంగాణ రాష్ట్రంలో రాత్రింబవళ్లు కష్టపడి 24 గంటల కరెంటు అన్ని రంగాలకూ ఇస్తున్నాం. – సీఎం కేసీఆర్ కులం, మతం పేరిట చిల్లర రాజకీయాలు ‘రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు (మంగళవారం) రాజకీయ సభలు జరుపుతున్నాయి. కానీ మనం కంటోన్మెంట్లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం. ఇదీ వాళ్లకు మనకూ ఉండే తేడా. ఇలాంటి పరిస్థితు ల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రం వచ్చాక మారిన పరిస్థితులు చూడాలి. ఫలానా వాళ్ళ షాపులో పూలు కొనొద్దు. ఫలానా వాళ్ల షాపులో ఇది కొనొ ద్దు. అది కొనొద్దు అని కొందరు మత విద్వేషంతో మాట్లాడుతున్నారు. దీనిపై ప్రజలుగా మీరు ఆలోచన చేయాలి. కొందరు కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. మతపిచ్చి అనేది ఏదో తాత్కాలికంగా మజా అనిపిస్తుంది. కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి. విదేశాల్లో పనిచేస్తున్న 13 కోట్ల మంది భారతీయుల్ని ఇలాగే వెనక్కి పంపిస్తే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలి? అందువల్ల అటువంటి సంకుచిత ధోరణులకు తెలం గాణలో ఆస్కారమివ్వొద్దు’ అని విజ్ఞప్తి చేశారు. -
కశ్మీర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ
సాక్షి, ఢిల్లీ: కశ్మీర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ పాల్గొన్నారు. దేవాలయం కోసం లీజు ప్రాతిపదికన 62 ఎకరాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కేటాయించింది. రూ.33.52 కోట్ల వ్యయంతో 18 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తికానుంది. దేవాలయ ప్రాజెక్ట్‌లో భాగంగా వేద పాఠశాల, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించనున్నారు. చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు భక్తులకు మరింత సులభంగా వసతి గదులు -
చంద్రబాబు కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి శ్రీకారం
సాక్షి, అమరావతి: విజయవాడలో గత ప్రభుత్వ హయాంలో కూల్చి వేసిన తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భక్తి శ్రద్ధలతో శంకుస్థాపన గావించింది. ఆగమ పండితులు నిర్ణయించిన 11.01 గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలు ధరించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. కృష్ణా నది ఒడ్డున సీతమ్మ వారి పాదాల చెంత రాతి కట్టడంతో శనైశ్చర ఆలయాన్ని పునః నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణకు రూ.77 కోట్లతో (రూ.7 కోట్లు ఆలయాలవి) రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న 8 పనులకూ భూమి పూజ నిర్వహించారు. ఆయా పనులకు సంబంధించి రెండు వేర్వేరు శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు. 20 నిమిషాలకు పైగా ఈ కార్యక్రమం కొనసాగింది. భూమి పూజ అనంతరం సీఎం జగన్.. ఇంద్రకీలాద్రి కొండపైకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత దుర్గమ్మ వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు, ఘనాపాటీల ఆశీర్వచనం అనంతరం సీఎం జగన్.. అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆలయాల పునర్నిర్మాణానికి శిలాఫలకాలను ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ దేవదాయ శాఖ వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ ► రాష్ట్ర దేవదాయ శాఖ రూపొందించిన 2021 వార్షిక క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల ప్రత్యేకత ప్రతిబింబించేలా, ఆయా ఆలయాల దేవతా మూర్తులు, ఆ ఆలయాల పరిధిలో నిర్వహించే వేడుకల వివరాలతో దేవదాయ శాఖ ఈ క్యాలెండర్‌ను రూపొందించింది. ► రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి సంబంధించిన రూట్ మ్యాప్ తయారు చేసి, అమలుకు తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు సూచించారు. నాడు వైఎస్సార్.. నేడు వైఎస్ జగన్ ► వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.33 కోట్లతో దుర్గ గుడి మహారాజ గోపురం నిర్మాణానికి శంకుస్థాపన చేసి, కొండపై ఆలయ అభివృద్ధికి నాంది పలికిన విషయాన్ని ఆలయ అర్చకులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అప్పటి శిలాఫలకాన్ని చూపించారు. ► దివంగత సీఎం వైఎస్సార్ తనయుడిగా, ప్రస్తుత ముఖ్యమంత్రిగా రూ.77 కోట్లతో ఈ ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం విశేషమని అర్చకులు కొనియాడారు. ► దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబం 28.380 గ్రాముల బరువున్న రూ.6.50 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన ముక్కుపుడక (నత్తు), బులాకీని కనకదుర్గమ్మకు కానుకగా సీఎం చేతుల మీదుగా ఆలయ అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ పైలా సోమి నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. పునర్నిర్మిస్తున్న తొమ్మిది ఆలయాలు ఇవే.. రాహు – కేతు ఆలయం, సీతమ్మ పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో), శనైశ్చర ఆలయం, బొడ్డు బొమ్మ, ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద), సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ ఆలయం, వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో), గోశాల కనకదుర్గ నగర్లో శ్రీ వేణుగోపాలకృష్ణ మందిరం. -
పేదలకు పట్టాభిషేకం
సాక్షి, అమరావతి: లక్షలాది కుటుంబాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నివాస స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలకు శుభ ముహూర్తం వచ్చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపనలు రెండు వారాల పాటు వాడవాడలా పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. లబ్ధిదారుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీలు చక్కటి వసతులతో సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని వైఎస్సార్ జగనన్న కాలనీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక కోసం సిద్ధమైంది. ఇక్కడ సేకరించిన 367.58 ఎకరాల్లో 60 ఎకరాలను సామాజిక అవసరాలకు వదిలేసి 16,500 ప్లాట్లను చక్కగా రూపొందించారు. సీఎం జగన్ కడప నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడకు చేరుకుని పైలాన్‌ను ఆవిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శనివారం నుంచి వచ్చేనెల ఏడో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ, భూమి పూజల కోలాహలం కొనసాగుతుంది. చదవండి: (ముందు లిమిటెడ్.. తరువాత రెగ్యులర్ డీఎస్సీ) వాడవాడలా ఆనందోత్సాహాలు ► భారత దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో 30,75,755 మందికి నివాస స్థల పట్టాలు అందజేయడంతోపాటు వచ్చే మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ► మన ప్రభుత్వం వస్తే 25 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామని ప్రజా సంకల్పయాత్ర సందర్భంగా విపక్షనేత హోదాలో ప్రకటించిన వైఎస్ జగన్.. సీఎం అయ్యాక ఏకంగా 30.75 లక్షల మందికి పట్టాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ► ఇంత మంచి కార్యక్రమం చేస్తే జగన్‌కు ప్రజల్లో ఎంతో పేరు ప్రతిష్టలు వస్తాయనే కసితో దీనిని ఎలాగైనా అడ్డుకోవాలని టీడీపీ నాయకులు శతవిధాలా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే ఇళ్ల స్థలాల పంపిణీకి బ్రేకులు వేయించేందుకు వెనకుండి కోర్టుల్లో కేసులు వేయించారు. ఇలా కోర్టు కేసుల్లో ఉన్న లేఅవుట్లలోనివి మినహా మిగిలిన వారందరికీ ఇళ్ల స్థల పట్టాలను ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు. ► రూ.50,940 కోట్ల అంచనా వ్యయంతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రూ.28,080 కోట్ల వ్యయంతో మొదటి విడతలో నిర్మించ తలపెట్టిన 15.60 లక్షల ఇళ్లకు వచ్చే నెల ఏడో తేదీ వరకూ ప్రజా ప్రతినిధులు శంకుస్థాపనలు చేస్తారు. వాస్తవాలను కోర్టులకు నివేదించడం ద్వారా స్టేలను ఎత్తివేయించి మిగిలిన 3.51 లక్షల మందికి కూడా త్వరలో ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే దిశగా రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. అర్హతే ప్రామాణికం ► కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా అర్హతే ప్రాతిపదికగా అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో గ్రామ/ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. అర్హుల పేర్లెవరివైనా పొరపాటున మిస్సయితే మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ► 68,361 ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూమిని సేకరించి పాఠశాలలు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పార్కులు, వైఎస్సార్ హెల్త్ క్లీనిక్‌లు, క్రీడా ప్రాంగణాలు లాంటి సామాజిక అవసరాల కోసం స్థలాలను వదిలేచి చక్కగా రహదారులు ఏర్పాటు చేశారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 17004 వైఎస్సార్ జగనన్న కాలనీలను అధికారులు అభివృద్ధి చేశారు. ఈ కాలనీల్లో ప్లాట్లను అత్యంత పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా కేటాయించారు. తమకు కేటాయించిన ప్లాట్లను చూసేందుకు ఆయా కాలనీల వద్దకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ► ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా దారిద్య్రరేఖకు దిగువనున్న ఇల్లులేని పేద కుటుంబాలన్నింటికీ ఈ నెల 25 నుంచి నివాస స్థల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు గురువారం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ‘తూర్పు’ నుంచే ‘పట్టా’భిషేకం సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం : పేదల సొంతింటి కలలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘తూర్పు’ నుంచి సాకారం చేస్తున్నారు. కాకినాడ–ఉప్పాడ బీచ్ రోడ్డుకు సమీపాన 367.58 ఎకరాల్లో సువిశాలమైన స్థలంలో పట్టాల పండుగకు సర్వం సిద్దమైంది. కొమరగిరి లే అవుట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమీనాబాద్ గ్రామంలో ప్రతిపాదిత ఫిష్షింగ్ హార్బర్‌కు ఐదు కిలోమీటర్లు, కాకినాడ స్మార్ట్ సిటీకి 11 కిలోమీటర్లు, కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్‌కు 12 కిలోమీటర్లు దూరాన కొమరగిరి లే అవుట్ ఏర్పాటైంది. 60 అడుగుల సువిశాలమైన ప్రధాన రహదారి, 40 అడుగులతో అంతర్గత రహదారులు, 20 అడుగులతో బ్లాకుల మధ్య రహదారులు ఏర్పాటు చేశారు. ప్రతి లబ్ధిదారుకు 60 చదరపు అడుగుల వంతున కేటాయించారు. కాగా, 2006 ఏప్రిల్ 1న మహానేత వైఎస్సార్ ‘తూర్పు’ సెంటిమెంట్‌తో ఇదే జిల్లా కపిలేశ్వరపురం మండలం పడమర కండ్రిగ గ్రామం నుంచి ‘ఇందిరమ్మ’ ఇళ్ల పథకాన్ని ప్రారంభించడం గమనార్హం. మహిళా స్వావలంబనకు పెద్దపీట మరే రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ వినూత్న రీతిలో మహిళా స్వావలంబనకు పెద్దపీట వేస్తున్నారు. మహిళల పేరుతో ఇన్ని లక్షల నివాస స్థల పట్టాలిచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. – సుధామూర్తి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ జగన్ సర్కారుకు అభినందనలు మహిళలకు ఇంత పెద్దఎత్తున ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం. నివాస స్థల పట్టా పొందుతున్న ప్రతి మహిళకూ హృదయపూర్వక శుభాభినందనలు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికీ అభినందనలు. – పరుగుల రాణి పీటీ ఉష మహిళలకు రక్షణ కవచం మహిళల అభ్యున్నతి, సాధికారతకు సీఎం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుచేస్తోంది. ఏపీ తెచ్చిన ‘దిశ’ చట్టం మహిళలకు రక్షణ కవచంగా మారింది. – నవనీత్ రవి రానా, మహారాష్ట్ర ఎంపీ దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం సీఎం జగన్ నిర్ణయం దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. 30 లక్షల మంది పేద మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలివ్వడమనేది మామూలు విషయం కాదు. మహిళలకు జగన్ సర్కారు ఇస్తున్న ప్రాధాన్యమేంటో అర్థమవుతోంది. – ఒలింపిక్ మెడల్ గ్రహీత కరణం మల్లీశ్వరి తూర్పుగోదావరి జిల్లా కొమరిగిరిలో సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పేదలకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్ -
ఆవిష్కారం.. ఆత్మ నిర్భర్ భారతం
సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మైలురాయని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు గురువారం ప్రధాని శంకుస్థాపన చేశారు. నూతన భవనం ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతలో అంతర్భాగమని, స్వాతంత్య్ర అనంతర కాలంలో మొదటిసారిగా ఓ ప్రజా పార్లమెంటు నిర్మించేందుకు చరిత్రాత్మక అవకాశం వచ్చిందని అన్నారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవ(2022) సమయానికి పూర్తయ్యే ఈ భవనం దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘2014లో పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటు భవనంలో మొదటిసారి అడుగుపెట్టిన క్షణం ఇంకా గుర్తుంది. ఆ సమయంలో ప్రజాస్వామ్యానికి ఆలయం అయిన ఈ భవనానికి శిరసు వంచి ప్రణామం చేశా. పాత పార్లమెంటు భవనం స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశానికి ఒక దిశను అందిస్తే కొత్త భవనం ఆత్మ నిర్భర్ భారత్ ఆవిష్కారానికి సాక్షిగా మారనుంది. 21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేరుస్తుంది.’’ అన్నారు. ప్రజాస్వామ్యమే బలం భారత ప్రజాస్వామ్య మూలాలు 13వ శతాబ్దికి చెందిన మాగ్నాకార్టాలో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం దేశ ప్రజల ఆత్మ. భారత్‌లో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని మొదట్లో చాలామంది భావించారు, కానీ అది తప్పని ప్రస్తుత తరం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఒక జీవన క్షమానుగత వ్యవస్థ ఉన్నాయి.’’ అన్నారు. కొత్త బిల్డింగ్ భవిష్యత్ రాజ్యాంగ అవసరాలు తీరుస్తుందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు. పలువురు కేంద్రమంత్రులు, విదేశీ రాయబారులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఏఐడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్ తదితర పార్టీల ప్రతినిధులు, రతన్‌టాటా వంటి వ్యాపారవేత్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా తమ సందేశాలు పంపారు. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆచార్య శివకుమార్ శర్మ, కేఎస్ లక్ష్మీనారాయణ సోమయాజి తదితరులు పూజలు నిర్వహించారు. శృంగేరి పీఠం నుం చి శంఖం, నవరత్న పీఠాలను శృంగేరి శారద పీఠం జగద్గురు భారతీ తీర్థ ఆశీర్వదించి పంపారు. ఈ కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు చేశారు. కాంగ్రెస్ విమర్శలు: ప్రజాస్వామ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన అనంతరం నిర్మించే కొత్త భవనం దేన్ని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ విమర్శించింది. హక్కుల కోసం రైతులు పోరాటం చేస్తున్న తరుణంలో ప్రధాని భవనాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి సూర్జేవాలా దుయ్యబట్టారు. పార్లమెంట్ బిల్డింగంటే ఇసుక, ఇటుకలు కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేదని చెప్పారు. విశేషాలు.. ► నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది. ► 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. ► ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. 2022కి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ► నిర్మాణం పూర్తయితే లోక్‌సభ సీటింగ్ సామ ర్థ్యం 888 మంది సభ్యులకు పెరుగుతుంది. ► సంయుక్త సమావేశాలప్పుడు 1224 మందివరకు సామర్ధ్యం పెంచుకునే వీలుంది. ► రాజ్యసభ సీటింగ్ సామర్ధ్యం 384 సీట్లు. ► ప్రాజెక్టులో భాగంగా నిర్మించే శ్రమ్శక్తి భవన్లో ఒక్కో ఎంపీకి 40 చదరపు మీటర్ల ఆఫీసు ఇస్తారు. ఈ భవనం నిర్మాణం 2024లో పూర్తవుతుంది. ► ప్రస్తుత పార్లమెంట్ భవన నిర్మాణం 1921లో ప్రారంభమై 1927 జనవరి 18న ముగిసింది. ► ప్రస్తుత నిర్మాణంపై సుప్రీంకోర్టులో పలు దావాలున్నాయి. అందుకే కోర్టు కేవలం పేపర్ వర్క్ పూర్తి చేసేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. తీర్పు వచ్చేవరకు కొత్త కట్టడాలు నిర్మించడం, కూల్చడం, చెట్లు నరకడం చేయవద్దని ఆదేశించింది. -
అమెరికాలో 'అయోధ్య' సంబరాలు
సాక్షి, న్యూయార్క్ : అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి చేపట్టిన భూమిపూజను పురస్కరించుకొని అమెరికాలోని హిందువులు సంబరాలు జరుపుకున్నారు. శంకుస్థాపనకు మద్దతుగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. 500 ఏళ్లనాటి హిందువుల పోరాటం సాకారం అయిందని, కోట్లాది హిందువుల కల నిజమయ్యిందని భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చాలా గొప్ప నిర్ణయమని, ప్రతీ హిందువూ గర్వించదగ్గ విషయమని ఆనందం వ్యక్తం చేశారు. టైమ్స్ స్కెవ్లో భారతీయ హిందువుల సంబరాలపై సాక్షి టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ -
అమెరికా, బ్రిటన్‌లో జైశ్రీరామ్
వాషింగ్టన్/లండన్: అయోధ్యలో రామాలయ మందిర నిర్మాణానికి చేసిన భూమి పూజను పురస్కరించుకొని అమెరికా, బ్రిటన్‌లలోని భారతీయ హిందువులు సంబరాలు చేసుకున్నారు. అమెరికాలోని క్యాపిటల్ హిల్ ప్రాంతంలో రాముడి చిత్రాలు కలిగిన డిజిటల్ స్క్రీన్ ట్రక్కు తిరుగుతూ జైశ్రీరామ్ అనే నినాదాలను వినిపించింది. వాషింగ్టన్ లోనూ విశ్వహిందూ పరిషద్ సభ్యులు రాముడి చిత్రాలు, నినాదాలతో కూడిన ఓ ట్రక్కును నడిపారు. భారతీయ హిందువులు తమ ఇళ్లలో దీపాలను వెలిగించి తమ ఆనందాన్ని తెలిపారు. కాలిఫోర్నియాకు చెందిన హిందూ నాయకుడు అజయ్ జైన్ మాట్లాడుతూ రామున్ని ఆరాధించే హిందువులు, జైనులకు ఇది ఓ మరపురాని రోజు అని చెప్పారు. ప్రముఖ టైమ్ స్క్వేర్ వద్ద రాముడి చిత్రాలను, రామాలయ నమూనా త్రీడీ చిత్రాలను ప్రదర్శించారు. మరోవైపు యూకేలో భారతీయ హిందువులు ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనల ద్వారా అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. కోవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్‌గా పూజలు జరిపి తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. యూకేలో ఉన్న 150 దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిపినట్లు వెల్లడించారు. భూమి పూజ జరిగిన కార్యక్రమం హిందువుల మనసుల్లో చిరకాలం నిలిచిపోతుందని యూకే హిందూ కౌన్సిల్ చెప్పింది. -
జగమంతా రామమయం
అయోధ్య: శతాబ్దాల నిరీక్షణ ఫలించింది. కోట్లాది రామభక్తుల స్వప్నం సాకారమైంది. దేశవ్యాప్తంగా రామ నామం ప్రతిధ్వనించింది. విశ్వవ్యాప్తంగా హిందూ లోగిళ్లలో ఉత్సవ వాతావరణం నెలకొంది. బాల రాముడి కోసం ఆయన జన్మస్థలిలోనే నవ్య, భవ్య, రమ్య మందిరం ఘనంగా సిద్ధమవుతోంది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించాడని భక్తులు విశ్వసించే ప్రదేశంలో భవ్యమైన రామ మందిర నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సుముహూర్త సమయమైన మధ్యాహ్నం 12.44 గంటలకు శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్, శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ సంత్ నృత్య గోపాల్ దాస్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయోధ్యలో ఉత్సవ వాతావరణం నెలకొంది. పట్టణమంతా పూల దండలతో ముస్తాబయింది. అలాగే, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. పలు చోట్ల ప్రజలు షాపుల్లోని టీవీల ముందు నిల్చుని కార్యక్రమాన్ని చూశారు. దేశంలోని పలు రామాలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. భూమి పూజ అనంతరం ప్రధాని మోదీ ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘సియా(సీతా)వర్ రామచంద్రజీ కీ జై’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. భారత దేశ ఆత్మగా నిలిచిన సకలగుణాభిరాముడి ఔన్నత్యాన్ని ఘనంగా శ్లాఘించారు. రామ నామం ఇప్పుడు దేశం నలుమూలలా ప్రతిధ్వనిస్తోందన్నారు. రాముడు సర్వ జనుల కొంగు బంగారమని కొనియాడారు. అద్భుత ఆలయంగా శతాబ్దాలు నిలిచే నిర్మాణానికి భూమిపూజ నిర్వహించే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. దశాబ్దాలుగా చిన్న తాత్కాలిక గుడారంలో ఉన్న రామ్‌లల్లా ఇకపై అద్భుతమైన ఆలయంలో కొలువుతీరుతారని హర్షం వ్యక్తం చేశారు. రామ్‌లల్లా ఆలయం భారతదేశ ఘన సంస్కృతికి ప్రతీకగా, మానవాళికి స్ఫూర్తిప్రదాయినిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారతీయులందరి హృదయాల్లో రాముడు నిలిచి ఉంటాడన్నారు. సామాజిక సామరస్యం రామరాజ్యంలో ముఖ్యమైన విధానమని తెలిపారు. రాళ్లపై శ్రీ రామ అని రాసి ‘రామసేతు’ నిర్మించిన తీరుగానే.. దేశంలోని మూల మూలల నుంచి రామ మందిర నిర్మాణం కోసం ఇటుకలు వచ్చాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రసంగం ముగించే ముందు సీతారాములను కీర్తిస్తూ ‘జై శ్రీరామ్’ అని నినదించారు. హనుమాన్‌గఢీలో హారతి భూమి పూజ కోసం బుధవారం ఉదయం ప్రధాని మోదీ అయోధ్య చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి, ముందుగా హనుమాన్‌గఢీలోని ఆంజనేయుడి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ స్వయంగా పవన సుతుడికి హారతి ఇచ్చారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ తరువాత అక్కడినుంచి వారు నేరుగా రామ్‌లల్లాను దర్శించుకునేందుకు రామజన్మభూమికి వెళ్లారు. రామ్‌లల్లాకు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు. అనంతరం, కొద్దిమంది ఆహ్వానితుల సమక్షంలో భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. భూమిపూజ వేదికకు సాష్టాంగ ప్రణామాలు అర్పించారు. అనంతరం విశిష్ట అతిథుల సమక్షంలో కాసేపు ప్రసంగించారు. కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 175 మందికి మాత్రమే ఆహ్వానం పంపించారు. వారిలో పలువురు వృద్ధాప్యం సహా పలు ఇతర కారణాలతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య దశాబ్దాలుగా సాగిన వివాదం అనంతరం.. రామజన్మభూమి ప్రాంతం రామ్‌లల్లాకే చెందుతుందని స్పష్టం చేస్తూ గత సంవత్సరం సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ప్రకటించిన నేపథ్యంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. 1992లో ఆ ప్రదేశంలో ఉన్న బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేయడం, తదనంతరం దేశవ్యాప్తంగా మతకల్లోలాలు చెలరేగడం తెలిసిందే. రామ చరితం విశ్వవ్యాప్తం ప్రసంగం ప్రారంభ, ముగింపు సమయాల్లో సీతారాములను కీర్తిస్తూ ‘సియావర్ రామచంద్ర కీ జై’, ‘సీతారామ్’ అని ప్రధాని నరేంద్ర మోదీ నినదించారు. ‘ఈ నినాదాలు ఇక్కడే కాదు.. ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తున్నాయి’ అని అన్నారు. ‘అంతా జానకీ మాతను, శ్రీరామ చంద్రుడిని జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆ తరువాత నేను ప్రసంగం ప్రారంభిస్తాను’ అన్నారు. అనంతరం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు, రామ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రసంగాన్ని ముగిస్తూ.. ‘ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆ రామచంద్రుడిని, సీతమ్మ తల్లిని ప్రార్థిస్తున్నా. వారిద్దరి ఆశీస్సులు మీ పై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా’ అన్నారు. తొలి ప్రధాని మోదీనే.. అయోధ్యలో రామ జన్మభూమిని, హనుమాన్‌గఢీ ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీయేనని యూపీ ప్రభుత్వం తెలిపింది. భూమి పూజను పురస్కరించుకుని ప్రత్యేక స్మారక పోస్టల్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. దేశంలో నెలకొని ఉన్న సామాజిక సామరస్యానికి, దేశ ప్రజల అభినివేశానికి ఈ కార్యక్రమం సాక్ష్యంగా నిలుస్తుంది. రామరాజ్య విలువలతో నడిచే ఆధునిక భారతదేశ ప్రతీకగా చట్టబద్ధంగా నిర్మితమవుతున్న ఈ ఆలయం నిలుస్తుంది. –రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతీయుల 500 ఏళ్ల కలను నేడు ప్రధాని మోదీ సాకారం చేశారు. ప్రధాని మోదీ ముందుచూపు, జ్ఞానము రామ మందిరానికి మార్గం సుగమం చేశాయి. ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా, రాజ్యాంగ మార్గాల ద్వారా సమస్యలు ఎలా పరిష్కరించవచ్చో మోదీ చూపించారు. –యోగి ఆదిత్యనాథ్, ఉత్తర ప్రదేశ్ సీఎం మానవ విలువలకు అత్యున్నత రూపం రాముడు. ఆయన శాంతమూర్తి. ఆయనలో క్రూరత్వం, ద్వేషం, అన్యాయం లేవు. –రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత రామ మందిర నిర్మాణానికి పునాది పడిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో ఆనందాన్ని నింపింది. దేశం స్వతంత్రంగా నిలబడగల ఆత్మవిశ్వాసం దీని ద్వారా వస్తుంది. రామాలయం కోసం రథయాత్ర చేసిన అడ్వాణీ జీ కార్యక్రమంలో హాజరు కాలేకపోయినా, టీవీ ద్వారా చూస్తూ ఉంటారు. – మోహన్ భాగవత్, ఆరెస్సెస్ చీఫ్ కోట్లాది మంది హిందు వుల కల నేడు నిజమైంది. అయోధ్యలో రామాలయ నిర్మా ణం ప్రజా క్షేమం కోసం చేస్తున్న కార్యక్రమం. ఇది దేశాన్ని, ప్రపంచాన్ని నిర్మించడం లాంటిది. ఆలయాన్ని త్వరగా నిర్మి స్తే మన కళ్లతో చూడవచ్చు. ఓ వైపు మోదీ, మరో వైపు యోగి. ఇప్పు డు కాకపోతే ఎప్పుడు నిర్మిస్తారు. –మహంత్ న్రిత్య గోపాల్ దాస్, రామాలయ ట్రస్ట్ చీఫ్ స్వాతంత్య్ర పోరాటం తీరుగానే.. బంగారు రంగు కుర్తా, ధోవతిపై కాషాయ కండువా ధరించి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. రామ మందిర నిర్మాణం దేశ ఐక్యతకు ప్రతీక అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆలయంతో ఈ ప్రాంతం ఆర్థి కంగా పుంజుకుంటుందన్నారు. ప్రేమ, సౌభ్రాతృత్వం పునాదులుగా ఆలయ నిర్మాణం జరుగుతుందన్నారు. ‘దశాబ్దాలుగా చిన్న గుడారంలో ఉన్న రామ్‌లల్లా కోసం అద్భుత ఆలయం రూపుదిద్దుకోనుంది. తన అస్తిత్వాన్ని రూపుమాపేందుకు శతాబ్దాలుగా సాగిన అన్ని ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకుని రామ జన్మభూమి స్వేచ్ఛను పొందింది. రాముడి విగ్రహాలను ధ్వంసం చేశారు. కానీ ఆయన మన హృదయాల్లో నిలిచి ఉన్నాడు. మన సంస్కృతికి మూలం ఆయనే’ అన్నారు. ఇప్పుడు భారత్ అయోధ్యలో ఒక అద్భుత అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. భారత దేశ విశిష్టత భిన్నత్వంలో ఏకత్వమని, ఆ భావనను నిలిపే ఉమ్మడి బంధం రాముడేనని వ్యాఖ్యానించారు. ఆంగ్లేయుల నుంచి స్వాతంత్య్రం పొందేందుకు జరిపిన పోరాటంతో.. ఆయోధ్యలోని రామజన్మభూమి ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించేందుకు శతాబ్దాలు సాగిన పోరాటాన్ని ప్రధాని పోల్చారు. స్వాతంత్య్ర పోరాటంలో దళితులు, గిరిజనులు సహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలు మహాత్మాగాంధీకి మద్దతిచ్చిన విధంగానే.. నేడు ప్రజలంతా దేశంలోని మూలమూలల నుంచి ఇటకలు, మట్టి, పవిత్ర జలంతో రామాలయ నిర్మాణానికి సహకరిస్తున్నారన్నారు. వేలాది మంది సహకారం, కృషి కారణంగానే రామాలయ నిర్మాణానికి పునాది పడిందన్నారు. తమ జీవిత కాలంలో ఈ అద్భుతాన్ని చూస్తామని ఊహించని వారంతా.. ఇప్పుడు తాదాత్మ్యంతో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించనున్న ఆలయం భారతదేశ సంస్కృతి, విశ్వాసాలకు, జాతీయ భావనకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ తెలిపారు. రాముడు చూపిన మార్గంలో వెళ్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ మార్గం తప్పినప్పుడు విధ్వంసం చోటు చేసుకుంటుందని వివరించారు. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా సహా.. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు రూపాల్లో రామ చరితం ప్రజల్లో నిలిచి ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జైపూర్‌లోని రామచంద్రజీ ఆలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న భక్తురాలు మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో రామ్టెంపుల్ కరమ్‌చంద్ చౌక్ వద్ద బాణసంచా కాలుస్తూ స్థానికుల సంబరాలు అయోధ్యలో హనుమాన్ ఆలయంలో హారతి ఇస్తున్న ప్రధాని మోదీ -
చరిత్రలో ఆగస్టు5 నిలిచిపోతుంది : బాబా రాందేవ్
అయోధ్య : రామాలయానికి భూమి పూజ జరిగిన ఆగస్టు 5 ను చారిత్రకరోజుగా యోగా గురువు బాబా రాందేవ్ అభివర్ణించారు. తరతరాలు ఈ రోజును గర్వంగా గుర్తుంచుకుంటాయని అన్నారు. భారత్‌లో కొత్త చరిత్ర లిఖించబడిందని, ప్రజలందరూ ఈరోజును పరస్కరించుకొని సంబరాలు జరుపుకోవాలన్నారు. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన సందర్భంగా బాబా రాందేవ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆలయ నిర్మాణంతో దేశంలో రాజరాజ్యానికి నాంది పలికినట్లయ్యిందన్నారు. ఈ చారిత్రక ఘట్టంతో సాంస్కృతిక, ఆర్థిక అసమానతలు తొలిగిపోతాయని రామరాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉంటారన్నారు. రామ రాజ్యం అంటే ఆదర్శవంతమైన పరిపాలన అని రాందేవ్ అన్నారు. (లైవ్ అప్డేట్స్; అయోధ్యలో భూమిపూజ) రాముడికి, హనుమంతుడికి నరేంద్రమోదీ అపర భక్తుడని, అలాంటి ప్రధాని మనకుండటం ప్రజలందరి అదృష్టమని అన్నారు. హిందూ ధర్మం గర్వించేలా చేసిన ప్రధాని మోదీనే అని బాబా రాందేవ్ కొనియాడారు. అత్యంత భద్రత , కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో కేవలం 175 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. అయెధ్య రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అయోధ్య నగరమంతా రామనామంతో మార్మోమోగిపోతుంది. (‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’) -
రాముని ఆశిస్సులతో..అత్యంత శక్తిమంతమైన దేశంగా
సాక్షి, ఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణం శంకుస్థాపన భూమి పూజ సందర్భంగా దేశ ప్రజలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత్ మారుతుందని కేజ్రివాల్ అన్నారు. రాముని ఆశీర్వాద బలంతో మన దేశం ఆకలి, నిరక్షరాస్యత, పేదరికం నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారతదేశం ప్రపంచానికే దిశానిర్దేశంగా నిలవనుంది. జై శ్రీ రామ్! జై బజరంగ్ బళి అంటూ కేజ్రివాల్ ట్వీట్ చేశారు. రామాలయ నిర్మాణ పోరాట చరిత్రలో ముందుభాగంలో నిలిచే నాయకుల్లో బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఒకరని గుర్తుచేశారు. (అయోధ్య రామాలయం : ఉద్వేగపూరిత క్షణం) శతాబ్దాల రామ భక్తుల కల సాకారమవుతున్న రామాలయ ఆలయ నిర్మాణ కార్యక్రమానికి మోదీతో సహా కేవలం 175 మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. కోవిడ్ నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ సందర్శకుల సంఖ్యను పరిమితం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అయోధ్య అంతటా రామనామంతో మార్మోగిపోతుంది. భారీగా మోహరించిన భద్రత నడుమ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. (‘భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదు’) भूमि पूजन के मौक़े पर पूरे देश को बधाई भगवान राम का आशीर्वाद हम पर बना रहे। उनके आशीर्वाद से हमारे देश को भुखमरी, अशिक्षा और ग़रीबी से मुक्ति मिले और भारत दुनिया का सबसे शक्तिशाली राष्ट्र बने। आने वाले समय में भारत दुनिया को दिशा दे। जय श्री राम! जय बजरंग बली! — Arvind Kejriwal (@ArvindKejriwal) August 5, 2020