న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా మాత్ర విగ్రహాలు కొలువుదీరాయి. న్యూయార్క్ నగరంలో ఉండే ఎన్‌ఆరైలు ఈ దుర్గాపూజకు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇదివరకటి మాదిరిగా వీడియో చాట్‌ల ద్వారా పూజలు జరుపుకోవాల్సిన పనిలేదు. ఈ దుర్గామాత విగ్రహాలను యూఎస్‌ఏ బెంగాలి క్లబ్ ఏర్పాటు చేసింది. ప్రారంభ పూజ అక్టోబర్ 5,6 తేదీల్లో ఘనంగా జరిగింది.
🚨 Durga Puja at Times Square, New York 🇺🇸 pic.twitter.com/dsTqktg14d
— Indian Tech & Infra (@IndianTechGuide) October 7, 2024
అందుకు సంబంధించిన ఫోటోలను పలువురు నెటిజన్లు "న్యూయార్క్ నగరం నడిబొడ్డున భారతీయ సంస్కృతి" అనే క్యాప్షన్‌తో సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అలాగే రుచికా జైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా షేర్ చేసింది. అందులో రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాల గురించి వివరించింది. దశమి పూజతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ చారిత్రాత్మక ఘటన సిందూర్ ఖేలా టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా చోటుచేసుకుంది.
History has been Scripted !!!
For the 1st time, Durga pujo was organized at the centre of Times Square, New York City, United States.
Kudos to all the Bengalis living in New York who have made this possible!!! pic.twitter.com/n6iu4FGNp8— Sourav || সৌরভ (@Sourav_3294) October 6, 2024
ఈ పండుగ ఆచారం ఐక్యత ఆవశక్యత గూర్చి చాటిచెబుతోంది. ఇలా ఈ నవరాత్రులను యునైటెడ్ కింగ్‌డమ్, లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో భారత సంతతి విదేశీయులు ఎంతో ఉత్సహాంగా జరపుకుంటున్నారు. ఆ వేడుకల్లో వివిధ సాంస్కృతిక బృందాలు ఈవెంట్‌లు, గర్బా పార్టీలు నిర్వహిస్తున్నాయి. నిజానికి ఈ చారిత్రాత్మక ఘటనలు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశంగా ఉపయోగపడతాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా భారతీయులంతా ఒకచోట చేరి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం విశేషం.
(చదవండి: కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు)
Comments
Please login to add a commentAdd a comment