
సాక్షి, న్యూయార్క్ : అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి చేపట్టిన భూమిపూజను పురస్కరించుకొని అమెరికాలోని హిందువులు సంబరాలు జరుపుకున్నారు. శంకుస్థాపనకు మద్దతుగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. 500 ఏళ్లనాటి హిందువుల పోరాటం సాకారం అయిందని, కోట్లాది హిందువుల కల నిజమయ్యిందని భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చాలా గొప్ప నిర్ణయమని, ప్రతీ హిందువూ గర్వించదగ్గ విషయమని ఆనందం వ్యక్తం చేశారు. టైమ్స్ స్కెవ్‌లో భారతీయ హిందువుల సంబరాలపై సాక్షి టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్