Anirudh Ravi Chander
-
రజినీకాంత్ లేటేస్ట్ మూవీ .. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కోలీవుడ్ సూపర్‌స్టార్, తలైవా రజినీకాంత్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. వచ్చేనెల 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండండతో మేకర్స్ దూకుడు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. మనసిలాయో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. తాజాగా రిలీజైన లిరికల్ సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.తలైవా కోసం తప్పుకున్న కంగువా..తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ దసరాకు ఊహించని విధంగా సూపర్ స్టార్ రజినీకాంత్ రేసులోకి రావడంతో కంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంగువా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఓ ఈవెంట్లో సూర్య అధికారికంగా ప్రకటించారు. -
కమల్ హాసన్ పాడిన పాట విన్నారా !
Kamal Haasan Vikram Telugu Version First Lyrical Mathuga Mathuga Released: సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై తన నట విశ్వరూపాన్ని చూపేందుకు రెడీ అయ్యాడు కమల్ హాసన్. యూనివర్సల్ హీరో కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విక్రమ్. అలాగే సూర్య అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు లోకేష్ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్‌పై నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'విక్రమ్' తెలుగు వెర్షన్ నుంచి మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'మత్తుగా మత్తుగా' అంటూ సాగే ఈ పాటను కమల్ హాసన్ ఆలపించడం విశేషం. చంద్రబోస్ లిరిక్స్ అందించారు. కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ 'రా' ఏజెంట్‌గా అలరించనున్నారని సమాచారం. చదవండి: మెటావర్స్ వెర్షన్లో 'విక్రమ్'.. తొలి మూవీగా రికార్డ్ -
రెండు గంటల్లో పాట రాసిన కమల్
-
అనిరుధ్ ఔట్... మిక్కీ జె. మేయర్ ఇన్!
‘వై దిస్ కొలవెరి డీ’ (ఎందుకింత పగ అని స్థూలంగా అర్థం) పాటతో సంచలనం రేపిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. మొన్నటి దాకా క్రేజీ యువ దర్శకుడిగా పేరున్న పాతికేళ్ళ అనిరుధ్‌కు ఇటీవల మాత్రం టైమ్ బాగున్నట్లు లేదు. తమిళనాట ‘బీప్ సాంగ్’తో ఇటీవల వివాదానికి కేంద్రమయ్యారు. అమ్మాయిల్ని ఆడిపోసుకునే మాటలను ‘బీప్ సౌండ్’ ద్వారా చెప్పకుండానే చెబుతూ, హీరో శింబు పాడిన పాట ఇంటర్నెట్లో లీకై, మొన్న డిసెం బర్లో కథ కేసులు, కోర్టుల దాకా వెళ్ళింది. శింబు పాడిన ఆ ‘‘ప్రైవేట్’’ బీప్‌సాంగ్ అనిరుధ్ రూపొందించినదే అని కథనం. తాజాగా ఆయన మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అ...ఆ (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి)’ చిత్రం నుంచి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ను పక్కకు తప్పించారు. ఒక పక్క ‘బీప్‌సాంగ్’ వివాదం, మరో పక్క ఇప్పటికే ఒప్పుకొన్న స్టేజ్ షోలు, చేతిలో ఉన్న తమిళ ప్రాజెక్ట్స్‌తో అనిరుధ్ ‘అ...ఆ...’ చిత్రంపై ఇప్పటి వరకు దృష్టి పెట్టనేలేదని చెన్నై సమాచారం. సమ్మర్ రిలీజ్ ప్లాన్‌తో, హైదరాబాద్ పరిసరాల్లో శరవేగంతో షూటింగ్ జరుపుకొంటున్న ‘అ..ఆ’ చిత్ర యూనిట్‌కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటి దాకా సహనంతో భరించిన యూనిట్ ఇక లాభం లేదని ప్రత్యామ్నాయం ఆలోచించింది. ఫలితంగా అనిరుధ్ స్థానంలో మిక్కీ జె. మేయర్‌కు మ్యూజిక్ డెరైక్షన్ చాన్స్ దక్కింది. ‘హ్యాపీ డేస్’ మొదలు పలు హిట్ చిత్రాలకు బాణీలు కూర్చిన మిక్కీ తాజాగా మహేశ్‌బాబు ‘బ్రహ్మో త్సవం’కి సంగీతమిస్తున్నారు. ఇప్పుడిలా అనుకోకుండా త్రివిక్రమ్ లాంటి దర్శకుడి చిత్రానికి స్వరాలు కూర్చే అవకాశం మిక్కీకి దక్కింది. తెలుగు సినిమాలపై... ‘వై దిస్ కొలవెరి డీ’! సహజంగానే ఈ వార్త సినీవర్గాల్లో సంచలన మైంది. రజనీకాంత్‌కు బంధువూ, ధనుష్, ఆయన భార్య ఐశ్వర్యా ధనుష్‌ల ఆశీస్సులు పుష్కలంగా అనిరుధ్ గతంలోనూ తెలుగు సినిమాల విషయంలో ఇలానే వ్యవహరించారని కృష్ణానగర్ వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శక త్వంలో వచ్చిన ‘బ్రూస్లీ’కి మొదట అనిరుధ్‌నే తీసు కున్నారు. ఆ సినిమాతో తెలుగులో స్వరంగేట్రం చేయాల్సిన మనవాడు తీరా, అజిత్ హీరోగా తమిళ ‘వేదాళమ్’ ఆఫర్ రావడంతో ‘బ్రూస్ లీ’ని అర్ధంతరంగా వదిలేశాడు. దర్శక - నిర్మాతలకు చుక్కలు చూపించాడు. ఫలితంగా, ‘బ్రూస్లీ’ బృందం తమన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ‘అ...ఆ’కు అలాంటి పరిస్థితే వచ్చింది. చిత్రమేమి టంటే, ‘అ..ఆ’ యూనిట్ మొదట ఎంచుకొన్న ఆర్ట్ డెరైక్టర్ రాజీవన్ కానీ, ఇప్పుడు అనిరుధ్ కానీ ఇద్దరూ ప్రొఫెషనలిజమ్‌ను విస్మరించి, తమ విధులు సరిగ్గా నిర్వర్తించకపోవడం, సరైన టైమ్‌లో స్పందించక పోవడం! ఫలితంగా ఇద్దరినీ ‘అ...ఆ’ నుంచి పక్కకు తప్పించాల్సి వచ్చింది. వాళ్ళ అన్ప్రొఫెషనలిజమ్ వాళ్ళపై ఏ మేరకు ప్రభావం చూపిందో కానీ, ఇక్కడి దర్శకనిర్మాతలకు డబ్బు, కాలం వృథా కదా! -
ఆ విషయం ఇప్పుడే చెప్పలేను: ధనుష్
తిరుమల: ప్రముఖ హిందీ నటుడు అమితాబ్‌బచ్చన్‌తో తాను నటిస్తున్న చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుందని తమిళ సినీ హీరో ధనుష్ తెలిపారు. ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తున్నట్లు వివరించారు. తెలుగులో మంచి కథ కోసం ఎదురుచూస్తున్నానన్నారు. తమ మామగారు రజనీకాంత్ తో కలిసి నటించే విషయం ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. అన్నీ కుదిరితే ఆయనతో కలిసి నటించేందుకు తనకెటువంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. తన భార్య ఐశ్వర్యతో కలిసి ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల వేంకటేశ్వరస్వామిని ధనుష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వీరితోపాటు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కూడా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సినీ నటి ప్రణీత కూడా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.