సేవ్ ది టైగర్స్ సీజన్‌-2.. అది చెప్పేందుకు ప్రయత్నిస్తా : మహి వి రాఘవ్ | Mahi V Raghav Interesting Comments On Save the Tigers Season 2 Script, Deets Inside - Sakshi
Sakshi News home page

Mahi V Raghav: సీజన్‌-2లో ఆ ప్రయత్నం చేశాం.. అందుకే: మహి వి రాఘవ్

Published Fri, Mar 22 2024 7:18 PM | Last Updated on Fri, Mar 22 2024 7:47 PM

Mahi V Raghav Comments On Save the Tigers Season 2 Script - Sakshi

ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సీజన్‌-1కు ఆడియన్స్‌ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వతా వచ్చిన సైతాన్ సైతం సూపర్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆయన సేవ్ ది టైగర్ సీజన్ -2 ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సేవ్ ది టైగర్స్ సీజన్- 1, సైతాన్ సూపర్ హిట్, సేవ్ ది టైగర్స్ సీజన్ -2 సక్సెస్‌తో హ్యాట్రిన్‌ తన ఖాతాలో వేసుకున్నారు.

ఓటీటీలో హ్యాట్రిక్ విజయంపై మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. 'ఇంత మంచి విజయాలు అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించారు. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి నేను ప్రయత్నిస్తా. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని అన్నారు.

వెబ్ సిరీస్ గురించి చెబుతూ.. 'సేవ్ ది టైగర్స్ సీజన్- 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే.. సీజన్- 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్- 2పై కాస్త ఒత్తిడిగా ఫీలయ్యా. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. అలాగే సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే మరికొన్ని వెబ్ సిరీస్‌లతో మీ ముందుకు వస్తా' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement