ప్రచారం కోసం నగ్నంగా చిందులు
న్యూయార్క్: స్వీడిష్ ఫోన్ కంపెనీ రెబ్టెల్ కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. భారత్కు అన్లిమిటెడ్ కాల్స్ను ఆఫర్ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఆఫర్ను ప్రమోట్ చేసుకోవడం కోసం వినూత్న మార్గం ఎంచుకుంది.
న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్లో నలుగురు మహిళలతో నగ్నంగా డాన్స్ చేయించింది. బాలీవుడ్ పాపులర్ పాట చమ్మక్ చల్లో పాటకు వారు చిందేశారు. నగ్నంగా ఉన్న ఆ మహిళలు ఒంటికి పెయింట్ మాత్రం పూసుకున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చినా.. రెబ్టెల్ కంపెనీ మాత్రం సమర్థించుకుంది. మగవాళ్లకు, మహిళలకు సమాన హక్కులు ఉంటాయని పేర్కొంది. మార్కెట్ చేసుకోవడం కోసం మహిళలను శృంగారంగా చూపించడం కొత్త పద్ధతేమీ కాదని, ఎప్పటి నుంచో ఉందని ఆర్గనైజింగ్ సెక్రటరీ జొహన్నా డాహ్లిన్ చెప్పారు.