Times Square
-
చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా మాత్ర విగ్రహాలు కొలువుదీరాయి. న్యూయార్క్ నగరంలో ఉండే ఎన్ఆరైలు ఈ దుర్గాపూజకు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ఇదివరకటి మాదిరిగా వీడియో చాట్ల ద్వారా పూజలు జరుపుకోవాల్సిన పనిలేదు. ఈ దుర్గామాత విగ్రహాలను యూఎస్ఏ బెంగాలి క్లబ్ ఏర్పాటు చేసింది. ప్రారంభ పూజ అక్టోబర్ 5,6 తేదీల్లో ఘనంగా జరిగింది. 🚨 Durga Puja at Times Square, New York 🇺🇸 pic.twitter.com/dsTqktg14d— Indian Tech & Infra (@IndianTechGuide) October 7, 2024అందుకు సంబంధించిన ఫోటోలను పలువురు నెటిజన్లు "న్యూయార్క్ నగరం నడిబొడ్డున భారతీయ సంస్కృతి" అనే క్యాప్షన్‌తో సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అలాగే రుచికా జైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా షేర్ చేసింది. అందులో రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాల గురించి వివరించింది. దశమి పూజతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఈ చారిత్రాత్మక ఘటన సిందూర్ ఖేలా టైమ్స్ స్క్వేర్ వద్ద కూడా చోటుచేసుకుంది. History has been Scripted !!!For the 1st time, Durga pujo was organized at the centre of Times Square, New York City, United States.Kudos to all the Bengalis living in New York who have made this possible!!! pic.twitter.com/n6iu4FGNp8— Sourav || সৌরভ (@Sourav_3294) October 6, 2024ఈ పండుగ ఆచారం ఐక్యత ఆవశక్యత గూర్చి చాటిచెబుతోంది. ఇలా ఈ నవరాత్రులను యునైటెడ్ కింగ్డమ్, లండన్, లీసెస్టర్, బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో భారత సంతతి విదేశీయులు ఎంతో ఉత్సహాంగా జరపుకుంటున్నారు. ఆ వేడుకల్లో వివిధ సాంస్కృతిక బృందాలు ఈవెంట్లు, గర్బా పార్టీలు నిర్వహిస్తున్నాయి. నిజానికి ఈ చారిత్రాత్మక ఘటనలు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశంగా ఉపయోగపడతాయి. అలాగే ఆస్ట్రేలియాలో కూడా భారతీయులంతా ఒకచోట చేరి ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం విశేషం. View this post on Instagram A post shared by RUCHIKA JAIN FIREFLYDO (@fireflydo) (చదవండి: కాన్సస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు) -
ప్రపంచ దేశాల్లో యోగా దినోత్సవం
న్యూఢిల్లీ/న్యూయార్క్/టెల్అవీవ్: అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీతోపాటు న్యూయార్క్‌లో పలు కార్యక్రమాలు జరిగాయి. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరిగాయి. అత్యధిక ఉష్ణోగ్రతలను లెక్క చేయకుండా జనం వేలాదిగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో జరిగిన కార్యక్రమంలో 300 మంది పాల్గొన్నారు. సింగపూర్‌లో ఆరోగ్య శాఖ మంత్రి రహయు మహజం ఆధర్యంలో జరిగిన కార్యక్రమంలో 200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. నేపాల్‌లోని పొఖారా, బుద్ధుడి జన్మస్థలం లుంబినిలో యోగా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. శ్రీలంక రాజధాని కొలంబో, చైనా రాజధాని బీజింగ్, ఫ్రాన్సు రాజధాని పారిస్, మాల్దీవులు రాజధాని మాలె, ఇటలీ రాజధాని రోమ్, సౌదీ రాజధాని రియాద్, కువైట్, మలేసియా, ఇండోనేసియాలో, స్వీడన్ రాజధాని స్టాక్‌హోం, లండన్‌లోని ట్రఫాల్గర్ స్క్వేర్‌లోనూ యోగా కార్యక్రమాలు జరిగాయి. -
పుట్టినరోజున టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత అరుదైన ఘనత
టాలీవుడ్ లేడీ సింగర్స్ అనగానే కొన్నిపేర్లు గుర్తొస్తాయి. వాటిలో టాప్‌లో కచ్చితంగా సునీత పేరు ఉంటుంది. 'ఈ వేళలో నీవు' అనే పాటతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సునీత తన మధురమైన స్వరంతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)సునీత పుట్టినరోజుని ఈమె అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సింగర్ సునీత ఫాన్స్.. న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో సునీత వీడియోను ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు అతికొద్ది మందికే ఈ అరుదైన అవకాశం లభించగా.. ఇప్పుడు సునీత కూడా ఆ జాబితాలో చేరారు.పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు సునీత ఇప్పటి వరకు పొందిన అవార్డులతో పాటు ఆమె సాధించిన పురస్కారాలతో కూడిన వీడియోను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో ప్లే చేశారు. మే 12 తేదీన ప్రతి గంటకు 60సెకండ్ల పాటు ఈ వీడియో ప్రదర్శించడం విశేషం.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్) -
NewYork: టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం
న్యూయార్క్: అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం రేగింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం బ్లాక్ చేసి బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. శనివారం టైమ్స్ స్క్వేర్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు ఒక ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ సమయంలో అటుగా వచ్చిన అక్కడికి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడిని దించిన వెంటనే తన కారు వెనుక సీటులో గ్రెనేడ్‌ను గమనించాడు. దీంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకుని క్యాబ్ ఉన్న ప్రదేశానికి వస్తున్న బాంబ్ స్క్వాడ్ ఎమర్జెన్సీ వాహనాన్ని ర్యాలీ చేస్తున్న వారు అడ్డుకున్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్ వాహనం గ్రెనేడ్ వద్ద ఉన్న క్యాబ్ వద్దకు వచ్చేసరికి ఆలస్యమైంది. చివరకు అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రెనేడ్ నిర్వీర్యమైనదేనని తేల్చారు. బాంబ్ స్క్వాడ్ వాహనాన్ని అడ్డుకున్న వారికి జైలు తప్పదని పోలీసులు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ఇదీ చదవండి.. ఐఎస్ఎస్కు వ్యోమగాముల ప్రయాణం వాయిదా -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ‘యాత్ర 2’ టీజర్
యాత్ర’మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్‌ను న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్ వేదికగా ఈ మూవీ టీజర్‌ను చూపించారు. ఇప్పటివరకు అతి కొద్ది సినిమాలకే ఈ అరుదైన అవకాశం లభించగా.. ఇప్పుడు యాత్ర 2 మూవీ ఈ జాబితాలో చేరిపోయింది. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రాబోతోంది. ఇక ఈ టీజర్లో 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్‌తో పాటు 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. -
Ram Mandir Pran Pratishtha: టైమ్స్ స్క్వేర్‌లో ‘ప్రాణప్రతిష్ఠ’ ప్రత్యక్ష ప్రసారం
జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మన దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అయోధ్య పవిత్రోత్సవం వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆరోజు రామభక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని సమాచారం. బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి 84 సెకన్ల శుభ సమయం నిర్ణయించారు. 2024, జనవరి 22న ఉదయం 12:29 నుండి 12:30 మధ్య కాలంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. కాగా నూతన రామాలయం మూడు అంతస్తులలో నిర్మితమయ్యింది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రామ్‌లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ఐదేళ్ల బాలుని రూపంలో ఉంటుంది. కాగా ఆలయంలో ఇంతవరకూ ఉన్న బాలరాముని విగ్రహాన్ని నూతన విగ్రహంతో పాటు గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య ‘ప్రాణప్రతిష్ఠ’కు ముఖ్య అతిథులెవరు? -
టైమ్స్ స్వ్కేర్‌లో బండి సంజయ్.. అభిమానం చాటుకున్న ఎన్నారైలు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయుడు ఆధ్వర్యంలో న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ బిల్ బోర్డుపై బీజేపీ నేత బండి సంజయ్ వీడియోను ప్రదర్శించి తమ అభిమానం చాటుకున్నారు. బండి సంజయ్ అమెరికా పర్యటనలో భాగంగా నార్త్ కరోలినా, వర్జీనియా, న్యూజెర్సీ, వాషిగ్టన్ డీసీ, డల్లాస్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు విలాస్ రెడ్డి జంబుల తెలిపారు. బండి సంజయ్‌ని కలుసుకోవడానికి ప్రవాస భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ట్వింకిల్ ట్వింకిల్ సూపర్‌స్టార్
మహేష్ బాబు–నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కూతురు సితార న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసి నెటిజనులను కనువిందు చేసింది. ఒక జ్యుయెలరీ యాడ్‌లో సితార నటించింది. ఆ యాడ్‌కు సంబంధించిన చిత్రాలను బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించారు. ‘సో సో ప్రౌడ్ ఆఫ్ యూ మై ఫైర్ క్రాకర్’ అంటూ మహేష్‌బాబు సితార చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘పదాలలో చెప్పలేని సంతోషం ఇది. కీప్ షైనింగ్ మై సూపర్ స్టార్’ అంటూ స్పందించింది నమ్రతా శిరోద్కర్. చిన్న వయసులోనే యూ ట్యూబ్ చానల్ మొదలు పెట్టి ‘ఆహా!’ అనిపించిన సితార చక్కని డ్యాన్సర్ కూడా. ‘ఫ్రోజెన్–2’ సినిమా తెలుగు వెర్షన్లో బేబీ ఎల్సా పాత్రకు వాయిస్–వోవర్ ఇచ్చింది. జ్యుయలరీ బ్రాండ్ ‘పీఎంజే’కు సితార బ్రాండ్ అంబాసిడర్. ఈ నేపథ్యంలో యంగెస్ట్ స్టార్ కిడ్‌గా టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై మెరిసింది. -
మహేశ్నే మించిపోయిన సితార.. ఆ ఒక్క విషయంలో
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఫుల్ హ్యాపీ. ఓ పక్క సినిమాలు, యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతడికి పోటీగా కూతురు సితార కూడా వచ్చేసింది. తన అంతా హైట్ పెరిగిపోయిందని ఆశ్చర్యపడేలోపే.. మరో షాక్ ఇచ్చి మహేశ్నే అవాక్కయ్యేలా చేసినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఏకంగా పాన్ వరల్డ్ రేంజులో ఎంట్రీ ఇచ్చింది. సితార గ్రాండ్ ఎంట్రీ! మహేశ్ కూతురు సితారని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎప్పటికప్పుడు మహేశ్, నమ్రత షేర్ చేసే ఫొటోలు, వీడియోల వల్ల సితార ఎలా ఉంది, ఏం చేస్తుందనేది తెలుస్తూనే ఉంది. ఇక సితార డ్యాన్స్ వీడియోలైతే ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇదంతా కాదన్నట్లు రీసెంట్ గా ఓ జ్యూవెల్లరీ యాడ్ షూట్లో సితార తొలిసారి పాల్గొంది. ఇప్పుడు దాన్ని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించారు. (ఇదీ చదవండి: పాయల్ కొత్త సినిమా టీజర్.. అలాంటి సీన్స్‌తో!) పాన్ వరల్డ్ రేంజులో ఓ నెలరోజుల క్రితం జరిగిన ఈ యాడ్ షూట్ లో సితార పాల్గొనడం ఓ విధంగా రికార్డ్. ఎందుకంటే టీనేజ్ లోకి రాకముందే ఇలా మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిందని తెలియగానే అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఏకంగా దాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్కేర్వ్ లో ప్రదర్శించారనేసరికి సోషల్ మీడియాలో ఆ ఫొటోలు, వీడియోలని వైరల్ చేస్తున్నారు. యాక్టర్ అవుతుందా? డ్యాన్సర్‌గా అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్న సితార.. ఇప్పుడు యాడ్ షూట్స్ లోకి కూడా వచ్చేసింది. తండ్రి ఇక్కడ యాడ్స్ చేస్తుంటే.. సితార మాత్రం అమెరికా నుంచి మొదలుపెట్టింది. మరి తండ్రి అడుగుజాడల్లోనే నటిగా అరంగేట్రం వస్తుందా లేదంటే కేవలం యాడ్స్, డ్యాన్స్ వరకే పరిమితం అవుతుందా అనేది చూడాలి. View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) -
ఉత్తమ చిత్ర పురుషోత్తమన్
న్యూయార్క్‌లోని టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించిన ఆ ఆర్ట్‌వర్క్ ప్రేక్షకులను బాగా ఆట్టుకుంటుంది. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకొంటూ ‘వావ్’ అన్నారు. ప్రేక్షకులే కాదు కళావిమర్శకులు కూడా ‘బ్రహ్మాండం’ అన్నారు. ఆ ఆర్ట్‌వర్క్‌ను సృష్టించింది బెంగళూరుకు చెందిన అజయ్ పురుషోత్తమన్... బెంగళూరులోని ఒక ఎడ్వర్టైజింగ్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అజయ్ పురుషోత్తమన్‌కు చిన్నప్పుడు చాలామంది పిల్లలలాగే బొమ్మలు వేయడం అంటే ఇష్టం. కార్టూన్ క్యారెక్టర్లు అంటే బోలెడు ఇష్టం. తన అభిమాన క్యారెక్టర్లను గీయడంలో ప్రాక్టిస్ చేస్తుండేవాడు. ఈ ఆసక్తి స్కూల్ రోజుల నుంచి కాలేజి రోజుల వరకు వచ్చింది. 2డీ ఆర్ట్, త్రీడి ఆర్ట్‌లతో ప్రయోగాలు చేస్తుండేవాడు. తనకు తెలిసిన కథలను యానిమేషన్ మరియు త్రీడి మోడలింగ్‌లోకి తీసుకువచ్చాడు. ఎన్నో సొంత ప్రాజెక్ట్‌లు చేసేవాడు. న్యూయార్క్‌లో జరిగే ‘ఎన్ఎఫ్టీ ఎన్వైసీ’ ప్రదర్శన ‘ఎన్ఎఫ్టీ’పై ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారిని ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే వేదిక. ఈ ఉత్సవానికి అజయ్ హాజరు కానప్పటికీ అతడి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ప్రశంసలు అందుకున్నాయి. ‘మన ఆర్ట్‌ను ప్రపంచ వేదిక మీదికి తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటాడు అజయ్. న్యూయార్క్ టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై తన ఆర్ట్‌వర్క్ ప్రదర్శించడం అజయ్ పురుషోత్తమన్‌ని ఎంతో సంతోషానికి గురిచేసింది. మొదట దీని గురించి విన్నప్పుడు ‘కలా నిజమా!’ అనుకున్నాడు. ఆ దృశ్యాన్ని కళ్లారా చూడాలనుకున్నాడు. సన్నిహితుల సహాయంతో న్యూయార్క్‌కు వెళ్లి ‘ఇంతకు మించిన ఆనందం ఏమున్నది!’ అనుకున్నాడు. గత సంవత్సరం అజయ్ మొదలుపెట్టిన ‘టాయ్ స్టోరీస్ ప్రొఫైల్’ చాలామందిని ఆకట్టుకుంది. ఈ యానిమేషన్ సిరీస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక హిప్–హప్ పాటకు డ్యాన్స్ చేస్తాడు. ‘షోలే’ సినిమాలోని క్యారెక్టర్లు అన్నీ కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేస్తాయి! నిజజీవితంలోని ప్రముఖ వ్యక్తులు ఈ సిరీస్‌లోని క్యారెక్టర్లు. ప్రతి క్యారెక్టర్‌కు తనదైన ప్రత్యేకత ఉంటుంది. రాబోయే ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే వెబ్3, ఎన్ఎఫ్టీకి సంబంధించి ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ కోసం అర్జెంటీనా ఆర్టిస్ట్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ‘ఇది సవాళ్లతో కూడిన ప్రయాణం’ అంటున్నాడు అజయ్. సాధారణ ఆర్టిస్ట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న అజయ్ పురుషోత్తమన్ ఆ సవాళ్లను అధిగమించి మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. మోస్ట్ పాపులర్ నాన్–ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)లు చిత్రకళ, సంగీతం, క్రీడా ప్రపంచంలోకి వచ్చాక ఎన్నో అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని, ట్రెండ్‌ను అందిపుచ్చుకొని మన దేశంలోని ‘మోస్ట్ పాపులర్ ఎన్ఎఫ్టీ క్రియేటర్’లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ పురుషోత్తమన్. తనకు వచ్చే కంటెంట్ ఐడియాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీ మొదలుపెట్టాడు. తనలోని సృజనకు సంబంధించి అవతలి కోణాన్ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. తాను రూపొందించిన ఎన్ఎఫ్టీలను రకరకాల డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మకం మొదలు పెట్టాడు. తన ఆర్ట్ మన దేశానికి మాత్రమే పరిమితం కావాలని అజయ్ అనుకోలేదు. ‘అక్కడ ఏం జరుగుతుంది’ అంటూ అంతర్జాతీయ ఆర్ట్‌పై దృష్టి పెట్టాడు. ట్రెండ్ ఏమిటో తెలుసుకున్నాడు. హాలివుడ్ కలెక్షన్స్‌కు శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన గాయకుల త్రీడీ బాటిల్ ఆర్ట్‌ను రూపొందించాడు. ప్రయాణాలు అంటే అజయ్‌కు ఇష్టం. ఎందుకంటే స్థానిక సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నది తన కళలోకి వచ్చి చేరుతుంది. బలాన్ని ఇస్తుంది. -
అమెరికాలో బంగారు బతుకమ్మ సందడి (ఫొటోలు)
-
తానా ఆధ్వర్యంలో అమెరికాలో బంగారు బతుకమ్మ ఉత్సవం
అమెరికాలోని న్యూయర్క్ టైమస్క్వేర్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అక్టోబర్ 8వ తేదీన బంగారు బతుకమ్మ ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో 20 అడుగులఎత్తున తీర్చిదిద్దిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా, విదేశీయులను సైతం ఆకర్షించింది. తెలంగాణ సంస్కృతికి గర్వకారణమైన బతుకమ్మ అలంకరణ, పాటలు, ఆటలు పండగ కాంతులు పంచాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ లతో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది తెలుగువారు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. బతుకమ్మలతో ఆడపడుచులు ఉత్సాహంగా వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా రకరకాల పూలతో అలంకరిచిన బతుకమ్మల అలంకరణ అందర్నీ విశేషంగా ఆకర్షించింది. తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో న్యూజెర్సీ BOD లక్ష్మి దేవినేని, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, దీపిక సమ్మెట ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు వైవిధ్యభరితమైన టైమ్ స్క్వేర్‌ని పూలవనంగా మార్చాయి. ఈ వేడుకలలో పాల్గొన్న తానా సంస్థ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ప్రత్యేక ఉపన్యాసం చేసారు. ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహించిన తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కృషిని కొనియాడారు. అలాగే సహకరించిన ఆడపడుచులకు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ మాట్లాడుతూ దేవుళ్ళని పూలతో పూజించే పూలనే దేవుళ్లుగా చేసి పూజించటంలోని విశిష్టతను గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగవరపు వినూత్నమైన కార్యక్రమాలతో సంస్థ ప్రతిష్టని మరింత పెంచే విధంగా బంగారు బతుకమ్మ ఉత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ కనులవిందుగా అలంకరించిన బతుకమ్మ టైమ్ స్క్వేర్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఇంత మంచి కార్యక్రమాన్ని న్యూయార్క్ నగరంలో చేయడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. భారతీయ సంప్రదాయాలను, పండుగల గురి౦చి తెలుసుకునే అవకాశం కల్పించినందుకు తానాకు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో బ్రూక్లీన్ బరో ప్రెసిడెంట్ ఆఫీసు ప్రతినిధి, దక్షిణ ఆసియా వ్యవహారాల డైరెక్టర్ దిలీప్ చౌహాన్.. తానా సంస్థకు మేయర్ జారీ చేసిన అభినందన పత్రాన్ని అందించారు. ప్రత్యేక అతిథులుగా హాజరైన ప్రఖ్యాత టీవీ, సినీనటి అనసూయ, ప్రముఖ జానపదగాయని మంగ్లీ, తమ ఆటపాటలతో హోరెత్తించారు. అలాగే మిమిక్రీ రమేష్ తమదైన హాస్యంతో ఆహుతులకు హాస్యాన్ని పంచారు. ఈ సందర్భంగా తెలుగుదనం ఉట్టి పడేలా సంప్రదాయమైన అలంకరణలతో తెలుగు ఆడపడుచులు ఉత్సాహభరితమైన బతుకమ్మ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. అలాగే సంప్రదాయ నృత్యాలు, మహిషాసుర మర్ధిని నృత్య రూపకం, చిన్నారుల జానపద నృత్యాలను ప్రదర్శించి ఆహూతులని ఆనందింపజేశారు. ఈ కార్యక్రమాన్ని ఫౌండేషన్ ట్రస్టీ విశ్వనాథ్ నాయునిపాటి, ఫౌండేషన్ ట్రస్టీలు సుమంత్ రామిశెట్టి-విద్య గారపాటి-శ్రీనివాస్ ఓరుగంటి, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూయార్క్ దిలీప్ ముసునూరు, రీజినల్ రిప్రజెంటేటివ్- న్యూ ఇంగ్లాండ్ ప్రదీప్ గడ్డం, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, కిరణ్ పర్వతాల ఆధ్వర్యంలో విశ్వవేదికపై కలకాలం గుర్తుండిపోయేలా తానా సంస్థ బతుకమ్మ సంబరాలను దిగ్విజయంగా నిర్వహించారు. అమెరికాలోని వివిధ నగరాలనుండి తానా సంస్థ నాయకులు నిర్మాత విశ్వప్రసాద్ పాటు ఫౌండేషన్ చైర్మన్ వెంకటరమణ యార్లగడ్డ, EVP నిరంజన్ శృంగవరపు, వెంకట్ చింతలపల్లి,సునీల్ కోగంటి, రవి పొట్లూరి, రవి మందలపు, సంస్థ ట్రస్టీ సభ్యులు రవి సామినేని, పద్మజ బెవర, మాధురి ఏలూరి, రాంచౌదరి ఉప్పుటూరి,శ్రీ అట్లూరి, ధృవ నాగండ్ల పాల్గొన్నారు. అతిధులకు ‘బీంజ్ హోటల్’ న్యూయార్క్ వారి ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో కమ్మని విందు అందించారు. అలాగే సహచర అమెరికా తెలుగు సంఘాలు TLCA, TTA, NYTTA సంస్థలకు, సభ్యులకు కృతఙ్ఞతలు తెలిపారు. ఇంతటి మహా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి వారాల తరబడి కృషి చేసిన వారందరికీ తానా సంస్థ తరఫున తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, న్యూజెర్సీ BOD లక్ష్మి దేవినేని ధన్యవాదాలు తెలియజేశారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Indian Flag: ప్రపంచాన మెరిసిన త్రివర్ణం
బీజింగ్/సింగపూర్/అమెరికా: ప్రపంచ దేశాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. వివిధ దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత స్వాతంత్య్ర దినోత్సవాలను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. చైనాలో భారత రాయబారి ప్రదీప్ రావత్ వేడుకల్లో పాల్గొన్నారు. భారత ఎంబసీలో జాతీయ జెండాను ఎగురవేశారు. చైనాలోని భారతీయులు అధిక సంఖ్యలో విచ్చేసి, సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. భారత నావికా దళానికి చెందిన నిఘా నౌక ‘ఐఎన్ఎస్ సరయూ’ బ్యాండ్ సిబ్బంది సింగపూర్‌లో భారత రాయబార కార్యాలయంలో దేశభక్తి గేయాలు ఆలపించారు. కెనడా, బంగ్లాదేశ్, నేపాల్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోను భారత స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. అమెరికాలోని బోస్టన్‌లో ‘ఇండియా డే’ పరేడ్ సందర్భంగా 220 అడుగుల ఎత్తున ఎగురవేసిన భారత జాతీయ జెండా ప్రజలను ఆకట్టుకుంది. భారత్‌కు శుభాకాంక్షల వెల్లువ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌కు ప్రపంచదేశాల అధినేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తదితరులు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ‘సత్యం, అహింసా అని గాంధీజీ ఇచ్చిన సందేశం విలువైనది. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్, అమెరికా ప్రజల శాంతిభద్రతల కోసం ఇరుదేశాలూ కలిసికట్టుగా పనిచేయాలి’ అని బైడెన్ సందేశమిచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బానీస్, ఆస్ట్రేలియా రక్షణ శాఖ మంత్రి రిచర్డ్ మార్లెస్, మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్, సోలిహ్, సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తదితర ప్రముఖులు భారత ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇదీ చదవండి: వివాదంలో బ్రిటన్ ప్రధాని అభ్యర్థి రిషి సునాక్! -
అమెరికాలో కాల్పులు: ముగ్గురికి గాయాలు
న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. న్యూయార్క్ టైమ్ స్కైర్ వద్ద గుర్తు తెలియని దుండుగుడు కాల్పులకు తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 4.55 గంటల సమయంలో సెవెన్త్ ఎవెన్యూ వద్ద ఓ దుండగుడు గన్‌తో బహిరంగంగా కాల్పులు జరిపాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పులో గాయపడినవారు.. బ్రూక్లిన్కు చెందిన 4ఏళ్ల బాలిక, ఐలాండ్‌కు చెందిన యువతి(23), న్యూజెర్సీకి చెందిన మహిళ(43)గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గాయపడిన వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనపై మేయర్ బిల్ డి బ్లాసియో మాట్లాడుతూ.. దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, గాయపడ్డ బాధితులు కోలుకుంటున్నారు. నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేయాలని న్యూయార్క్ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశా. తుపాకీల అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని అన్నారు. టైమ్ స్కైర్‌లో ఎంతమంది దుండగులు కాల్పులకు తెగబడ్డరో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ కమిషనర్ డెర్మోట్ ఎఫ్. షియా అన్నారు. కానీ ప్రాథమిక నిర్ధారణలో ఒక్కడే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. చదవండి: అర్ధరాత్రి హైవేపై.. సినిమాను తలపించే రీతిలో -
అమెరికాలో 'అయోధ్య' సంబరాలు
సాక్షి, న్యూయార్క్ : అయోధ్యలోని రామమందిరం నిర్మాణానికి చేపట్టిన భూమిపూజను పురస్కరించుకొని అమెరికాలోని హిందువులు సంబరాలు జరుపుకున్నారు. శంకుస్థాపనకు మద్దతుగా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. 500 ఏళ్లనాటి హిందువుల పోరాటం సాకారం అయిందని, కోట్లాది హిందువుల కల నిజమయ్యిందని భావోద్వేగానికి లోనయ్యారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చాలా గొప్ప నిర్ణయమని, ప్రతీ హిందువూ గర్వించదగ్గ విషయమని ఆనందం వ్యక్తం చేశారు. టైమ్స్ స్కెవ్లో భారతీయ హిందువుల సంబరాలపై సాక్షి టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ -
మోహన్ బగాన్‌కు అరుదైన గౌరవం
కోల్‌కతా: క్రికెట్ అంటే పడిచచ్చే భారత్‌లో ఇప్పటికీ ఫుట్‌బాల్‌ను బతికిస్తున్న జట్లలో ప్రతిష్టాత్మక మోహన్ బగాన్ క్లబ్ ఒకటి. 131 ఏళ్ల చరిత్ర గల ఈ క్లబ్‌కు బుధవారం అరుదైన గౌరవం దక్కింది. న్యూయార్క్‌లోని ప్రతిష్టాత్మక టైమ్స్ స్క్వేర్‌లో ‘నాస్డాక్’ బిల్‌బోర్డులపై క్లబ్ లోగోను, టీమ్ రంగులను ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారత్ నుంచి ఏ క్రీడలకు సంబంధించిన జట్టు గురించైనా ఇలా ‘నాస్డాక్’ బిల్‌బోర్డుపై ప్రదర్శించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జులై 29ని ‘మోహన్ బగాన్ డే’గా వ్యవహరిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఏర్పాటు చేశారు. 1911లో ఇదే రోజు ప్రతిష్టాత్మక ఐఎఫ్ఏ షీల్డ్ టోర్నీలో భాగంగా మోహన్ బగాన్ 2–1తో బ్రిటిష్‌కు చెందిన ఈస్ట్ యార్క్‌షైర్ రెజిమెంట్ జట్టును ఓడించింది. భారత స్వాతంత్రోద్యమ కాలంలో దక్కిన ఈ గెలుపునకు అప్పట్లో ఎంతో ప్రాధాన్యత లభించింది. తమ జట్టుకు తాజాగా దక్కిన గౌరవంపట్ల మోహన్ బగాన్ యాజమాన్యం ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. తమ జట్టు ఎంతో ప్రత్యేకమైందో ఇది చూపించిందని అభిమానులు ఆనందం ప్రదర్శించారు. మరోవైపు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) కూడా దీనిపై అభినందనలు తెలపడం విశేషం. ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో బిల్‌బోర్డుపై కనిపించిందంటే అది ఒక క్లబ్ మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో ఫుట్‌బాల్‌కు అమితంగా మద్దతిచ్చే క్లబ్‌లలో ఒకటైన మోహన్ బగాన్‌ను అభినందనలు’ అని ‘ఫిఫా’ ట్వీట్ చేసింది. -
ప్రచారం కోసం నగ్నంగా చిందులు
న్యూయార్క్: స్వీడిష్ ఫోన్ కంపెనీ రెబ్టెల్ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. భారత్‌కు అన్లిమిటెడ్ కాల్స్‌ను ఆఫర్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఆఫర్‌ను ప్రమోట్ చేసుకోవడం కోసం వినూత్న మార్గం ఎంచుకుంది. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో నలుగురు మహిళలతో నగ్నంగా డాన్స్ చేయించింది. బాలీవుడ్ పాపులర్ పాట చమ్మక్ చల్లో పాటకు వారు చిందేశారు. నగ్నంగా ఉన్న ఆ మహిళలు ఒంటికి పెయింట్ మాత్రం పూసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా.. రెబ్టెల్ కంపెనీ మాత్రం సమర్థించుకుంది. మగవాళ్లకు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది. మార్కెట్ చేసుకోవడం కోసం మహిళలను శృంగారంగా చూపించడం కొత్త పద్ధతేమీ కాదని, ఎప్పటి నుంచో ఉందని ఆర్గనైజింగ్ సెక్రటరీ జొహన్నా డాహ్లిన్ చెప్పారు. -
విదేశీ గడ్డపై ‘ఉట్టి’
సాక్షి, ముంబై : నగరంలో మహిళా దహిహండీ బృందాలకు మొట్టమొదటిసారిగా విదేశాల్లో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం దక్కింది. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ) న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో దివాలి సంబరాల పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ నెల 20వ తేదీన మహిళలతో నిర్వహించే దహి హండీ హైలెట్ కానుందని అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో టైమ్స్‌స్క్వేర్‌లో పురుష దహిహండీ బృందాలు ప్రదర్శన నిర్వహించాయి. అయితే మహిళా గోవింద బృందాలు అక్కడ ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి. 20 మంది సభ్యులు గల గోవిందా బృందంలో 18 మంది మహిళా గోవిందులు కాగా, ఇద్దరు సమన్వయకర్తలు ఉంటారు. దహిహండీ సమన్వయ్ సమితి (ఎంటీడీసీ) సభ్యులు వివిధ దహిహండీ బృందాల నుంచి జట్టు సభ్యులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర పర్యాటక విభాగం ఈ బృందం కోసం వీసాతోపాటు వసతి, భోజన సదుపాయాలను స్పాన్సర్ చేయనుంది. బృందం సభ్యులు మాత్రం తమ టికెట్ కోసం రూ.75 వేల ఖర్చును సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా బృందం సమన్వయకర్త గీతా జగాడే (32) మాట్లాడుతూ.. విదేశాలలో తాము ప్రదర్శన ఇవ్వబోతుండటం ఆనందంగా ఉందన్నారు. అయితే తమకు సహాయ సహకారాలు అందించేందుకు ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదన్నారు. కనీసం దహి హండీ నిర్వాహక మండళ్లు నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. తమ బృందం న్యూయార్క్ వెళ్లాలంటే సుమారు రూ.10 లక్షలు అవసరం ఉంటాయని ఆమె తెలిపారు. దహిహండీ సమన్వయ సమితి అధ్యక్షుడు బాలా పదాల్కర్ మాట్లాడుతూ బృందం అక్కడికి వెళ్లేందుకయ్యే ఖర్చును ఎవరైనా స్పాన్సర్ చేస్తే బాగుంటుందని తాము ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను, రాజకీయ నాయకులను కలిశామని కాని ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఈ బృందానికి బీఎంసీ కనీసం రూ.రెండు లక్షలైనా సాయం చేయాలని స్వతంత్ర కార్పొరేటర్ విజయ్ తాండెల్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహిళా బృందానికి మేయర్ స్నేహల్ అంబేకర్, బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే సహాయం కూడా కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
స్పైడర్‌మ్యాన్ అరెస్ట్!
న్యూయార్క్: సినిమాలో అయితే ఎన్ని వేషాలు వేసినా కుదురుతుంది. స్పైడర్‌మ్యాన్ వేషం వేసి సినిమాలలో ఎలా చేసినా పరవాలేదు. పిల్లల నుంచి అందరూ చూస్తారు. ఆనందిస్తారు. అదే నిజజీవితంలో అయితే జైలు పాలు కావలసిందేనని న్యూయార్కులో జరిగిన ఓ సంఘటన రుజువు చేసింది. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్ ప్రాంతంలో జూనియర్ బిషప్ అనే 25 ఏళ్ల వ్యక్తి స్పైడర్మాన్ డ్రెస్ వేసుకుని పర్యాటకులను అకట్టుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. తనతో ఫొటోలు తీయించుకోవాలంటే 5 నుంచి 20 డాలర్ల వరకూ ఇచ్చుకోవాలని పర్యాటకులను ఆ స్పైడర్మాన్ డిమాండ్ చేస్తున్నాడు. వారిని ఇబ్బంది పెడుతున్నాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి జోక్యం చేసుకున్నారు. పర్యాటకులను వేధించవద్దని అతనికి సూచించారు. గుర్తింపు కార్డు అడిగితే ‘ఇది నీకు సంబంధించినది కాదు’ అని రెటమతంగా సమాదానం చెప్పాడు. అంతే కాకుండా వేషం వేసుకోగానే స్పైడర్మాన్ అయిపోయాననుకున్నాడో ఏమో అరెస్ట్ చేయబోయిన పోలీసుపై చేయి కూడా చేసుకున్నాడు. అంతదాక వచ్చిన తరువాత పోలీసులు ఊరుకుంటారా? ఓ పది మంది పోలీసులు వచ్చి అతనిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. వారికి ఎదురు తిరిగాడు. పోలీసులతో పెనుగులాడాడు. ఎట్టకేలకు పోలీసులు స్పైడర్మాన్ను కిందపడవేసి బేడీలు వేసి అరెస్ట్ చేశారు. -
టైమ్ స్క్వేర్స్ వద్ద 11 వేలమందితో యోగా
న్యూయార్క్: భారతీయ జీవన విధానంలో భాగమైన యోగాకు ఖండాంతరాలలోనూ ప్రాచుర్యం లభిస్తోంది. న్యూయార్క్ నగరంలో నిత్యం రద్దీగా టైమ్ స్క్వేర్‌లో 11 వేలమందికిపైగా యోగా చేశారు. శనివారం క్రాస్ రోడ్స్ వద్ద చాపలు వేసుకుని ఆసనాలు చేశారు. ఈ కార్యక్రమం చేయడం సాహసమని టైమ్స్ స్క్వేర్ అలియెన్స్ అధ్యక్షుడు టిమ్ టాంప్కిన్స్ అన్నారు. యోగా ప్రక్రియలో సూర్యుడిని ఆరాధించే దినమని 25 ఏళ్ల యోగా శిక్షకురాలు క్రిస్టీనా కీలుస్నియక్ అన్నారు. న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ అతిపెద్ద వాణిజ్య సముదాయం. -
కథ ముగిసిన చిత్రం..
రెండో ప్రపంచయుద్ధం ముగిసిన ఆనందంలో ముద్దుపెట్టుకుంటున్న అమెరికా సైనికుడు, నర్సు చిత్రమిది. ఆ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం చాలా ప్రాచుర్యం పొందింది. ఇందులోని నర్సు ఎడిత్ షేన్.. దాదాపు నాలుగేళ్ల కింద తన 91వ ఏట మరణించింది. ఆ సైనికుడు గ్లెన్ ఎడ్వర్డ్ మెక్‌డఫీ ఈ నెల 9న తన 86వ ఏట గుండెపోటుతో మరణించారు. అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్ ఆల్ఫ్రెడ్ ఐసెన్స్టాడిట్ తీసిన ఈ చిత్రం.. చాలా ఏళ్ల పాటు ఒక మిస్టరీగా నిలిచింది. అందులోని వ్యక్తులెవరనేదానిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది కూడా. 1970వ దశకంలో అందులోని నర్సు తానేనంటూ ఎడిత్ షేన్ బయటపెట్టగా.. తర్వాత చాలా కాలానికి మెక్‌డఫీ పేరు వెల్లడైంది. అసలు ఈ ఫొటో తీసిన నేపథ్యమూ విచిత్రమే. 1945 ఆగస్టు 14న అమెరికా, బ్రిటన్ తదితర మిత్రరాజ్యాల సేనలకు జపాన్ లొంగిపోవడంతో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. ‘వీ-జే డే (విక్టరీ ఆన్ జపాన్ డే)’గా పేర్కొనే ఆ రోజున అమెరికా న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రజలంతా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఆ ఆనందంలో మెక్‌డఫీ అక్కడ కనిపించిన చాలా మంది మహిళలను వరుసగా ముద్దుపెట్టుకున్నాడు. అలా ఎడిత్‌ను ముద్దుపెట్టుకుంటుండగా ఐసెన్స్టాడిట్ తన కెమెరాతో క్లిక్ మనిపించాడు. మరో విశేషం ఏమిటంటే.. ఈ ముద్దుకు ముందు ఎడిత్, మెక్డఫీలకు ఒకరికొకరికి అసలు పరిచయమే లేదు.. ఆ తర్వాతా కలవలేదు.. ఇక ఇప్పుడు వారిద్దరూ లేరు!