యాత్ర-2 నుంచి ఎమోషనల్‌ సాంగ్‌ రిలీజ్‌ | Yatra 2 Movie Makers Released 'Choodu Nanna' Video Song | Sakshi
Sakshi News home page

యాత్ర-2 నుంచి ఎమోషనల్‌ సాంగ్‌ రిలీజ్‌

Published Fri, Jan 19 2024 11:56 AM | Last Updated on Fri, Jan 19 2024 12:07 PM

Yatra 2 Movie Makers Released Video Song - Sakshi

యాత్ర -2 నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'చూడు నాన్న' వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది.  వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది.

తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. 'చూడు నాన్న' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్‌ నారాయణన్‌  ఎమోషన్స్‌తో కూడిన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారి పాత్రలో జీవా తనదైన నటనతో మెప్పించారు.

ఓదార‍్పు యాత్రలో భాగంగా ఈపాట ఉండటంతో అందరినీ మెప్పిస్తుంది. తండ్రి మరణంతో మొదటిసారి ప్రజల్లో అడుగుపెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని చూసేందుకే వేలాదిగా జనాలు వచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను పాటలో చూపించారు డైరెక్టర్‌ మహి వి రాఘవ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement