Kamal Haasan Vikram Movie Telugu Version Mathuga Mathuga Song Lyrical Video Released - Sakshi
Sakshi News home page

Kamal Haasan Vikram Movie: 'మత్తుగా మత్తుగా' ఉందంటున్న కమల్‌ హాసన్‌..

Published Fri, May 27 2022 3:47 PM | Last Updated on Fri, May 27 2022 5:56 PM

Kamal Haasan Vikram Telugu Version First Lyrical Mathuga Mathuga Released - Sakshi

Kamal Haasan Vikram Telugu Version First Lyrical Mathuga Mathuga Released: సుమారు నాలుగేళ్ల తర్వాత వెండితెరపై తన నట విశ్వరూపాన్ని చూపేందుకు రెడీ అయ్యాడు కమల్‌ హాసన్. యూనివర్సల్‌ హీరో కమల్‌, విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం విక్రమ్. అలాగే సూర్య అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకు లోకేష్‌ కనగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌పై కమల్‌ హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మించిన ఈ మూవీ జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రేష్ట్‌ మూవీస్‌పై నిర్మాత సుధాకర్‌ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా 'విక్రమ్‌' తెలుగు వెర్షన్‌ నుంచి మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. 'మత్తుగా మత్తుగా' అంటూ సాగే ఈ పాటను కమల్‌ హాసన్‌ ఆలపించడం విశేషం. చంద్రబోస్‌ లిరిక్స్ అందించారు. కోలీవుడ్‌ సెన్సేషనల్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ స్వరాలు సమకూర్చారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ 'రా' ఏజెంట్‌గా అలరించనున్నారని సమాచారం. 

చదవండి: మెటావర్స్‌ వెర్షన్‌లో 'విక్రమ్‌'.. తొలి మూవీగా రికార్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement