దుర్గతులను నివారించే పరాశక్తి ఎనిమిదో రోజున దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గారూపం. భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత. కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగిపోతుంది. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. ఎర్రని వస్త్రం సమర్పించి, ఎర్రటి అక్షతలు, ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి.
శ్లోకం: సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాదికే
శరణ్యే త్య్రంబకే గౌరి నారాయణి నమోస్తుతే.
రాహుగ్రహ దోషాలను నివారించి, భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుంది. ఓం దుర్గ దుర్గాయ నమః అని వీలైనన్ని సార్లు జపిస్తే శత్రు బాధలు తొలగి, సుఖశాంతులతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం. అంతేగాదు. ఈ రోజు 'ఓం కాత్యానాయ విద్మహే కన్యకుమారి ధీమహి! తన్నో దుర్గ్ ప్రచోదయాత్!' అంటూ ప్రార్థన చేసి, ఆరాధిస్తే మనకున్న దుర్గతులు పోతాయని పురాణ వచనం.
మరోవైపు ఎనిమిదోరోజు కొన్ని చోట్ల నవదుర్గల ప్రకారం గౌరి దేవిని పూజిస్తారు. ఈ తల్లి తెల్లటి ముత్యంలా మెరుస్తుంది. ఆమె శక్తి అత్యంత ఫలప్రదమైనది. ఈ రోజున మహాగౌరీ దేవిని తెలుపు లేదా ఊదా రంగు దుస్తులు ధరించి పూజించాలి
నైవేద్యం: బెల్లం పొంగలి, చెక్కెర పొంగలి, పాయసాన్నం వంటివి నివేదిస్తారు
(చదవండి: నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!)
Comments
Please login to add a commentAdd a comment