ఇలా చూడు మహీ.. ఎర్ర డైరీలో పేరు రాసుకోమంటావా? | Yatra 2 Director Mahi V Raghav 2 Acers Land For Studio In Rayalaseema Controversy - Sakshi
Sakshi News home page

ఇలా చూడు మహీ.. ఎర్ర డైరీలో పేరు రాసుకోమంటావా?

Published Tue, Feb 13 2024 3:19 PM | Last Updated on Tue, Feb 13 2024 4:03 PM

Mahi V Raghav Studios Land Issue - Sakshi

ప్రియమైన రాఘవా.!

రెండు సినిమాలు తీసినావో లేదో... రాజకీయాలన్నీ ఒంటబట్టేశాయని అనుకోబాకు సామి.
కొంచెం టైమిస్తేనే అన్నీ అర్థమవుతాయి!

ఇలా చూడు మహీ...

ముందు మేము రామరావులో దేవుడిని చూపించాం...
వాటాల్లో తేడాలొచ్చాయో లేదో... 

అదే పెద్దమడిసిని కామారావును చేసేశాం.. డ్రామారావునూ చూపించి.. చెప్పులేయించి మరీ కుర్చీ లాగేశాం.
ఈ వ్యవహారాన్ని కాస్తా... మావోళ్లు అదేనబ్బీ ఆనాటోళ్లు ఉన్నారు కదా.. ఆళ్ల సాయంతో లోకకళ్యాణంగానూ జనాలకు చూపించేశాము. 
దీందేముందిగానీ.. దీనికంటే ముందు.. మన బెజవాడలోనే కదూ... ఆ నేతను లేపేసింది?
కొంటా పెడతా ఉంటే అదేదో నేస్తమంటారు..

మాదీ అంతే.. ఉంటే మాతో ఉండాలి.. లేదంటే అస్సలు ఉండకూడదు! అదీ లెక్క!
కాదూ కూడదని ఎవరైనా కాలరేగరేశారా? కాలంలో కలిసిపోయారు. 

ఏ రావయినా.. ఏ రెడ్డయినా.., ఇంకెవరయినా.. ఇప్పుడు నువ్వయినా సరే... 
మా దారికి రావాల్సిందే.. లేదంటావా? నీ ఇష్టం. చూసుకో మరి!
నిత్యం ఉషోదయంతో ఉదయించేది మేమనుకున్న సత్యమే! 
తిమ్మిని బమ్మి అంటాం. నమ్మితే సరేసరి.. కాదంటే అంతే సంగతి!

సినిమాలైనా... మీడియా అయినా సరే.. అందరూ మా పాటే పాడాలి. మేం చెప్పినట్లే ఆడాలి. 
కాదు కూడదంటే....అను‘కుల’ పత్రికలతో కాటేయిస్తాం.

అప్పుడెప్పుడో ఓ దర్శకరత్నం ఎగిరెగిరి పడ్డాడు...
‘ఉదయం’తో మొదలైన హడావుడి సాయంత్రానికే సద్దుమణిగేలా చేశాం.

ఇంకొకాయన... సమాజం సమాజం... న్యాయం న్యాయం అంటూ గొంతు చించుకున్నాడు. చివరికి ఏమైంది?
రాజకీయానికి బ్రేక్‌ పడింది. సినిమా మాత్రమే దిక్కయింది!

అంచేత ఏతావాతా మేము సెప్పొచ్చేదేటంటే... మాకు రాజకీయ ప్రత్యర్ధులైతే చాలు.. సొంతోళ్లనూ వదలం.. ఇతరులనూ వదలం. విషం కక్కడం మా నైజం కదా... సదా కక్కుతూనే ఉంటాం. 

మా ఫిలాసఫీ నీకు నచ్చేస్తే.. చేతులు కలిపేయి! కళాపోషణ ఎలాగూ చేసుకోవచ్చు. అదనంగా మా భ్రమరావతిలో ఓ కాలనీ పడేస్తాం!

కాదూ కూడదంటావా? 
మా పెన్నుల్లో ఇంకు వాడకం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం. 

రాజకీయ పార్టీలు పెట్టినా, విద్యా సంస్దలు నడిపినా, ఆసుపత్రులు నడిపినా, జనం భూములు లాక్కుని ఫిల్మ్ సిటీలు కట్టినా, మా విష ప్రచారం కోసం  పత్రికలు నడిపినా , చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి చట్టాలు ఉల్లంఘించినా, పచ్చళ్లు , పాల యాపారాలు ...ఇలా ఏది చేసినా మా వాడే చెయ్యాలి.
ఇది మేము పెట్టుకున్న రూలు.

కాదంటే..! తెలుసు కదా.. స్క్రీన్‌ ప్లే ఎలా ఉంటుందో.?

ఉదాహరణకు .... మా కులపోడు బికినీ ఉత్సవాలు నిర్వహించాలని చూస్తే... అబ్బో బ్రహ్మాండం , భజగోవిందమని జాకీలెట్టి లేపుతాం.

వేరేవాడు పోర్టులు , హార్బర్లు , మెడికల్ కాలేజీలు కడితే.... అమ్మో రాష్ట్రం దివాళా తీస్తుందని , సర్వనాశనమైపోతుందని విషం కక్కుతాం, అదే నిజమని నమ్మేలా ప్రచారం చేస్తాం. అనకాపల్లి నుంచి అమెరికా దాకా, నంద్యాల నుంచి న్యూజిలాండ్‌ దాకా దానికి సపోర్టుగా ట్వీట్‌లు వేస్తాం.

ఇప్పటికైనా అర్ధమయ్యిందా ? లేక ఎర్ర డైరీలో పేరు రాసుకోమంటావా?

-మీ డ్రామోజీ నాయుడు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement