రజినీకాంత్ లేటేస్ట్‌ మూవీ .. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది! | Super Star Rajinikanth Latest Movie Vettaiyan Lyrical Song Out Now | Sakshi
Sakshi News home page

Vettaiyan: దసరా బరిలో వెట్టైయాన్.. లిరికల్ సాంగ్‌ రిలీజ్

Published Mon, Sep 9 2024 6:46 PM | Last Updated on Mon, Sep 9 2024 6:48 PM

Super Star Rajinikanth Latest Movie Vettaiyan Lyrical Song Out Now

కోలీవుడ్ సూపర్‌స్టార్‌, తలైవా రజినీకాంత్‌ ప్రస్తుతం వెట్టైయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా బరిలో నిలిచింది. వచ్చేనెల 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండండతో మేకర్స్ దూకుడు పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్‌ రిలీజ్ చేశారు. మనసిలాయో అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. తాజాగా రిలీజైన లిరికల్ సాంగ్ తలైవా ఫ్యాన్స్‌ను ఓ ఊపు ఊపేస్తోంది.

తలైవా కోసం తప్పుకున్న కంగువా..

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తోన్న భారీ యాక్షన్‌ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో  ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్‌ సంస్థలు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్‌ చేశారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ దసరాకు ఊహించని విధంగా సూపర్ స్టార్‌ రజినీకాంత్‌  రేసులోకి రావడంతో కంగువా మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కంగువా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఓ ఈవెంట్‌లో సూర్య అధికారికంగా ప్రకటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement