![Singer Sunitha Picture New York Times Square](/styles/webp/s3/article_images/2024/05/12/sunitha-birthday.jpg.webp?itok=NSfvvDgT)
టాలీవుడ్ లేడీ సింగర్స్ అనగానే కొన్నిపేర్లు గుర్తొస్తాయి. వాటిలో టాప్‌లో కచ్చితంగా సునీత పేరు ఉంటుంది. 'ఈ వేళలో నీవు' అనే పాటతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సునీత తన మధురమైన స్వరంతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)
సునీత పుట్టినరోజుని ఈమె అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సింగర్ సునీత ఫాన్స్.. న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో సునీత వీడియోను ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు అతికొద్ది మందికే ఈ అరుదైన అవకాశం లభించగా.. ఇప్పుడు సునీత కూడా ఆ జాబితాలో చేరారు.
పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు సునీత ఇప్పటి వరకు పొందిన అవార్డులతో పాటు ఆమె సాధించిన పురస్కారాలతో కూడిన వీడియోను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో ప్లే చేశారు. మే 12 తేదీన ప్రతి గంటకు 60సెకండ్ల పాటు ఈ వీడియో ప్రదర్శించడం విశేషం.
(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్)
Comments
Please login to add a commentAdd a comment