mahi v raghav
-
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్!
మహి వీ రాఘవ్ డైరెక్షన్లో వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్-2. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు ఇండియాలోనే టాప్-3 ప్లేస్ దక్కించుకుంది. ఓటీటీల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన జాబితాలో టాప్-3లో నిలిచింది. ఈ విజయం పట్ల మహి వి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను మీరంతా ఆదరించి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి విజయాలను సాధిస్తాయని మరోసారి రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది’’ అని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సేవ్ ది టైగర్ రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతోసీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైయాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్- 3 సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ కోరింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని పేర్కొన్నారు. -
సేవ్ ది టైగర్స్ సీజన్-2.. అది చెప్పేందుకు ప్రయత్నిస్తా : మహి వి రాఘవ్
ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సీజన్-1కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వతా వచ్చిన సైతాన్ సైతం సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆయన సేవ్ ది టైగర్ సీజన్ -2 ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సేవ్ ది టైగర్స్ సీజన్- 1, సైతాన్ సూపర్ హిట్, సేవ్ ది టైగర్స్ సీజన్ -2 సక్సెస్‌తో హ్యాట్రిన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఓటీటీలో హ్యాట్రిక్ విజయంపై మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. 'ఇంత మంచి విజయాలు అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించారు. దీంతో ఎంటర్టైన్మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి నేను ప్రయత్నిస్తా. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని అన్నారు. వెబ్ సిరీస్ గురించి చెబుతూ.. 'సేవ్ ది టైగర్స్ సీజన్- 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే.. సీజన్- 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్- 2పై కాస్త ఒత్తిడిగా ఫీలయ్యా. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. అలాగే సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే మరికొన్ని వెబ్ సిరీస్‌లతో మీ ముందుకు వస్తా' అని అన్నారు. -
Save The Tigers 2 Review: సేవ్ ద టైగర్స్ 2.. ఎలా ఉందంటే?
వెబ్ సిరీస్ రివ్యూ: సేవ్ ద టైగర్స్ 2 నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు క్రియేటర్స్: మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం రైటర్స్ : ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్ ఆనంద్ కార్తీక్ దర్శకత్వం : అరుణ్ కొత్తపల్లి క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం సంగీతం : అజయ్ అరసద ఎడిటర్ : శ్రవణ్ కటికనేని విడుదల తేది: మార్చి 15, 2024 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్సే కానీ కామెడీ జాడేది అనుకుంటున్న తరుణంలో సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ రిలీజైంది. గతేడాది హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. భార్యా బాధితులుగా హీరోలు పడే అగచాట్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. ఈ హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా తాజాగా సేవ్ ద టైగర్స్ 2 విడుదలైంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం... కథ హీరోయిన్ హంసలేఖ(సీరత్ కపూర్) మిస్ అవడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. తను ఏమైందన్న ఆందోళనతో రెండో సీజన్ కథ మొదలవుతుంది. హంసలేఖ ఎక్కడ? అని పోలీసులు విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను ప్రశ్నిస్తారు. తమకు తెలియదు మహాప్రభో అని మొర పెట్టుకున్నా సరే.. పోలీసులు లెక్క చేయకుండా ముగ్గురికీ లాఠీదెబ్బల రుచి చూపిస్తారు. మరోవైపు మీడియాలో హంసలేఖను ఈ ముగ్గురూ పార్టీ నుంచి తీసుకెళ్లిన వీడియో చూపించి ఏకంగా ఆమెను హత్య చేశారంటూ కథనాలు ప్రసారం చేస్తారు. ఇంతలో హంసలేఖ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముగ్గురినీ పోలీసులు వదిలేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఏం జరిగింది? ఆ ముగ్గురి భార్యలు స్పంద కౌన్సిలర్ (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకెళ్లారు? రాహుల్, అతడి భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మధ్య దూరిన మూడో వ్యక్తి హారిక (దర్శనా బానిక్) ఎవరు? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలన్న రవి భార్య హైమావతి(జోర్దార్ సుజాత) కల నెరవేరిందా? విక్రమ్ భార్య రేఖ (దేవయాని శర్మ) లాయర్ ప్రాక్టీస్ ఎందుకు ఆపేయాలనుకుంది? మూడు జంటల మధ్య మళ్లీ గొడవలు ముదరడానికి కారణమేంటి? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ మొదటి సీజన్‌లాగే ఈ సీజన్లోనూ కామెడీకి కొదవలేదు. కామెడీతో పాటు ఓ సందేశాన్ని జోడించారు. కళ్లతో చూసే ప్రతీది నిజం కాదని నొక్కి చెప్పారు. చూసిన ప్రతీది నిజమని గుడ్డిగా నమ్మేసి ఓ అభిప్రాయానికి రాకూడదని, ఏది నిజం? ఏది అబద్ధం? అనేది మనమే తెలుసుకోవాలని మహి వి రాఘవ్ మెదడుకు ఎక్కేలా చెప్పాడు. ఈ విషయంలో మహిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే! మహి క్రియషన్స్, అరుణ్ డైరెక్షన్ ఎక్కడా సింక్ మిస్ అయినట్లు అనిపించదు. సిరీస్ నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. కథకు తగ్గట్టుగా అజయ్ అరసద సంగీతం అందించాడు. ఎవరెలా చేశారంటే? ఈ సిరీస్‌లో ఎవరి నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. ప్రియదర్శి, అభినవ్, చైతన్య బాగా నటించారు. సుజాత, దేవయాని, పావని వారితో పోటీపడి నటించినట్లు అనిపించినా మగజాతి ఆణిముణ్యాలదే ఇక్కడ పైచేయి అని చెప్పాలి. ముఖ్యంగా ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కూతురు పెద్దమనిషి అయ్యాక ఆమెతో మాట్లాడిన సీన్.. ఆ అమ్మాయి స్కూల్లో తన గురించి మాట్లాడేటప్పుడు అతడు భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల్లో ప్రియదర్శి చింపేశాడు. గంగవ్వ, అవినాష్, , వేణు.. తమ పాత్రల పరిధిమేర నటించారు. పనిమనిషితో పెట్టుకుంటే మడతెడిపోద్ది అనే రీతిలో రోహిణి మరోసారి ఫుల్‌గా నవ్వించింది. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఓపక్క నవ్విస్తూనే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తుందీ సిరీస్. తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఏడిపిస్తుంది. వీకెండ్లో హ్యాపీగా చూసేయొచ్చు. -
ఓటీటీలోకి తెలుగు హిట్ సిరీస్ రెండో సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగు క్రేజీ వెబ్ సిరీస్... మరోసారి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. గతేడాది తొలి సీజన్ తో ఆకట్టుకోగా.. ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత నవ్వించేందుకు సిద్ధమైపోయారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన టీమ్.. అలానే రెండో సీజన్ స్ట్రీమింగ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఓటీటీల వరకు తెలుగులో పలు సినిమాలు వచ్చాయి. కానీ స్ట్రెయిట్ తెలుగు వెబ్ సిరీసులు చాలా తక్కువే వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో 'సేవ్ ద టైగర్స్' ఒకటి. భార్య-భర్తలు.. వాళ్ల మధ్య ఉండే ప్రాబ్లమ్స్, తద్వారా వచ్చే ఫన్ తదితర అంశాలతో ఈ సిరీస్ తీశారు. పెద్దగా అంచనాల్లేకుండా గతేడాది రిలీజైన ఈ సిరీస్ హిట్ అయింది. మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం రూపొందించిన 'సేవ్ ద టైగర్స్' రెండో సీజన్ మార్చి 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇందులో హంసలేఖ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ముగ్గురు భర్తలు ఇరుక్కోవడం అనే కాన్సెప్ట్ చూపించారు. ఇంతకీ హంసలేఖ ఎవరు? ఆమెతో వీళ్ల ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీసిందనేది రెండో సీజన్ స్టోరీ. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
ఇలా చూడు మహీ.. ఎర్ర డైరీలో పేరు రాసుకోమంటావా?
ప్రియమైన రాఘవా.! రెండు సినిమాలు తీసినావో లేదో... రాజకీయాలన్నీ ఒంటబట్టేశాయని అనుకోబాకు సామి. కొంచెం టైమిస్తేనే అన్నీ అర్థమవుతాయి! ఇలా చూడు మహీ... ముందు మేము రామరావులో దేవుడిని చూపించాం... వాటాల్లో తేడాలొచ్చాయో లేదో... అదే పెద్దమడిసిని కామారావును చేసేశాం.. డ్రామారావునూ చూపించి.. చెప్పులేయించి మరీ కుర్చీ లాగేశాం. ఈ వ్యవహారాన్ని కాస్తా... మావోళ్లు అదేనబ్బీ ఆనాటోళ్లు ఉన్నారు కదా.. ఆళ్ల సాయంతో లోకకళ్యాణంగానూ జనాలకు చూపించేశాము. దీందేముందిగానీ.. దీనికంటే ముందు.. మన బెజవాడలోనే కదూ... ఆ నేతను లేపేసింది? కొంటా పెడతా ఉంటే అదేదో నేస్తమంటారు.. మాదీ అంతే.. ఉంటే మాతో ఉండాలి.. లేదంటే అస్సలు ఉండకూడదు! అదీ లెక్క! కాదూ కూడదని ఎవరైనా కాలరేగరేశారా? కాలంలో కలిసిపోయారు. ఏ రావయినా.. ఏ రెడ్డయినా.., ఇంకెవరయినా.. ఇప్పుడు నువ్వయినా సరే... మా దారికి రావాల్సిందే.. లేదంటావా? నీ ఇష్టం. చూసుకో మరి! నిత్యం ఉషోదయంతో ఉదయించేది మేమనుకున్న సత్యమే! తిమ్మిని బమ్మి అంటాం. నమ్మితే సరేసరి.. కాదంటే అంతే సంగతి! సినిమాలైనా... మీడియా అయినా సరే.. అందరూ మా పాటే పాడాలి. మేం చెప్పినట్లే ఆడాలి. కాదు కూడదంటే....అను‘కుల’ పత్రికలతో కాటేయిస్తాం. అప్పుడెప్పుడో ఓ దర్శకరత్నం ఎగిరెగిరి పడ్డాడు... ‘ఉదయం’తో మొదలైన హడావుడి సాయంత్రానికే సద్దుమణిగేలా చేశాం. ఇంకొకాయన... సమాజం సమాజం... న్యాయం న్యాయం అంటూ గొంతు చించుకున్నాడు. చివరికి ఏమైంది? రాజకీయానికి బ్రేక్ పడింది. సినిమా మాత్రమే దిక్కయింది! అంచేత ఏతావాతా మేము సెప్పొచ్చేదేటంటే... మాకు రాజకీయ ప్రత్యర్ధులైతే చాలు.. సొంతోళ్లనూ వదలం.. ఇతరులనూ వదలం. విషం కక్కడం మా నైజం కదా... సదా కక్కుతూనే ఉంటాం. మా ఫిలాసఫీ నీకు నచ్చేస్తే.. చేతులు కలిపేయి! కళాపోషణ ఎలాగూ చేసుకోవచ్చు. అదనంగా మా భ్రమరావతిలో ఓ కాలనీ పడేస్తాం! కాదూ కూడదంటావా? మా పెన్నుల్లో ఇంకు వాడకం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం. రాజకీయ పార్టీలు పెట్టినా, విద్యా సంస్దలు నడిపినా, ఆసుపత్రులు నడిపినా, జనం భూములు లాక్కుని ఫిల్మ్ సిటీలు కట్టినా, మా విష ప్రచారం కోసం పత్రికలు నడిపినా , చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి చట్టాలు ఉల్లంఘించినా, పచ్చళ్లు , పాల యాపారాలు ...ఇలా ఏది చేసినా మా వాడే చెయ్యాలి. ఇది మేము పెట్టుకున్న రూలు. కాదంటే..! తెలుసు కదా.. స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో.? ఉదాహరణకు .... మా కులపోడు బికినీ ఉత్సవాలు నిర్వహించాలని చూస్తే... అబ్బో బ్రహ్మాండం , భజగోవిందమని జాకీలెట్టి లేపుతాం. వేరేవాడు పోర్టులు , హార్బర్లు , మెడికల్ కాలేజీలు కడితే.... అమ్మో రాష్ట్రం దివాళా తీస్తుందని , సర్వనాశనమైపోతుందని విషం కక్కుతాం, అదే నిజమని నమ్మేలా ప్రచారం చేస్తాం. అనకాపల్లి నుంచి అమెరికా దాకా, నంద్యాల నుంచి న్యూజిలాండ్ దాకా దానికి సపోర్టుగా ట్వీట్లు వేస్తాం. ఇప్పటికైనా అర్ధమయ్యిందా ? లేక ఎర్ర డైరీలో పేరు రాసుకోమంటావా? -మీ డ్రామోజీ నాయుడు -
స్టూడియోకి స్థలం కేటాయింపు.. మహి వి.రాఘవ్ స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ డైరెక్టర్ మహి వి.రాఘవ్ ఇటీవలే యాత్ర-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈనెల 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహి వి.రాఘవ్ తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నా ప్రాంతం కోసమే నా వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో కేవలం రెండు ఎకరాల భూమిలోనే మిని స్టూడియో నిర్మించాలనుకుంటున్నట్లు మహి తెలిపారు. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరని అన్నారు. ఓ వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చినవారికి ఎవరెవరికో ఎక్కడెక్కడో భూములు ఇచ్చిందని.. వాటి గురించి ఎవరూ మాట్లాడరని ఆయన మండిపడ్డారు. నా ప్రాంతం కోసం కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలనుకుంటే దీనిపై పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మహి వి.రాఘవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశయం లేకపోతే.. నేను హైదరాబాద్‌లోనో.. వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగేవాణ్ని కదా అని మహి ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలోనే ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటానని వివరించారు. నేను రాయలసీమ ప్రాంతంలోని మదనపల్లిలోనే పుట్టి పెరిగా.. అక్కడే చదువుకున్నా.. అందుకే నా ప్రాంతం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆశయంతోనే ముందుకెళ్తునన్నారు. రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నానని.. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. నా సినిమాలు పాఠశాల, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయలసీమలోనే చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది? నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నా. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నా. సొంతంగా రెండు నిర్మాణ సంస్థలను స్థాపించా. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఇష్టపడరు. నా ప్రాజెక్ట్స్ రాయలసీమలోనే చిత్రీకరించా. ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది అనే మూడు ప్రాజెక్ట్స్‌ను మదనపల్లి, కడప ప్రాంతాల్లో రూపొందించాం. వాటి కోసం దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయల ఖర్చు చేశా' అని తెలిపారు. నా ప్రాంతం కోసమే నా తపన.. అనంతరం మాట్లాడుతూ.. 'నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేదన్నారు. మదనపల్లిలో సినిమాలు చేయటం వల్ల స్థానిక హోటల్స్, లాడ్జీలు, భోజనాలు, జూనియర్స్‌కు ఉపయోగపడుతుందని భావించా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా. బుద్ధి ఉన్నోడెవడైనా దీని గురించి ఆలోచించాలి. నా స్టూడియో నిర్మాణం కోసం యాభై, వంద ఎకరాలు అడగలేదు. కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా. రాయలసీమకు ఎవరైనా ఏమైనా చేశారా! మీరు చేయరు... చేసేవాడిని చెయ్యనియ్యరు. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించలేదు. వాళ్ల ప్రియమైన ప్రభుత్వం ఎవరెవరికీ భూములను ఎక్కడెక్కడో ఇచ్చింది. వీటి గురించి ఎవరూ మాట్లాడరు. నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు' అని మహి వి.రాఘవ్ మండిపడ్డారు. -
యాత్ర- 2 నుంచి సాంగ్.. సీఎం జగన్ పాదయాత్రను మరోసారి చూసేయండి
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. 2019లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా కొనసాగుతుంది. స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఒక పొలిటికల్ బయోపిక్కు రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఈ సినిమాలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి పాత్రలు కనిపించడంతో అందరూ థియేటర్లకు వెళ్తున్నారు. తమ కళ్ల ముందు జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా తీశారని ప్రేక్షకులు తెలుపుతున్నారు. యాత్ర 2లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను రియల్స్టిక్గా డైరెక్టర్ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'భగ భగ మండే సూర్యుడు రా..' అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 10 ఏళ్ల పాటు ప్రజల్లో తిరిగారు. ఆయన కొనసాగించిన పాదయాత్రలో లక్షలాదిమంది ప్రజలు భాగం అయ్యారు. వాటిలోని కొన్ని విజువల్స్ ఈ పాటలో కనిపిస్తాయి. మరోకసారి వాటిని చూసిన అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. -
యాత్ర 2.. ప్రేక్షకులు మెచ్చారు: దర్శకుడు
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సినిమా యాత్ర. 2019లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన యాత్ర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ స్పందన లభిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అందరికీ కృతజ్ఞతలు శుక్రవారం నాడు హైదరాబాద్‌లో యాత్ర 2 సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. ఈ మూవీ నచ్చిన వాళ్లకు, నచ్చని వాళ్లకు.. అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఎవరి అభిప్రాయాలు వారివని, తనకు అనిపించింది చెప్పానన్నాడు. ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ మాత్రం బాగుందన్నాడు. యాత్ర 2 కమర్షియల్ ఫిలిం కాదని మరోసారి నొక్కి చెప్పాడు. (యాత్ర 2 సినిమా రివ్యూ) అప్పుడే అనుకున్నా ఈ చిత్రం కోసం పని చేసిన టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలియాజేశాడు. నిజానికి ఈ మూవీ చేయాలని 2019లోనే అనుకోగా.. ఇన్నాళ్లకు అది కార్యరూపం దాల్చిందన్నాడు. ప్రస్తుతానికైతే యాత్ర 3 గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదని తెలిపాడు. కాగా యాత్ర 2లో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాత్రలో జీవా నటించారు. వైఎస్ భారతిగా కేతకి నారాయణ్ పాత్రలో ఒదిగిపోయారు. చదవండి: 'హనుమాన్' రెమ్యునరేషన్ విషయంలో గొడవలు.. ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్ -
మహానేత వైఎస్ఆర్, వైఎస్ జగన్‌లపై రూపొందిన బయోపిక్
-
Yatra 2 Movie Reveiw: యాత్ర 2 రివ్యూ
టైటిల్:యాత్ర 2 నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకి నారాయణ్,సుజానే బెర్నెర్ట్, మహేష్ మంజ్రేకర్, శుభలేక సుధాకర్ తదితరులు నిర్మాణ సంస్థ: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ నిర్మాత: శివ మేక రచన-దర్శకత్వం: మహి వి. రాఘవ్ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ:మది విడుదల తేది: ఫిబ్రవరి 8, 2024 దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్ ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఐదేళ్ల క్రితం (2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ యాత్ర 2. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది. భారీ అంచనాల మధ్య నేడు (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర 2 మూవీ ఎలా ఉందో చూద్దాం. కథేంటంటే.. యాత్ర 2 ఈవెంట్ బేస్డ్ బయోపిక్. వైఎస్సార్ మరణం అనంతరం, ఆయన తనయుడు, వైఎస్. జగన్మోహన్రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు.. ఆ పాదయాత్ర చేపట్టడానికి ఆయనని ప్రేరేపించిన సంఘటనలు, ఆ పాదయాత్ర కారణంగా ప్రజల కష్టాలని స్వయంగా తెలుసుకున్న ఉదంతాల సమాహారమే ‘యాత్ర 2’ కథ. వైఎస్సార్ మరణం (2009) తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు.. తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్థులు చేసిన కుట్రలు.. వాటన్నింటిని ఎదుర్కొన్ని వైఎస్ జగన్ ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగారనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. ఇది వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డిల కథ కాదు..వారి వ్యక్తిత్వానికి సంబంధించిన స్టోరీ. వైఎస్సార్ రాజకీయం ఎలా ఉంటుంది? ఆయనను నమ్ముకున్న వాళ్ల కోసం ఎలాంటి భరోసా ఇస్తారు? అనేది ‘యాత్ర’లో చూపించిన మహి వి రాఘవ్.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యక్తిత్వం ఏంటి? తండ్రి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆయన పడిన కష్టాలేంటి? అదిష్టానం వద్దని చెప్పినా..తనను నమ్ముకున్న ప్రజల కోసం అండగా ఉండేందుకు జగన్ చేపట్టిన పాదయాత్ర.. వైఎస్సార్సీపీ పార్టీ స్థాపించడానికి గల కారణం.. ప్రత్యర్థులంతా ఒక్కటైనా భయపడకుండా నిలబడి, ప్రజా నాయకుడిగా ఎలా ఎదగగలిగాడు? అనేది యాత్ర 2లో చూపించాడు. వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర గురించి అందరికి తెలిసిందే.. అయితే ఆ యాత్ర చేపట్టడానికి గల ప్రధాన కారణం.. ఆ సమయంలో ఆయనకు ఎదురైన సంఘటనలు ఏంటి అనేది చాలా ఎమోషనల్‌గా చూపించాడు డైరెక్టర్ మహి. ఎమోషన్స్ ఎంత పండించాలి? ఎలాంటి సన్నివేశాలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతారనేది లెక్కలేసుకొని మరీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు మహి. రెగ్యులర్ బయోపిక్‌లా కేవలం కథను మాత్రమే చెప్పకుండా.. ప్రతి సన్నివేశాన్ని ఎమోషనల్‌గా చూపిస్తూ ప్రేక్షకులు కథలో లీనమయ్యేలా చేశాడు. 2009 నుంచి 2014 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలతో వైఎస్ జగన్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా వైఎస్ జగన్ పోటీ చేస్తున్నట్లు వైఎస్సార్ ప్రకటించే సన్నివేశంలో ‘యాత్ర 2’కథ ప్రారంభం అవుతుంది. రెండోసారి వైఎస్సార్ సీఎం అవ్వడం.. రచ్చబండ కోసం వెళ్తూ మరణించండం కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అక్కడ నుంచి ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ప్రజల కోసం జగన్ అదిష్టానాన్ని ఎదిరించిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ భారీ మెజార్టీతో గెలిచిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆయన్ను ఓడించేందుకు చంద్రబాబు చేసిన కుట్రలు ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక సెకండాఫ్ అంతా 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఏపీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సాగుతుంది. 2014 ఎన్నికల సమయంలో ఓడిపోయినా పర్లేదు కానీ రుణమాఫీ చేస్తానని అబద్దపు హామీ ఇవ్వలేనని జగన్ చెప్పే మాటలు అందరిని ఆకట్టుకుంటాయి. అధికార పార్టీ బెదిరింపులకు భయపడి వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా..జగన్ ధైర్యంతో పార్టీని నడిపించడం.. ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా కృష్ణా బ్రిడ్జిపైకి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడం.. తప్పుడు కేసులు పెట్టిన నందిగాం సురేశ్‌ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం..ఇవ్వన్నీ తెరపై చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఈ సినిమాలోని ప్రతి డైలాగు.. ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. వైఎస్ జగన్ ఎలాంటి వాడో డైలాగ్స్లతోనే తెలియజేశాడు మహి వి.రాఘవ్. ‘జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ అనే ఒకే ఒక్క డైలాగ్‌తో జగన్ వ్యక్తితం ఎలాంటిదో తెలియజేశాడు. ‘ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఆ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను’ అనే మాటల్లో జగన్ విశ్వసనీయత ఎంతటిదో అర్థమవుతుంది. 'నువ్వు మా వైఎస్సార్ కొడుకువన్న మాకు నాయకుడిగా నిలబడన్నా’ అంటూ ఓ అంధుడు చెప్పే మాటలు.. జగన్‌పై ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారనేది తెలియజేస్తుంది. ‘నేను విన్నాను-నేను ఉన్నాను' అంటూ జగన్ చెప్పే మాటలు ప్రజలకు ఆయనిచ్చిన భరోసాని తెలియజేస్తుంది. 'నాకు భయపడడం రాదయ్యా.. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వైఎస్సార్ కొడుకుని'అంటూ అసెంబ్లీ వార్నింగ్ ఇచ్చినప్పుడు జగన్ ధైర్యం ఎలాంటిదో అర్థమతుంది. చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తపని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తు పెట్టుకుంటే చాలన్న’ అనే మాటలు.. జగన్ ఆశయం ఏంటో తెలియజేస్తుంది. ‘పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పిల్లే...పులిని బోనులో పెట్టినా అది పులే’అంటూ వైఎస్ జగన్ గురించి ఓ సీనియర్ నేత చెప్పే డైలాగ్‌కి థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో కథంతా వైఎస్సార్, వైఎస్ జగన్ పాత్రల చుట్టే తిరుగుతుంది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి జీవించేశాడు. ఇక వైఎస్ జగన్‌గా జీవా అదరగొట్టేశాడు. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద వైఎస్ జగన్నే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు జీవా. వైఎస్ జగన్ హుందాతనం, రాజకీయం, తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెరపై అద్భుతంగా పండించాడు. వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీగా కేతకి నారాయణ్ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. తెరపై అచ్చం వైఎస్ భారతీలాగే కనిపించారు. సోనియా గాంధీ పాత్రలో సుజానే బెర్నెర్ట్ సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె సోనియా గాంధీని గుర్తు చేశారు.చంద్రబాబుగా మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ కీలక నేత రెడ్డిగా శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాకేంతిక పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణన్ అందించిన పాటలు.. నేపథ్య సంగీతం సినిమాని మరో మెట్టు ఎక్కించాయి. ‘చూడు నాన్న..’పాటు హృదయాలను హత్తుకుంటుంది. పెంచలదాస్ పాడిన వైఎస్సార్ పాట అయితే కన్నీళ్లను తెప్పిస్తుంది. ‘తొలి సమరం’సాంగ్ వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానుల్లో జోష్ని నింపుతుంది. మది సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. చివరిగా.. ‘ఓ రాజకీయ నాయుకుడి జీవితంలో డ్రామా ఉండవచ్చు.. యాక్షన్కూ అవకాశముంది.. బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందన్న వాళ్లను చూస్తే కామిడీకి స్కోపు ఉందని అనుకోవచ్చు. కానీ.. ఎమోషన్ కూడా ఉంటుందా? కచ్చితంగా ఉంటుంది అనడమే కాకుండా... ఆ భావోద్వేగాలను అందంగా తెరపైకి ఎక్కించి మరీ చూపించాడు మహి వి.రాఘవ్. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘యాత్ర 2’ ట్విటర్ రివ్యూ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మూవీ ‘యాత్ర 2’. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాతక్మంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు మహి వి.రాఘవ్. ఇందులో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలు సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేశాయి. (చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే ఏకంగా 10 సినిమాలు!) ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వైఎస్సార్, వైఎస్ జగన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు నేడు(ఫిబ్రవరి 8) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఇప్పటికే ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. యాత్ర 2 మూవీ ఎలా ఉంది? వైఎస్ జగన్‌గా జీవా ఎలా నటించాడు? తదితర విషయాలు ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. యాత్ర 2 చిత్రానికి ఎక్స్‌లో పాజిటివ్ స్పందన వస్తోంది. సినిమా అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్ అని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయట. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయంటూ పలువురు నెటిజన్స్ ఎక్స్‌లో కామెంట్ చేస్తున్నారు. #Yatra2 The best biopic ever in all the industries u will feel goosebumps right from the start @MahiVraghav just remember this name. Had a little hatred towards jagan but now it’s love ❤️ @JiivaOfficial 💥 Antis ki kuda goosebumps vache moments unnay ⭐️⭐️⭐️⭐️/5 Rating :-4/5 pic.twitter.com/Tggn0vieAr — Film Buff 🍿🎬 (@SsmbWorshipper) February 7, 2024 ‘యాత్ర 2’ బెస్ట్ బయోపిక్. సినిమా స్టార్టింగ్ నుంచే గూస్ బంప్స్ వచ్చేలా చేశాడు మహి వి. రాఘవ్. ఇంతకు ముందు జగన్‌పై కొంచెం ద్వేషం ఉండే..సినిమా చూశాక అది ప్రేమలా మారింది. వైఎస్ జగన్‌ని ద్వేషించేవారికి కూడా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉన్నాయంటూ ఓ నెటిజన్ 4/5 రేటింగ్ ఇచ్చాడు. Honestly chepthuna one of the best biopics ever made in Telugu #Yatra2 🔥🔥🔥🔥 Blockbuster movie 👌🏻👌🏻👌🏻#Yatra2 Bomma Blockbuster 🔥💙#YSJaganAgain @ysjagan @JiivaOfficial @mammukka pic.twitter.com/YhYNZnV46B — Sri Surya Movie Creations (@SSMCOfficial) February 8, 2024 నిజాయితీగా చెబుతున్న..తెలుగులో ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌లో యాత్ర 2 బెస్ట్ బయోపిక్. బ్లాక్ బస్టర్ మూవీ. బొమ్మ అదిరింది అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు.. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుంది -వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి #BlockbusterYatra2#Yatra2#CMYSJagan pic.twitter.com/kKzp63OOgv — YSR Congress Party (@YSRCParty) February 7, 2024 యాత్ర-2 సినిమా చూస్తూ థియేటర్లో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మనం మర్చిపోయిన ఎన్నో జ్ఞాపకాలను ఈ మూవీ కచ్చితంగా గుర్తు చేస్తుందని వైఎస్సార్సీసీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 @DrPradeepChinta అన్న రేటింగ్ 5 స్టార్ అంటే.... #Yatra2Movie కి తిరిగే ఉండదిక.... 👏👏👏👏 https://t.co/8J3g3dCOTd — #Siddham for 2024 🦾💪🇮🇳 (@bhojaraju99) February 8, 2024 First half completed! Edipinchesav @MahiVraghav ! pure emotions and YSJagan mass high! Trailer is jujubi.#Yatra2 #Yatra2JourneyBegins #Yatra2Movie #Yatra2OnFeb8th https://t.co/8xpua0Epg0 — Pavan_GR (@pavan_gr) February 7, 2024 Emotional n Gusebumps Stuff 🔥🔥🔥🔥#Yatra2 Blockbuster Reports pic.twitter.com/WBaUpCbNp6 — Jani Journalist (@shaik_jani8) February 8, 2024 Last Ki @ysjagan sir cameo 🔥 Pillini teesukuni velli adavilo vadileste adi pille, kani akkada undi puli adavilo Unna bonu lo Unna gargistundi. Deii em cinema Ra Babu HYD vadini Kuda vachi meeku vote veyali ani undi Jai Jagan#Yatra2#Yatra2OnFeb8th #Yatra2Premier pic.twitter.com/RS25F9xmp9 — UK DEVARA 🌊⚓ (@MGRajKumar9999) February 7, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్‌లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 #Yatra2 #Yatra2Movie వైఎస్ఆర్ మరణం, తదనంతర పరిణామాలు,తన తండ్రి మరణంతో నష్టపోయిన వారిని ఓదార్చేందుకు జగన్ ఓదార్పు యాత్రను ఎలా ప్రారంభించాడో, ఆయన నిర్ణయం వల్ల ఎదుర్కొన్న పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు — @Team Basireddy (@BasireddyLokes1) February 7, 2024 ప్రతీ అభిమాని గుండె చప్పుడిలో పెద్దాయన ఉంటారు 🥹🥹#Yatra2#Yatra2JourneyBegins#JaitraYatrapic.twitter.com/IdzOCiCkZ1 — Vikas 🎯🎯 (@VikasRonanki) February 8, 2024 Yatra -2 movie is an inspiration 👌👌👌👌👌@MahiVraghav @mammukka @JiivaOfficial @ysjagan @YSRCParty @JaganannaCNCTS @SajjalaBhargava Please watch it 🔥🔥https://t.co/DSvqpvfiEs pic.twitter.com/1gFEvtBqTX — Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) February 8, 2024 అధ్బుతమైన స్పందనతో, యూరోప్‌లో ముగిసిన యాత్ర -2 ప్రీమియర్ షో#Yatra2Movie #Yatra2 #JaitraYatra pic.twitter.com/3yOE48IhX0 — AP360 (@andhraa360) February 7, 2024 Finally blockbuster kottisamu anna.. 🥹❤️🔥🙏 Tnq @MahiVraghav Anna Great inspirational movie ichavu... 🧎♂️ Jai Jagan anna.. 🇸🇱🙏 @ysjagan #Yatra2Movie #Yatra2 #YSJaganAgainIn2024 pic.twitter.com/IB16sF6fa8 — ᴀʟʟᴜ sᴀɴᴊᴜ ʀᴇᴅᴅʏ™🪓🐉 (@AlluSanjuReddy) February 8, 2024 @MahiVraghav ఎవడ్రా నువ్వు మా జగనన్నకు మాకన్నా పెద్ద ఫ్యాన్ లా ఉన్నావ్🔥 Thanks Mahi anna 🥰 pic.twitter.com/dGJY6pV6Ge — Manager (@thinkpad8gen) February 8, 2024 -
'యాత్ర 2'లో ఆ భావోద్వేగాలే చూపించాను: డైరెక్టర్ మహి
‘‘యాత్ర 2’లోని పాత్రలు ఎవర్నీ కించపరిచేలా ఉండవు. ఏ పార్టీనీ విలన్‌గా చూపించలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిగారి మరణం తర్వాత ఇచ్చిన మాట కోసం (ఓదార్పు యాత్ర) కొడుకుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు చేసిన భావోద్వేగ ప్రయాణాన్ని మాత్రమే చూపించాను’’ అన్నారు దర్శకుడు మహి వి. రాఘవ్. వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో మహి వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం ‘యాత్ర 2’. వైఎస్ఆర్ పాత్రను మమ్ముట్టి చేయగా, ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా, వైఎస్ భారతీ రెడ్డి పాత్రలో కేతకీ నారాయణ్ నటించారు. త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యూలాయిడ్‌తో కలసి శివ మేక నిర్మించిన ఈ సినిమా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మహి వి. రాఘవ్ మాట్లాడుతూ– ‘‘మమ్ముట్టిగారు, జీవా, కేతకి, శివ మేక, నేను, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, కెమెరామేన్ మది.. ఇలా యూనిట్ అందరి వల్లే ‘యాత్ర 2’ బాగా వచ్చింది. జీవా అద్భుతమైన నటుడు. జగన్ అన్న పాత్రకి న్యాయం చేయగలడనే నమ్మకంతో ఎంచుకున్నాను. తెలుగు రాకపోయినా డైలాగ్స్ నేర్చుకుని అంకితభావంతో చేశాడు. ‘యాత్ర 2’ కథ, ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ భావోద్వేగాలతో నడిపించామన్నది ఎవరికీ తెలియదు. టీజర్, ట్రైలర్లో చూసిన ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ప్రజలకు తెలియని ఎన్నో అంశాలు సినిమాలో ఉంటాయి. ఈ మూవీలో వైఎస్ఆర్గారి మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. జగన్‌గారు ఢిల్లీ పెద్దలను ఎదిరించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు. మనమంటే గిట్టనివారు మనపై రాళ్లు వేస్తుంటారు.. బురద జల్లుతుంటారు.. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే మంచిది’’ అన్నారు. జీవా మాట్లాడుతూ– ‘‘మహీగారు నాకు కథ చెప్పి, వైఎస్ జగన్‌గారి పాత్ర అన్నప్పుడు షాక్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి నాకు అవగాహన లేదు. కానీ జగన్‌గారి పాత్ర చేయడం బాధ్యతగా అనిపించింది. జగన్‌గారు ఎలా మాట్లాడతారు? ఎలా నడుస్తారు? అని వీడియోలు చూసి తెలుసుకున్నాను. మహీగారు ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైమ్ తీసుకున్నారు. తొలి సన్నివేశం ఆయన ఓకే చెప్పడంతో నాకు పెద్ద ఉపశమనం అనిపించింది. నేను ఇప్పటివరకూ వైఎస్ జగన్‌గారిని కలవలేదు.. కలిసే చాన్స్ వస్తే వదులుకోను. ‘యాత్ర 2’ విడుదల తర్వాత జగన్‌గారు మమ్మల్ని పిలిచి, అభినందిస్తారనే నమ్మకం ఉంది. ‘యాత్ర 2’ చేస్తున్నప్పుడు ప్రతిపక్షాల నుంచి నాకెలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు. అయితే ‘యాత్ర’ చేస్తున్నప్పుడు మీకేమైనా అలాంటి కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టిగారిని అడిగాను. ‘మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. దీన్ని కేవలం సినిమాలానే చూడు’ అని ఆయన చెప్పారు. ఈ మూవీలోని ‘చూడు నాన్నా’ పాట తీస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యాను. పులివెందులలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడి ప్రజల ప్రేమ, అభిమానం మరచిపోలేను. నా కెరీర్లో ‘యాత్ర 2’ తప్పకుండా ఓ మైలురాయిగా నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను’’ అన్నారు. కేతకీ నారాయణ్ మాట్లాడుతూ– ‘‘నేను మరాఠీ, హిందీ సినిమాలు చేశాను. తెలుగులో ‘యాత్ర 2’ నా మొదటి చిత్రం. తొలిసారి ఓ రియల్ పాత్ర చేశాను. పాత్రకు తగ్గ భావోద్వేగాలు పండించాను. పులివెందులలో షూటింగ్ చేసినప్పుడు అక్కడి మహిళలు నన్ను హత్తుకుని ఆ΄్యాయతతో మాట్లాడారు. అప్పుడు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైంది’’ అన్నారు. -
ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ తీశాను: మహి వి.రాఘవ్
‘‘యాత్ర 2’లో ఎవరిని కించపరిచేలా పాత్రలు సృష్టించలేదు. తండ్రికి ఇచ్చిన మాట కోసం కొడుకు చేసే ఎమోషనల్ జర్నీని మాత్రమే చూపించాను’ అని దర్శకుడు మహి వి రాఘవ్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యాత్ర 2’. యాత్ర మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటించారు. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా యాత్ర 2 టీమ్ మీడియాతో ముచ్చటించింది. మహి వి. రాఘవ్ మాట్లాడుతూ.. ‘తెలిసిన కథే అయినా.. సినిమాను ఎలా తీశామన్నది ఎవ్వరికీ తెలియదు. ప్రారంభం, ముగింపు అందరికీ తెలిసి ఉండొచ్చు. కానీ సినిమాను ఎలా తీశాం, ఏ ఎమోషన్‌తో నడిపించామన్నది తెలియదు. ఈ టీజర్, ట్రైలర్లో చూసిన సీన్లు ప్రజలకి తెలిసి ఉండకపోవచ్చు. ఓ చెవిటి అమ్మాయితో ఉన్న సీన్, ఓ అంధుడితో సీన్ ఇవన్నీ బయటి ప్రజలకు తెలియవు. ఇలాంటి ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఎన్నో తెలియని అంశాలతో ‘యాత్ర 2’ని తీశాను. ట్రైలర్లో చూపించిన ఆ ఎమోషనల్ సీన్లు నిజంగానే జరిగాయా? లేదా? అన్నది పక్కన పెడితే.. ఆ సీన్‌తో ఎమోషన్‌ను జనాలకు కనెక్ట్ చేశామా? అన్నదే సినిమా ఉద్దేశం. వైఎస్సార్ పేదల కోసం, వికలాంగుల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని చెప్పే ఉద్దేశంలో ఆ సీన్ అనుకోవచ్చు. వైఎస్ జగన్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతో మంది ఆయన వెనకాల నిలిచారు అనేది చెప్పడం కోసం ఆ అంధుడి పాత్రని చూపించాం. ఇక ఈ చిత్రంలో వైఎస్సార్ గారి మరణానికి సంబంధించిన కారణాలు చూపించలేదు. ఇందులో కేవలం ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట అనే పాయింట్ చుట్టూనే తిరుగుతుంది. ఢిల్లీని ఎదురించడం, సీఎం అయిపోవడం అనేది నా కథ కాదు. ఇందులో నేను ఎవ్వరినీ కించపరిచేలా పాత్రలు సృష్టించలేదు. నిజానిజాలు జనాలకు తెలుసు. ఒక పాత్రని హీరో చేయడం కోసం ఇంకో పాత్రను తక్కువ చేసి చూపించలేదు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, రీ రిలీజ్ చేసినా పర్వాలేదు.. అన్నీ బాగా ఆడాలి.. ఆ డబ్బులన్నీ మన ఇండస్ట్రీకే వస్తాయి. అన్ని సినిమాలకు కలెక్షన్స్ వస్తే.. థియేటర్లు బాగుంటాయి కదా. ప్రతీ రాజకీయ నాయకుడి మీద కేసులుంటాయి. ఇందులో ఎవరికీ డప్పు కొట్టలేదు. నమ్మేలా ఉందా? భజనలా అనిపించిందా? అన్నది ఆడియెన్స్‌కి అర్థం అవుతుంది. సినిమాలంటే.. నిజాలైనా చూపించాలి.. నమ్మేలా అయినా చూపించాలి. ఇందులో నిజాలెంత?, కల్పితం ఎంత అంటే.. అన్నంలో నీళ్లలా 1:2 శాతం అని చెప్పలేం. మమ్ముట్టి గారు చేసిన ఆ మూగమ్మాయి సీన్ నిజమా? అంటే నేను చెప్పలేను..కానీ ఆ పాత్ర సోల్, ఎమోషన్ మాత్రం నిజం’ అని అన్నారు. జీవా మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ గారి పాత్రలో నటించడం కష్టంగా అనిపించింది. యూట్యూబ్, మీడియా నుంచి వీడియోలు రెగ్యులర్‌గా చూస్తూ ఉన్నాను. జగన్ గారు ఎలా మాట్లాడతారు.. ఎలా నడుస్తారు.. ఇలా ప్రతీ ఒక్క విషయం మీదో ఎంతో శ్రద్ద తీసుకున్నాను. ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ ఎప్పుడైతే షాట్‌కి ఓకే చెప్పారో అప్పుడు నాకు రిలీఫ్ అనిపించింది. మహి గారు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన ఈ పాత్రకు నన్ను ఓకే చేయడానికే చాలా టైం తీసుకున్నారు. ఇక షాట్ ఓకే చెప్పడంతో నాకు పెద్ద రిలీఫ్‌లా అనిపించింది. నేను జగన్ మోహన్ రెడ్డి గారిలానే కనిపిస్తున్నానని అప్పుడే నాకు అర్థమైంది. ఆ తరువాత నేను మానిటర్ కూడా చూడలేదు. ప్రతిపక్షం నుంచి ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అని మమ్ముట్టి గారిని అడిగాను. మనం యాక్టర్స్.. ఇది క్రియేటివ్ స్పేస్.. ఇది కేవలం సినిమాలనే చూడు అని ఆయన చెప్పారు. చూడు నాన్నా అనే పాట చిత్రీకరిస్తున్నప్పుడు చాలా ఎమోషన్‌కు లోనయ్యాను’ అని అన్నారు. కేతకి నారాయణ్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఓ రియల్ పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఇది నా మాతృభాష కాదు. నేను మరాఠీ, హిందీల్లో నటించాను. తెలుగులో ఇది నాకు మొదటి చిత్రం. భారతి గారికి ఓ ఇమేజ్ ఉంది. ఆమె గురించి ఎక్కువగా తెలుసుకున్నాను. ఎలాంటి మనిషి.. ఎలాంటి విషయాలకు ఎలా రియాక్ట్ అవుతారు.. అనే విషయాలను తెలుసుకున్నాను. పులివెందులలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ పాత్రలోని ఇంటెన్సిటీ నాకు అర్థమైంది’ అని అన్నారు. -
యాత్ర-2 తియ్యడానికి ఇదే కారణం
-
అమెరికాలో 'యాత్ర- 2' ప్రీమియర్స్ సిద్ధం.. అభిమానుల భారీ ర్యాలీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా వైఎస్సార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అమెరికాలో నివసిస్తున్న వైఎస్సార్, ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ యాత్ర సినిమా విడదుల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని వందల కార్లు, బైకులతో యాత్ర పోస్టర్స్ పట్టుకుని రోడ్ షో నిర్వహించారు. అమెరికాలో విడుదలకు ముందే యాత్ర జండా రెపరెపలాడుతుంది. సినిమా విడుదల కోసం ఎంతగానో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని టెక్సాస్, డల్లాస్‌లో ఫిబ్రవరి 7న యాత్ర 2 ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఫ్యాన్స్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచే అమెరికాలో ప్రీమియర్ షోలు ఉండనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ (శుభలేక సుధాకర్) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్ ట్రైలర్ ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవన్నీ భారీగా ట్రెండ్ అవుతున్నాయి. USA #Yatra2 Collection 🔥🔥 pic.twitter.com/9FxfcrFmuF — MBYSJTrends ™ (@MBYSJTrends) February 6, 2024 🚨Premiere Alert🚨 All theatre chain passes are now enabled for #Yatra2 in the USA 🇺🇸 Premieres on Feb 7#Yatra2Trailer - https://t.co/xzuTsMDg0h Directed by @mahivraghav#LegacyLivesOn #Yatra2OnFeb8th @mammukka @JiivaOfficial @ShivaMeka pic.twitter.com/Tcputw5Thl — Three Autumn Leaves (@3alproduction) February 6, 2024 -
యాత్ర- 2 ట్రైలర్‌పై ప్రకటన చేసిన డైరెక్టర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిన చూసిన నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. వైఎస్సార్, ఆయన తనయుడి జీవితంలో జరిగిన యథార్థంగా జరిగిన సంఘటనలే టీజర్లో కనిపించాయని ప్రేక్షకులు చెబుతున్నారు. దీంతో యాత్ర 2 చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం ట్రైలర్‌ను రేపు (ఫిబ్రవరి 3న) విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. మహీ వి. రాఘవ్ తెరకెక్కిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. -
'యాత్ర-2' నుంచి మరో సాంగ్ విడుదల
యాత్ర -2 ఫిబ్రవరి 8న విడుదల కానున్నడంతో అభిమానులకు చిత్ర యూనిట్ మరో కానుక అందించింది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కొద్దిరోజుల క్రితం 'చూడు నాన్న' అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆ పాట కూడా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా 'తొలి సమరం' అనే సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను గౌతమ్ భరధ్వాజ్ ఆలపించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా చాలా అద్భుతంగా కనిపించారు. ఈ పాటలో ఆయన పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు. -
యాత్ర-2 నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్
యాత్ర -2 నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా నుంచి 'చూడు నాన్న' వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర'. ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయింది. 'చూడు నాన్న' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల ఈ పాటకు అద్భుతమైన సాహిత్యం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఎమోషన్స్‌తో కూడిన సంగీతాన్ని అందించారు. ఈ పాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో జీవా తనదైన నటనతో మెప్పించారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఈపాట ఉండటంతో అందరినీ మెప్పిస్తుంది. తండ్రి మరణంతో మొదటిసారి ప్రజల్లో అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకే వేలాదిగా జనాలు వచ్చారు. ఆ సమయంలో జరిగిన కొన్ని ఘటనలను పాటలో చూపించారు డైరెక్టర్ మహి వి రాఘవ్. -
Yatra- 2 Teaser.. తూటాల్లా పేలుతున్న డైలాగ్స్
యాత్ర- 2 టీజర్ విడుదలైంది. యూట్యూబ్ ట్రెండింగ్‌లో టాప్-1కు చేరిపోయింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి స్టార్ హీరోలు లేరు.. కానీ టీజర్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది వైఎస్సార్ అభిమానులు తమ మొబైల్స్‌లలో వాట్సప్ స్టేటస్‌లుగా యాత్ర-2 టీజర్ డైలాగ్స్‌ను పెట్టుకుంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర-2 సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వైఎస్ఆర్, ఆయన వారసుడు సీఎం జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వారందరూ యాత్ర-2 టీజర్‌తో పండుగ చేసుకుంటున్నారు. టీజర్లో చూపించిన ప్రతి అంశం గడిచిన రోజుల్లో మన కళ్ల ముందు జరిగినవే.. కానీ డైరెక్టర్ మహి వి రాఘవ అద్భుతంగా తెరకెక్కించారు. దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్ లీడర్, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్ మహి కే సాధ్యమైంది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అసలు టీజర్ స్టార్ట్ కావడమే ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమైంది. ఆ షాట్ కూడా పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్దే జరిగింది. ఈ టీజర్లో సీఎం జగన్ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలనే తెరపైకి తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జగన్ గారిని బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు. వైఎస్ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. ఈ పాయింట్‌తోనే టీజర్ ప్రారంభం అవుతుంది. అనుకున్నట్లే వైఎస్ జగన్ గారు పాదయాత్ర ప్రారంభించారు.. రోజురోజుకూ ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన కొందరు తండ్రి పోయాడనుకుంటే వారసుడొచ్చాడని.. దీనిని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్‌తో జత కట్టి దొంగదెబ్బ తీసేందుకు వార్నింగ్‌లు జారీచేశారు. అప్పుడు టీజర్లో వినిపించిన డైలాగ్ ఇదే... 'ఉన్నది అంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం' ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇదే. ఎవరికీ తలవంచని ధైర్యం.. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. పెద్ద దిక్కు తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్ జగన్ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలో వచ్చిందే ఈ డైలాగ్ 'నాకు భయపడడం తెలియదు.. నేను వైఎస్సార్ కొడుకుని' అని చెప్పడం. వైఎస్ జగన్ గారిపై అన్యాయంగా సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయించి, టీడీపీతో కుమ్మక్కై రాజకీయంగా మొగ్గదశలోనే వైఎస్సార్ వారసుడిని అంతమొందించేందుకు 16 నెలల పాటు జైల్లో పెట్టిన తీరును యాత్ర- 2లో చూపించనున్నాడు డైరెక్టర్ మహీ. జగన్ గారి ఓదార్పు యాత్రకు ముందు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు.. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర ప్రకటన వచ్చిందో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వచ్చాయి. రాజకీయంగా వైఎస్సార్ వారసుడిని లేకుండా చేయాలని కుట్ర పన్నిన వారందరికీ వైఎస్ జగన్ అభిమానులు తగిన బుద్ధి చెప్పారు. ఆయన వెంట ఒక సైన్యంలా జనం కదిలారు. తండ్రి మాదిరే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా.. పోరాడి నిలబడిన యోధుడిలా జగన్ జీవితం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. అందుకే రాజన్నతో పాటు ఆయన బిడ్డ వైఎస్ జగన్ జీవితం గురించి సినిమాలు వస్తున్నాయి. వారి అసలైన జీవితాన్ని నేటి తరం యువకులకు తెలిసేలే కొందరు దర్శకనిర్మాతలు పూనుకున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది.. ఫిబ్రవరి 8న యాత్ర- 2 విడుదల కానుంది. -
Yatra 2 Movie: పవర్ఫుల్ డైలాగ్‌తో వైఎస్ భారతి లుక్ రిలీజ్
యాత్ర’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘యాత్ర 2’. ఇందులో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో హీరో జీవా నటిస్తున్నారు. వైఎస్సార్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన సూపర్‌హిట్ మూవీ ‘యాత్ర’కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు మహి. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగిన తీరుని, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో మరాఠీ నటి కేతకి నారాయణన్ నటిస్తోంది. నేడు(డిసెంబర్ 9) వైఎస్ భారతి పుట్టినరోజు. ఈ సందర్భంగా యాత్ర 2 మూవీలో ఆమె క్యారెక్టర్ లుక్ పోస్టర్ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్‌పై ‘నిజమేన్నా మా ఇంట్లో ఆడవాళ్లకి రాజకీయాలు, వ్యాపారాలు నేర్పించలేదు. అట్లానే మాకు కష్టం, సమస్య వస్తే భయపడి వెనుతిరిగి చూడటం కూడా నేర్పించలేదు.’ అని భారతి పాత్ర చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌ని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది. యాత్ర’ చిత్రాన్ని ఫిబ్రవరి 8, 2019లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు ‘యాత్ర 2’ ని కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు, 2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. A resilient force behind the rise of a leader! Presenting @KetakiNarayan as #YSBharathi from #Yatra2. In cinemas from 8th Feb, 2024.#HBDYSBharathiGaru #Yatra2OnFeb8th #LegacyLivesOn @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @3alproduction pic.twitter.com/KdhUuB47wA — Mahi Vraghav (@MahiVraghav) December 9, 2023 -
పులివెందులలో 'యాత్ర 2'... పవర్ఫుల్ పోస్టర్స్ రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'యాత్ర 2'. 2018లో రిలీజైన 'యాత్ర' చిత్రానికి ఇది సీక్వెల్. ఇప్పటికే ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. జగన్ పాత్రలో జీవాని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అలా సెట్ అయిపోయాడు మరి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!) ఇప్పటికే షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. తాజాగా చివరి షెడ్యూల్‌ని సీఎం జగన్ సొంతూరు పులివెందులలో చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన డైరెక్టర్ మహీ వి రాఘవ.. పవర్ఫుల్ పోస్టర్స్ షేర్ చేయడంతో పాటు ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తాజాగా ఫొటోల్లో జగన్ పాత్రధారి జనంతో ఉంటూ వాళ్ల బాగోగులు తెలుసుకుంటూ కనిపించారు. 'జగన్ పాత్రలో జీవా జీవించేశాడు. నేను ప్రత్యక్షంగా చూశాను. ఫిబ్రవరి 8న యాత్ర 2 రిలీజైన తర్వాత ప్రతిఒక్కరూ ఇదే మాట చెబుతారు. నాతో ఏకీభవిస్తారు' అని డైరెక్టర్ మహీ వి రాఘవ రాసుకొచ్చాడు. 'యాత్ర' సినిమాలో వైఎస్ పాదయాత్ర పరిణామాల్ని చూపించారు. ఇక సీక్వెల్లో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, వైఎస్సార్సీపీ ఆవిర్భావం, పాదయాత్ర, భారీ మెజారిటీతో ముఖ్యమంత్రి కావడం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తదితర విషయాల్ని చూపించబోతున్నారని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. (ఇదీ చదవండి: స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం) View this post on Instagram A post shared by Mahi V Raghav (@mahivraghav) -
ఈ పాయింట్‌తో యాత్ర 2 ఉంటుంది: మహీ వి. రాఘవ్
'యాత్ర’కి, ‘యాత్ర 2’కి కథ పరంగా సంబంధం ఉండదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి జీవితంలోని ఎత్తుపల్లాలనే ‘యాత్ర 2’లో చూపిస్తాం' అన్నారు డైరెక్టర్ మహీ వి. రాఘవ్. ఆయన దర్శకత్వంలో శివ మేక నిర్మించనున్న చిత్రం ‘యాత్ర 2’. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ‘యాత్ర 2’ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భగా మహీ వి. రాఘవ్ మాట్లాడుతూ–'యాత్ర 2’లో 2009 నుంచి 2019 వరకు జగన్‌గారి జీవితాన్ని, ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్‌తో ఈ సినిమా ఉంటుంది. పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైమ్‌లో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైమ్‌లో 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఏపీ ఓటర్లను తక్కువ అంచనా వేయొద్దు. ‘యాత్ర 2’తో ఓటర్లు ప్రభావితం అవుతారనుకోవద్దు. మా సినిమా చూసి ఎమోషనల్ అవుతారు. కానీ, వాళ్లకు నచ్చినవాళ్లకు ఓటు వేస్తారు. ‘యాత్ర 2’ని వైసీపీ వాళ్ల కోసమే తీస్తున్నామని అనుకున్నా పర్లేదు' అన్నారు. 'నిజ జీవితంలో ఉండే పాత్రలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ‘యాత్ర’ను అందరూ సపోర్ట్ చేశారు.. ‘యాత్ర 2’ మూవీని కూడా ఆదరించాలి' అన్నారు శివ మేక. -
Yatra 2: తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టిన ఓ కొడుకు కథే ‘యాత్ర 2’
‘కథను ఎంచుకునేటప్పుడు ఓ మేకర్‌గా కమర్షియల్ కోణంలో సినిమాకు పెట్టిన డబ్బులు వస్తాయా? లేదా? అన్నది ఆలోచిస్తాం. యాత్రలో ఓ రాజకీయ నాయకుడి తన గురించి తాను తెలుసుకోవడం, ప్రజల కష్టాలను తెలుసుకోవడం, ఆయన ఏంటన్నది ప్రజలు తెలుసుకోవడం ఉంటుంది. యాత్ర 2లో 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి గారి పీరియడ్‌ను చూపిస్తాను. ఆయన ఎదుగుదలను పొలిటికల్ డ్రామాగా చూపిస్తాను’అని దర్శకుడు మహి వి. రాఘవ్ అన్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం యాత్ర 2. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి(జులై 8) సందర్భంగా నేడు యాత్ర 2 మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► తండ్రి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టే కొడుకు అనే పాయింట్ చుట్టూ యాత్ర 2 కథ నడుస్తుంది. సీఎం జగన్ ఎక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టారు.. ఎక్కడి వరకు ఎదిగారు అన్నదే ఈ సినిమాలో చూపిస్తున్నాం. యాత్రకి, యాత్ర 2కి కథ పరంగా ఏ సంబంధం ఉండదు. ► యథార్థ సంఘటనలే అయినా కూడా జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు ఫిక్షన్ యాడ్ చేస్తాం. రెండు గంటల్లో కథను చెప్పాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేస్తాను.ఈ సినిమాతో ఓటర్లు ప్రభావితం అవుతారని అనుకోవద్దు. సినిమా చూసి ఎమోషనల్ అవుతారు.. పోలింగ్ బూత్‌లో వాళ్లకు నచ్చిన వాళ్లకు ఓటు వేస్తారు. ► జగన్ మోహన్ రెడ్డి జీవితంలో ఎత్తుపల్లాలున్నాయి. వాటినే సినిమాలో చూపిస్తాం. జగన్ అనే ఓ రాజకీయ నాయకుడి కథను చెప్పబోతోన్నాం ► పొలిటికల్ సినిమాలు చేయడమే రిస్క్.. ఇలాంటి సినిమాలు ఎప్పుడు, ఏ టైంలో రిలీజ్ చేస్తామనేది ముఖ్యం. అందుకే ఎన్నికల టైంలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం ► ఆర్జీవీ గారు తీసే వ్యూహం మాపై ఎలాంటి ప్రభావం చూపదు. త్వరలోనే నటీనటుల వివరాలను ప్రకటిస్తాం. శివ మేక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మధి సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. -
వైఎస్ రాజశేఖర రెడ్డి వాయిస్‌తో .. యాత్ర-2 పోస్టర్ వచ్చేసింది
2019లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా వచ్చిన 'యాత్ర' సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన మహి వి.రాఘవ్ సీక్వెల్ కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఇటీవలే ఆయన విడుదల చేశారు. ఆ పోస్టర్లో మహి వి.రాఘవ్ ఇలా చెప్పుకొచ్చాడు.. 'నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్. రాజశేఖరరెడ్డి కొడుకుని' అనే లైన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నేడు (జులై 8) వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా యాత్ర-2కు సంబంధించి మోషన్ పోస్టర్‌ను ఉదయం 11:35 గంటలకు దర్శకులు మహి వి.రాఘవ్ విడుదల చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సమయంలో చెప్పిన మాటలతో మోషన్ పోస్టర్ ప్రారంభం అవుతుంది. 'నమస్తే బాబు.. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా నమస్తే.. నమస్తే...' అంటూ ఆ నాడు ఆయన మాట్లాడిన గొంతును డైరెక్టర్ మహి వి.రాఘవ్ నేడు మళ్లీ గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 'నేను విన్నాను... నేను ఉన్నాను' అనే మాటలతో వీడియో ముగుస్తుంది. వీరిద్దరూ చెప్పిన ఈ మాటలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంతగానో దగ్గరకు చేరాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, వైఎస్సార్ సీపీ ఆవిర్భావం, ఆపై 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠం చేపట్టడం తదితర అంశాలను యాత్ర 2 లో ఉండనుంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నారు. -
Yatra 2 Update: ఒక్కటి గుర్తు పెట్టుకోండి!
‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ ‘యాత్ర 2’ సినిమా పోస్టర్ని విడుదల చేసింది చిత్రయూనిట్. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించిన ‘యాత్ర’ (2019) సినిమా మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ కి సీక్వెల్‌గా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర 2’ ఉంటుందని మహీ వి.రాఘవ్ గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్డేట్ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసింది చిత్రయూనిట్. మహీ వి.రాఘవ్ దర్శకత్వంలో వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మించనున్న ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ని విడుదల చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. ఇందులో జగన్ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్ మొదలవుతుంది. -
Yatra 2: గుర్తుపెట్టుకోండి..నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని..
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ ‘యాత్ర’. వైఎస్సార్ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నాలుగేళ్ల క్రితం(2019) విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లోనే ఈ చిత్రానికి సీక్వెల్ ఉటుందని ప్రకటించాడు దర్శకుడు మహి వి.రాఘవ్. ఈ సీక్వెల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుందని ఇటీవల రివీల్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ని జులై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ వారం ముందే ‘యాత్ర-2’ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ని విడుదల చేసి సర్ప్రైజ్ చేశాడు మహి. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానున్నట్లు ప్రకటించారు. (చదవండి: సినీ తారల ‘వ్యాపారం’.. సైడ్ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న స్టార్స్ వీరే!) తాజాగా రిలీజైన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఈ పోస్టర్‌పై ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్ రాజశేఖరరెడ్డి కొడుకుని’అనే లైన్స్ ‘యాత్ర 2’ కథేంటో తెలియజేస్తుంది. వైఎస్సార్ మరణానంతరం వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర మొదలు.. సీఎం పీఠం ఎక్కే వరకు ఆయనకు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో యాత్ర 2 కథ సాగుతుందని పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. సీఎం జగన్ చేపట్టిన పాదయాత్రను హైలెట్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. సీఎం జగన్ పాత్ర పోషించేదెవరనేది ఇంతవరకు ప్రకటించలేదు కానీ తమిళ హీరో జీవా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. Step into the shoes of a torchbearer as we bring his extraordinary journey to life! #Yatra2 in cinemas from Feb 2024 👣#LegacyLivesOn @ShivaMeka @MahiVraghav @vcelluloidsoffl @Music_Santhosh @madhie1 #SelvaKumar @3alproduction pic.twitter.com/biCaoXraBh — Three Autumn Leaves (@3alproduction) July 1, 2023 -
'సైతాన్' దర్శకుడి వెంటపడుతున్న ఓటీటీలు!
బోల్డ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ అనగానే చాలామందికి 'మీర్జాపుర్' గుర్తొస్తుందేమో. ఇప్పుడు దాన్ని తలదన్నే రీతిలో 'సైతాన్' సంచలనం సృష్టించింది. ఎందుకంటే ఈ సిరీస్ లో బూతులు, అడల్ట్ సీన్స్ లెక్కకు మించి ఉన్నప్పటికీ.. ఎమోషన్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అయింది. దీంతో సిరీస్ సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ మహీ వి రాఘవపై ప్రముఖ ఓటీటీల కన్ను పడింది. ప్రొడ్యూసర్ టూ డైరెక్టర్! టాలీవుడ్ లో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన మహీ వి రాఘవ.. 'విలేజ్ లో వినాయకుడు', 'కుదిరితే కప్పు కాఫీ' సినిమాలు తీశాడు. కానీ ఆ రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. దీంతో తనలోని దర్శకుడుని బయటకు తీశాడు. 'పాఠశాల', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. కాస్తంత గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'ఆదిపురుష్' టీమ్!) ఓటీటీలతో మరింత క్రేజ్ ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ పై తన సత్తా చూపించిన మహీ వి రాఘవ.. హాట్ స్టార్ కోసం రెండు సిరీస్ లు ప్లాన్ చేశాడు. రీసెంట్ గా విడుదలైన ఈ రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ఒకటి 'సేవ్ ద టైగర్స్'. కామెడీ స్టోరీతో సిరీస్ తీసినా సక్సెస్ సాధించొచ్చని ఇది ప్రూవ్ చేసింది. ఈ సిరీస్ కి రైటర్ కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన మహీ.. షో రన్నర్ గా వ్యవహరించారు. డైరెక్షన్ చేయలేదు. 'సైతాన్' వెబ్ సిరీస్ కి మాత్రం అన్నీ తానై వ్యవహరించాడు. బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఈ క్రమంలోనే తన క్రేజ్ చాలా పెంచేసుకున్నాడు. ముందుంది పెద్ద టాస్క్ డైరెక్టర్ మహీ వి రాఘవ.. ప్రస్తుతం 'సిద్దా లోకం ఎలా ఉంది నాయనా' సినిమా చేశాడు. ఇది రిలీజ్ కు రెడీగా ఉంది. అటు సినిమాలు, ఇటు ఓటీటీల్లో వెబ్ సిరీసులు చేస్తూ బిజీగా ఉన్న ఇతడు.. రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడా అనేది పెద్ద టాస్క్. ఎందుకంటే దేనికి దానికి సెపరేట్ ఆడియెన్స్ ఉంటారు కదా! ఇదంతా కాదన్నట్లు ఏపీ ముఖ్యమంత్రి జగన్ జీవితం ఆధారంగా 'యాత్ర 2' తీయబోతున్నాడు. మహీ సక్సెస్ దెబ్బకు ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. (ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?) -
Shaitan Review: ‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్ : సైతాన్ (9 ఎపిసోడ్స్) నటీనటులు : రిషి, షెల్లీ, రవి కాలే, దేవయాని శర్మ, జాఫర్ సాదిక్, నితిన్ ప్రసన్న తదితరులు నిర్మాతలు: మహి వి రాఘవ్, చిన్నా వాసుదేవ్ రెడ్డి రచన-దర్శకత్వం: మహి వి రాఘవ్ సంగీతం : శ్రీరామ్ మద్దూరి సినిమాటోగ్రఫీ: షణ్ముగ సుందరం ఓటీటీ వేదిక: డిస్నీ +హాట్‌స్టార్ విడుదల తేది: జూన్ 15, 2023 సినీ నటులతో పాటు దర్శక నిర్మాతకు దొరికిన సరికొత్త మాధ్యమ వేదిక ఓటీటీ. రెండున్నర గంటల్లో చెప్పలేని కథలను, చేయలేని ప్రయోగాలను వెబ్ సిరీస్‌ల ద్వారా చేసి తమని తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఓటీటీ సంస్థలు కూడా సినిమాలకు ధీటుగా వెబ్ సిరీస్‌లు తెరకెక్కిస్తున్నాయి. తాజాగా ‘యాత్ర’ ఫేం మహి వి.రాఘవ్ దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ ‘సైతాన్’. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో నేటి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రచార చిత్రల్లో బోల్డ్ సీన్స్, బూతులతో చూపించి సంచలనం సృష్టించిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘సైతాన్’ కథేంటంటే.. సావిత్రి(షెల్లీ నబు కుమార్)కి బాలి(రిషి), జయ(దేవయాని శర్మ), గుమ్తి(జాఫర్ సాధిక్) ముగ్గురు పిల్లలు. భర్త వదిలేసి వెళ్లడంతో పిల్లల పోషణ కోసం ఓ పోలీసు అధికారికి ఉంపుడుగత్తెగా ఉంటుంది. తల్లి గురించి ఇరుగుపొరుగు వారు నానా మాటలు అనడం బాలికి నచ్చదు. అలాంటి పని చేయొద్దని తల్లికి చెబితే.. ‘మీరు సంపాదించే రోజు వచ్చినప్పటి నుంచి నేను ఇలాంటి పని చేయడం మానేస్తా’ అంటుంది. ఏదైనా పని చేద్దామని వెళ్తే.. ఎవరూ బాలికి పని ఇవ్వరు. అదే సమయంలో తల్లి కోసం వచ్చే పోలీసు కన్ను తన చెల్లిపై పడుతుంది. చెల్లిని బలవంతం చేయడానికి ట్రై చేసిన పోలీసుని కొట్టి చంపేస్తారు. (చదవండి: మరికొద్ది గంటల్లో రిలీజ్.. ఆదిపురుష్‌కి ప్రచారం ఎక్కడ?) ఈ కేసులో బాలి తొలిసారి జైలుకు వెళ్తాడు. కొన్నాళ్ల తర్వాత బయటకు వస్తాడు. ఆ తర్వాత బాలి తన కుటుంబంతో కలిసి ఎంతమందిని హత్య చేశాడు? ఎన్నిసార్లు జైలుకు వెళ్లాడు? దళంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? తను ప్రాణంగా ఇష్టపడే తమ్ముడు గుమ్తిని చంపిదెవరు? కళావతి(కామాక్షి భాస్కర్)కు బాలికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తన ప్రయాణంలో పోలీసు అధికారి నాగిరెడ్డి(రవి కాలే) పాత్ర ఏంటి? చివరకు బాలి ఎలా చనిపోయాడు? అనేది తెలియాలంటే ‘సైతాన్’ వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే... ఇప్పటి వరకు మహి వి. రాఘవ్‌కు సెన్సిబుల్ డైరెక్టర్ అనే ముద్ర ఉంది. ఆయన తెరకెక్కించిన ‘పాఠశాల’, ‘ఆనందో బ్రహ్మా’, ‘యాత్ర’ లాంటి చిత్రాల్లో ఎక్కడ వల్గారిటీ కనిపించదు. ఇక ఆయన షో రన్నర్‌గా వ్యవహరించిన ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ కూడా క్లీన్ కామెడీగా సాగుతుంది. అలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న డైరెక్టర్ సడెన్‌గా రూటు మార్చి సైతాన్ లాంటి బోల్డ్, అడల్ట్ వెబ్ సిరీస్‌ని తెరకెక్కించి అందరిని ఆశ్చర్యపరిచాడు. క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్‌లో రాయలేని భాషలో బూతులు ఉన్నాయి. హింస, శృంగార సన్నివేశాలు మోతాదుకు మించి ఉంటాయి. కేవలం ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మహి ఈ వెబ్ సిరీస్‌ని తీర్చి దిద్దారు. ఆ వర్గానికి మాత్రం ఈ వెబ్ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. కానీ దర్శకుడు మొదటి నుంచి చెప్పినట్లుగా ఫ్యామిలీతో కలిసి చూసే వెబ్ సిరీస్ అయితే కాదిది. మొత్తం తొమ్మిది ఎపిసోడ్లతో.. ప్రతి ఎపిసోడ్‌లోనూ బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉంటాయి. తొలి ఎపిసోడ్‌తోనే ‘సైతాన్’ ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేయడం మొదలు పెట్టి, చివరకు తనువు చాలించిన ఓ నేరస్తుని కథే ‘సైతాన్’. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా మేకింగ్ మాత్రం కొత్తగా ఉంది. బాలి ఫ్యామిలీ చేసే హత్యలు క్రూరంగా ఉన్నప్పటికీ.. అలా చేయడంలో తప్పు లేదనేలా కథను తీర్చిదిద్దాడు దర్శకుడు. కొన్ని చోట్ల అనవసరంగా బూతు పదాలను జొప్పించారనే ఫీలింగ్ కలుగుతుంది. ‘భర్త లేని మహిళ మరో పురుషుడితో సంబంధం పెట్టుకుంటే ఆమెపై 'లం**...' అని ముద్ర వేసే సమాజం, ఆ మగాడికి ఎందుకు ఏ పేరు పెట్టలేదు?’ లాంటి సంభాషణలు వినడానికి వినడానికి హార్ష్‌గా అనిపించినా.. ప్రసుత్తం సమాజంలో జరుగుతుంది ఇదే కదా అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ.. బోల్డ్ మేకింగ్ కారణంగా వాటికి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేకపోతాడు. నాలుగు, ఐదో ఎపిసోడ్లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. పోలీసులకు, దళ సభ్యలకు మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకోలేవు. కొన్ని చోట్ల సినిమాటిక్ లిబర్టీని ఎక్కువడా వాడేశారు. అతి హింస, శృంగార సన్నీవేశాల కారణంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్‌ని చూడలేరు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌కి మాత్రం బాగా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. బాలి పాత్రకి వందశాతం న్యాయం చేశాడు రిషి. అమాయకత్వం, కోపం, ఆవేశం... ప్రతిది చక్కగా తెరపై చూపించాడు. జయప్రదగా దేవయాని శర్మ డీ గ్లామర్ లుక్‌లో బోల్డ్ యాక్టింగ్ చేశారు. గుమ్తి పాత్రలో జాఫర్‌ని తప్ప మరొకరిని ఊహించుకోలేము. కామాక్షి భాస్కర్ల, షెల్లీ, రవి కాలేతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. టెక్నికల్ పరంగా ఈ వెబ్ సిరీస్ బాగుంది. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
సైతాన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు పాజిటివ్ రెస్పాన్స్
దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న క్రైమ్ వెబ్ సిరీస్ 'సైతాన్'. కొన్ని రోజుల క్రితం సైతాన్ ట్రైలర్ రిలీజ్ చేయగా మిలియన్ల కొద్ది వ్యూస్ తో దూసుకుపోతోంది. ట్రైలర్లో చూపిన ఒళ్ళు గగుర్పొడిచే క్రైమ్ అంశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. అయితే ట్రైలర్లో ఉన్న కొన్ని ఘాటైన అభ్యంతకర పదాలు, డైలాగ్స్‌పై చర్చ జరగడంతో సోషల్ మీడియాలో సైతాన్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సైతాన్ సిరీస్‌లోని ఒక ఎపిసోడ్‌తో పాటు షో రీల్‌ను మీడియాకు ప్రదర్శించారు. ఈ ఎపిసోడ్ వీక్షించిన మీడియా వారితో పాటు తదితరులు సిరీస్ కంటెంట్‌ను, టేకింగ్‌ను మెచ్చుకున్నారు. సమాజంలో జరిగే కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌లో కథా పాత్రలను రూపొందించామన్నాడు మహి వి రాఘవ్. ఆర్టిస్టులు రిషి, సెల్లి, జాఫర్, దేవయాని అలాగే ఇతర నటీనటులు అందరూ బాగా చేశారని ప్రశంసించాడు. ఒక తెలుగు వెబ్ సిరీస్‌లో క్రైమ్ సన్నివేశాలని ఈ తరహాలో భయకంరంగా చూపించడం ఇదే తొలిసారి అని, ఆ సీన్స్ వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉంటాయన్నాడు. ఈ వెబ్ సిరీస్ లో ఉండే వయలెన్స్.. బోల్డ్ కంటెంట్ డిస్టర్బ్ చేసే విధంగా ఉంటాయని కాబట్టి ఈ వెబ్ సిరీస్‌ను చూసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దర్శకుడు తెలిపాడు. చదవండి: మొన్ననే విడాకులు, అంతలోనే కలవాలని ఉందంటున్న నటుడు -
సైతాన్ ట్రైలర్ నిండా బూతులు.. స్పందించిన దర్శకుడు
ఓటీటీలో అశ్లీలత, అసభ్య పదజాలం వాడకం మించిపోతోంది. ఈ మధ్య అయితే కొన్ని సిరీస్‌లు పచ్చిబూతులతో చెలరేగిపోయాయి. తాజాగా ఇదే కోవలోకి వచ్చేందుకు సిద్ధమైంది సైతాన్. సేవ్ ద టైగర్స్‌తో నవ్వించిన దర్శకుడు మహి వి. రాఘవ్ సైతాన్‌తో భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్లో వాడిన దారుణ పదజాలం ఫ్యామిలీ ఆడియన్స్ చెవులు మూసుకునేలా ఉంది. రానా నాయుడును ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలా బూతులతో రెచ్చిపోయారా? అంటూ నెటిజన్లు దర్శకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విమర్శలపై డైరెక్టర్ మహి.వి. రాఘవ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'నేను ఈసారి క్రైమ్ డ్రామా జానర్ ఎంచుకున్నాను. ఇందులో నలుగురు వ్యక్తులు వారు సజీవంగా ఉండటం కోసం ఇతరులను చంపుకుంటూ పోతారు. ఇంతకుముందు నేనెప్పుడూ ఈ జానర్ టచ్ చేయలేదు. ఇందులో ఉన్న కంటెంట్ ప్రేక్షకులకు అర్థమవ్వాలంటే అందుకు తగ్గట్లుగా ఆ సన్నివేశాలు, బూతులు ఉండాల్సిందే! కథ డిమాండ్ చేసింది కాబట్టే వాటిని అలాగే ఉంచేశాం. అంతే తప్ప ప్రేక్షకులు నా సిరీస్ చూడాలని ఎంచుకున్న షార్ట్‌కట్ కాదిది. ఒక రచయితగా, దర్శకుడిగా జనాలకు ఒక కథ చెప్పాలనుకున్నాను. సైతాన్ క్యాప్షన్ ఏంటో తెలుసా? 'మీరందరూ నేరం అనేదాన్ని వారు మనుగడ అని చెప్తున్నారు'. సమాజంలో వివక్షకు గురైన ఎంతోమంది బాధితులే నేరస్థులుగా మారతారు. మిధుంటర్ మూవీలో చిన్న వయసులోనే వేధింపులకు, చీత్కారాలకు గురైన పిల్లలు తర్వాత నేరస్థులిగా మారారు. కానీ వారు అలా అవడానికి కారణం సమాజమే! ఈ పాయింట్ తీసుకునే సైతాన్ సిరీస్ తెరకెక్కించాను' అని చెప్పుకొచ్చాడు. కాగా సైతాన్ సిరీస్ జూన్ 15 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేయించాడు: అనసూయ -
సైతాన్ ట్రైలర్.. పచ్చిబూతులు, అడల్ట్ సన్నివేశాలు!
సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు మహి వి. రాఘవ్ తొలి సిరీస్‌తోనే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇదే జోష్‌లో సైతాన్ అనే మరో వెబ్ సిరీస్‌తో ముందుకు రాబోతున్నాడు. అయితే ఈసారి కామెడీ జానర్ కాకుండా క్రైమ్ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. తాజాగా సైతాన్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ప్రారంభంలోనే ఒంటరిగా చూడమని హెచ్చరిస్తూ ఓ నోట్ పెట్టారు. అంటే ఇదేదో భయంకరమైన సిరీస్ అనుకునేరు.. అంతా బూతులమయంతో ఉంది. 'ఈ సమాజం నేనొక నేరస్థుడిని అన్నా సరే నేను బాధితుడిని' అంటూ హత్యలకు పూనుకుంటాడో వ్యక్తి. 'మనలో ఒకరిని కాపాడుకోవడం కోసం ఎవరినైనా, ఎంతమందినైనా చంపాల్సిందే' అన్న మహిళా డైలాగ్‌తో ఇందులో రక్తపాతం ఎక్కువే ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత వచ్చే బూతు డైలాగులకు ఫ్యామిలీ ఆడియన్స్ చెవులు మూసుకోవడం ఖాయం. రాజకీయ నాయకులకు, పోలీసులకు విశ్వాసం, కృతజ్ఞతల్లాంటివి ఉండవు అనే డైలాగులు మెరిసినప్పటికీ తర్వాత వరుసగా పచ్చిబూతులు, అడల్ట్ సన్నివేశాలే కనిపిస్తాయి. ఈ ట్రైలర్ చూసిన నెటిజన్లు ఇది రానా నాయుడుకు నెక్స్ట్ లెవల్లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో ఓటీటీలకు సెన్సార్ అనేది ఉండదా? మరీ ఇంత దారుణంగా తయారయ్యారేంటి? దీనికి బదులు అడల్ట్ సినిమాలు తీసుకోండి అని ఫైర్ అవుతున్నారు. ఇక ఈ సిరీస్ జూన్ 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: శర్వానంద్ పెళ్లికి హాజరైన లవ్ బర్డ్స్ -
క్రైమ్ థ్రిల్లర్‌గా ‘సైతాన్’ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
‘సేవ్ ద టైగర్స్’వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ మహి వి. రాఘవ్. ఈ కామెడీ వెబ్ సిరీస్‌కి మహి క్రియేటివ్ ప్రొడ్యూసర్, షో రన్నర్‌గా వ్యవహరించారు. ప్రతి ఇంట్లో భార్య భర్తల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజై సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఇదే జోష్‌లో మరో వెబ్ సిరీస్‌ని విడుదల చేయబోతున్నాడు మహి. అదే ‘సైతాన్’. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకు కామెడీ అండ్ ఎమోషనల్ కథలనే తెరకెక్కించిన మహి..ఇప్పుడు క్రైమ్ నేపథ్యంలో ‘సైతాన్’ని తెరకెక్కించడం విశేషం. ‘సైతాన్' ఫస్ట్ లుక్ చూస్తే... నలుగురు కలిసి ఓ పోలీసును హత్య చేసినట్టు అర్థం అవుతోంది. ఎందుకు చంపారు? అనేది సిరీస్ చూస్తే తెలుస్తుంది. 'మీరు నేరం అని దేనిని అయితే అంటున్నారో... వాళ్ళు దానిని మనుగడ కోసం చేసిన పనిగా చెబుతున్నారు'' అని మహి వి. రాఘవ్ పేర్కొన్నారు. క్రైమ్ జానర్ ప్రాజెక్ట్ చేయడం ఆయనకు ఇదే తొలిసారి. దేవయాని శర్మ, మలయాళీ నటి షెల్లీ నబు కుమార్, నటుడు రిషి, జాఫర్ సాధిక్ కీలక పాత్రలు పోషించిన ఈ ఫుల్ లెంగ్త్ క్రైమ్ సిరీస్ ఈ నెల 15న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
యాత్ర 2 ఉంటుంది.. జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై...
‘‘యాత్ర’ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ప్రస్తుతం ‘యాత్ర 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ చిత్రంలోని పాత్రలకు తగ్గ నటీనటులు కుదరడం లేదు. పూర్తి కథ, నటీనటులు ఫైనల్ అయ్యాక ‘యాత్ర 2’ ని సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అని డైరెక్టర్ మహీ వి.రాఘవ్ అన్నారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి, హర్షవర్ధన్ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. మహీ వి.రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 27నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మహీ వి.రాఘవ్ పంచుకున్న విశేషాలు... ► మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘సేవ్ ది టైగర్స్’ నిరూపించింది. కుటుంబం అంతా కలిసి మా వెబ్ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. దీంతో ఒక మంచి సిరీస్ తీశామనే తృప్తి ఉంది. ఇలాంటి చక్కని సిరీస్‌ని నిర్మించే అవకాశం మాకు కల్పించిన డిస్నీ హాట్‌స్టార్‌కి థ్యాంక్స్. త్వరలో ‘సేవ్ ది టైగర్స్’ రెండో సిరీస్ షూటింగ్ ప్రారంభిస్తాం. ► ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల సమయంలో ‘యాత్ర 2’ ని విడుదల చేయనున్నారని, ఆ సినిమా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నకి సపోర్ట్‌గా ఉంటుందని వినిపిస్తున్న మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే సినిమా వల్ల ఓట్లు వస్తాయనుకోవడం అపోహ మాత్రమే. అలా అనుకుంటే ఇతర పార్టీల వారు కూడా నాలుగైదు సినిమాలు తీసుకోవచ్చు కదా? ఓటర్లందరూ నా ‘యాత్ర’ సినిమాని చూసుంటే ‘బాహుబలి’లా పెద్ద సినిమా అయ్యేది. ఓటర్లందరూ సినిమాలు చూస్తారని అనుకోవడం లేదు. జగన్ అన్న పాదయాత్రతో... ‘యాత్ర 2’ సినిమా జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుంది. కథ మొత్తం పూర్తయ్యాక ఆ వివరాలు చెబుతాను. ప్రస్తుతం నేను దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘సైతాన్’ అనే కొత్త వెబ్ సిరీస్‌తో జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. -
'సేవ్ ది టైగర్స్'.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన యాత్ర డైరెక్టర్!
డైరెక్టర్ మహి వీ రాఘవ సినీ ఇండస్ట్రీలో చాలామందికి తెలిసి ఉండదు. ఆయన దర్శకుడిగా తీసింది మూడు సినిమాలే అయినా మహీ వి రాఘవది శైలి వేరు. పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి చిత్రాలతో డిఫరెంట్ జానర్స్తో సినీ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మరోసారి సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్‌కు మహీ వి రాఘవ్ కథను అందించగా.. తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను మహీ సొంత నిర్మాణ సంస్ధ త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ప్రస్తుతం ఈ కామెడీ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. (ఇది చదవండి: ‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం) ఇటీవలే ఓటీటీ విడుదలైన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కరోనా టైంలో దొరికిన గ్యాప్‌లోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మహి కథ, కథనాన్ని అందించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన 'సేవ్ ది టైగర్స్' భార్యభర్తల మధ్య రిలేషన్స్, కుటుంబంలో ఉండే ఎమోషన్స్‌ను చక్కగా తెరకెక్కించారు. కాగా.. ఆయన త్వరలోనే బోల్డ్ కంటెంట్‌తో ఓటీటీలోకి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి, అభినవ్, రోహిణి, చైతన్యతో పాటు తదితరులు నటించారు. (ఇది చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్) -
పాన్ ఇండియా మూవీగా వైఎస్ జగన్ బయోపిక్
-
పాన్ ఇండియా మూవీగా వైఎస్ జగన్ బయోపిక్, హీరో ఎవరంటే..?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ హీరో మమ్ముట్టి చక్కగా ఒదిగిపోయారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ సినిమాకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు మహీ వి. రాఘవ్. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ని రూపొందించాలనుకుంటున్నారని తెలిసింది. జగన్ జీవితంపై సినిమా అనే వార్త వచ్చినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై వైఎస్ జగన్ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో, చిత్రపరిశ్రమలో చర్చలు మొదలయ్యాయి. జగన్ పాత్రలో ఎవరు కనిపిస్తారు? అనేది మరింత ఆసక్తిగా మారింది. ‘జగన్‌గారి పాత్రలో నటించేందుకు నన్ను సంప్రదిస్తే కచ్చితంగా నటిస్తా’ అని తమిళ హీరో సూర్య ఓ ఇంటర్వ్యూలో విలేకరి అడిగితే చెప్పారు. దీంతో సూర్య నటిస్తారనే ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అజ్మల్ నటిస్తారనే వార్తలూ వచ్చాయి. అయితే తాజాగా జగన్ పాత్రలో బాలీవుడ్ నటుడు, ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీ నటించనున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. ప్రతీక్ ఆహార్యం, హావభావాలు జగన్‌కి దగ్గరగా ఉంటాయని భావించి, మహీ ఆయన్ను ఎంపిక చేశారని సమాచారం. ఈ బయోపిక్ గురించి దర్శకుడు చెప్పగానే చాలా ఎగై్జట్ అయి, నటించడానికి ప్రతీక్ అంగీకారం తెలిపారని భోగట్టా. వైఎస్ జగన్ క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకుని ప్యాన్ ఇండియా చిత్రంగా తీయనున్నారట. జగన్ సొంతంగా పార్టీ స్థాపించడం, పాదయాత్ర, ఎదుర్కొన్న సవాళ్లు, ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలిసింది. -
లోకం ఎలా ఉంది నాయనా?
మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వి. రాఘవ్ ఇటీవల కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ‘సిద్దా.. లోకం ఎలా ఉంది నాయనా’ టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం లోకం తీరు ఎలా ఉంది? అనే అంశంపై సెటైర్‌గా ఈ చిత్రకథాంశం ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ కథగా రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్ చేస్తున్నారు. ‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాల్లో హీరోయిన్గా నటించారు శ్రద్ధ. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ముహూర్తం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
క్రేజీ న్యూస్.. బన్నీ, విజయ్ మల్టీస్టారర్!
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. గతంలో ఎప్పుడు లేనంతగా ఇటీవల దాదాపు స్టార్ హీరోలు అందరూ మరో హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక దర్శక, నిర్మాతలు కూడా ధైర్యంగా ఇద్దరి హీరోలతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్,ఎన్టీఆర్‌లు కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే పవన్ కల్యాణ్, రానా కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్లో మరో క్రేజీ మల్టీస్టారర్ రాబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారనే వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ చిత్రాల దర్శకుడు మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని అంటున్నారు. అంతేకాదు, ఈ భారీ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించనున్నారట. మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందంటున్నారు. బన్నీ, విజయ్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అల్లు అర్జున్‌ని విజయ్ ఆప్యాయంగా బన్నీ అన్న అని పిలుస్తుంటాడు. అలాగే విజయ్‌ని బన్నీ బ్రదర్ అని సంభోదిస్తాడు. విజయ్‌కు చెందిన ‘రౌడీ బ్రాండ్’ దుస్తులు ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇంత క్లోజ్‌గా ఉండే ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తే అభిమానులకు పండగనే చెప్పొచ్చు. ఇక బన్నీ-రౌడీలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు. మరోవైపు విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ సరసన నటిస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటిస్తోంది. -
నాగ్ – మహీ – ఓ సినిమా?
‘ఆనందోబ్రహ్మ, యాత్ర’ సినిమాలతో ఆకట్టుకున్నారు దర్శకుడు మహీ వి. రాఘవ్. తన తదుపరి చిత్రాన్ని నాగార్జునతో ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే నాగార్జునను కలసి కథాచర్చలు జరిపారట మహీ. త్వరలోనే ఈ కాంబినేషన్లో సినిమా ఉండబోతోందని టాక్. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నారు నాగ్. ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండూ పూర్తయ్యాక మïß వి. రాఘవ్ దర్శకత్వంలో సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమా క్రైమ్ జానర్లో ఉంటుందని సమాచారం. -
ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా?
‘‘పవన్ కల్యాణ్‌తో తీయబోయే సినిమాలో విలన్ పాత్ర చేయగలరా? అని పదేళ్ల క్రితం మమ్ముట్టిని అడిగితే, ఇదే ప్రశ్న చిరంజీవిని అడగగలరా అన్నాడు. మమ్ముట్టి వ్యక్తిత్వానికి అది నిదర్శనం’’ అన్నారు అల్లు అరవింద్. మమ్ముట్టి లీడ్ రోల్లో పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మామాంగం’. ఈ సినిమా తెలుగు, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 12న విడుదలవుతోంది. తెలుగులో విడుదల చేస్తున్న అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కేరళలోని చావెరుక్కల్ యుద్ధ వీరులకు గొప్ప చరిత్ర ఉంది. కలరీ యుద్ధ విద్యలో ఆరితేరిన వారి కథతో మమ్ముట్టి ఈ సినిమా చేయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘మామాంగం’ కేరళకు సంబంధించిన కథే కాదు. ప్రతి భారతీయుడు దీని గురించి తెలుసుకోవాలి. ప్రతి 12 ఏళ్లకు జరిగే మామాంగం అనే ఉత్సవం నేపథ్యంలో ఉత్కంఠభరితంగా ఉంటుంది’’ అన్నారు మమ్ముట్టి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహి.వి రాఘవ్ పాల్గొన్నారు. -
హీరో పాత్రనా, దేవుడి పాత్రనా చెప్పలేను
వైఎస్ వంటి గొప్ప వ్యక్తి బయోపిక్ అనుకున్నప్పుడు మీకు ఎదురైన సవాళ్లు ఏంటి? సినిమా తీయాలనుకున్నప్పుడు భయం లేదు. కానీ, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి వచ్చిన జనాలను చూస్తే భయమేసింది. ఇంతమంది నాపై నమ్మకం పెట్టుకున్నారు. వారి అంచనాలను అందుకోగలమా? అని. అయితే నేను ఓ సినిమా కంటే వైఎస్‌గారి పాజిటివ్ స్టోరీ చెబుతున్నానని అనుకున్నా, అప్పుడు చాలా నమ్మకం కలిగేది. వైఎస్ గురించి నాకు చాలా తక్కువ తెలియడం వల్ల సినిమాపై నమ్మకం ఎక్కువ ఉండేది. అది తలరాతేమో తెలియదు కానీ, ఆయన కథ నేను ప్రజలకు చెప్పాలని రాసి ఉందేమో(నవ్వుతూ). ‘యాత్ర’ కోసం ఓ డైరెక్టర్‌గా కాకుండా రచయితగా మీ అనుభవాలేంటి? పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలకు స్వయంగా కథ రాసుకున్నా. వీటిల్లో ‘యాత్ర’ ∙రాయడం సులభంగా అనిపించింది. ఎక్కడా తడబడలేదు. అది ఎందుకో తెలియదు. ఈ చిత్రంలోని డైలాగ్స్ నేనేదో అనుకొనో, బాగా పరిశోధించి రాశానని చెప్పడానికో లేదు. ఆయన గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నవే రాశా. వైఎస్ పాత్రని మీరు వేటిని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు? నేను ఆయన్ని దగ్గరి నుంచి చూడలేదు. చాలా మందిని కలిసి వారి అనుభవాలు తెలుసుకున్నా. యూట్యూబ్‌లో ఆయన గురించి ఉన్న ఇంటర్వూ్యలు, కథనాలు చదివా. ఆయనతో చాలా మంది ప్రయాణించారు. వారందరికీ చాలా అనుభూతులున్నాయి. వాటికి నా ఊహల్ని జతచేసి ‘యాత్ర’ చేశా. ఆ పాత్ర రాసేటప్పుడు మీ మానసిక సంఘర్షణ ఎలా ఉండేది? ఆయన ప్రజలకు దూరమై పదేళ్లవుతున్నా ఇప్పటికీ జనాలు ఆయన గురించి మంచిగా మాట్లాడుతున్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్... ఇలాంటి పథకాలు కావొచ్చు, ఆయన తోటి మనుషులకు ఇచ్చిన విలువ కావొచ్చు... అది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నాకు తెలిసిన వైఎస్లోని లక్షణాల నుంచి పుట్టింది ‘యాత్ర’ కథ. ఆయనది హీరో పాత్రనా, దేవుడి పాత్రనా అన్నది అనుకోలేదు. ఏ సన్నివేశం రాస్తున్నప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు? వైఎస్ అనగానే రైతు బాంధవుడు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ గుర్తుకొస్తాయి. అలాంటి రైతు బాంధవుడికి ఓ రైతు తన కష్టం ఎలా చెబుతాడు? దానికి వైఎస్‌గారు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఒకటి, రెండు పేజీల డైలాగులతోనూ చెప్పొచ్చు. కానీ, ఒక్కమాట కూడా రైతు చెప్పకుండానే ‘నాకు వినపడుతోందయ్యా, నేను విన్నాను... నేను ఉన్నాను’ అనే డైలాగ్‌తో చెప్పించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఆస్పత్రి సన్నివేశంలో ఆ ఎమోషన్స్‌ని క్యాప్చర్ చేయగలిగాం. నాకు బాగా నచ్చిన సన్నివేశం అదే. సినిమాకి వచ్చిన స్పందనకి మీలోని రచయిత సంతృప్తి చెందాడా? నేను ఓ ఐదు, పదేళ్లు సినిమాలు చేసినా, వంద కోట్ల బడ్జెట్ సినిమా చేసినా ‘యాత్ర’ నాకు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తుంటుంది. ‘ఆనందోబ్రహ్మ’ చూసి నవ్వుకున్నాం అంటారు. కానీ, ‘యాత్ర’ అనేది ప్రజల్లో ఎమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చింది. అది చాలా కష్టం. వేరే హిట్ సినిమాలు చాలా ఉండొచ్చు. కానీ, వైఎస్ అభిమానులతో పాటు రాయలసీమ ప్రజలు చూపించిన అభిమానం, ఆ ప్యాయత తెచ్చుకోవడం కష్టం. అవి దొరకడం నా అదృష్టం. ఏ బంధమో తెలియదు కానీ, ఆయన కథ చెప్పే గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు వైఎస్‌గారికి థ్యాంక్స్. దీనివల్ల ఓ ఫిలిం మేకర్‌గా నాకు విశ్వసనీయత, గుర్తింపు వచ్చాయి. -డేరంగుల జగన్ -
‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!
పాఠశాల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మహి వీ రాఘవ్ ఆనందో బ్రహ్మ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు. తరువాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన యాత్ర సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లను కూడా సాధించింది. యాత్ర తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మహి, తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు మహి. ‘ఓ దర్శకుడు కథ చెప్పటం కన్నా, ఏ కథ చెప్పాలి అని నిర్ణయించుకోవటమే కష్టమైన పని. బాక్సాఫీస్ ట్రెండ్స్, బడ్జెట్, నటీనటులు ఇవేవి కథ ఎంపికకు సాయపడవు. నిశ్శబ్ధంలో వచ్చే ఓ ఆలోచన.. ఇదే నువ్వు చెప్పాల్సిన కథ అని నాకు తెలియజేస్తుంది. నా తదుపరి చిత్రం ఓ యాక్షన్ డ్రామా. టైటిల్ ‘సిండికేట్’. త్వరలోనే ఈ కథ, పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా, ఆ స్క్రిప్ట్ సినిమాగా వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ‘SYNDICATE’ pic.twitter.com/6DAyGGqjFf — Mahi Vraghav (@MahiVraghav) July 30, 2019 -
రెండో యాత్రకు శ్రీకారం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దీంతో ‘యాత్ర’ సీక్వెల్‌కు శ్రీకారం చూట్టారు మహీ వి. రాఘవ్. ‘‘వై.ఎస్. రాజారెడ్డి (వైఎస్సార్ తండ్రి), వై.ఎస్. జగన్ పాత్రలు లేకుండా వైఎస్సార్‌గారి కథ సంపూర్ణంగా అనిపించదు. ‘యాత్ర’ సినిమా వై.ఎస్. జగన్‌గారి విజువల్స్‌తో ముగుస్తుంది. ‘యాత్ర 2’ను అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనే ఆలోచనతోనే అలా చేశాం’’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహి.వి. రాఘవ్. -
‘యాత్ర 2’ కథ అక్కడ మొదలవుతుంది!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన మహి వీ రాఘవ, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో యాత్ర 2 సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ యాత్ర 2కు సంబంధించిన హింట్ ఇచ్చారు దర్శకుడు మహి. తాజాగా యాత్ర 2 సినిమాకు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు. ‘వైఎస్ రాజా రెడ్డి, వైఎస్ జగన్ ల గురించి చెప్పకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ పూర్తి కాదు. యాత్ర 2 ఆయన కథను పరిపూర్ణం చేస్తుంది. రాజశేఖర్ రెడ్డి యాత్ర తన తండ్రి సమాధి దగ్గర నుండి ప్రారంభమైంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా ప్రారంభమైంది’ అంటూ ట్వీట్ చేశారు మహి వీ రాఘవ. పావురాల గుట్ట దగ్గర వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తన తండ్రి మరణం తట్టుకోలేక చనిపోయిన వారిని స్వయంగా వచ్చి కలుస్తానని ప్రజలకు ఇచ్చిన మాట, ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులు. ఎన్ని కష్టాలు ఎదురైన మాట నిలబెట్టుకునేందుకు వైఎస్ జగన్ ముందడుగు వేయటం, 9 ఏళ్ల పోరాటం తరువాత అఖండ విజయం సాధించటం లాంటి అంశాల నేపథ్యంలో సీక్వెల్ సాగుతుందని అంచనా వేస్తున్నారు. YSR’S story is incomplete without Y.S. Raja reddy & Y.S.Jagan. Yatra 2 will complete their story. The reason why Yatra ended on Y.S. Jagan is we could take it off from where we left. YSR’s Yatra started from his father grave and Jagan’s Yatra from his father’s #yatra2 @ShivaMeka — Mahi Vraghav (@MahiVraghav) 29 May 2019 -
వైఎస్ జగన్ ఘనవిజయం.. ‘యాత్ర 2’
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సునామీలో ప్రత్యర్థి పార్టీలన్ని కొట్టుకుపోయాయి. వైఎస్ జగన్ విజయం ఖాయమైపోవటంతో ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. సుధీర్ బాబు, రవితేజ లాంటి సినీ హీరోలు కూడా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇక దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు మహీ వీ రాఘవ కూడా వైఎస్ఆర్సీపీ సునామీపై స్పందించారు. వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఆయన ‘మీరు భవిష్యత్ తరాలకు చెప్పాల్సినంత గొప్ప విజయాన్ని అందించారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు యాత్ర 2 (#Yatra2) అనే ట్యాగ్‌ను కూడా జోడించారు. Congratulations to @ysjagan @YSRCParty Anna a truly deserving victory. As promised Hope you deliver more than Y S Rajasekhar Reddy Garu. You have a written and made story worth telling.. :) #yatra2 @ShivaMeka pic.twitter.com/1BI6ArOMFh — Mahi Vraghav (@MahiVraghav) 23 May 2019 Congratulations to the youngest CM of AP @ysjagan garu. Looking forward for good Governance...wishing you all the good luck🙏 — Ravi Teja (@RaviTeja_offl) 23 May 2019 Congratulations @ysjagan garu. The people of Andhra Pradesh have given you both, the victory and the responsibility. Sending my best wishes. Let's all work together for a greater AP. #APElectionResults2019 — Sudheer Babu (@isudheerbabu) 23 May 2019 -
జగన్ అనే నేను; అప్నా టైమ్ ఆయేగా...
-
జగన్ అనే నేను; అప్నా టైమ్ ఆయేగా...
అధికారం కోసం పరితపించే వాడు రాజకీయ నాయకుడు మాత్రమే అనిపించుకుంటాడు.. అదే ఆశయసాధన కోసం కష్టాల్ని సైతం లెక్కచేయని మనస్తతత్వం ఉన్నవాడు ప్రజానాయకుడిగా ఎదుగుతాడు.. ప్రజల గుండెల్లో శాశ్వతంగా కొలువు ఉంటాడు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. అందుకే ప్రజా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజన్న ‘ఆశయ’ వారసత్వాన్ని కొనసాగించేందుకు అనేక కష్టనష్టాలకోర్చి 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించి ప్రజా సమస్యల గురించి స్వయంగా తెలుసుకున్నారు. ఆ క్రమంలో హత్యాయత్నం వంటి ఘటనలు చోటుచేసుకున్నా మడమ తిప్పక ప్రజాక్షేత్రంలోనే గడిపారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రత్యర్థులు తన చిన్నాన్నను హత్య చేసి కుట్ర రాజకీయాలకు తెరతీసినా బాధను దిగమింగి.. సంయమనం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘జగన్ అనే నేను’ అంటూ ఆయన పలికే మాటల కోసం వైఎస్ జగన్ అభిమానులే కాదు సామాన్య ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో రాజన్న పాదయాత్ర ఘట్టాన్ని ‘ యాత్ర’గా తెరకెక్కించిన సినిమా దర్శకుడు మహి వి రాఘవ్ ప్రస్తుతం ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. వైఎస్ జగన్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యాలకు.. ‘జైబోలో ఆజాదీ’ అంటూ ఫుల్‌జోష్‌గా సాగే బీజీని జతచేశారు. ‘అప్నా టైమ్ ఆయేగా’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
కొత్త రచయితల కోసం...
‘ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ మహి వి.రాఘవ్. వరుసగా రెండు విజయాలు సొంతం చేసుకున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారారు. ‘‘ఓ గొప్ప చిత్రాన్ని ప్రేక్షకుల ముందుంచాలంటే మూడు ముఖ్యాంశాలు కావాలి.. అందులో మొదటిది కథ, రెండోది కథ, మూడోది కూడా కథే. ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ మేకర్ ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ చెప్పిన ఈ మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నాను’’ అని మహి వి. రాఘవ్ తెలిపారు. శివమేక, రాకేష్ మంహకాళి వంటి సన్నిహితులతో కలసి ‘త్రీ ఆటమన్ లీవ్స్’ పేరిట ఓ ప్రొడక్షన్ హౌస్‌ని స్థాపించారు మహి. ‘‘సంప్రదాయ తెలుగు సినిమా ప్రొడక్షన్ సంస్థల మాదిరిగా సినిమాల్ని నిర్మించి, విడుదల చేసే పద్ధతికి పూర్తి భిన్నంగా మా సంస్థ అడుగులు వేస్తుంది. ఔత్సాహికులైన రచయితల్ని, సినిమా కథలు రాయగలిగే సత్తా ఉన్న యువ ఫిల్మ్ రైటర్స్‌ని ప్రోత్సహిస్తూ వారి చేత కొత్త కథల్ని తయారు చేయించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. కథలకి, కథకులకి డబ్బులు పెడుతూ అలా పురుడు పోసుకున్న స్క్రిప్ట్స్‌ని పలు నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించేందుకు మా సంస్థ ముందుంటుంది. ‘యాత్ర’ సినిమాకి ‘త్రీ ఆటమన్ లీవ్స్’ సంస్థ సహ నిర్మాతగా వ్యవహరించింది. ఔత్సాహికులైన రచయితల్ని, కొత్త కథల్ని ప్రోత్సహించే నిర్మాణసంస్థలతో భాగస్వాములు అయ్యేందుకు మా సంస్థ ముందుంటుంది. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీ రచయితలు, ఫిల్మ్ మేకర్స్, నిర్మాణ సంస్థలు, చానల్ పార్టనర్స్‌తో జతకలిసేందుకు ‘త్రీ ఆటమన్ లీవ్స్’ సంస్థ సుముఖంగా ఉంది’’ అన్నారు. -
మరో తెలుగు సినిమాలో దుల్కర్
మళయాల యువ కథనాయుకు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఓకె బంగారం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించిన దుల్కర్, మహానటితో స్ట్రయిట్ తెలుగులో సినిమా నటించాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో దుల్కర్‌ను టాలీవుడ్ నుంచి ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఈ యువ నటుడు మరో తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మళయాల మెగాస్టార్ దుల్కర్ తండ్రి అయిన మమ్ముట్టి ప్రధాన పాత్రలో యాత్ర సినిమాను తెరకెక్కించిన మహి వీ రాఘవ దర్శకత్వంలో దుల్కర్, తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే మహి చెప్పిన లైన్‌కు ఓకె చెప్పిన ఈ యంగ్ హీరో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. -
బాధ్యతారాహిత్యంపై దండ‘యాత్ర’
కళకీ కులాలుంటాయి. సినిమాలకీ రాజకీయాలుంటాయి. మనోళ్ల కళ హాయిగా కళ కళ లాడుతూ ఉంటుంది. మనోళ్లకి నష్టం తెచ్చే పరాయి వారి కళ ఎంతబాగున్నా వెల వెలబోతుంది. అసలామాటకొస్తే మనోడి సినిమా బాగాలేకపోయినా.. అద్భుతంగా ఉందని చెప్పడానికి మనకి భయమే ఉండదు. మనోడి సినిమాకన్నా అవతలోడి సినిమా నిజంగానే అద్భుతంగా ఉన్నా...మన మాటల వల్ల కూడా ఆ సినిమాకి ప్రచారం జరిగిపోతే కొంపలంటుకుపోతాయి కాబట్టి దాని గురించి మాట్లాడనే మాట్లాడం. ఇపుడు టాలీవుడ్ లో మెజారిటీ ప్రముఖులకు ఓ సినిమా అంటరానిదైపోయింది. దాని గురించి మాట్లాడ్డమే నేరమన్నట్లు అంతా మౌనవ్రతం పట్టేశారు. ఆ సినిమాయే యాత్ర. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవితంలో ఓ చిన్న అధ్యాయం పాదయాత్ర. ఆ చిన్నపాటి ఘట్టాన్నే ఇతివృత్తంగా తీసుకున్న నిర్మాత...ఓ వర్ధమాన దర్శకుడు కలిసి ఈ సినిమాని తెరకెక్కించారు. ఎలాంటి హడావిళ్లూ..ప్రచార ఆర్భాటాలూ లేకుండా యాత్ర సినిమాని విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ అయ్యింది. చిత్రంగా టాలీవుడ్ లో ఏ సినీ ప్రముఖుడూ కూడా ఈ సినిమా గురించి ఒక్క మాట మాట్లాడలేదు. సినిమా బాగుందనో.. బాగాలేదనో చెప్పలేదు. దీనికి కొద్ది రోజుల ముందు నందమూరి బాలకృష్ణ నటించిన కథానాయకుడు సినిమా అత్యంత ఆర్భాటంగా విడుదలైంది. సినిమా విడుదలకు మూడు నెలల ముందు నుంచే అన్ని చానెళ్లూ..పత్రికలూ కథానాయకుడి గురించి లెక్కకు మించిన కథనాలు రాసి ప్రమోట్ చేశాయి. అంత హడావిడీ చేసి విడుదల చేసిన సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా సినిమా గురించి ఆహా ఓహో అని పొగిడారు. ట్విట్టర్ లో పోస్టింగులు పెట్టి తమ బాధ్యత నెరవేర్చుకున్నారు. ఈ పెద్దలంతా యాత్ర సినిమా విషయం వచ్చేసరికి నోళ్లు కట్టేసుకున్నారు. కలాలు పక్కన పెట్టేశారు. మౌస్ లు కదలకుండా పట్టేసుకున్నారు. ఇదంతా ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోయింది కాదు. కావాలనే..ఒక పథకం ప్రకారమే.. యాత్ర గురించి మాట్లాడకుండా అందరూ మౌనంగా ఉండిపోయారు. ఎందువల్ల చేత? యాత్ర సినిమాని పొరపాటున బాగుందంటే...ఏపీలో ఒక రాజకీయ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుతుందేమనని కంగారు పడ్డారేమోనని అనిపించగానే ఆందోళన కలిగింది. అక్కడ ఒకానొక మన రాజకీయ పార్టీకి నష్టం చేకూరుస్తుందేమో...మన పార్టీ పెద్దలకు మనపై కోపం వస్తుందేమో అని భయపడ్డారేమో అనిపించగానే జాలేసింది. సినీ రంగంలో ఉన్న చాలా మంది మేథావులు..సినీ క్రిటిక్స్ సైతం యాత్ర సినిమా విషయంలో స్ట్రైక్ చేసినట్లు స్పందించకపోవిడం చూసి మనసు చివుక్కుమంది. టాలీవుడ్ లో భిన్న వైరుధ్యాలు..శత్రుత్వాలూ ఉన్న గ్రూపులన్నీ కూడా యాత్రను ప్రమోట్ చేయకూడదన్న ఒకే ఒక్క అంశంలో ఒక్కతాటిపైకి రావడం చూసి భయమేసింది. ఏ చిన్న సినిమాయో అనాథలా విడుదలై హిట్ అయితే..స్పందించకపోతే బాగుండదేమోనని బాగుందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే సినీ జీనియస్ లు సైతం యాత్ర ను వెలివేయడం చూసి బాధేసింది. సామాజిక వర్గం ఆధారంగా ఓ సినిమాని ఇలా వెలివేసేసే పెద్దలున్న కాలంలోనే నేనూ బతుకుతున్నందుకు సిగ్గేసింది. ఈ పెద్దలంతా కూడా... కథానాయకుడి విషయంలో ఇందుకు భిన్నంగా స్పందించడం చూసి ఆశ్చర్యమేసింది. కథానాయకుడు సినిమా ఫ్లాప్ అని తేలిపోయిన తర్వాత కూడా.. అన్ని చానెళ్లూ..అందరు సినీ ప్రముఖులూ కూడా ఒకటే భజన. కథానాయకుడి సినిమా చాలా బాగున్నప్పటికీ..బాలకృష్ణ నటన అద్భుతంగా ఉన్నప్పటికీ...సినిమా అనుకున్నట్లు ఆడలేదట. అంటే..మనోడి సినిమాని మెచ్చుకోకపోతే..మొత్తం ప్రేక్షకులందరినీ బోనులో నిలబెట్టి..ఇంత మంచి సినిమా ఎందుకు చూడలేదని కాలర్ పట్టుకుని నిలేస్తారన్నమాట. అదే అవతలోడి యాత్ర ఎవరూ ప్రమోట్ చేయకపోయినా..మీడియా ఏ పాటి ప్రాధాన్యత ఇవ్వకపోయినా..విడుదలై జనం అద్భుతంగా ఉందని మెచ్చుకుంటే... ఆ విషయం ఎవరికీ తెలీకుండా ఉండేందుకు మొత్తం యాత్ర సినిమానే బోనులో పెట్టేస్తారన్నమాట. యాత్రపై కోపానికి చాలా కారణాలే ఉండచ్చు. ఎందుకంటే..చాలా సినిమాల్లా యాత్ర సినిమా ఆర్భాటంగా ముందుకు రాలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి భారీ సెట్టింగులు వేసి..సినీ పరిశ్రమలోని అతిరథమహారథులను పిలిచి తారల తళుక్కుల మధ్య నిర్వహించలేదు. సినిమాలో సుమోలు గాల్లోకి లేచి కిందపడలేదు. అమ్మాయిల అంగాంగ ప్రదర్శనలతో యువతకు గేలం వేయలేదు. భారీ సెట్టింగులూ లేవు..ఘోరమైన ఫైటింగులూ లేవు. ఓ ఊరి నుంచి మరో ఊరికి ఎడ్లబండిపై వెళ్లినట్లు సినిమాని ముందుకు నడిపించారు దర్శకుడు మహి. సినిమాకి సంబంధించిన రూల్స్ ని పక్కన పెట్టి.. సినీ పరిశ్రమలోని సంప్రదాయాలను పట్టించుకోకుండా.. అత్యంత సింపుల్ గా సినిమా విడుదల చేసేసి..హిట్ కొట్టేసి.. కాలరెగరేస్తే ఎలాగ? అనుకున్నారో ఏమో కానీ చిత్ర పరిశ్రమ అంతా ఒకేలా సహాయనిరాకరణ ప్రదర్శించింది. సమకాలీన అంశాలపై తమ తమ యూట్యూబ్ ఛానెళ్లలో అద్భుతంగా స్పందించే సినీ మేథావులు తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి బ్రదర్స్, నాగబాబులతో పాటు..సోషల్ మీడియాలో భిన్న అంశాలపై బాధ్యతాయుతంగా తమ అభిప్రాయాలను వెల్లడించే..సాహితీ ప్రియులు...విమర్శకులు సైతం యాత్ర మనది కాదులేనని వదిలేయడం అన్యాయం అనిపించింది. సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఆర్ఫాన్- అన్న సామెత కూడా అన్ని వేళలా..అన్ని కాలాల్లోనూ నిజం కాదనిపించింది. ఎందుకంటే కథానాయకుడు ఫెయిల్ అయినా..మేథావులు..సినీ ప్రముఖులూ.. జర్నలిస్టులూ అంతా కూడా సినిమా బాగుంది కానీ..ఎక్కువ మంది చూడలేదని కితాబునిచ్చారు. అంటే మనోళ్ల ఫెయిల్యూర్ కి కూడా చాలా మంది ఫాదర్సూ,బాబాయిలూ..మావయ్యలూ దూరపు చుట్టాలూ అండగా నిలిచారు. సినిమా బాగుంటే జనం ఎందుకు చూడరు? జనం చూడకపోవడం వల్లనే కదా సినిమా ఫ్లాప్ అయ్యింది. చూడలేదంటే ఆ సినిమా జనానికి నచ్చలేదనే కదా. అదే యాత్ర చాలా బాగుందని జనం మెచ్చుకున్నా..సినిమా హిట్ అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క మంచి మాట అనలేకపోవడం దేనికి సంకేతం? అన్నింటినీ మించిన దారుణం ఏంటంటే..యాత్ర సినిమా ఘన విజయం సాధించాక..చిత్ర యూనిట్ విశాఖ పట్టణంలో సక్సెస్ మీట్ పెట్టారు. దానికి చిత్ర కథానాయకుడు..మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా వచ్చారు. చిన్న చిన్న సినిమాల సక్సెస్ మీట్ లు జరిగినా మీడియాలో వార్తలు వస్తారు. కానీ యాత్ర సక్సెస్ మీట్ వార్తలు మాత్రం ప్రధాన పత్రికలు పక్కన పెట్టేశాయి. యాత్రను మీడియా కూడా వెలి వేసిందన్నమాట. యాత్ర సక్సెస్ అయినా ..అనాథగా వదిలేసి వెళ్లిపోవాలని మెజారిటీ పెద్దలు అనుకున్నారు. అయితే యాత్ర అనాథ కాలేదు. 5కోట్ల మంది ప్రజలు యాత్రను దత్తత తీసుకుని తమ గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్నారు. జన హృదయాల్లోంచి యాత్ర సంతకాన్ని ఎవరూ చెరపలేరు. మనం మెచ్చిందే కళ...మనం చెప్పిందే వేదం అన్న ఆలోచన ఎంత ప్రమాదకరం? కళ మనకో మనోళ్లకో...మనోళ్ల పార్టీలకో మేలు చేసేదై ఉండాలనుకోవడం ఎంత బాధ్యతారాహిత్యం? ఎంత దారుణం? - సి.ఎన్.ఎస్.యాజులు -
‘ఆ పేరు తెలుగునాట ఒక బ్రాండ్’
‘యాత్ర’ YSR బయోపిక్ కాదు, అది తీయడానికి రెండున్నర గంటల సినిమా నిడివి సరిపోదు. కేవలం ‘పాదయాత్ర’ అంటే, అంతసేపు ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడానికి సరుకు చాలదు. మరేంటి? ఈ ఉత్సుకతతోనే సినిమాకెళ్ళా! ఓపెన్ మైండ్‌తో, నిర్మల మనసుతో సాంతం చూశా. ఇంటర్మిషన్, ది ఎండ్ త్వరగా వచ్చాయి. నడుమ నాలుగయిదు మార్లు కళ్ళు చేమర్చినా, అరె! సినిమా అప్పుడే అయిపోయిందే! అనిపించింది. హాట్సాఫ్ టు ది డైరెక్టర్. చిత్రీకరణ నైపుణ్యమే కాదు సినిమా అంతటా నిజాయితీ ఉంది. అందుకే ఆ నిండుతనం. జనమాధ్యమాల (mass communication) లో సెల్యులాయిడ్, సినిమా ఎంత పవర్ఫుల్లో మరోమారు అర్థమైంది. ‘వైఎస్సార్’ అని పొట్టిగా పిలిచినా, ‘రాజశేఖరరెడ్డి’ అంటూ రాజసం చిలికినా, ‘డా.వైఎస్సార్’ని ఒడలు పులకించేలా పొడుగ్గా పలికినా... నాలుగు దశాబ్దాలు ఆ పేరు తెలుగునాట ఒక బ్రాండ్! ఎందుకు? ఎందువల్ల? ఏ కారణంగా? క్రమంగా వికసించిన ఆయన వ్యక్తిత్వం, తనవారితో మమేకమయ్యే జీవనశైలి, ద్విదృవ మొండి/హుందాతనం, ఊపిరై సహవాసం చేసిన మానవత, జనం కోసం ఏమైనా చేయగల తెగువ... ఇవే, దర్శకుడికి ముడిసరుకయ్యాయి. అందుకే, సంఘటనలు, సన్నివేశాల వరుస మార్చినా, అక్కడక్కడ నిజాలకు సినీమాటిక్ ట్రిక్కులద్దినా... ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. చరిత్ర సృష్టించిన ‘ఆరోగ్యశ్రీ’, రికార్డుకెక్కిన ‘ఫీ రిఇంబర్స్మెంట్’, నేటికీ నిలిచిన ‘ఉచిత విద్యుత్’, సాచురేషన్ వరకిచ్చిన ‘పెన్షన్లు’, ప్రాంతాల గతి మార్చిన ‘జలయజ్ణం’ ఇలా, అయిదున్నరేళ్ళు అభివృద్ధి - సంక్షేమం జోడు గుర్రాల స్వారీతో పాలన పరుగులెత్తించిన దాదాపు అన్ని పథకాలూ.... ‘పాదయాత్ర’లో ఎలా పురుడు పోసుకున్నాయో ఒడుపుగా తెరకెక్కించాడు దర్శకుడు మహి వి రాఘవ్ దట్సాల్! కుళ్ళు రాజకీయాల్ని జొప్పించలేదు, ఒకటీ అరా ఆహ్లాదపరిచే సెటైర్లు తప్ప! ‘నటన’ కళ అయితే, అది తప్పక భాషాతీతమని మమ్ముట్టి తన నిండైన రూపం, చాతుర్యం, మ్యానరిజం, కడకు వాచకం (తనదే డబ్బింగ్)తో నిరూపించాడు. చివరికి, గ్రేట్.... కనబడీ కనబడనీకుండా కంటతడి తుడిచేసుకుంటారు గనుక, ‘రాజకీయాల్లో ఉంటే వైఎస్సార్ లా ఉండాలి, ‘అధికారం’ అబ్బితే ఆయనలా నడవాలి, మనిషై మాటిస్తే రాజన్నలా కట్టుబడాలి, స్నేహమంటూ చేస్తే అతనిలా విశ్వసించాలి, ఇవేవీ చేయలేకపోయినా.... మనకెప్పటికీ YSR లాంటి పాలకుడుండాలి’ అనుకుంటూ, ప్రేక్షకులంతా బరువెక్కిన గుండెలతో థియేటర్ బయటకు నడుస్తారు. -దిలీప్ రెడ్డి. -
అంతరంగ ‘యాత్ర’
డైరెక్టర్ మహి ఇది బయోపిక్ కాదన్నాడు. నిజమే... జననంతో మొదలై మరణంతో అంతమయ్యే డాక్యుమెంటరీలా లేదు. ఈవెంట్ బేస్డ్ స్టోరీ అన్నాడు. అది మాత్రం నిజం కాదనుకుంటా... ఎందుకంటే.. వైఎస్ పాదయాత్ర కేవలం ఓ క్రతువు కాదు. వసివాడిన పేదల జీవితాల్లో వికసించిన వసంత రుతువు. అది ముగిసిన యాత్ర కాదు.. ‘‘నడుస్తున్న’’ చరిత్ర. అందుకే తడుస్తున్న కళ్లతో ప్రేక్షకులు ఆ చిత్రాన్ని చూస్తున్నారు. బరువెక్కిన హృదయాలతో బయటికి వస్తున్నారు. ఈ దర్శకుడు నిజంగానే ‘మహి’మాన్వితుడు. లేకపోతే.. ఎక్కడో విదేశాల్లో ఉండి ఆంధ్రదేశంలో సాగిన పాదపాత్రని.. ఎలా చూడగలిగాడు..! కంట తడిపెట్టించే సంభాషణల సాగు ఎలా చేశాడు..! హృదయాన్ని కదిలించే కడగళ్ల కథని ఎలా రాశాడు..! పాదయాత్ర సాక్షిగా రాజన్న జనం గుండె చప్పుడు వింటుంటే.. ఈ దర్శకుడు అదృశ్యంగా ఉండి.. పెద్దాయన అంతరంగాన్నే ఆలకించినట్టున్నాడు. యాత్ర చూస్తున్నంత సేపూ.. మహికి మహిమలేమన్నా వచ్చా.. అన్న సందేహం రావొచ్చు. అంతలా కనికట్టు చేశాడు. కట్టిపడేశాడు. కష్టాలకి తలవంచని తత్వం, మాట తప్పని వ్యక్తిత్వం, అనుకున్నది సాధించే మొండితనం, శత్రువునైనా ప్రేమించే మంచితనం.. వైఎస్ సొంతం. సినిమా ఆసాంతం అదే కనిపించింది. మమ్ముట్టి ఆ పాత్రని ఆకళింపు చేసుకొని నటించలేదు. వైఎస్ అంతరంగాన్ని ఆవాహనం చేసుకున్నాడు. రాజన్న నడకలోని రాజసం, మాటలోని గాంభీర్యం.. మనసులోని మర్మం.. సెల్యులాయిడ్‌పై నిలువెల్లా వ్యాపించింది. అక్కడున్న గాలిలో సైతం వైఎస్ ఆత్మ సంలీనమై సంచరించింది. ఇది కంచికి చేరే కథలా లేదు. ఇంటికి వచ్చాక కూడా కంటికి కనిపించే దృశ్యాలు. ఎంత దూరం వెళ్లినా వెంటాడే దుఃఖ మేఘాలు. నిజానికి మహి కథ రాయలేదు. నడిచీ నడిచీ బొబ్బలు కట్టిన రాజన్న పాదాలకు ఆత్మీయ లేపనం రాశాడు. అసలు మహి సినిమా తియ్యలేదు. ఆ చెమట చుక్కల్ని, చెమ్మగిల్లిన కళ్లనీ.. తుడుచుకో రాజన్నా అంటూ.. ఓ తుండు గుడ్డని అందివ్వాలని చూశాడు. తన గుండెలోంచి పొంగే కన్నీళ్లను మాత్రం దాచుకోలేకపోయాడు. వెండితెరపై నిండిన ఆ ఆశ్రుధారే.. యాత్ర. - రాశ్రీ -
‘యాత్ర’పై వర్మ ప్రశంసలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ‘యాత్ర ఒక అద్భుతమైన చిత్రం. వైఎస్సార్ గొప్ప నాయకుడు. వైఎస్సార్‌లోని నిజమైన కోణాన్ని ఈ చిత్రం అవిష్కరించింది. మహి వీ రాఘవ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో జీవించి.. పాత్రకు ప్రాణం పోశార’ని ట్విటర్లో పేర్కొన్నారు. మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. Yatra is an awesome film ..A truly great insight into YSR,a truly great leader ..Kudos to @MahiVraghav who made him come alive and kudos to @mammukka for immortalising him forever 🙏🙏🙏 — Ram Gopal Varma (@RGVzoomin) February 12, 2019 -
టెక్సాస్‌లో ‘యాత్ర’ సంబరాలు
టెక్సాస్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. యాత్ర సినిమా విడుదలని ప్రపంచ వ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు పండుగ వాతావరణంలో జరుపుకొంటున్నారు. సినిమాను వీక్షించిన అభిమానులు సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పాదయాత్రలో భాగంగా నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలతో తన అనుబంధాన్ని ఎలా ఏర్పర్చుకున్నారనే విషయాన్ని.. దర్శకుడు చాలా ఎమోషనల్‌గా తెరకెక్కించారని చెప్పారు. మహి వి రాఘవ దర్శకత్వ ప్రతిభను మెచ్చుకున్నారు. ఒక మంచి భావోద్వేగ కథను చక్కగా చూపించారని అభిప్రాయపడ్డారు. ఈ సినిమా వైఎస్ అభిమానులకే కాకుండా అందరికీ నచ్చుతుందని, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యే విధంగా తీశారని చెప్పారు. ఇక మమ్ముట్టి, వైఎస్సార్ పాత్రలో ఒదిగిపోయారని, వైఎస్సార్ ని మళ్ళీ చూసిన అనుభూతి కలిగిందని అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఆస్టిన్లోని వైఎస్సార్ అభిమానులు సుబ్బా రెడ్డి చింతగుంట, పుల్లా రెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి, మల్లికార్జున రెడ్డి ఆవుల, నారాయణ రెడ్డి గండ్ర, రవి బల్లాడ, కుమార్ అశ్వపతి, ప్రవర్ధన్ రెడ్డి చిమ్ముల, వంశి, వెంకట శివ నామాల, కొండా రెడ్డి ద్వారసాల, అశోక్ గూడూరు, స్వాదీప్ రెడ్డి, బ్రమేంద్ర రెడ్డి లక్కు, మురళీధర్ రెడ్డి బండ్లపల్లి, ప్రదీప్ రెడ్డి లక్కీరెడ్డి , రామ కోటి రెడ్డి , వెంకట గౌతమ్ , హనుమంత రెడ్డి , దేవేందర్ రెడ్డి, శివ రెడ్డి ఎర్రగుడి, వెంకట రెడ్డి కొండా, యస్వంత్ రెడ్డి గట్టికుప్పల, గురు చంద్రహాస్ రెడ్డి , శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ కొట్టే, రవి, రఘు, శ్రీను చింత, కళ్యాణ్ రెడ్డి , ప్రసాద్ రెడ్డి, చెన్నా రెడ్డి, విట్టల్ రెడ్డి, చెన్న కేశవ రెడ్డి తదితరులు యాత్ర సినిమాను చూసారు. అనంతరం యాత్ర సినిమా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ యాత్ర
-
‘సుచరితా రెడ్డి’పై స్పందించిన అనసూయ
రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్రలో అనసూయ నటనను మరువక ముందే.. ‘యాత్ర’లో సుచరితా రెడ్డిగా మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశారు. యాత్రలో కనిపించింది కొన్ని క్షణాలే అయినా.. తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు ఆమె. యాత్ర చిత్రంలో తన పాత్రపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో.. అనసూయ తన ఆనందాన్ని అభిమానులతో పంచకున్నారు. ‘సుచరితరెడ్డి పాత్రను పోషించడం నాకు సంతోషంగా ఉంది. నాపై చూపిస్తున్న అభిమానానికి ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఆ పాత్రను నేను పోషించగలనని నాపై నమ్మకం ఉంచిన డైరెక్టర్ మహి వి రాఘవ, 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్కు ధన్యవాదాలు’ అంటూ అనసూయ భరద్వాజ్ ట్వీట్ చేశారు. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘యాత్ర’ విజయవంతంగా దూసుకుపోతోంది. Playing #SucharitaReddy was an experience I will cherish always.. Thank you my audience for all the good things you are saying.. Thank you @MahiVraghav Sir and @70mmEntertains for having faith in me that I can pull this off 🙏🏻#YatraTheMovie #YatraRoars pic.twitter.com/miywLKlVqo — Anasuya Bharadwaj (@anusuyakhasba) 10 February 2019 -
‘యాత్ర’ యూనిట్‌కు జగన్ శుభాకాంక్షలు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా ఘనవిజయం సాధించిన సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘మహానేత రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అంకిత భావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు’ అంటూ చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులను అభినందించారు. మమ్ముట్టి, రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి, శివ మేకలు నిర్మించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ హర్షం వ్యక్తం చేశారు. Congratulations @MahiVraghav @devireddyshashi @VijayChilla @ShivaMeka @mammukka & entire crew on the successful release of #Yatra.I wholeheartedly thank you & appreciate your passion & dedication in wanting to depict cinematically,the character & essence of the great leader,YSR. — YS Jagan Mohan Reddy (@ysjagan) 10 February 2019 -
గుండెల్లో నిలిచిపోయే ‘యాత్ర’
ఎటుచూసినా కరువు కాటకాలు, దుర్భరంగా ప్రజల బతుకులు. చేయడానికి పని లేదు, తినడానికి తిండి లేదు. జేబులో చిల్లిగవ్వ కరువాయె. ఇటువంటి పరిస్థితుల్లో నేనున్నానంటూ ప్రజలకు భరోసానివ్వడానికి మహానేత వైఎస్ఆర్ చేపట్టినదే ప్రజా ప్రస్థాన పాదయాత్ర. ఆ మహాఘట్టం వెండితెరపై యాత్రగా పునరావిష్కృతమై ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకుంటోంది. వైఎస్ఆర్గా మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి పాత్రకు ప్రాణం పోశారని మన్ననలు పొందారు. కన్నడనాట ఈ చిత్రం బహుళ ప్రజాదరణ పొందుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నయవంచక పరిపాలనతో విసిగిపోయిన ప్రజానీకంలో 2004 అసెంబ్లీ ఎన్నికల ముందు మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర కొత్త ఆశలు చిగురింపజేసింది. ఏపీని కొత్త అడుగులు వేయించిన ప్రజాప్రస్థాన యాత్ర, మహానేత వైఎస్ఆర్ క్షేత్ర స్థాయి నుంచి సమస్యలు తెలుసుకున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు మలయాళ ప్రముఖ సినీ హీరో మమ్ముట్టి నటించిన ‘యాత్ర’ కన్నడనాట ప్రభంజనం సృష్టిస్తోంది. యాత్ర సినిమా బళ్లారి నగరంలోని గంగ థియేటర్లో ప్రదర్శిస్తున్నారు. సినిమా విడుదలైన శుక్రవారం మొదటి ప్రదర్శన నుంచే ప్రేక్షకులు, అభిమానులతో కిక్కిరిసింది. కదిలిన మనసులు, చెమర్చిన కళ్లు వైఎస్ఆర్ జ్ఞాపకాలను నెమరవేసుకుని ప్రేక్షకుల కళ్లు చెమర్చాయి. ప్రజాప్రస్థాన యాత్రలో ఆస్పత్రిలో గుండెజబ్బు చిన్నారి కష్టాలను వైఎస్ఆర్ చూసి వారికి చేయూత ఇచ్చేందుకు ప్రయత్నించిన దృశ్యం, అనంతరం ఆ బాలిక కన్నుమూయడం సన్నివేశం ప్రేక్షకులను కలచివేసింది. ఎన్నికల్లో ఘన విజయంతో వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత ఆరోగ్యశ్రీ నాంది పలకడానికి ఆ ఘటనే కారణమని భావిస్తారు. ప్రజాప్రస్థాన యాత్రలో వైఎస్ఆర్ కళ్లారా చూసిన సమస్యలకు సీఎం అయిన తర్వాత పరిష్కార మార్గం చూపారని ప్రేక్షకులు పేర్కొన్నారు. రెండు రోజులుగా యాత్ర సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సాగుతోందని థియేటర్ యజమాని సాక్షికి తెలిపారు. యాత్ర సినిమా చూసిన ప్రేక్షకులు ఏమన్నారంటే... అందరి సమస్యలను తీర్చారు యాత్ర సినిమా కొత్త అనుభూతిని ఇచ్చింది. వైఎస్ఆర్ సుదీర్ఘ పాదయాత్రను యాత్ర సినిమాలో చూసేందుకు అవకాశం ఏర్పడింది. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్న మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్ ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించారు. ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధిని ఆయన చేసి చూపించారు. – రమేష్, బళ్లారి అద్భుతంగా ఉంది యాత్ర సినిమా అద్భుతంగా ఉంది. మహానేత దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుదీర్ఘ ప్రజాప్రస్థాన పాదయాత్రను ఈ సినిమా ద్వారా చూసే భాగ్యం కలిగింది. అనేక సన్నివేశాలను మనసును కదిలించాయి. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సీఎం అయిన తర్వాత అమలు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనంలో చిరస్థాయిగా నిలిపోయారు. – బేసేజ్రెడ్డి, కొర్లగొంది ఆనందం, బాధ కలిగాయి వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన యాత్రను చిత్రంలో చూసిన తరువాత ఆనందంతో పాటు ఎంతో బాధ కలిగింది. కాళ్లకు బొబ్బలు వచ్చినా, సుస్తీ కలిగినా ఆపకుండా పాదయాత్ర చేయడం వల్ల ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా యావత్ దేశానికి మంచి జరిగింది. వైఎస్ఆర్ సీఎం అయిన తర్వాత అమలు చేసిన పథకాలు నేడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయంటే అది మహానేత చలువే. – శ్రీకాంత్‌రెడ్డి, కొళగల్లు దేశానికే ఆదర్శం వైఎస్ఆర్ పథకాలు ప్రజాప్రస్థాన యాత్ర సినిమా ఎంతో మంచి అనుభూతిని కలిగించింది. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజ్ రిఇంబర్స్ మెంట్, జలయజ్ఞం ఇలా చెప్పుకుంటే పోతే వైఎస్ఆర్ పథకాలు దేశానికి వరంగా మారిపోయాయి. అలాంటి మహానేత చేసిన ప్రజాప్రస్థాన యాత్రను మేం మళ్లీ చూసేందుకు యాత్ర సినిమా దోహదపడింది. మమ్ముట్టి ఎంతో బాగా నటించారు. యాత్ర సినిమా మళ్లీ మళ్లీ చూడాలని ఉంది. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలన్నది చేసి చూపించింది ఒక్క వైఎస్సార్ మాత్రమే. – హేమారెడ్డి, కొళగల్లు వైఎస్ఆర్ అంటేనే సమ్మోహకశక్తి వైఎస్ఆర్ నిర్వహించిన ప్రజాప్రస్థాన పాదయాత్ర మేం కుటుంబం మొత్తం చూసి తరించాం. వైఎస్ఆర్ అనే మూడు అక్షరాలు సమ్మోహనశక్తి లాంటివి. వృద్ధులు పడుతున్న బాధలను తెలుసుకుని, వృద్ధాప్య పెన్షన్‌ను భారీగా పెంచారు. విద్యుత్ కొరతతో అల్లాడిపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల రద్దు చరిత్రాత్మకం. ఇదంతా ప్రజాప్రస్థాన యాత్ర ద్వారానే సాధ్యమైంది. మహానేత పాదయాత్ర యావత్ దేశానికే మార్గదర్శకంగా మారింది. – లలితమ్మ, బళ్లారి -
‘యాత్ర’ చేసినందుకు గర్వంగా ఉంది
‘‘70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ముఖ్యోద్దేశం ప్రేక్షకులను డిఫరెంట్‌గా ఎంటర్టైన్ చేయడమే. ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ ఇప్పుడు ‘యాత్ర’. ఇది పొలిటికల్ సినిమా అయినప్పటికీ పాలిటిక్స్ ఉండవు. కేవలం వైయస్సార్‌గారి సోల్, స్పిరిట్‌ను ఈ సినిమాలో చూపించాం’’ అని విజయ్ చిల్లా అన్నారు. మహీ వి. రాఘవ్ దర్శకత్వంలో వైఎస్సార్‌గా మమ్ముట్టి నటించిన చిత్రం ‘యాత్ర’. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. శుక్రవారం ఈ చిత్రం రిలీజైంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ – ‘‘మహీ వి. రాఘవ్ నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు కాంట్రవర్శీ ఎందుకు? అన్నాను. కానీ తను చెప్పిన సన్నివేశాలు విన్నాక సినిమా మొత్తం ఇదే ఎమోషన్‌తో ఉంటే చేద్దాం అనుకున్నాను. మంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలామంది ఫోన్ చేసి ‘పెద్దాయన్ని గుర్తు చేశారు, బరువైన హృదయంతో, చెమర్చిన కళ్లతో ప్రేక్షకులు బయటకు వస్తున్నారు’ అని అంటున్నారు. ఈ సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. మా బడ్జెట్‌కు మంచి ఓపెనింగ్ లభించింది’’ అన్నారు. ‘‘అభిమానానికి, కళకి వెల కట్టలేము. ‘రుణం తీర్చుకోలేము స్వామి’ అని ప్రేక్షకులు అంటున్నారు. మేం కేవలం ఒక నాయకుడి కథ అనుకొని కథ చెప్పాం. ఇలాంటివి వింటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మహా అయితే ఇంకో 4–5 సినిమాలు తీస్తానేమో కానీ ఇంత అభిమానం రాకపోవచ్చు. కలెక్షన్స్, సినిమా రేటింగ్స్ కాదు చిన్న చిన్న సన్నివేశాలు కూడా గుర్తుపెట్టుకుని అభినందిస్తుండటం సంతోషంగా ఉంది. మనం అన్నింటినీ అంకెల్లో చూడటానికి అలవాటు పడ్డాం. ఈ అంకెల్లో కొలవడం మనం ఆపేయాలి. వరంగల్, నల్గొండ ప్రాంతాల నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఒక నాయకుడిని ఇంత అభిమానిస్తున్నారా? అనుకున్నాను. భయమేసింది. ఇది తెలిసి ఉంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేవాణ్ని కాదేమో. ‘మాతృదేవోభవ’ సినిమా చూసి ఏడ్చాం. మళ్లీ ‘పితృదేవోభవ’ సినిమా చూపించి ఏడిపిస్తున్నారండీ అని అంటున్నారు. 2–3 సన్నివేశాల తర్వాత మమ్ముట్టిగారు ప్రేక్షకుడిని కచ్చితంగా సినిమాలోకి తీసుకెళ్తారని నమ్మాం. రెస్పాన్స్ అలానే ఉంది’’ అని మహీ వి. రాఘవ్ అన్నారు. ‘‘యాత్ర’లో కేవీపిగారి పాత్ర పోషించాను. ‘విలేజ్‌లో వినాయకుడు’కు మహీ నిర్మాతగా చేశారు. అప్పుడు తెలియలేదు కానీ అతని డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. గొప్ప నాయకుడి కథ చెప్పేటప్పుడు కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ చెప్పడం కుదరదు. పాదయాత్రే ఉంది. రాజకీయాల గురించి చెడుగా చెబుతారు. కానీ సినిమా చూస్తుంటే ఎంతో గౌరవంగా ఉంది. ఇంటిని సెట్ చేసుకోవడానికే చాలా సమయం పడుతుంది. ఇంతమందికి సహాయపడాలంటే నాయకులకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. వైయస్‌గారి పాత్ర తాలూకు బరువు మోయాలంటే కష్టం. కానీ మమ్ముట్టిగారు దాన్ని భూజాన మోసిన విధానం గ్రేట్. ఆలోచింపజేసేంత గొప్ప సినిమా ఇది. స్క్రీన్ మీద మమ్ముట్టిగారు, నాకూ మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసింది’’ అన్నారు రావు రమేశ్. -
‘యాత్ర’ ప్రేక్షకాదరణ పట్ల జగనన్న సంతోషం వ్యక్తం చేశారు
-
యాత్ర ప్రతి ఒక్కరిని కదిలించే చిత్రం : రావు రమేశ్
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మంచి హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రంలో మహానేత వైఎస్సార్ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పోస్తే కేవీపీ పాత్రలో రావురమేశ్ ఒదిగిపోయారు. ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణపై రావు రమేశ్ స్పందించారు. సినిమా చూసిన తర్వాత రాత్రంతా ఆ మహానేత ఆలోచనలేనని తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘ఈ చిత్రాన్ని ఇంత అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవకు అభినందనలు. ఓ మహా నాయకుడు సినిమా.. ఎలాంటి సున్నితమైన అంశాల జోలికి పోకుండా చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. సినిమా చూసి రాత్రంతా ఆ మహానేత గురించే ఆలోచించాను. సినిమాలోని ప్రతీ సీన్‌ను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి అంతరాత్మను తాకే సినిమా ఇది. ముఖ్యంగా యాత్రలో భాగంగా వచ్చే ప్రతి సీన్ మనస్సును కదిలించేలా ఉంది. ఓ రైతు పండించిన టమాటాలు అమ్ముకోలేకపోవడం.. కనీసం చార్జీలు ఇవ్వలేని పరిస్థితి, వైద్యం అందక ఓ అమ్మాయి చనిపోయే సీన్స్ చూస్తే చాలా సిగ్గేసింది. ఇన్ని కష్టాలను చూసి ఆ మహానేత వారికి భరోసా కల్పించి.. వారికిచ్చిన హామీలను నెరవేర్చడం చాలా గొప్ప విషయం. మహానాయకుడి పాత్రలో మమ్ముట్టిగారు ఒదిగిపోయారు. ప్రతి సీన్‌ను ఆయన మోసిన విధానం అద్భుతం. మహీ తీసిన విధానం, మ్యూజిక్, సిరివెన్నల సీతారమశాస్త్రి ‘పల్లెల్లో కళ ఉంది.. పంటల్లో కలిముంది’ అనే లిరిక్స్ కదిలించాయి. రోజు పేపర్లో రైతుల ఆత్మహత్యలు చూసి మొండిగా తయారయ్యాం. ఎలాంటి సమాజంలో బతుకుతున్నామా? అని ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే మంచి సినిమా. ఈ అనుభూతిని వర్ణించలేను. ఈ సినిమాలో కేవీపీ పాత్ర చేయడం చాలా ఆనందంగా ఉంది. తెల్లబట్టలేసుకుని ఏదో చేశా అనుకున్నా కానీ.. నిన్న చూసిన తర్వాత నా ప్రాతను చూసి ఆస్వాదించాను. చాలా తృప్తినిచ్చిన పాత్ర. ఈ పాత్ర ఇచ్చినందుకు డైరక్టర్, నిర్మాతలకు ధన్యవాదాలు’ అని తన అనుభూతి పంచుకున్నారు. -
సినిమా చూసిన తర్వాత ఆ మహానేత ఆలోచనలే
-
వైఎస్ జగన్‌ను కలిసిన ‘యాత్ర’ టీమ్
-
వైఎస్ జగన్‌ను కలిసిన ‘యాత్ర’ టీమ్
సాక్షి, హైదరాబాద్ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యాత్ర టీమ్ శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసింది. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ, నిర్మాత విజయ్ చల్లాలు వైఎస్ జగన్‌ను కలిసారు. ఈ భేటీ అనంతరం దర్శకుడు రాఘవ మీడియాతో మాట్లాడారు. సినిమాకు వచ్చిన హిట్ టాక్ గురించి వైఎస్ జగన్ అడిగి తెలుసుకున్నారని, చిత్రంపై వస్తున్న ప్రేక్షకాదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. జనాలు ఫోన్ చేసి చిత్రంపై ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటే తనకు మాటలు రావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు. (గర్వంగా ఉంది : ‘యాత్ర’ దర్శకుడు) ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం.. ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమయ్యే రాజన్న తెగువ, ధైర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని, సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. (చదవండి: ‘యాత్ర’ మూవీ రివ్యూ) -
చెన్నైలోనూ ‘యాత్ర’కు బ్రహ్మారథం
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆదారంగా తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగుతో పాటు తమిళ, మళయాల భాషల్లోనూ ఒకేసారి విడుదలైంది. ఈ సందర్భంగా చెన్నైలోని వైఎస్ఆర్ అభిమానులు థియేటర్లలో సంబరాలు చేసుకున్నారు. చెన్నైలోని 13 థియేటర్లలో యాత్ర రిలీజ్ కాగా ప్రతీ థియేటర్లోనూ పండుగ వాతావరణం కనిపించింది. (‘సినిమా చూస్తున్నంతసేపు గుండె బరువెక్కింది’) ఈ చిత్రం తమ మహానేత ఇంకా మా గుండెల్లో కొలువై ఉన్నాడని నిరూపించిందని అభిమానులు కన్నీళ్ల పర్యంతం అవుతున్నారు. వైఎస్ఆర్ పాదయాత్ర ద్వారా దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించి తనదైన బాణిలో బడుగు బలహీర వర్గాలకు దేవుడిగా నిలిచిన తీరు సినిమాలో కళ్లకుకట్టినట్టుందన్నారు. చెన్నైలోని మాయాజాల్, ఏజీఎస్, పాలాజ్జో మల్టీప్లెక్స్ లతోపాటు వివిధ ప్రాంతాల్లో థియేటర్లలో యాత్ర తెలుగు వెర్షన్ విడుదలైంది. (చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ) దీంతో ఆయా థియేటర్ల ముందు అభిమానులు బారులు తీరీ జోహార్ వైఎస్ఆర్ అంటూ తమ మహానేత తలుచుకుంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రేక్షకులు సినిమా చూసి వైఎస్ఆర్ గొప్ప హృదయాన్ని ప్రశంసిస్తున్నారు. ఇక వివిధ కళాశాలలు, సత్యభామ, ఎస్ఆర్ఎం విద్యావిద్యాలయాలా విద్యార్ధులు జయహో వైఎస్సార్ అంటూ యాత్ర సినిమా కోసం చేస్తున్న సందడి చెన్నై నగరంలోని తెలుగు వారిలో వైఎస్ఆర్ పట్ల ఉన్న అభిమానాన్ని గుర్తు చేస్తోంది. -
జైత్ర యాత్ర
-
గర్వంగా ఉంది : ‘యాత్ర’ దర్శకుడు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథా ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్ర యూనిట్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యాత్ర దర్శకుడు మహి వీ రాఘవ్ సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, వైఎస్ఆర్ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.(చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ) ‘ఈ కథ, రాజశేఖర్ రెడ్డిగారు, ఆయన అభిమానులు, ఫాలోవర్స్ పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. నా దృష్టిలో ఒక వ్యక్తికి ఇచ్చే అత్యుత్తమ గౌరవం కృతజ్ఞత చూపించటమే. నా మీద ఇంత ప్రేమ చూపిస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులు, వైఎస్ఆర్ అభిమానులకు నా నమస్కారాలు. ఇంత గొప్ప కథ చెప్పే అవకాశం కలిగించిన సినిమారంగానికి నా ధన్యవాదాలు. విమర్శలను కూడా నేను గౌరవిస్తాను. కానీ నేను నమ్మి చేసిన కథ విషయంలో ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని భావిస్తున్నా. యాత్ర లాంటి సినిమా చేయటం ఎప్పటికీ గౌరవంగానే భావిస్తా. వైఎస్ఆర్ కథ చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే ఈ సినిమా చేశా. ఇది వైఎస్‌ఆర్‌గారికి నేనిచ్చిన నివాళి. ఎంతో దాతృత్వం, వినయం, కరుణ, ధైర్యం, విశ్వసనీయత ఉన్న ఆయన్ను కేవలం మా నాయకుడు అని చెప్పటం చాలా చిన్న మాట’ అంటూ తన ఆనందాన్ని కృతజ్ఞతను అభిమానులతో పంచుకున్నారు. -
‘తన కథను చెప్పమని.. ఆయనే నన్ను ఎంచుకున్నాడు’
వెండితెరపై బయోపిక్‌లు అన్నివేళలా విజయాన్ని చేకూర్చలేవు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కథలో అందర్నీ ఆకర్షించగలిగే అంశాలు, మనసుల్ని కట్టిపడేసే కథనం ఉండాలి.. అంతేకానీ ఆర్భాటాలకు పోయి సినిమాను తెరకెక్కిస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చూశాం. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ప్రేక్షకుల గుండెను బరువెక్కేలా, కన్నీటిని కార్చేలా చేసిన ‘యాత్ర’ సినిమా పాజిటివ్ టాక్‌తో సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తున్న సందర్భంగా.. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్, నిర్మాత విజయ్ చిల్లా ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు.. తాను యాత్రకు సంబంధించిన రిపోర్ట్‌ను ఉదయం నాలుగు గంటలకు యూఎస్ నుంచి విన్నానని.. ఓ అభిమాని ఫోన్‌చేసి చాలా బాగుందని చెప్పాడని తెలిపాడు. ఆనందో బ్రహ్మ సమయంలో.. ఈ మధ్య కాలంలో ఇలా ఓ సినిమా చూసి ఇంత సేపు నవ్వేలా చేశారని ప్రేక్షకులు తనతో అన్నారని.. మళ్లీ ‘యాత్ర’కు వచ్చేసరికి చాలా ఏడిపించారని చెబుతున్నారని అన్నారు. చప్పట్లు కొట్టించే సన్నివేశాల కన్నా.. కన్నీళ్లు తెప్పించే సీన్సే ఎక్కువగా గుర్తుంటాయని, అవే ప్రేక్షకులు ఇంటికి తీసుకెళ్తారని, హాస్పిటల్లో చిన్నపాప సీన్, రైతు సీన్ అందరికీ నచ్చుతుందని అన్నారు. ఈ చిత్రాన్ని పోస్ట్‌ప్రొడక్షన్‌లో చాలా సార్లు చూశానని.. థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని చూస్తే తాను నోటీస్ చేయని సన్నివేశాలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు. తాను రాసిన మాటలకు కూడా మంచి స్పందన వచ్చిందని తెలిపారు. తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎప్పుడూ కలవలేదని, ఆయనే తన కథను చెప్పమని తనను ఎంచుకున్నాడేమోనని అన్నారు. ప్రతీ వ్యక్తికి వైఎస్సార్‌తో అనుబంధం ఉంటుందని.. భారతదేశంలో రాజకీయ నాయకులను నమ్మడమనేది అరుదుగా చూస్తామని.. ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడటం..చనిపోయి ఇంతకాలమైనా..ఆ వ్యక్తిని ఇంకా గుర్తు పెట్టుకున్నారంటే.. ఏదో కథ ఉందని ఓ దర్శకుడిగా తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు. -
విజయ యాత్ర
-
ట్రెండింగ్ : ‘యాత్ర’ బ్లాక్ బస్టర్ హిట్
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని వెండితెరపై యాత్ర పేరుతో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సాంగ్స్, టీజర్స్, పోస్టర్స్‌తో ఈ మూవీ అంచనాలను మించిపోయింది. నేడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇక ఈ సినిమాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం.. ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమయ్యే రాజన్న తెగువ, ధైర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని, సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు. (‘యాత్ర’ మూవీ రివ్యూ) విడుదల అన్ని కేంద్రాల్లో వైఎస్ఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రాగా.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్‌తో అందరినీ కంటతడి పెట్టించిన అసిస్టెంట్ డైరెక్టర్ వైఎస్ చిత్ర పటానికి పూల మాల వేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. చదవండి : ‘యాత్ర’ మూవీ రివ్యూ (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘యాత్ర’ మూవీ రివ్యూ
టైటిల్ : యాత్ర జానర్ : బయోగ్రాఫికల్ మూవీ తారాగణం : మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి సంగీతం : కె దర్శకత్వం : మహి వీ రాఘవ నిర్మాత : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్ మూవీ యాత్ర. వైఎస్ఆర్లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు రెండున్న దశాబ్దల తరువాత మళయాల మెగాస్టార్ మమ్ముట్టి ఈ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కిన యాత్ర ఎలా సాగింది..? కథ : ఇది ఈవెంట్ బేస్డ్ బయోపిక్. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర.. ఆ యాత్ర సమయంలో వైఎస్ఆర్కు ఎదురైన అనుభవాలు. వాటి వల్ల వైఎస్ వ్యక్తిత్వంలో వచ్చిన మార్పులే ఈ సినిమా కథ. వైఎస్ జీవితంలో జరిగిన సంఘటనలు చూపిస్తే ఆయన వ్యక్తిత్వాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు.. ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి.. పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది.. యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి అన్నదే కథ. నటీనటులు : బయోపిక్ కావటంతో సినిమా అంతా ఒక్క రాజశేఖరరెడ్డి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో మమ్ముట్టి జీవించాడనే చెప్పాలి. తన నటనతో తొలి షాట్ నుంచే తెర మీద రాజన్ననే చూస్తున్నమంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు. రాజారెడ్డి పాత్రలో.. కనిపించింది రెండు సన్నివేశాలే అయినా జగపతిబాబు తన మార్క్ చూపించారు. విజయమ్మ పాత్రలో ఆశ్రిత సరిగ్గా సరిపోయారు. లుక్ పరంగాను ఆమె విజయమ్మను గుర్తు చేశారు. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఆమె పాత్ర గుర్తుండి పోతుంది. మరో కీలక పాత్రలో కనిపించిన రావూ రమేష్ తనదైన నటనతో కేవీపీ పాత్రకు ప్రాణం పోశాడు. తెర మీద కనిపించింది కొద్దిసేపే అయిన అనసూయ, సుహసిని, పోసాని కృష్ణమురళిలు.. వారు పోషించిన పాత్రలకు జీవం పోశారు. విశ్లేషణ : ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి కథ కాదు.. ఆయన వ్యక్తిత్వం. వైఎస్ఆర్ రాజకీయం ఎలా ఉంటుంది? మాటకు, నమ్మకానికి ఆయన ఇచ్చే విలువ ఏంటి? ఆయనను నమ్ముకున్న వ్యక్తులకు ఆయనకు ఎలాంటి భరోసా ఇస్తారు? పాదయాత్రకు ముందు పాదయాత్ర తరువాత వైఎస్ఆర్లో వచ్చిన మార్పు ఏంటి? ఇలా వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాలను వెండితెర మీద ఆవిష్కరించారు. తొలి సన్నివేశం నుంచే వైఎస్ఆర్ రాజకీయం ఎలా ఉంటుందో ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చూపించారు. పాదయాత్రలో ఆయన ప్రజలతో వైఎస్ఆర్ మమేకమైన తీరు, వారి కష్టాలను అవలోకనం చేసుకోవడం లాంటి అంశాలు ఆకట్టుకుంటాయి. తన ప్రత్యర్థి కూతురు ఇంటికి వచ్చి సాయం అడిగితే.. సాయం చేయద్దన్న వారితో ‘మన గడప తొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా’ అనే రాజన్న మాటలకు ఎవరికైనా చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. హైకమాండ్ పెద్దలు వచ్చి మీ ఒక్కరితోనే మాట్లాడలన్నప్పుడు పక్కన కేవీపీ ఉన్నా.. ‘మీరు ఇప్పుడు ఒక్కరితోనే మాట్లాడుతున్నారు’ అనటం ఆయన స్నేహానికి ఎంత విలువ ఇచ్చేవారో గుర్తు చేస్తుంది. మాట ఇచ్చేముందు ఆలోచించాలి.. ఇచ్చాక చేసేదేముంది ముందుకెళ్లాల్సిందే’ అన్న మాటల్లో ఆయన విశ్వసనీయత ఎంతటిదో అర్ధమవుతుంది. ‘నేను పార్టీకి విధేయుణ్ని మాత్రమే బానిసను కాదు’ అంటూ హైకమాండ్ పెద్దలను ఎదిరించినప్పుడు ఆయన ధైర్యం ఎలాంటిదో అర్ధమవుతుంది. మార్కెట్లో ఆత్మహత్య చేసుకోబోయిన రైతుతో ‘నేను విన్నాను.. నేనున్నాను’ అన్ని సన్నివేశం ఆయనలోని నాయకుడిని జ్ఞప్తికి తెస్తుంది. తనను నమ్ముకున్న ఓ పోలీసు కానిస్టేబుల్ తప్పు చేస్తే నాకేందుకులే అని విడిచిపెట్టుకుండా, తనకు చెడ్డ పేరువస్తుందేమో అని ఆలోచించకుండా తానే తగ్గి ‘నా కోసం అతని తప్పును పొరపాటుగా భావించి వదిలిపెట్టమనడం’ ఆయనది ఎంత పెద్ద మనసో చూపిస్తుంది. పాదయాత్ర చేవెళ్ల నుంచి ప్రారంభిస్తే అశుభమన్న పేరొస్తుందేమో అన్న సబితమ్మతో ‘మంచి మనసున్న మనుషులున్నప్పుడు ముహూర్తాలతో పని ఏముంది’ అన్నప్పుడు ఓ అన్న, చెల్లికి ఇచ్చే భరోసా కనిపిస్తుంది. ఇలా ఒక్కో సన్నివేశంతో రాజన్నలోని ఒక్కో గుణాన్ని తెర మీద చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు. గ్రామంలోని ఓ ఇంట్లో భోజనం చేయటం, హస్పిటల్లో వైఎస్ఆర్ కళ్ల ముందే ఓ చిన్నారి ప్రాణాలొదలటం, మార్కెట్లో ఆత్మహత్య చేసుకోబోయిన రైతుతో వైఎస్ఆర్ మాట్లాడటం లాంటి సీన్స్ గుండె బరువెక్కేలా చేస్తాయి. రెగ్యులర్ బయోపిక్‌లా కేవలం కథ చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. ప్రతీ ప్రేక్షకుణ్ని పాదయాత్రలో భాగం చేశాడు. అప్పటి రాజకీయ, సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. అక్కడక్కడ పొలిటికల్ సెటైర్లు కూడా బాగా పేలాయి. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర పెద్దల ఆహార్యం, వారి డైలాగ్స్ సినిమాకు కామెడీ టచ్ ఇచ్చాయి. ఇక అప్పటి సంఘటనలకు తగ్గట్టుగా ‘బ్రీఫ్డ్ మీ’ డైలాగ్‌ను జోడించిన సన్నివేశం నవ్వులు పూయించింది. కె అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్రతీ సన్నివేశాన్ని ప్రేక్షకుడికి మరింత దగ్గర చేశాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సత్యన్ సూరన్ సినిమాటోగ్రఫి ఆకట్టుకుంటాయి. సినిమాకు మరో ప్రధాన బలం సిరివెన్నెల సీతారామశాస్త్రీ అందించిన సాహిత్యం. ఆయన అందించిన పాటలు వైఎస్ వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో ఆవిష్కరించాయి. చివర్లో వచ్చే పెంచల్దాస్ పాట ప్రతీ ప్రేక్షకుడిని కంటతడిపెట్టిస్తుంది. సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీన్స్ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్ఆర్ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్ ఫుటేజ్ కదిలిస్తుంది. మరోసారి ఆ చీకటి రోజును గుర్తుచేస్తుంది. యాత్ర తెలుగు రాజకీయాలను మలుపు తిప్పిన ఓ మహత్తర ఘట్టానికి సాక్ష్యం. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం. సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
970 స్క్రీన్స్‌లో వెండితెర యాత్ర
మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘యాత్ర’ విశేషాలు. ► ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ’ వంటి హిట్ చిత్రాల తర్వాత 70 ఎంఎం బ్యానర్లో 3వ చిత్రంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. ‘‘ఈ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి వైఎస్‌గారి అభిమానుల్లోనే కాదు.. సాధారణ ప్రజల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇందుకు కారణం.. ఓ మహానేత చరిత్ర తెరకెక్కించటం. వైఎస్‌గారిని ఎలా చూపించనున్నారు? సినిమా పాజిటివ్‌గా ఉంటుందా? లేక నెగటివ్‌గా ఉంటుందా? అనే సందేహాలు ఒకవైపు. అసలు ‘యాత్ర’ ఇప్పడు తీయాల్సిన అవసరం ఏంటి? ఎన్నికల స్టంటా? వైఎస్ జగన్మోహన్రెడ్డిగారికి సపోర్ట్‌గా తీస్తున్నారా? వంటి ప్రశ్నలు మరోవైపు. వీటన్నింటికీ ఈ రోజు ‘యాత్ర’ సినిమా సమాధానం చెబుతోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ► 970 స్క్రీన్స్‌లో భారీ ఎత్తున ‘యాత్ర’ విడుదలయింది. సాధారణంగా ఒక సినిమా హీరో బయోపిక్ లేదా బిగ్ కాస్టింగ్‌తో తీసిన సినిమాలు ఇంతటి భారీ స్థాయిలో రిలీజ్ కావటం చూశాం. కానీ, తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి బయోపిక్ తీస్తే ఒక్క ఓవర్సీస్లోనే 180 స్క్రీన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 500 స్క్రీన్స్.. ఇలా ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదలవటం చూస్తే ‘యాత్ర’పై తెలుగు ప్రజల క్రేజ్ ఏంటో తెలుస్తోందని, అటు అమెరికా నుంచి అనకాపల్లి వరకూ ఈ సినిమాకి అనూహ్యమైన స్పందన లభిస్తోందని నిర్మాతల్లో ఒకరైన విజయ్ చిల్లా చెప్పారు. ► ‘నాయకుడిగా మనకు ఏం కావాలో తెలుసుకున్నాం కానీ... జనానికి ఏం కావాలో తెలుసుకోలేకపోయాం’ అంటూ అధిష్టానాన్ని సైతం లెక్కచేయక పేద ప్రజల కష్టాల్ని వినటానికి కడప గడప దాటి పాదయాత్ర చేసిన వైఎస్‌గారు జననేతగా, మహానేతగా, పేద ప్రజల గుండె చప్పుడుగా పదిలమైన చోటు సంపాదించుకున్నారు. వైఎస్‌గారి పాదయాత్ర 68 రోజులు జరిగింది. యాదృచ్ఛికంగా ‘యాత్ర’ షూటింగ్ కూడా 68 రోజుల్లో పూర్తికావటం ఆ పెద్దాయన ఆశీస్సులుగా టీమ్ భావిస్తున్నారు. ► వైఎస్‌గారి రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ ‘యాత్ర’. పాదయాత్రలో రైతుల కష్టాలు, పేదవాళ్ల ఆవేదనలు, ప్రతి ఒక్కరి భావోద్వేగాలని రాజన్న మనసుతో వినటమే ఈ చిత్రంలో కీలక భాగం. రాజకీయాలు లేని రాజకీయ నాయకుడి కథే ఈ సినిమా. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూసి భావోద్వేగానికి లోనవుతారు. ఎందుకంటే కష్టం ఎవరికైనా కష్టమే. అందుకే ఈ యూనివర్సల్ సబ్జెక్ట్‌ని తెలుగుతోపాటు భారతదేశం మొత్తం విడుదల చేశాం. ఎమోషనల్ కంటెంట్‌తో ఉన్న ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకుడు బరువైన గుండెతో థియేటర్స్ నుంచి బయటకి వస్తారు. ► మహి చెప్పిన ‘యాత్ర’ కథలోని పాత్రలు, వాటి కష్టాలు మమ్ముట్టిగారిని కలచి వేశాయి. ఆ తర్వాత ఆయన వైఎస్‌గారి గురించి పూర్తిగా తెలుసుకుని పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. ‘ఇది రాజకీయ నాయకుడి కథ మాత్రమే కానీ, రాజకీయాలు ఉండవు.. ప్రజల కష్టాలు, రైతుల బాధలు ఉంటాయి.. ఇవన్నీ భారతదేశం అంతటా ఉంటాయి. ఏ రైతుని అడిగినా, ఏ పేదవాడిని అడిగినా వారి కష్టాలు చెప్తారు’ అని మమ్ముట్టి చెప్పారు. ‘యాత్ర’లో ఆద్యంతం ఎమోషన్‌తో కూడిన పాత్రలు, పాత్ర చిత్రణ కనిపిస్తాయి. తెలుగు ప్రజలందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ని దర్శకుడు చూపించారు. సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని నిర్మాతలు అన్నారు. ► ‘‘యాత్ర’ సినిమా చేయాలనుకున్నప్పటి నుంచి విడుదల వరకూ వైఎస్ జగన్‌గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా అభ్యంతరాలు పెట్టలేదు సరికదా కనీసం కథ వివరాలు కూడా అడగలేదు. దర్శకుడికి, ప్రొడక్షన్‌కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం జగన్‌గారి గొప్పతనానికి నిదర్శనం. ఇటీవల జగన్‌గారిని మహి కలిసినప్పుడు.. ‘మీ నాయకుడి చిత్రం మీరు తీస్తున్నారు.. ఆయన గురించి మీకే బాగా తెలుసు.. నాన్నగారు చేసిన పనులు చెప్పండి చాలు’ అని జగన్‌గారు సున్నితంగా చెప్పటం మా యూనిట్‌కి నూతనోత్సాహం కలిగించింది. ఇందుకు జగన్‌గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి అన్నారు. -
యాత్ర బుకింగ్‌లు చూస్తుంటే హ్యాపీ
‘‘యాత్ర’ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఎంత సెన్సేషన్ అయిందో ప్రేక్షకులందరికీ తెలుసు. పాదయాత్రలో ఉన్న ఎమోషన్స్, మూమెంట్స్‌ని తీసుకుని మహి రెడీ చేసిన కథతో విజయ్ ‘యాత్ర’ నిర్మించారు. మమ్ముట్టిలాంటి లెజెండ్ నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసినప్పుడు, పాటలు విన్నప్పుడు సినిమా ఎప్పుడు చూస్తామా? అనే ఓ ఎగై్జట్‌మెంట్ కనిపించింది. మా విజయ్‌కి, మహికి ఆల్ ది బెస్ట్’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘యాత్ర’ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఓవర్సీస్లో ఈ సినిమా ఓపెనింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఓపెనింగ్స్ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఆ సినిమాకి రెవెన్యూ పరంగా మంచి మ్యాజిక్ జరుగుతుంది. ఫస్ట్ మంచి ఓపెనింగ్స్ రావాలి.. ఆ తర్వాత మంచి టాక్ రావాలి. ఓ సినిమాకి ఓపెనింగ్స్ అన్నవి ఎప్పుడూ ముఖ్యమే.. కానీ ఇప్పుడు చాలా ముఖ్యం అయిపోయాయి. ఒకప్పుడు సినిమా ఫర్వాలేదు అంటే మెల్లిగా ఓపెనింగ్స్ పెరిగేవి. ఇప్పుడు అలా లేదు.. మంచి ఓపెనింగ్స్ వస్తేనే సినిమా. ‘యాత్ర’ అడ్వాన్స్ బుకింగ్‌లు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాని నైజాం, వైజాగ్ ఏరియాల్లో మా సంస్థ విడుదల చేస్తోంది. వైఎస్‌గారి పాదయాత్ర మూమెంట్స్‌ని ఆ రోజుల్లో టీవీల్లో చూడటం, పేపర్లో చదవటమే. పాదయాత్రతో ఆయన హీరో అయిపోయారు. దాని తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జనాలకోసం ఏదైనా చేస్తాను అని పాదయాత్ర ద్వారా చూపించారాయన. ఎన్టీ రామారావుగారి తర్వాత మళ్లీ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో వైఎస్గారికే అంత ఇమేజ్ వచ్చింది.అలాంటి ఆయన నేపథ్యంలో వస్తున్న ఈ ‘యాత్ర’ పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. విజయ్ చిల్లా మాట్లాడుతూ– ‘‘యాత్ర’ కోసం ఏడాదిన్నరగా పని చేస్తున్నాం. రేపు విడుదలవుతోందంటే చాలా ఎగై్జటింగ్‌గా, సంతోషంగా ఉంది. వైఎస్‌గారు రాజకీయ నేత కావొచ్చు.. సినిమాలో రాజకీయాలు ఉండొచ్చు.. కానీ ఇది పూర్తిగా పొలిటికల్ సినిమా కాదు. ఎటువంటి వివాదాలు లేవు. ఈ సినిమా మొత్తానికి సోల్ అండ్ స్పిరిట్ వైఎస్గారే. సినిమా చూడండి.. నచ్చితే ఇతరులకు చెప్పండి. ఇది కేవలం ఆయన అభిమానులకే కాదు.. సినిమాను ప్రేమించేవారెవరైనా చూసి ఎంజాయ్ చేయొచ్చు’’ అన్నారు. ‘యాత్ర’ సినిమాను ఉద్దేశిస్తూ దర్శకుడు మహి వి. రాఘవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కథను చెప్పడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఆయన కుటుంబం, అభిమానుల నుంచి మాకు అమితమైన ఆదరణ లభించడం గొప్ప విషయం. చిత్రబృందం చాలా కష్టపడింది. దీన్ని మరో సినిమాతో పోల్చి.. ఓ రేస్‌లా చేయకండి. వైఎస్సార్ ప్రయాణంలా భావించి సెలబ్రేట్ చేసుకుందాం’. ‘ఎన్టీఆర్, వైఎస్సార్.. ఇద్దరూ ఈ నేలతల్లి బిడ్డలు, తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు. మన భిన్నాభిప్రాయాలు వారిని అగౌరవపర్చడానికి కారణాలు కాకూడదు. నాకు వైఎస్సార్, చిరంజీవిగార్లపై ఉన్న ఇష్టం, అభిమానం ఎప్పటికీ చెరిగిపోదు. మనకు స్ఫూర్తినిచ్చిన వారి సినిమాను సెలబ్రేట్ చేసుకుందాం. అదే మనం వారికిచ్చే గొప్ప నివాళి’. ‘మా ‘యాత్ర’ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంది. నిజాయతీగా మీ స్పందన చెప్పండి. నేను వినయంగా వాటిని స్వీకరిస్తా. ఈసారి ఇంకా మంచి కథతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తా.. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. -
‘మహానాయకుడి ‘యాత్ర’ను సెలబ్రేట్ చేసుకుందాం’
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మహి వీ రాఘవ్ దర్శకుడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు నిర్మిస్తున్నారు. మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 8) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వీ రాఘవ్ తన టీంతో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కించే అవకాశం నాకు రావటం వరంగా భావిస్తున్నాను. ఈ విషయంలో నాకు సహకరించిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, కోట్లాది కూడా ఉన్న ఆయన అభిమానులకు నా కృతజ్ఞతలు. ఈ సినిమాను మరే సినిమాలో పోల్చటం గానీ, పోటిగా చూపించటం కానీ చేయకండి. ఆ మహానాయకుడి యాత్రను ఆనందంగా సెలబ్రేట్ చేసుకుందాం. ఎన్టీఆర్ గారూ, వైఎస్‌ఆర్‌గారూ ఈ మట్టి వారసులు, ఎంతో కీర్తిని, గౌరవాన్ని మనకు వదిలి వెళ్లిన తెలుగు లెజెండ్స్. మన అభిప్రాయ భేదాలతో వారి గౌరవానికి భంగం కలిగించకూడదు. వైఎస్ఆర్, చిరంజీవి గారిపట్ల నా ప్రేమ కారణంగా నాకు ఎవరి మీద ద్వేషం కలగలేదు. మా యాత్ర సినిమాను ప్రేక్షకులు ఎలా స్వాగతిస్తారో తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్న’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
యాత్ర తొలి టికెట్ @ రూ.4.37లక్షలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో మమ్ముట్టి లీడ్ రోల్లో మహి వి. రాఘవ్ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడి నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు (దాదాపు 4.37 లక్షలు) సొంతం చేసుకుని వైఎస్‌పై తనకున్న అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ– ‘‘యాత్ర’ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ నెలకొంది. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు అమెరికాలోని సీటెల్‌లో ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేయగా వైఎస్‌గారి అభిమాని మునీశ్వర్ రెడ్డి భారీ మొత్తాన్ని చెల్లించి మొదటి టికెట్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఆయన ఇచ్చిన డబ్బులో టికెట్‌కి సరిపడా 12 డాలర్లు (దాదాపు 860) మాత్రమే తీసుకుని, మిగతా డబ్బుని వైఎస్సార్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తాం. రాజన్న క్యాంటీన్స్, వాటర్ ప్లాంట్స్ కోసం ఈ డబ్బును వెచ్చించనున్నారు. ఈ వేలంలో పాల్గొన్నవారందరికీ కృతజ్ఞతలు. వైఎస్‌గారి పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్రలో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు. -
వైఎస్ ‘యాత్ర’లో పాల్గొనండి!
మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పథకాలతో లబ్ధి పొందని తెలుగు ప్రజలంటూ దాదాపుగా ఉండరు. ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక సహాయాన్ని, ప్రయోజనాన్ని పొందే ఉంటారు. ఫీ రీయింబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత్ విద్యుత్‌లాంటి వినూత్న పథకాలతో వైఎస్సార్ తన పాలనలో ప్రజలపై చెరగని ముద్ర వేశారు. మహానేత మరణించి ఇన్నేళ్లైనా.. జనం గుండెళ్లో ఆయనపై ఉన్న అభిమానం మాత్రం చెక్కు చెదరలేదు. చిరంజీవిగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానాయకుడు చేపట్టిన పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ప్రజలతో కలిసి, వారితో నడిచి, కన్నీళ్లను తుడుస్తూ.. చేపట్టిన పాదయాత్ర.. రాజన్ననను ప్రజలకు మరింత దగ్గర చేసింది. అప్పటి పాదయాత్ర స్మృతులతో పాటు ఎన్నో ఘటనలను యాత్ర పేరుతో వెండితెరపై ఆవిష్కరించబోతోన్న సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటిస్తుండగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ - యాత్ర సినిమాను వీక్షించే అవకాశం కల్పిస్తోంది. రాజన్న ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఏ విధంగా ప్రయోజనం పొందారు? ఆయనతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మీకు కలిగిన అనుభం, సందర్భాన్ని గురించి నాలుగు విషయాలను కింద పేర్కొన్న ఈ మెయిల్ కు పంపించండి. (టికెట్లు అందజేయడంలో ఉన్న సాంకేతిక ఇబ్బందుల దృష్ట్యా ఈ కాంటెస్ట్ హైదరాబాద్‌లో నివసిస్తున్న వారికి మాత్రమే పరిమితం) వైఎస్ తో ఉన్న మీ అనుబంధం, అనుభవాన్ని పంచుకోవడానికి మీరు చెప్పే సందర్భం, సన్నివేశం వివరాలతో పాటు మీ పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తో సహా info@sakshi.com కు మెయిల్ చేయగలరు. ఈ కాంటెస్ట్‌లో పాల్గొన్నవారిలో కొందరిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. కాంటెస్ట్‌లో పాల్గొనండి. టిక్కెట్లు పొందండి. -
వేలంలో ‘యాత్ర’ టికెట్ ఎంత పలికిందంటే..?
సియాటెల్ : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించారు. అమెరికాలోని సియాటెల్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో భాగంగా 70ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సంస్థలు ‘యాత్ర’ ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను వేలం వేశాయి. అందులో మునీశ్వర్ రెడ్డి 6,116 డాలర్లకు(దాదాపు 4.37లక్షలు) మొదటి టికెట్‌ను గెలుచుకున్నారు. వైఎస్సార్ మీద అభిమానంతో మునీశ్వర్ రెడ్డి యాత్ర టికెట్ బిడ్డింగ్ రూపంలో కొన్నారు. అయితే టికెట్ ధర 12 డాలర్లు మాత్రమే నిర్మాతలు తీసుకుని మిగతా మొత్తాన్ని వైఎస్సార్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు సహాయంగా ఇస్తామని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్, నిర్వాణ సినిమాస్ వారు తెలిపారు. ప్రీమియర్ షోలు అధికంగా వేసి, టికెట్ రేట్లు పెంచుకుని జేబులు నింపుకుంటున్న నిర్మాతలు ఉన్న ఈ రోజుల్లో, వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చిన యాత్ర నిర్మాతలు విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డిలను కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులు అభినందించారు. ఈ ఈవెంట్లో పాల్గొన్న వారందరికీ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 8న యాత్ర ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జైత్ర యాత్ర మమ్మూట్టీ ప్రత్యేక ఇంటర్వ్యూ
-
‘యాత్ర’ ఈవెంట్లో కదిలించిన కథలెన్నో!
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్ర ఘట్టాన్ని వెండితెరపై యాత్రగా ఆవిష్కరించబోతోన్న సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించగా.. ఇప్పటికే రిలీజ్చేసిన పాటలు, పోస్టర్స్, టీజర్లు చిత్రంపై భారీ అంచనాలను ఏర్పరిచాయి. శుక్రవారం జరిగిన యాత్ర చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. రాజన్న ప్రవేశపెట్టిన ఎన్నో పథకాల ద్వారా లబ్ధిపొందిన అభిమానులు వేదికపై.. రాజన్నను తలుచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ‘యాత్ర’ అసిస్టెంట్ డైరెక్టర్ రవి మాట్లాడుతూ.. ‘2008లో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మకి గుండె నొప్పి వస్తే హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకొచ్చాం. హార్ట్‌లో హోల్ ఉంది 6 నెలల కంటే ఎక్కువ బతకదని చెప్పారు. అంత స్థోమత లేదని తిరిగి మా ఊరు బస్సులో వెళ్తుంటే.. ఏ తల్లీ కొడుకుని కోరని ఒక కోరిక మా అమ్మ నన్ను అడిగింది. ‘మూడు లక్షలు అప్పు తెచ్చి నాకు ఆపరేషన్ చేయించు. నాకొక ఐదారేళ్లు బతకాలని ఉంది. మీరు చిన్న పిల్లలు’ అంది. అప్పుడు నా చదువు పోతే పోయింది మా అమ్మకంటే ఎక్కువ కాదు అని.. డిగ్రీ వదిలేసి హైదరాబాద్ వచ్చాను. జూబ్లీహిల్స్‌లోని ఓ కాఫీ షాప్‌లో పని చేస్తూ ఎంగిలి ప్లేట్లు, కప్పులు కడిగాను. అయినా నాలుగు నెలల్లో నాకు వచ్చింది రూ.20 వేలు మాత్రమే. ఆ డబ్బు మా అమ్మ హాస్పిటల్ ఖర్చులకు, బస్ చార్జీలకు సరిపోయింది. అప్పుడు మా అమ్మ.. ‘నా ప్రాణం పోతే.. చెల్లిని బాగా చూసుకో.. చెల్లి చిన్నది. నేను చనిపోయినా మీరు ధైర్యంగా ఉండాలి’ అని చెప్పింది. గుడి, చర్చి, మసీదు ఏది కనిపించినా మా అమ్మ ‘ఐదారేళ్లు బతికితే చాలు. నా పిల్లలు చిన్నవాళ్లు’ అని మొక్కుకునేది. కానీ ఏ దేవుడూ మా మొర ఆలకించలేదు. కానీ 2009లో వైఎస్సార్ అనే దేవుడు నేనున్నాను.. అని ఆరోగ్యశ్రీ పథకం పెట్టారు. ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఆపరేషన్ చేశారు. మేము చాలా పేదవాళ్లం. చిన్న రెండు గదుల ఇల్లుంది. అది కూడా రాజశేఖర్ రెడ్డిగారిచ్చిన ఇందిరమ్మ ఇల్లే. మా ఇంట్లో ఏ దేవుడి ఫోటోలుండవు. వైఎస్సార్ ఫోటోలు మూడు కనిపిస్తాయి. ప్రతిరోజు మా అమ్మ నాకు ఫోన్ చేస్తది. పదేళ్లకు ముందు ఆగిపోవాల్సిన మాట ఇప్పటికీ నాకు వినబడుతుందంటే దానికి కారణం వైఎస్సార్. ఈ మాట చెప్పటానికి మా అమ్మను ఇక్కడికి తీసుకొద్దామనుకున్నా. కానీ నేను సినిమాల్లో చేస్తున్నట్టు ఆమెకు తెలియదు. కానీ ఫిబ్రవరి 8న(‘యాత్ర’ రిలీజ్) మా స్వగ్రామం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి వెళ్లి.. మా అమ్మను, చెల్లిని సినిమాకు తీసుకెళ్లి గర్వంగా పెద్దాయన సినిమాకు పనిచేశానని చెప్పుకుంటా. నాకు తెలిసి ఇంతటి అదృష్టం రాదు. దేవుడు లాంటి మనిషి(వైఎస్సార్) చనిపోయారు. అలాంటి దేవుడి రుణం ఈ సినిమాకు పని చేయడం ద్వారా కొంచెమైనా రుణం తీర్చుకున్నా’’ అని చెప్పుకొచ్చారు. చాలా మంది విద్యార్థులు, నిరుపేదలు తమ కథనాలతో ఎంతో మంది గుండెల్ని కదలించారు. -
‘యాత్ర’ ప్రీరిలీజ్ ఫంక్షన్
-
ప్రేక్షకులందరికీ యాత్ర నచ్చుతుంది
‘‘మా కథని నమ్మి సినిమా చేసి, మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన మమ్ముట్టిగారికి థ్యాంక్స్. కె. చక్కటి పాటలిచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ఐదు వైవిధ్యమైన పాటలు అద్భుతంగా రాశారు. ‘యాత్ర’ సినిమా వైఎస్‌గారి అభిమానులకు ఎలాగూ నచ్చుతుంది. కానీ, ఈ సినిమా ఆయన అభిమానులకి మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అని నిర్మాత విజయ్ చిల్లా అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మమ్ముట్టి లీడ్ రోల్లో నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. శుక్రవారం హైదరా బాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్లో మహి వి.రాఘవ్ మాట్లాడుతూ– ‘‘యాత్ర’ షూటింగ్ మొత్తం పూర్తయ్యాక జగన్ అన్నకి ట్రైలర్ చూపిస్తే, బాగుందన్నారు. సినిమా కూడా పూర్తయింది చూస్తారా? అని అన్నను అడిగాం. ‘మీ నాయకుని కథ మీరు చెప్పారు.. నేను చూసి ఏం చెప్పేది’ అన్నారు. ఇక్కడే మనం ఒక మాట గమనించాలి. ఇది మా నాన్న కథ అనలేదు.. మీ నాయకుని కథ అన్నారు. ఒకర్ని గుడ్డిగా నమ్మడానికి, అలాంటి మాట చెప్పడానికి చాలా గుండె ధైర్యం కావాలి. అది జగన్ అన్నకు ఉంది. ఈ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా, అతిథులుగా ఎవర్ని పిలుద్దామన్నప్పుడు వైఎస్‌గారి అభిమానులను పిలుద్దామని చెప్పా. ఇది మన నాయకుడి కథ’’ అన్నారు. ‘‘యాత్ర’ సినిమా వైఎస్‌గారి ఫ్యాన్స్‌కే కాదు.. ఆయన ఫ్యాన్స్ కానివారికి కూడా నచ్చుతుంది. అందరికీ నచ్చే స్ఫూర్తిదాయకమైన సినిమా ఇది. ‘యాత్ర’ అన్ని పొలిటికల్ పార్టీలు చూసే చిత్రం. వారందరికీ మంచి స్ఫూర్తిగా ఉంటుందనే నమ్మకం నాకుంది’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. నిర్మాతలు పీవీపీ, దామోదర ప్రసాద్, రవిశంకర్, నటుడు విజయ్‌చందర్, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య, సంగీత దర్శకుడు కృష్ణకుమార్ (కె.), చిత్ర కెమెరామెన్ సత్యన్ సూర్యన్, తుని ఎమ్మెల్యే తాడిశెట్టి రాజ, కెమెరామెన్ శ్యామ్ దత్, నటి ఆశ్రిత, ‘బిగ్ సీ’ డైరెక్టర్ గౌతమ్, పాటల రచయిత, గాయకుడు పెంచల్దాస్, ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనిక పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డిగారి అభిమానులే సెలబ్రిటీలుగా హాజరై ‘యాత్ర’ సినిమాలోని ఒక్కో పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందారో తమ మాటల్లో పంచుకున్నారు. ► ‘వైఎస్‌గారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మేము చదువుకున్నాం. నిరుపేదలమైన మేము ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదివాం’ అని తూర్పుగోదావరి జిల్లా తాల్రేవు మండలం పి.మల్లవరం గ్రామానికి చెందిన స్వర్ణలత, సువర్ణ కుమారి అన్నారు. ► ‘వైఎస్‌గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు నా కుటుంబానికి వర్తించాయని గర్వంగా చెబుతున్నా’ అని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన నక్కా లక్ష్మీనారాయణ అన్నారు. ► ‘వైఎస్‌గారి పాదయాత్రలో నేను కూడా పాల్గొన్నా. నాకు వికలాంగుల పెన్షన్‌తో పాటు ఇల్లు మంజూరు చేశారాయన. రాజన్న చేసిన సేవలు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేం. రాజన్న కుమారుడు జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలి’’ అని ఆనపాటి వెంకటయ్య చెప్పారు. ► ‘చాలా దూరం నుంచి ఒక్కదానివే ఎలా వచ్చావని ఎంతో మంది నన్ను అడిగారు. వైఎస్‌గారు ఇచ్చిన ధైర్యం చాలదా మనకి ఒంటరిగా రావడానికి? ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యా’ అని తూర్పు గోదావరి జిల్లా కడియం గ్రామానికి చెందిన వి.నిఖిల సంతోషం పంచుకున్నారు. ► ‘మా అమ్మకి గుండెకి రంధ్రం ఉండేది. అమ్మ ఆపరేషన్ కోసమని చదువు మానేశా. పనిలో చేరా. ఆపరేషన్ చేయించే స్థోమత లేదు. మా అమ్మ గోడు ఏ దేవుడూ వినలేదు. వైఎస్ అనే దేవుడు విన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యశ్రీ’ పథకంతో మా అమ్మకి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా గుండె ఆపరేషన్ చేయించా’ అని నిజామాబాద్ జిల్లా దేవపల్లికి చెందిన కె. రవికుమార్ చెప్పారు. -
ఇవే నా రాజకీయాలు : మమ్ముట్టి
‘‘ఇప్పటివరకు దాదాపు 375 చిత్రాల్లో నటించాను. ఏడాదికి ఐదారు సినిమాలు చేయాలని నేను ఒప్పందం కుదుర్చుకోవడంలేదు. నా దగ్గరకు వచ్చిన సినిమాలను నేను చేస్తూ వెళ్తున్నానంతే. సినిమాల పట్ల నాకు ఉన్న తపన అలాంటిది’’ అన్నారు మలయాళ స్టార్ మమ్ముట్టి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా రూపొందిన చిత్రం ‘యాత్ర’. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించారు. మహి వి.రాఘవ్ దర్శకత్వంలో శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. ఈ నెల 8న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మమ్ముట్టి చెప్పిన విశేషాలు. ► చాలా కాలం తర్వాత తెలుగు సినిమా చేశాను. తెలుగు ప్రేక్షకులు అన్ని రకాల సినిమాలను ఆదరిస్తారు. ఇండస్ట్రీలో మంచి వాతావరణం ఉంటుంది. వైఎస్సార్ లాంటి లెజెండరీ క్యారెక్టర్ కోసం మహి పూర్తి స్క్రిప్ట్‌తో నా వద్దకు వచ్చారు. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. సినిమా ఆలస్యం కాకుండా నిర్మించగల మంచి నిర్మాత దొరికారు. ఇలా చాలా అంశాలు ఉన్నాయి ఈ ‘యాత్ర’ సినిమా చేయడానికి. ► వైఎస్సార్ బాడీ లాంగ్వేజ్‌ని ఇమిటేట్ చేయలేదు. ఆయనది డిఫరెంట్ పర్సనాలిటీ. సినిమాలో సోల్ ఆఫ్ ది క్యారెక్టర్‌ను మాత్రమే తీసుకుని నటించాను. స్క్రిప్ట్ ప్రకారం చేశానంతే. ఒక గొప్ప వ్యక్తి లైఫ్‌ని రెండుగంటల్లో చెప్పడం కష్టం. ఇది పూర్తి బయోపిక్ కాదు. వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం. పాదయాత్రలో భాగంగా వైఎస్సార్ ప్రజలను కలవడం, వారితో మాట్లాడటం, వారి భావోద్వేగాలను పంచుకోవడం, వారి సమస్యలను విని పరిష్కార మార్గాల గురించి చర్చించడం వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. ► వైఎస్సార్ పాత్రలో పాద యాత్ర చేసినప్పుడు సినిమాలో ప్రజలు తమ కష్టాలను చెప్పుకునే సీన్స్ ఉంటాయి కదా. ఆ కష్టాలన్నీ నిజంగా జరిగినవే. అవి విన్నప్పుడు ఎమోషనల్‌గా అనిపించింది. నా ఎమోషన్‌ను కంట్రోల్ చేసుకున్నాను. ఎందుకంటే నేను చేస్తున్నది పాత్ర అని నాకు తెలుసు. ప్రజల సమస్యలు ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. పేదరికం ఒకేలా ఉంటుంది. ► మహి డైరెక్ట్ చేస్తున్నట్లు నాకు అనిపించలేదు. బాగా చేశారు. టీమ్ ఎఫర్ట్ ఇది. షూటింగ్ అంతా విహార యాత్రలా గడిచింది. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. యాత్రలో నాకు యంగ్ ఏజ్ ఫాదర్‌గా నటించారు జగపతిబాబు. నా ‘మధురరాజా’ (మలయాళం) సినిమాలో ఆయనతో మంచి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ► నా కెరీర్లో ఇప్పటివరకు 70కి పైగా కొత్త దర్శకులతో పని చేశాను. వారిలో దాదాపు 90 శాతం మంది మాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్‌లో ఇద్దరు పెద్ద దర్శకులు అయ్యారు. మహి వి. రాఘవ్ ఆల్రెడీ రెండు సినిమాలు చేశారు. ► కొత్తభాష నేర్చుకోవడమంటే నాకు చాలా ఆసక్తి. అందుకే ఈ సినిమాకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నా. నా దర్శక నిర్మాతలు, నా సహచర నటులు నా తెలుగు పట్ల హ్యాపీగానే ఉన్నారు. తెలుగు, మలయాళ భాషలో కొన్ని సిమిలర్ పదాలు ఉన్నాయి. ఉచ్చారణలో పెద్ద తేడా లేదు. కొన్ని టేక్స్ తీసుకుని ఫైనల్‌గా బాగానే కంప్లీట్ చేశాను. నా కెరీర్లో పొలిటికల్ చిత్రాలు ఉన్నాయి. కానీ బయోపిక్స్ లేవు. ‘అంబేద్కర్, బషీర్’ల బయోపిక్స్ మాత్రమే చేశాను. 38 ఏళ్లు సినిమాల్లో గడిచిపోయాయి. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లడం ఎందుకు? ఇవే (సినిమా) నా రాజకీయాలు (నవ్వుతూ). ► గత 30 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్‌లో మార్పు కనిపిస్తోంది. విశ్వనాథ్‌గారు భిన్నమైన చిత్రాలు చేశారు. నేను గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశా. తెలుగులో మంచి మసాలా సినిమా చేసే అవకాశం రాలేదు. గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో ‘రైల్వేకూలి’ అనే సినిమా అంగీకరించాను. అది పూర్తి కాలేదు. ► నేను తెలుగు సినిమాలు చూస్తాను. ‘రంగస్థలం, భరత్ అనే నేను’ సినిమాలు చూశాను. తెలుగుభాషపై పట్టు కోసం యూట్యూబ్‌లో కొన్ని క్లిపింగ్స్ చూశాను. ఇప్పుడు నేను చేస్తున్న నా మలయాళ సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవుతాయా? కావా? అనేది ‘యాత్ర’ రిజల్ట్‌ని బట్టి ఉంటుంది. ► వైఎస్ జగన్‌ను నేను కలవలేదు. వైఎస్సార్సీపీ అభిమానులు ఎవరూ ఈ సినిమా గురించి నాతో మాట్లాడలేదు. వైఎస్సార్సీపీ అభిమానుల నుంచి మా సినిమాకు మద్దతు లభిస్తుందేమో నాకు తెలీదు. ► ఏ ఇండస్ట్రీలో సినిమా చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది అనే విషయం మనం చేస్తున్న సినిమాపై ఆధారపడి ఉంటుంది. వందకోట్లతో సినిమా చేయవచ్చు. యాభైలక్షలతో కూడా చేయవచ్చు. మన సినిమాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. అప్పుడు మన నటనలో తేడా తెలుస్తుంది. ఇందుకోసం నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను. ప్రతిభ ఉండటమే కాదు. దాన్ని నిరూపించుకునేందుకు కష్టపడటం కూడా ముఖ్యమే. ఇప్పటికీ నా సహచర నటులను చూసి ఇన్స్పైర్ అవుతుంటాను. ► అప్పటి ‘స్వాతికిరణం’ సినిమాలో ఎలా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను అంటే ఇందుకు కారణం నాకు తెలీదు. దేవుడి దయ అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. నాది 1980 బ్యాచ్ కాదు. 2018 బ్యాచ్. ► నా మలయాళ చిత్రం ‘మధుర రాజా’ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. కన్నడంలో ఓ సినిమా చేస్తున్నాను. వెబ్ సిరీస్‌లో నటించే ఆలోచన ప్రస్తుతం లేదు. -
చేసినవే చూపించండి... చేయనివి వద్దన్నారు
‘‘ఆనందో బ్రహ్మ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కోసం చెన్నై వెళ్లాం. అప్పుడు ‘యాత్ర’ ఐడియా గురించి చెప్పాడు మహి. ఫస్ట్ ‘యాత్ర’ కథ నాకు చెప్పలేదు. జస్ట్ ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ డైలాగ్‌కి సంబంధించిన సీన్ మాత్రమే చెప్పాడు. అప్పుడు నేను ఒకటే మాట చెప్పా. సినిమా మొత్తం ఇదే ఎమోషన్ ఉంటే తప్పకుండా చేద్దాం అన్నాను’’ అని విజయ్ చిల్లా అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. మమ్ముట్టి లీడ్ రోల్లో నటించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ చిల్లా విలేకరులతో మాట్లాడారు. ‘యాత్ర’ పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్. ఇందులో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్ ఏంటంటే.. ‘ఎమోషన్’. 2 గంటల పాటు ప్రేక్షకులు ఎమోషన్‌తో ఎంగేజ్ అవుతారు. పాదయాత్ర నాటికి వైఎస్సార్‌గారి లుక్స్‌కి, సినిమాలో మమ్ముట్టిగారి లుక్స్‌కి చాలా తేడా ఉంది. డైలాగ్ మాడ్యులేషన్ విషయంలో కూడా వైఎస్సార్గారిలా మాట్లాడమని చెప్పలేదు. అలాగే వైఎస్సార్‌గారు ఎలా నడిస్తే చాలా నడవాలని చెప్పలేదు. పాత్రను అవగాహన చేసుకుని మమ్ముట్టిగారు నటించారు. మేం తీసిన ‘భలే మంచి రోజు’కి శ్యామ్ దత్‌గారు కెమెరామేన్‌గా చేశారు. ఆయన ద్వారానే మమ్ముట్టిగారిని సంప్రదించాం. అప్పుడు ఆయన వేరే సినిమా షూటింగ్లో ఉన్నారు. గ్యాప్‌లో లైన్ విన్నారు. ఆ తర్వాత ఓ రోజు పిలిచి కథ విని, పదిరోజుల్లో పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మన్నారు. మరో రోజు వెళ్లినప్పుడు మొత్తం కథ తెలుగులోనే విన్నారు. మధ్యలో మహి కొంచెం ఇంగ్లీష్ వాడినా తెలుగులోనే చెప్పమనేవారు. ఎక్కడైనా అర్థం కాకపోతే అడిగి మళ్లీ మళ్లీ చదివించుకుని 10 గంటల పాటు కథ విన్నారు. మహి, నా కెరీర్లో లాంగెస్ట్ నెరేషన్ అంటే అదే. కథ విని నటించేందుకు మమ్ముట్టిగారు ఒప్పుకున్నా వెంటనే డేట్స్ ఇవ్వలేకపోయారు. 3, 4 నెలలు వేచి ఉండగలిగితే సినిమా చేద్దాం అన్నారు. ఓ రోజు ఫోన్ చేసి 45 రోజులు డేట్స్ ఉన్నాయి చేయగలరా? అన్నారు. కుదరదు సార్.. మాకు 3 నెలలు కావాల్సిందే అని రిక్వెస్ట్ చేశాం. మామూలుగా అయితే 90 రోజుల్లో మలయాళంలో రెండు సినిమాలు చేసేయొచ్చు. కానీ మన దగ్గర వీలుపడదు. వైఎస్సార్‌గారి పాదయాత్ర ప్రధానాంశం కాబట్టి ఈ సినిమాలో దాదాపు ప్రతి సీన్లో ఎక్కువమంది జనాలు ఉంటారు. అందుకే ఎక్కువ రోజులు అడిగాం. మమ్ముట్టిగారు ఓకే అన్నారు. ‘యాత్ర’ సినిమా ఒక ఈవెంట్ బేస్డ్ మూవీ. కొన్ని బయోపిక్స్ ఎలా ఉంటాయంటే.. పుట్టినప్పటి నుంచి బిగిన్ అయి, చనిపోయే వరకూ ఉంటాయి. మరికొన్ని ముఖ్యమైన అంశం చుట్టూ తిరుగుతాయి. మా సినిమా మాత్రం వైఎస్సార్‌గారి జీవితాన్ని ప్రభావితం చేసిన పాదయాత్ర చుట్టూ తిరుగుతుంది. బయోపిక్‌లో అన్నీ కరెక్ట్‌గా చూపించడానికి కుదరదు. అలా చూపిస్తే డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే వైఎస్సార్‌గారి జీవితంలో జరిగిన వాస్తవాలనే సినిమాటిక్ లిబర్టీతో సినిమా ఫార్మాట్లో చూపించాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు పాదయాత్రలో ఉన్నప్పుడు కలిసి, ఈ సినిమా గురించి చెప్పాము. ఆయన ఇన్పుట్స్ ఇస్తారేమో అనుకున్నాం. కానీ ‘మా నాన్నగారు చేసిందే చూపించండి.. చేయనివి చూపించకండి. ఇది మీ నాయకుడి సినిమాలా మీ వెర్షన్లో మీరు చేస్తున్నారు. అలాగే చేయండి’ అని ఆయన అన్నారు. అంతకుమించి ఈ బయోపిక్‌లో జగన్‌గారి ప్రమేయం లేదు. ‘యాత్ర’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని నమ్మకంగా ఉన్నాం. ఈ సినిమా వెనక ఏ పార్టీ బ్యాకింగ్ లేదు. మా అంతట మేమే తీశాం. మేమే రిలీజ్ చేస్తున్నాం. -
కంట నీరు పెట్టించే ‘యాత్ర’ పాట
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రను.. వెండితెరపై ‘యాత్ర’గా ఆవిష్కరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ మూవీ నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. మరుగైనావా రాజన్న.. కనుమరుగైనావా రాజన్న అంటూ సాగే ఈ పాట.. రాజన్న మరణంతో శోక సంద్రంలో మునిగిన ఎంతో మంది ప్రజల గుండెల్లోని భావాలే పాటైనట్టుంది. రచ్చబండకని బయల్దేరిన రాజన్న అనంతలోకాలకు చేరుకోవడంతో తెలుగు రాష్ట్రాలు కన్నీటి సంద్రమైన పరిస్థితులను ఈ పాట వివరిస్తోంది. ఈ పాటకు సమకూర్చిన బాణీ, పెంచల్ దాస్ స్వయంగా రాసి, పాడిన ఈ పాట మళ్లీ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఉన్నాయి. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. -
‘యాత్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. యాత్రగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి ఒకటో తేదీన హైద్రాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఈ ఈవెంట్ జరుగనున్నట్లు నిర్మాతలు తెలిపారు. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 8న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. -
యాత్ర పొలిటికల్ సినిమా కాదు
వైఎస్ఆర్... జనరంజకమైన పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్ఆర్ పాత్రలో మలయాళ స్టార్ మమ్ముట్టి నటించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. శివ మేక సమర్పణలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ. ► ‘యాత్ర’ని గతేడాది చివర్లోనే పూర్తి చేశారు కదా, సినిమా విడుదల తేదీ ఎందుకు మార్చారు? మహి: నిజానికి గతేడాది డిసెంబర్ 21కి రిలీజ్ అనుకున్నాం. ఆ తర్వాత ఈ జనవరి 9న విడుదల అని ఫిక్స్ అయ్యాం. అయితే సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతుండటం వల్ల థియేటర్ల సమస్య ఉంటుంది. ప్రాక్టికల్‌గా... థియేటర్లు దొరికి రిలీజ్ చేసే అంత బలం మా వద్ద లేదు. అందుకే ఫిబ్రవరి 8న రిలీజ్ చేస్తున్నాం. మరో కారణం ఏంటంటే ‘యన్.టి.ఆర్ : మహానాయకుడు’ కూడా ఫిబ్రవరిలోనే విడుదలవుతోంది కదా. అప్పుడే ‘యాత్ర’ రిలీజ్ చేస్తే అయిపోతుందిలే అనుకున్నాం. అందులో దాచిపెట్టేది ఏమీ లేదు. ► అసలు ‘యాత్ర’ ఎలా మొదలైంది? ‘యాత్ర’ చేద్దామనుకున్నప్పుడు నాకు తెలిసిన ఏ ఒక్కరు కూడా ‘ఏం పర్లేదు చెయ్.. మంచిది అనలేదు. పొలిటికల్ సినిమా ఎందుకు?’ అన్నారు. కానీ నాకు నా కథపై నమ్మకం ఉంది. ఇప్పుడు కాకపోయినా ఓ 50 ఏళ్ల తర్వాతైనా వైఎస్‌గారి గురించి చెప్పాల్సిన కథ ఇది. నా ‘ఆనందో బ్రహ్మ’ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ‘యాత్ర’కి రిస్క్ తీసుకునే చాన్స్ దొరికింది. ఆ సినిమా ఫ్లాప్ అయ్యుంటే మార్కెట్‌ని బట్టి పోవాల్సి వచ్చేది. ‘ఆనందో బ్రహ్మ’ చేస్తున్నప్పుడే ‘యాత్ర’ కథ గురించి విజయ్ చల్లా, శశి దేవిరెడ్డిగార్లతో చర్చించేవాణ్ని. కథ బాగా వస్తే చూద్దామన్నారు. కథ బాగా కుదరడం, పైగా నాపై ఉన్న నమ్మకంతో చేద్దామన్నారు. ► వైఎస్‌గారి బయోపిక్ తీయాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఈ కథకి స్ఫూర్తి ఏంటి? నాకు వైఎస్‌గారి గురించి చాలా తక్కువ తెలియడం అడ్వాంటేజ్ అయింది. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నేను ఈ దేశంలో లేను. వైఎస్‌గారి మరణానికి ఏడాది ముందు 2008లో ఇండియా వచ్చాను. 2009లో ఎలక్షన్లు రావడం.. వైఎస్‌గారు మళ్లీ అధికారం చేపట్టడం జరిగాయి. ఆయన మరణానంతరం జనాలంతా ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటుండటం విన్నాను. వైఎస్‌గారి అభిమానులో, వీరాభిమానులో మాట్లాడుకుంటుంటే విని సినిమా తీయడం కష్టం అయ్యుండేది. ఆయన గురించి వేరేవాళ్లు చెబుతున్నప్పుడు కొత్తగా, బాగా అనిపించింది. అప్పుడే ఆయనపై స్టోరీ రెడీ చేద్దామనిపించింది. వైఎస్గారితో ప్రయాణం చేసిన వారిని కలిసి, వారి అనుభవాలు, జరిగిన సంఘటనలు తెలుసుకున్నా. ఆయనతో ఏ సంబంధం లేనివాళ్లు కూడా ‘వైఎస్ అది చేశారు.. ఇది చేశా’రని మాట్లాడుకుంటుండం ఆశ్చర్యమనిపించింది. వైఎస్గారితో ప్రయాణం చేసినవాళ్లో, కడపలోనే ఆయన గురించి మాట్లాడుతున్నారంటే అది వేరే విషయం. అరే.. ఓ ఐదారేళ్లలో ఆయన ప్రజలకి ఎంత సేవ చేసి ఇంత ఇంపాక్ట్ చూపించారో అనిపించింది. ► మీరు ఎప్పుడైనా వైఎస్‌గారిని కలిశారా? నాకా భాగ్యం కలగలేదు. కానీ, ఆయనతో మాకున్న చిన్న లింక్ ఏంటంటే మా అమ్మది ఇడుపులపాయ దగ్గర చక్రాయపేట మండలంలోని చిలేకాంపల్లె అనే ఊరు. కానీ, వైఎస్‌గారి కథ మనం చెప్పాలని మాత్రం ఉండేది. మా అమ్మ నా సినిమాలు ఎప్పుడూ చూడలేదు. కానీ, ‘యాత్ర’ సినిమా చూస్తానన్నారు. అది కూడా నా గురించి కాదు.. వైఎస్‌గారి గురించి. ► ఈ బయోపిక్ చేయాలనుకున్నప్పుడు విజయమ్మగారిని కానీ, వైఎస్ జగన్‌గారిని కానీ కలిశారా? ‘యాత్ర’ పోస్టర్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత పాదయాత్రలో జగన్ అన్నని కలిశాను. వైఎస్‌గారిపై సినిమా చేయాలనుకుంటున్నానంటే ఓకే అన్నారు. జగన్ అన్న ‘మా నాన్న చేయనివి చెప్పొద్దు. నాన్నగారు చేయనిదాని క్రెడిట్ మనకొద్దు’ అన్నారు. అంతేకాదు.. ‘నాన్నగారి గురించి జనాలకు మీరు ఓ కథ చెప్పాలనుకున్నారు. ఆ కథ ఏంటని నేను తెలుసుకుని, మార్పులు చేర్పులు చేయమని చెప్పడం కరెక్ట్ కాదు’ అన్నారు. ఆ మాట జగన్ అన్న చెప్పడం చాలా గ్రేట్. ఇప్పుడొస్తున్న బయోపిక్‌లలో ఎస్టాబ్లిష్ అయ్యే విషయాలనే చూపిస్తున్నారు. ► వైఎస్‌గారి బాల్యం, విద్యార్థి దశ ఈ సినిమాలో ఉంటాయా? లేదు. ఆయన పాదయాత్ర ఘట్టం నుంచే సినిమా ఉంటుంది. ఈ కథని డ్రైవ్ చేయడానికి ఏం అవసరం అనే అంశాలన్నీ తీసుకుని కథ రెడీ చేశా. అలాగని కేవలం పాదయాత్ర గురించి మాత్రమే ఉండదు. అయితే 2004 ఎన్నికలకు ఆర్నెల్ల ముందు నుంచి పాదయాత్ర చేసినట్టు చూపించాం. ఆయన వాస్తవంగా ఎన్నికలకు ఏడాదిన్నర క్రితం పాదయాత్ర చేశారని మనకు తెలుసు. కానీ, మనం సినిమా అనే ఫార్మాట్లో.. ఓ డ్రమటైజ్డ్ ఫార్మాట్లో చెప్పదలచుకున్నాం కాబట్టి ఆ పాత్రల్ని మూవ్ చేయడం కానీ, తగ్గించడమో, పెంచడమో చేశాం. ► ఈ సినిమాలో వైఎస్‌గారి తనయుడి పాత్రలో జగన్‌గారు కనిపిస్తారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి? సినిమా చివరలో వచ్చే సన్నివేశంలో ఓ ఫుటేజ్‌లో ఉంటారే కానీ, సినిమాలో ఎక్కడా నటించలేదు. వైఎస్‌గారు చనిపోయినప్పుడు తీసుకున్న కొన్ని రియల్ విజువల్స్‌లో ఆయన ఎక్కడైనా కనిపిస్తారు కానీ, సెపరేట్‌గా ఆయనపై షూట్ చేయలేదు. ∙‘యాత్ర’ పక్కా పొలిటికల్ మూవీ అని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాలు మీదాకా వచ్చాయా? అలా ఏం లేదు. వైఎస్‌గారి గొప్పతనం చెప్పడానికి ఇంకొకర్ని మనం చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. ఒకర్ని తిట్టాల్సిన లేదా చెడు చేయాల్సిన అవసరం కూడా లేదు. వైఎస్‌గారికి ఉన్న పాజిటివ్ థ్రెడ్స్‌ని మనం కరెక్ట్‌గా చూపించగలిగితే చాలు అనుకున్నాం. మన దేవుణ్ని మహానుభావుడు అనుకోవడానికి వేరొకర్ని చిన్నగా చేయాల్సిన అవసరం రాలేదు. పైగా అలాంటి లక్షణం వైఎస్‌గారిది కాదు. ► ఫిబ్రవరిలో ‘యాత్ర’ రిలీజవడం ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందనుకుంటున్నారా? నిజాయతీగా చెప్పాలంటే అలా అనుకోవడం ఓవర్ ఎస్టిమేషన్ అనుకుంటున్నాం. ఇప్పుడున్న ప్రజలు, ఓటర్లు స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్. ఎవరికి ఓటేస్తే ఎంత లాభం అని ఓ క్యాలిక్యులేషన్‌తో చెప్పేస్తారు. అంత తెలివైన ఓటర్లు ఓ సినిమాతో ప్రభావితం అవుతారని నేను అస్సలు నమ్మను. 30 ఏళ్ల కిందట సినిమా చూసి వాళ్లు ఎగై్జట్ అయ్యి ఓట్లు వేసుండొచ్చేమో. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకవేళ మా సినిమా ప్రభావితం చేస్తే మంచిదే. ► ‘యాత్ర’ టీజర్, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. జగన్‌గారికి చూపించారా? చూపించాను.. బాగుందన్నారు. సినిమాలో ఏం ఉంటుందనే అంశాల్ని ట్రైలర్లో చూపించాం అంతే. ఏ అంశాన్నీ మిస్లీడ్ చేయలేదు. ► ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ రీచ్ అవుతుందనుకుంటున్నారు? నాకు ఆ ఆలోచన లేదండీ. ఇదొక హానెస్ట్ ఫిల్మ్. సినిమా చూసినప్పుడు ఆ పాత్రతో వాళ్లు ఎమోషనల్‌గా కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఎంతమంది చూస్తారు, ఎంత వసూలు చేస్తుందనే ఆలోచన లేదు. తెలుగు ప్రేక్షకులే కాదు.. మలయాళ ప్రేక్షకులు కూడా ‘యాత్ర’ని ఓ మంచికథగా యాక్సెప్ట్ చేస్తారు. వైఎస్‌గారు తెలిసిన వాళ్లు చూడటం కాదు.. తెలియని వారు కూడా చూడాలి.. ‘ఎవరో ఓ నాయకుని కథ, చరిత్ర ఇది. కథగా చాలా ఇంట్రెస్టింగ్గా, ఎమోషన్‌గా ఉంది’ అనేది అచీవ్ అవ్వాలి. అది మేం అచీవ్ అయ్యామనుకుంటున్నాం. ► మీ తర్వాతి ప్రాజెక్ట్స్ ఏంటి? ‘యాత్ర’ బాగా ఆడితే ఇంతకంటే ఇంకో పెద్ద సినిమా వస్తుంది. ఆడకుంటే మరో చిన్న సినిమా అవకాశం వస్తుంది. అది కూడా సరిగ్గా ఆడకుంటే ఏ వెబ్‌సిరీసో చేయాలి. మనం కథ చెప్పాలని వచ్చాం. అది సినిమానా, వెబ్ సిరీసా, అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలకు చెబుతామా? అన్నది ముఖ్యం కాదు. ఏదేమైనా ఓ సినిమా నా చరిత్రను అంతం చేయదు. ఈ సినిమా కాకుంటే మరో సినిమా.. అది కూడా కాకుంటే వెబ్ సిరీస్. అంతేకానీ కథ చెప్పడం మాత్రం ఆపం (నవ్వుతూ). ‘యాత్ర’ రాజకీయ సినిమా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. వాళ్లకున్న సర్ప్రైజ్ ఏంటంటే ఇందులో రాజకీయాలు ఉన్నది కేవలం 20 శాతమే. మిగిలిన 80 శాతం హ్యూమన్ డ్రామా. ఎమోషనల్‌గా చాలా బాగుంటుంది. వైఎస్‌గారు రాజకీయ నాయకుడు కావొచ్చు కానీ, ఇది పొలిటికల్ సినిమా మాత్రం కాదు. రాజకీయాలు చాలా తక్కువ ఉంటాయి. పాదయాత్రకి ముందు వరకూ వైఎస్గారంటే ఒక విధమైన లీడర్ అనే ప్రచారం చేశారు కొందరు వ్యక్తులు.. మీడియా వాళ్లు. పాదయాత్ర ద్వారా ఆయన ప్రజల్ని కలుసుకుని, మాట్లాడారు. దీంతో వైఎస్‌గారు ఇంత మంచి మనిషా అంటూ జనాలు భావించారు. అప్పటివరకూ ఆయనపై ఉన్న ఇమేజ్ వట్టిదే అనుకుని మార్పు చెందారు. -
‘యాత్ర’ నుంచి గుండెను తాకే పాట
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ ‘యాత్ర’పై అంచనాలను పెంచేశాయి. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి గుండెను కదిలించే ఓ పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. పల్లెల్లో కల ఉంది.. పంటల్లో కలిముంది అంటూ సాగే ఈ పాటలో రైతుల కష్టాలను, వారు పడే బాధలను వివరించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ చిత్రానికి కె (కృష్ణ కుమార్) సంగీతాన్ని అందించారు. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. శివ మేక సమర్పణలో 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 8న మూడు (తెలుగు, తమిళ, మలయాళ) భాషల్లో విడుదలవుతోంది. -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘యాత్ర’
మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న బయోగ్రాఫికల్ మూవీ యాత్ర. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకు మహి వీ రాఘవ్ దర్శకుడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్‌కు రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికేట్‌ను జారీ చేశారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. ఈ సినిమాలో వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి రాజా రెడ్డి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. సుహాసిని, అనసూయ, రావూ రమేష్, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
‘వైఎస్సార్ కథ చెప్పే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథతో తెరకెక్కుతున్న బయోపిక్ మూవీ యాత్ర. రాజశేఖర్ రెడ్డి చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్సార్ పాత్రలో నటించారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ వరుస అప్డేట్స్తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు మహి వీ రాఘవ్ వైఎస్సార్ ఘాట్‌లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించి నివాళులర్పించారు. ఆయన గొంతు వినిపించే అవకాశం, ఆయన కథను ప్రజలకు చెప్పే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శివా మేక సమర్పణలో 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు, సుహాసిని, రావూ రమేష్, అనసూయ, పోసాని కృష్ణమురళి, వినోద్ కుమార్, సచిన్ ఖేడ్కర్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Except for my roots, my mom who hails few miles away from idupulapaya(Kadapa) Our paths never crossed but was destined & chosen to tell YS Rajasekhara Reddy’s story Finally we did meet all I could do is to THANK HIM for making me his voice & for the opportunity to tell his story pic.twitter.com/oxyjlplyiU — Mahi Vraghav (@MahiVraghav) 19 January 2019 -
ఇది మరచిపోలేని యాత్ర
ఇటీవలే ‘యాత్ర’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహా నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాత్రను పోషించారు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ జర్నీలో మమ్ముట్టితో తనకు ఏర్పడిన అనుబంధాన్ని దర్శకుడు మహీ. వి రాఘవ్ ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘మమ్ముట్టిగారితో మా ప్రయాణం ముగిసింది. 390కి పైగా సినిమాలు, 3 నేషనల్ అవార్డులు, 60మందికి పైగా నూతన దర్శకులను పరిచయం చేసిన వ్యక్తి మమ్ముట్టిగారు. ఇవన్నీ కాకుండా చాలా గొప్ప మనిషి, మంచి గురువు. ఇన్ని చేసిన ఆయన ఇంకా నిరూపించుకోవాల్సింది, సాధించాల్సింది ఏమీ లేదు. బంధువును గౌరవించుకోవడం మన సంప్రదాయం అంటారు. ఏదైనా సినిమాలో తన పాత్రను సరిగ్గా నిర్వర్తించకపోయినా, మీ అంచనాలను అందుకోకపోయినా ప్రేక్షకులుగా మీరు ఆయన్ను విమర్శించవచ్చు. కానీ, నటుడిగా ఆయనకున్న డెడికేషన్ అభినందించకుండా ఉండలేనిది. ఈ స్క్రిప్ట్‌ని తెలుగులోనే విన్నారు. ప్రతి అక్షరానికీ అర్థం తెలుసుకున్నారు. ప్రతి డైలాగ్‌ని ఆయన భాషలో రాసుకొని క్షుణ్ణంగా సెట్లో పలికారు. డబ్బింగ్లో ఒకటికి రెండు సార్లు జాగ్రత్తపడ్డారు. ఆయనకు మన సంప్రదాయాలు, సంస్కృతి మీద విపరీతమైన గౌరవాభిమానాలు ఏర్పడ్డాయి. ఈ క్యారెక్టర్‌కు మమ్ముట్టిగారు తప్ప మరెవరూ న్యాయం చేయలేరని బలంగా చెప్పగలను. మమ్ముట్టిగారు నిజంగా మ్యాజిక్, వండర్ఫుల్. ఆయనతో చేసిన ఈ యాత్ర ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా’’ అన్నారు. ‘యాత్ర’ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. -
పాఠశాల మూవీ పోస్టర్స్