
ఏపీ రాజధాని భూమి పూజకు తొలగిన అడ్డంకి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భూమి పూజకు ఎట్టకేలకు అడ్డంకి తొలగింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని భూమి పూజకు ఎట్టకేలకు అడ్డంకి తొలగింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో రాజధాని భూమి పూజతో పాటు సంకల్ప సభకు షరతులతో అనుమతి లభించినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈకార్యక్రమాల్లో ఎలాంటి ప్రకటనలు చేయొద్దంటూ ఎన్నికల సంఘం పేర్కొంది. కాగా, నూతన రాజధానికి జూన్ మొదటివారంలో భూమి పూజతో శంకుస్థాపన చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే .