Save The Tigers
-
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' సిరీస్‌లతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న దేవయాని శర్మకు ఇప్పుడు ఊహించని కష్టం వచ్చి పడింది. ఆమె ఉపయోగిస్తున్న ఫోన్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. దీని వల్ల మానసికంగా తాను ఎంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన నంబర్ నుంచి ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే స్పందించొద్దని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.(ఇదీ చదవండి: తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?)దేవయాని ఏం చెప్పింది?'కొన్నిరోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ అయింది. నా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ల దగ్గరే ఉంది. అయితే ఇది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలీదు. కానీ ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతున్నాను. అలానే నా వాట్సాప్ కూడా హ్యాక్ అయింది. ఎందుకంటే ఫోన్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఒకవేళ నా నంబర్ నుంచి ఎవరికైనా ఎలాంటి మెసేజులు వచ్చినా స్పందించొద్దు. ఎందుకంటే అది నేను కాదు''ఇప్పటికే దీని వల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అలానే మూడుసార్లు ముంబయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. కాబట్టి నా నంబర్ నుంచి ఎలాంటి మెసేజులు వచ్చిన చేస్తున్నది నేను కాదని అర్థం చేసుకోండి. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఇదేదే నా పరువు తీసి, చెడుగా ప్రాజెక్ట్ చేసే ఉద్దేశంతో చేస్తున్నారని అనిపిస్తుంది. మామూలుగానే ఆర్టిస్ట్ జీవితం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాటితో మరింత కష్టంగా మారుతోంది' అని దేవయాని తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది. (ఇదీ చదవండి: ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్) -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్!
మహి వీ రాఘవ్ డైరెక్షన్లో వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్-2. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు ఇండియాలోనే టాప్-3 ప్లేస్ దక్కించుకుంది. ఓటీటీల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన జాబితాలో టాప్-3లో నిలిచింది. ఈ విజయం పట్ల మహి వి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను మీరంతా ఆదరించి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి విజయాలను సాధిస్తాయని మరోసారి రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది’’ అని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సేవ్ ది టైగర్ రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతోసీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైయాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్- 3 సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ కోరింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని పేర్కొన్నారు. -
సేవ్ ది టైగర్స్ సీజన్-2.. అది చెప్పేందుకు ప్రయత్నిస్తా : మహి వి రాఘవ్
ఫిల్మ్ మేకర్ మహి వి.రాఘవ్ రూపొందించిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. సీజన్-1కు ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వతా వచ్చిన సైతాన్ సైతం సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆయన సేవ్ ది టైగర్ సీజన్ -2 ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలి వారంలోనే వ్యూయర్ షిప్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. సేవ్ ది టైగర్స్ సీజన్- 1, సైతాన్ సూపర్ హిట్, సేవ్ ది టైగర్స్ సీజన్ -2 సక్సెస్‌తో హ్యాట్రిన్ తన ఖాతాలో వేసుకున్నారు. ఓటీటీలో హ్యాట్రిక్ విజయంపై మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. 'ఇంత మంచి విజయాలు అందించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రతిరోజూ మనతో పాటు మన చుట్టూ వారి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, జంటలు మధ్య సాగే సంభాషణలతో పాటు బలమైన ఎమోషన్స్‌ను ప్రధానంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. నటీనటులు అద్భుతంగా నటించారు. దీంతో ఎంటర్టైన్మెంట్ మేం అనుకున్నట్లుగా వచ్చింది. మన మూలాలకు సంబంధించిన కథలను చెప్పటానికి నేను ప్రయత్నిస్తా. అలా చేశాను కాబట్టే ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది' అని అన్నారు. వెబ్ సిరీస్ గురించి చెబుతూ.. 'సేవ్ ది టైగర్స్ సీజన్- 1లో ఫ్రస్టేషన్‌తో భాధపడుతున్న భర్తలు ఎలా ప్రవర్తిస్తారనే దాన్ని తెరకెక్కిస్తే.. సీజన్- 2లో వారి బాధ్యతలు, మానసిక పరిపకత్వలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. సేవ్ ది టైగర్స్ పెద్ద హిట్టయ్యింది. దీంతో సీజన్- 2పై కాస్త ఒత్తిడిగా ఫీలయ్యా. ఇలాంటి డిఫరెంట్ కంటెంట్‌ను చేయాలనుకున్నప్పుడు చమత్కారంతో కూడిన రచన అనేది ఎంతో అవసరం. మా త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై కొత్త రైటర్స్, దర్శకులను ప్రోత్సహిస్తున్నాం. అలాగే సినిమాలను, వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌కు ఇండస్ట్రీలో ఓ గుర్తింపు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఆసక్తికరమైన కథలను అందించటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. త్వరలోనే మరికొన్ని వెబ్ సిరీస్‌లతో మీ ముందుకు వస్తా' అని అన్నారు. -
Save The Tigers 2 Review: సేవ్ ద టైగర్స్ 2.. ఎలా ఉందంటే?
వెబ్ సిరీస్ రివ్యూ: సేవ్ ద టైగర్స్ 2 నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు క్రియేటర్స్: మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం రైటర్స్ : ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్ ఆనంద్ కార్తీక్ దర్శకత్వం : అరుణ్ కొత్తపల్లి క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం సంగీతం : అజయ్ అరసద ఎడిటర్ : శ్రవణ్ కటికనేని విడుదల తేది: మార్చి 15, 2024 (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్సే కానీ కామెడీ జాడేది అనుకుంటున్న తరుణంలో సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ రిలీజైంది. గతేడాది హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ జనాలను ఎంతగానో ఆకట్టుకుంది. భార్యా బాధితులుగా హీరోలు పడే అగచాట్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది. ఈ హిట్ సిరీస్‌కు సీక్వెల్‌గా తాజాగా సేవ్ ద టైగర్స్ 2 విడుదలైంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం... కథ హీరోయిన్ హంసలేఖ(సీరత్ కపూర్) మిస్ అవడంతో మొదటి సీజన్ ముగుస్తుంది. తను ఏమైందన్న ఆందోళనతో రెండో సీజన్ కథ మొదలవుతుంది. హంసలేఖ ఎక్కడ? అని పోలీసులు విక్రమ్ (చైతన్య కృష్ణ), రాహుల్ (అభినవ్ గోమఠం), గంటా రవి (ప్రియదర్శి)లను ప్రశ్నిస్తారు. తమకు తెలియదు మహాప్రభో అని మొర పెట్టుకున్నా సరే.. పోలీసులు లెక్క చేయకుండా ముగ్గురికీ లాఠీదెబ్బల రుచి చూపిస్తారు. మరోవైపు మీడియాలో హంసలేఖను ఈ ముగ్గురూ పార్టీ నుంచి తీసుకెళ్లిన వీడియో చూపించి ఏకంగా ఆమెను హత్య చేశారంటూ కథనాలు ప్రసారం చేస్తారు. ఇంతలో హంసలేఖ ఎంట్రీ ఇవ్వడంతో ఆ ముగ్గురినీ పోలీసులు వదిలేస్తారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఏం జరిగింది? ఆ ముగ్గురి భార్యలు స్పంద కౌన్సిలర్ (సత్యకృష్ణ) దగ్గరకు ఎందుకెళ్లారు? రాహుల్, అతడి భార్య మాధురి (పావని గంగిరెడ్డి) మధ్య దూరిన మూడో వ్యక్తి హారిక (దర్శనా బానిక్) ఎవరు? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనాలన్న రవి భార్య హైమావతి(జోర్దార్ సుజాత) కల నెరవేరిందా? విక్రమ్ భార్య రేఖ (దేవయాని శర్మ) లాయర్ ప్రాక్టీస్ ఎందుకు ఆపేయాలనుకుంది? మూడు జంటల మధ్య మళ్లీ గొడవలు ముదరడానికి కారణమేంటి? అన్నది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ మొదటి సీజన్‌లాగే ఈ సీజన్లోనూ కామెడీకి కొదవలేదు. కామెడీతో పాటు ఓ సందేశాన్ని జోడించారు. కళ్లతో చూసే ప్రతీది నిజం కాదని నొక్కి చెప్పారు. చూసిన ప్రతీది నిజమని గుడ్డిగా నమ్మేసి ఓ అభిప్రాయానికి రాకూడదని, ఏది నిజం? ఏది అబద్ధం? అనేది మనమే తెలుసుకోవాలని మహి వి రాఘవ్ మెదడుకు ఎక్కేలా చెప్పాడు. ఈ విషయంలో మహిని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే! మహి క్రియషన్స్, అరుణ్ డైరెక్షన్ ఎక్కడా సింక్ మిస్ అయినట్లు అనిపించదు. సిరీస్ నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. కథకు తగ్గట్టుగా అజయ్ అరసద సంగీతం అందించాడు. ఎవరెలా చేశారంటే? ఈ సిరీస్‌లో ఎవరి నటనకు వంక పెట్టాల్సిన పని లేదు. ప్రియదర్శి, అభినవ్, చైతన్య బాగా నటించారు. సుజాత, దేవయాని, పావని వారితో పోటీపడి నటించినట్లు అనిపించినా మగజాతి ఆణిముణ్యాలదే ఇక్కడ పైచేయి అని చెప్పాలి. ముఖ్యంగా ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కూతురు పెద్దమనిషి అయ్యాక ఆమెతో మాట్లాడిన సీన్.. ఆ అమ్మాయి స్కూల్లో తన గురించి మాట్లాడేటప్పుడు అతడు భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాల్లో ప్రియదర్శి చింపేశాడు. గంగవ్వ, అవినాష్, , వేణు.. తమ పాత్రల పరిధిమేర నటించారు. పనిమనిషితో పెట్టుకుంటే మడతెడిపోద్ది అనే రీతిలో రోహిణి మరోసారి ఫుల్‌గా నవ్వించింది. ఫైనల్‌గా చెప్పాలంటే.. ఓపక్క నవ్విస్తూనే భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తుందీ సిరీస్. తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఏడిపిస్తుంది. వీకెండ్లో హ్యాపీగా చూసేయొచ్చు. -
ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏమున్నాయా అని చాలామంది చూస్తారు. ఈసారి థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గర మూవీస్ అయితే ఏం లేవు. 'తంత్ర', 'వెయ్ దరువెయ్', 'షరతులు వర్తిస్తాయి' లాంటి చిన్న చిత్రాలే ఉన్నాయి. వీటిలో ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకుని నిలబడుతుందనేది చూడాలి. అదే టైంలో ఓటీటీలోకి మాత్రం మంచి క్రేజీ మూవీస్ వచ్చేశాయి. వీటిలో ఓ మూడు మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. భ్రమయుగం.. మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమా, గత నెలలో థియేటర్లలో రిలీజై మలయాళం సెన్సేషన్ సృష్టించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడం, కాస్త ల్యాగ్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేదు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిపోతుంది. 1970ల్లో జరిగిన ఓ విచిత్రమైన కథతో 'భ్రమయుగం'.. మీరు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తెలుగులో వెబ్ సిరీసులు రావడం ఏమో గానీ అవి హిట్ అయిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. కానీ ఈ కామెడీ ఎంటర్టైనర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు దీని రెండో సీజన్ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లోకి వచ్చేసింది. తొలి భాగాన్ని మించి ఉందని టాక్ అయితే వచ్చేసింది. మరి కామెడీ సిరీస్ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేయండి. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన తమిళ సినిమా 'మిషన్ చాప్టర్-1'. అరుణ్ విజయ్-అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్ల సమస్య కారణంగా తెలుగు వెర్షన్ వాయిదా వేసుకున్నారు. తమిళంలో ఓ మాదిరి టాక్ తెచ్చుకున్న తండ్రి కూతుళ్ల డ్రామా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. సో అదన్నమాట విషయం. ఈ వీకెండ్లో చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఇవే కాస్తంత ఆసక్తి కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే సినిమాలు రిలీజ్‌కు సిద్ధమైపోతాయి. ఈ వారంలో థియేటర్లలో చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో వెయ్ దరువెయ్, రజాకార్, లంబసింగి, తంత్ర, యోధ అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. మరి ఈ వీకెండ్లో సందడి చేసేందుకు క్రేజీ చిత్రాలు రెడీ ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో హనుమాన్ వచ్చే అవకాశముంది. కానీ ఇప్పటికే హిందీ వర్షన్ అధికారికంగా ప్రకటించగా.. దక్షిణాది భాషల్లో ఎప్పుడనేది క్లారిటీ లేదు. మరోవైపు మమ్ముట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు వస్తున్నాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీల్లోకి రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14 గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15 ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15 మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15 అమెజాన్ ప్రైమ్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14 ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 హాట్‌స్టార్ గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15 టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 జీ5 మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14 సోనీ లివ్ భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15 ఆపిల్ ప్లస్ టీవీ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 లయన్స్ గేట్ ప్లే నో వే అప్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 15 బుక్ మై షో ద డెవిల్ కాన్స్పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15 జియో సినిమా హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16 ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలోకి వచ్చే చిత్రాల్లో దాదాపు అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో 'వెయ్ దరువెయ్', 'రజాకర్', 'తంత్ర'తో పాటు 'యోధ' అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ తెలుగు చిత్రాలు-సిరీసులు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?) ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా ఓటీటీల్లోకి రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 11-17th వరకు) నెట్‌ఫ్లిక్స్ యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ సిరీస్) - మార్చి 11 జీసస్ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 12 టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 12 బండిడోష్ (స్పానిష్ సిరీస్) - మార్చి 13 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14 గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15 ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15 మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15 అమెజాన్ ప్రైమ్ లవ్ అదురా (హిందీ సిరీస్) - మార్చి 13 బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14 ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 హాట్‌స్టార్ గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15 టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 జీ5 మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14 సోనీ లివ్ భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15 ఆపిల్ ప్లస్ టీవీ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 లయన్స్ గేట్ ప్లే నో వే అప్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 15 బుక్ మై షో ద డెవిల్ కాన్స్పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15 జియో సినిమా హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16 ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17 (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఓటీటీలోకి తెలుగు హిట్ సిరీస్ రెండో సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగు క్రేజీ వెబ్ సిరీస్... మరోసారి ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. గతేడాది తొలి సీజన్ తో ఆకట్టుకోగా.. ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత నవ్వించేందుకు సిద్ధమైపోయారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన టీమ్.. అలానే రెండో సీజన్ స్ట్రీమింగ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) ఓటీటీల వరకు తెలుగులో పలు సినిమాలు వచ్చాయి. కానీ స్ట్రెయిట్ తెలుగు వెబ్ సిరీసులు చాలా తక్కువే వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో 'సేవ్ ద టైగర్స్' ఒకటి. భార్య-భర్తలు.. వాళ్ల మధ్య ఉండే ప్రాబ్లమ్స్, తద్వారా వచ్చే ఫన్ తదితర అంశాలతో ఈ సిరీస్ తీశారు. పెద్దగా అంచనాల్లేకుండా గతేడాది రిలీజైన ఈ సిరీస్ హిట్ అయింది. మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం రూపొందించిన 'సేవ్ ద టైగర్స్' రెండో సీజన్ మార్చి 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇందులో హంసలేఖ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ముగ్గురు భర్తలు ఇరుక్కోవడం అనే కాన్సెప్ట్ చూపించారు. ఇంతకీ హంసలేఖ ఎవరు? ఆమెతో వీళ్ల ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారితీసిందనేది రెండో సీజన్ స్టోరీ. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) -
కడుపుబ్బా నవ్వించిన వెబ్ సిరీస్‌కు సీక్వెల్.. అప్పుడే స్ట్రీమింగ్!
ఓటీటీలో థ్రిల్లర్, క్రైమ్, హారర్ కంటెంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లేదంటే కమర్షియల్ చిత్రాలు తారసపడుతుంటాయి. కామెడీ షోలు కనిపిస్తాయి కానీ సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తెలుగులో 'సేవ్ ది టైగర్స్' అనే వెబ్ సిరీస్ రిలీజైంది. ఇది గతేడాది హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించగా వీరి భార్యల పాత్రల్లో సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి నటించారు. తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఆ సిరీస్ చూసినంతసేపు జనాలు వారి టెన్షన్ పక్కనపెట్టి కడుపుబ్బా నవ్వారు. ఈ క్రమంలో ఈ సూపర్ హిట్ సిరీస్‌కు సీక్వెల్ ప్రకటించింది హాట్‌స్టార్. ముగ్గురు హీరోలు జైల్లో ఉన్నట్లుగా ఆ మధ్య పోస్టర్ వదిలింది. సీజన్ 2 గురించి బుధవారం ఆసక్తికర పోస్ట్ చేసింది హాట్‌స్టార్. మొదటి సీజన్‌ను మార్చి 10 వరకు ఫ్రీగా చూడొచ్చని ఆఫర్ ఇచ్చింది. ఇది చూసిన జనాలు.. మార్చి రెండో వారంలో మొదటి సీజన్ చూడమంటున్నావంటే తర్వాతి వారంలో సీక్వెల్ రిలీజ్ చేస్తావన్నమాట అంటూ ఎవరికి వారు డిసైడ్ అయిపోతున్నారు. Save The Tigers S2 is on its way! And now you can binge-watch the first season for FREE until March 10 🙌 Get going, Tigers 🐅 #SaveTheTigersAgain coming soon only on #DisneyPlusHotstar Link - https://t.co/alAtoK4Ycq@mahivraghav @PradeepAdvaitam @PriyadarshiPN… pic.twitter.com/3ZOAz1zls1 — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) February 28, 2024 చదవండి: Shriya Saran: నేను తల్లిని.. అయినా అలాగే చూస్తారు.. అది చూసి నా భర్త.. -
సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లకు సీక్వెల్స్.. ఆ ఓటీటీలోనే!
సినీ ప్రియులు సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్‌లకూ ఓటేస్తున్నారు. కొత్త కంటెంట్‌తో రిలీజయ్యే సిరీస్‌లను ఆదరిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకునే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సిరీస్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పటికే అలా వచ్చినవాటిలో ఎన్నో హిట్టయ్యాయి కూడా! ఈ క్రమంలో కొన్ని సూపర్ హిట్ సిరీస్‌లకు సీక్వెల్స్ ప్రకటించింది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. అవేంటో చూసేద్దాం.. సేవ్ ది టైగర్స్ హాట్‌స్టార్‌లో గతేడాది వచ్చిన తెలుగు వెబ్ సిరీస్‌లలో సేవ్ ది టైగర్స్ ఒకటి. కడుపుబ్బా నవ్వించిన ఈ సిరీస్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. తేజ కాకుమాను దర్శకత్వం వహించగా ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. వీరి భార్యల పాత్రల్లో సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి నటించారు. హీరోలు ముగ్గురూ ఒక్కో రంగానికి సంబంధించినవారు. కానీ ఈ ముగ్గురూ భార్యా బాధితులే. భార్యల నస వల్ల ఫ్రస్టేషన్‌కు గురవతుంటారు. ఈ క్రమంలో వారి కాపురాలు ప్రమాదంలో పడతాయి. అలాంటి పరిస్థితుల్లో వీరు ఏం చేశారు? ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది రెండో సీజన్లో చూపించనున్నారు. ఈ ముగ్గురు హీరోలు జైల్లో ఉన్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది హాట్‌స్టార్. త్వరలోనే రెండో సీజన్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. Can anyone save the tigers this time around?! #HotstarSpecials #SavetheTigers S2 coming soon. pic.twitter.com/Yb1rtpoZao — Disney+ Hotstar (@DisneyPlusHS) February 14, 2024 కేరళ క్రైమ్ ఫైల్స్ 2 ఇది పూర్తిగా క్రైమ్ సిరీస్. గతేడాది కేరళ క్రైమ్ ఫైల్స్ రిలీజైంది. ఆషిఖ్ ఐమర్ అందించిన కథకు అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించాడు. ఒక లాడ్జిలో వేశ్య హత్యకు గురవుతుంది. తనను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతూ హంతకుడి కోసం వెతుకులాట మొదలుపెడతారు. ఒక ఫేక్ అడ్రస్‌ను పట్టుకుని వారు దర్యాప్తు చేస్తూ ఉంటారు. ఈ మలయాళ సిరీస్‌లో అజు వర్గీస్, లాల్, షింజ్ షాన్, సంజు సనిచెన్, అశ్వతి మనోహర్, నవాస్ వల్లికున్ను, దేవకి తదితరులు నటించారు. ఓటీటీలో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ హిట్ సిరీస్‌కు సీక్వెల్ ప్రకటించారు. త్వరలోనే కొత్త కేసుతో కేరళ క్రైమ్ ఫైల్స్ 2 రానున్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) గూస్బంప్స్ ఇది ఒక హారర్ సిరీస్. ఆర్.ఎల్. స్టీన్ రాసిన పుస్తకం ఆధారంగా ఈ అమెరికన్ సిరీస్ రూపొందించారు. ఇందులో జాక్ మారిస్, ఇసా బ్రియోన్స్, మైల్స్ మెకెన్నా, అనయి పుయిగ్, విల్ ప్రైస్, రాచెల్ హారిస్ ప్రధాన పాత్రలు పోషించారు. రాబ్ లాటెర్మాన్, నికోలర్ స్టోలర్ దర్శకత్వం వహించారు. పది ఎపిసోడ్లతో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. కథేంటంటే.. హైస్కూల్ విద్యార్థులు ఓ రోజు పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తారు. అక్కడ 30 ఏళ్ల క్రితం ఓ పిల్లవాడు చచ్చిపోతాడు. ఆ బంగ్లాకు వెళ్లినప్పటినుంచి విద్యార్థుల జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. మరి ఆ బంగ్లాలో ఎన్ని ఆత్మలున్నాయి? వాటితో వీళ్లు ఎలా పోరాడారు? ఎవరు విజయం సాధించారన్నదే గూస్బంప్స్ స్టోరీ. తాజాగా దీనికి కూడా సీక్వెల్ ప్రకటించారు.. త్వరలోనే రెండో సీజన్ రానున్నట్లు ప్రకటించింది హాట్‌స్టార్. ఇలా ఫన్, క్రైమ్, హారర్ సిరీస్‌లు త్వరలో అందుబాటులోకి వస్తున్నాయని తెలిసి ఖుషీ అవుతున్నారు ఓటీటీ లవర్స్! Season 2 of #GoosebumpsSeries is coming. pic.twitter.com/M1WgMzijg5 — Disney+ Hotstar (@DisneyPlusHS) February 12, 2024 చదవండి: విజయ్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. నాకూ రాజకీయాల్లోకి.. -
యాత్ర 2 ఉంటుంది.. జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై...
‘‘యాత్ర’ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ప్రస్తుతం ‘యాత్ర 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ చిత్రంలోని పాత్రలకు తగ్గ నటీనటులు కుదరడం లేదు. పూర్తి కథ, నటీనటులు ఫైనల్ అయ్యాక ‘యాత్ర 2’ ని సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అని డైరెక్టర్ మహీ వి.రాఘవ్ అన్నారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి, హర్షవర్ధన్ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. మహీ వి.రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 27నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మహీ వి.రాఘవ్ పంచుకున్న విశేషాలు... ► మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘సేవ్ ది టైగర్స్’ నిరూపించింది. కుటుంబం అంతా కలిసి మా వెబ్ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. దీంతో ఒక మంచి సిరీస్ తీశామనే తృప్తి ఉంది. ఇలాంటి చక్కని సిరీస్‌ని నిర్మించే అవకాశం మాకు కల్పించిన డిస్నీ హాట్‌స్టార్‌కి థ్యాంక్స్. త్వరలో ‘సేవ్ ది టైగర్స్’ రెండో సిరీస్ షూటింగ్ ప్రారంభిస్తాం. ► ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల సమయంలో ‘యాత్ర 2’ ని విడుదల చేయనున్నారని, ఆ సినిమా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నకి సపోర్ట్‌గా ఉంటుందని వినిపిస్తున్న మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే సినిమా వల్ల ఓట్లు వస్తాయనుకోవడం అపోహ మాత్రమే. అలా అనుకుంటే ఇతర పార్టీల వారు కూడా నాలుగైదు సినిమాలు తీసుకోవచ్చు కదా? ఓటర్లందరూ నా ‘యాత్ర’ సినిమాని చూసుంటే ‘బాహుబలి’లా పెద్ద సినిమా అయ్యేది. ఓటర్లందరూ సినిమాలు చూస్తారని అనుకోవడం లేదు. జగన్ అన్న పాదయాత్రతో... ‘యాత్ర 2’ సినిమా జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుంది. కథ మొత్తం పూర్తయ్యాక ఆ వివరాలు చెబుతాను. ప్రస్తుతం నేను దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘సైతాన్’ అనే కొత్త వెబ్ సిరీస్‌తో జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. -
'సేవ్ ది టైగర్స్'.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన యాత్ర డైరెక్టర్!
డైరెక్టర్ మహి వీ రాఘవ సినీ ఇండస్ట్రీలో చాలామందికి తెలిసి ఉండదు. ఆయన దర్శకుడిగా తీసింది మూడు సినిమాలే అయినా మహీ వి రాఘవది శైలి వేరు. పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి చిత్రాలతో డిఫరెంట్ జానర్స్తో సినీ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మరోసారి సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్‌కు మహీ వి రాఘవ్ కథను అందించగా.. తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను మహీ సొంత నిర్మాణ సంస్ధ త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ప్రస్తుతం ఈ కామెడీ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. (ఇది చదవండి: ‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం) ఇటీవలే ఓటీటీ విడుదలైన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కరోనా టైంలో దొరికిన గ్యాప్‌లోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మహి కథ, కథనాన్ని అందించిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన 'సేవ్ ది టైగర్స్' భార్యభర్తల మధ్య రిలేషన్స్, కుటుంబంలో ఉండే ఎమోషన్స్‌ను చక్కగా తెరకెక్కించారు. కాగా.. ఆయన త్వరలోనే బోల్డ్ కంటెంట్‌తో ఓటీటీలోకి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో ప్రియదర్శి, అభినవ్, రోహిణి, చైతన్యతో పాటు తదితరులు నటించారు. (ఇది చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్) -
Save The Tigers Review: ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్ సిరీస్ రివ్యూ: సేవ్ ద టైగర్స్ నటీనటులు : ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ, 'జోర్దార్' సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని, హర్షవర్ధన్, గంగవ్వ, వేణు టిల్లు, రోహిణి తదితరులు నిర్మాతలు : మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి దర్శకత్వం : తేజ కాకుమాను క్రియేటర్స్ : మహి వి. రాఘవ్, ప్రదీప్ అద్వైతం విడుదల తేది: ఏప్రిల్ 27, 2023(డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) ఈ మధ్య కాలంలో ఓటీటీలలో ఎక్కువగా అడల్ట్ కంటెంటే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వెబ్ సీరస్తో బోల్డ్ కంటెంట్ శృతిమించిపోతుంది. ఇలాంటి తరుణంలో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సిరీస్‌ని తెరకెక్కించాడు తేజ కాకుమాను. అదే ‘సేవ్ ద టైగర్స్. ‘యాత్ర’ఫేమ్ మహి వి. రాఘవ్ ఈ సిరీస్‌కి షో రన్నర్‌గా వ్యవహరించాడు. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సిరీస్ కథేంటి? ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. గంటా రవి(ప్రియదర్శి). రాహుల్(అభినవ్ గోమఠం), విక్రమ్(చైతన్య కృష్ణ).. ఈ ముగ్గురిని డ్రంక్ డ్రైవ్ కేసులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. అలాగే విక్రమ్ కారుని సీజ్ చేస్తారు. అది అతని భార్య పేరుపై ఉంటుంది. కారు కావాలంటే కోర్టు కెళ్లి ఫైన్ కట్టాలని పోలీసులు చెబుతారు. ఈ విషయం తెలిస్తే తన భార్య గొడవ చేస్తుందని భావించిన విక్రమ్.. స్నేహితులు రవి, రాహుల్‌లతో కలిసి సీఐ(శ్రీకాంత్ అయ్యంగార్)దగ్గరకు వెళ్లి తమ బాధలను తెలియజేస్తూ.. ఎందుకు తాగాల్సి వచ్చిందో వివరిస్తారు. గంటారవి పాల వ్యాపారి. భార్య హైమావతి(సుజాత), పిల్లలలో కలిసి బోరబండలో నివాసం ఉంటాడు. హైమావతి బ్యూటీపార్లర్ రన్ చేస్తుంది. బోరబండను వదిలి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్లాలని తరచు భర్తతో గొడవ పడుతూ ఉంటుంది. విక్రమ్ ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ పని చేస్తుంటాడు. అతని భార్య(దేవియాని శర్మ) లాయర్. ఫెమినిస్ట్. భర్త, కూతురిని పట్టించుకోకుండా ఎప్పుడూ కేసులంటూ కోర్టుల చుట్టే తిరుగుతుంది. ఆమెకు, విక్రమ్ తల్లికి అస్సలు పడదు. ఇక రాహుల్..రైటర్ కావాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఖాలీగా ఉంటాడు. అతని భార్య మాధురి(పావనీ గంగిరెడ్డి) డాక్టర్. మొదట్లో రాహుల్‌కి మద్దతుగా ఉన్న మాధురి.. కొన్నాళ్ల తర్వాత ఖాలీగా ఉన్నావంటూ విసుక్కుంటుంది. అంతేకాదు తన స్నేహితుడు డాక్టర్ నవీన్(రాజా చెంబోలు)కు క్లోజ్‌గా ఉంటుంది. ఇది రాహుల్‌కి నచ్చదు. ఈ ముగ్గురి పిల్లలు ఓకే స్కూల్లో చదువుతారు. దాని కారణంగా గంటా రవి, రాహుల్, విక్రమ్‌ల మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఓ రోజు ఈ ముగ్గురు కలిసి బార్లో బాగా తాగి రచ్చ చేస్తారు. అది ఓ టీవీ ప్రోగ్రామ్‌లో టెలికాస్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గంటా రవి మాటతీరు కారణంగా భార్య, పిల్లలకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఓ కమర్షియల్ యాడ్ కారణంగా విక్రమ్, అతని భార్యల మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చాయి? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై రాహుల్ ఎందుకు అనుమానం వ్యక్తం చేశాడు? ఆ అనుమానం ఎక్కడికి దారితీసింది? బార్లో గొడవకి, హీరోయిన్ హంస నందిని మిస్సింగ్‌కి ఎలాంటి సంబంధం ఉంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. భార్యల వల్ల భర్తలు పడే ఇబ్బందుల నేపథ్యంలో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ కూడా ఆ నేపథ్యంతో తెరకెక్కిన కథే. పెళ్లైన మగవారి కష్టాలను మెయిన్ పాయింట్‌గా తీసుకొని ఎంటర్టైనింగ్ పంథాలో ఈ సిరీస్‌ని తెరకెక్కించారు. ఇందులో మొత్తం మూడు జంటలు ఉంటాయి. వీరిలో మగవాళ్లంతా ఆడవారి వల్ల ఇబ్బంది పడుతున్నవారే. గంటా రవికి భార్యతో పాటు కూతురు,తల్లితో కూడా ఇబ్బందులే. ఇక విక్రమ్‌కు అయితే ఫెమినిస్ట్ అయిన భార్యతో పాటు అత్తగారి చేతిలో కూడా నలిగిపోతాడు. మరోవైపు రైటర్ కావాలని ఉద్యోగం మానేసిన రాహుల్‌కి భార్యతో పాటు ఇంటి పనిమనిషి కూడా చుక్కలు చూపిస్తుంది. ఈ కష్టాలను ఆరు ఎపిసోడ్లుగా చాలా వినోదాత్మకంగా, సహజసిద్దంగా చూపించారు. అంతేకాదు అంతర్లీనంగా మంచి సందేశాన్ని కూడా చూపించాడు. భార్యభర్తల మధ్య గొడవలు వస్తే కలిసి సాల్వ్ చేసుకోవాలిని కానీ సైకిలాజిస్టుల వద్దకు వెళ్తే పరిష్కారం దొరకదని ఓ సన్నివేశం ద్వారా చూపించారు. అలాగే పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏదో తెలియజేసే బాధ్యత తల్లిదండ్రులదే అని మరో సన్నివేశం ద్వారా చూపించారు. చేసే వృత్తిని గౌరవించాలని, పేరెంట్స్ పిల్లల కోసం ఎలాంటి బాధలు పడతారనేది గంటా రవి, అతని కూతురి పాత్ర ద్వారా చూపించారు. రాహుల్, మాధురిల ట్రాక్ చూస్తే.. భార్యను అలా అనుమానించాల్సింది కాదనిపిస్తుంది. అదే సమయంలో విక్రమ్, అతని భార్యల ట్రాక్ చూస్తే.. ఆమె విక్రమ్‌ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందనే బాధ కలుగుతుంది. మొత్తంగా ఈ మూడు జంటలను చూస్తే కొత్తగా పెళ్లైన మగవాళ్లు ఏదో ఒక జంటకు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఈ మధ్య కాలంలో ఎలాంటి అశ్లీలత(కొన్ని డైలాగ్స్ కాస్త ఇబ్బందిగా ఉంటాయి) లేకుండా కామెడీగా సాగే ఇలాంటి వెబ్ సిరీస్ రాలేదనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే.. పాల బిజినెస్ చేసే గంటా రవి పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయాడు. తెలంగాణలో యాసలో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు. అలాగే కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా చక్కగా నటించాడు. రైటర్ కావాలనుకుని ఇంట్లోనే ఖాలీగా ఉండే వ్యక్తిగా అభినవ్ తనదైన నటనతో అదరగొట్టేశాడు. పొట్టను తగ్గించే సీన్, యాడ్ కోసం కంటెంట్ రాసే సన్నివేశాలలో అభివన్ నవ్వులు పూయించాడు. ఇక ఇంట్లో భార్య, ఆఫీసులో బాస్ మధ్య నలిగిపోయే విక్రమ్ పాత్రకి చైతన్య కృష్ణ న్యాయం చేశాడు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా జోర్దార్ సుజాత, , పావని గంగిరెడ్డి, దేవయాని తమదైన నటనతో ఆకట్టుకున్నారు. పనిమనిషిగా రోహిని, గంటా రవి తల్లిగా గంగవ్వ, విక్రమ్ బాస్‌గా హర్షవర్దన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.