విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్‌'.. అనిరుధ్ అదరగొట్టేశాడు! | Vijay Deverakonda Latest Movie Kingdom Teaser Original Sound Track | Sakshi
Sakshi News home page

Kingdom Teaser OST: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌.. ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ అదుర్స్!

Published Mon, Mar 17 2025 9:01 PM | Last Updated on Mon, Mar 17 2025 9:02 PM

Vijay Deverakonda Latest Movie Kingdom Teaser Original Sound Track

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్‌ 'కింగ్‌డమ్‌'. ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.  గతనెల ఫిబ్రవరిలో సినిమా టీజర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌ సాధించింది. ఈ టీజర్‌కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడం టీజర్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేసింది.

తాజాగా ఈ మూవీ టీజర్‌కు సంబంధించిన ఫ్యాన్స్‌కు మరో ట్రీట్ ఇచ్చారు. కింగ్‌డమ్‌ టీజర్‌ ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను తాజాగా విడుదల చేశారు. నిమిషం 30 సెకన్ల పాటు ఉన్న ఈ సాండ్‌ ట్రాక్‌ ‍అద్భుతందా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ బీజీఎం అదిరిపోయిందంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా..  ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవిలో మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.  ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తోన్న సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement