'యాత్ర 2' సినిమా టీజర్ వచ్చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. అయితే ఏయే సంఘటనల ఆధారంగా తీశారనేది మొన్నటివరకు కాస్త సందేహం ఉండేది. తాజాగా వచ్చిన టీజర్‌తో సినిమాపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అలానే అంచనాలు కూడా పెరిగిపోయాయి.
టీజర్‌లో ఏముంది?
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి (మమ్ముట్టి) కొడుకుగా వై.ఎస్.జగన్ (జీవా) రాజకీయాల్లోకి రావటానికి కారణమేంటనే అంశాన్ని చిన్నహార్ట్ టచింగ్ సన్నివేశంతో చూపించారు. అలానే తండ్రి లాంటి నాయకుడిని కోల్పోయినప్పుడు వారిని ఓదార్చటానికి ఓదార్పు యాత్ర చేద్దామంటే నాటి రాజకీయ నాయకులు ఎలాంటి అడ్డంకులు సృష్టించారనే విషయాన్ని కూడా చూపించే ప్రయత్నం చేశారు. ఆ అడ్డంకులని జగన్ ఎలా అధిగమించారు? తిరుగులేని ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారనేదే 'యాత్ర 2' సినిమా.
(ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)
గూస్‌బంప్స్ సీన్స్
ఈ టీజర్‌లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్.. 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే మరో సీన్.. 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా 'యాత్ర 2' సినిమా తీశారు డైరెక్టర్ మహి వి రాఘవ. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
(ఇదీ చదవండి: OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!)
Comments
Please login to add a commentAdd a comment