న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్​ బిల్డింగ్‌ వేదికగా ‘యాత్ర 2’ టీజర్‌ | yatra 2 teaser times square new york bill board | Sakshi
Sakshi News home page

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్​ బిల్డింగ్‌ వేదికగా ‘యాత్ర 2’ టీజర్‌

Published Wed, Jan 31 2024 2:54 PM | Last Updated on Wed, Jan 31 2024 3:21 PM

yatra 2 teaser times square new york bill board - Sakshi

యాత్ర’మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ టీజర్‌ను న్యూయార్క్‌లోని ప్రఖ్యాత  టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్​ బిల్డింగ్ వేదికగా ఈ మూవీ టీజర్‌ను చూపించారు. ఇప్పటివరకు అతి కొద్ది సినిమాలకే ఈ అరుదైన అవకాశం లభించగా.. ఇప్పుడు యాత్ర 2 మూవీ ఈ జాబితాలో చేరిపోయింది.  

మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రజా నాయ‌కుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం   రాబోతోంది.

ఇక ఈ టీజర్‌లో  'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్‌తో పాటు 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే సీన్స్..  గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement