శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏమున్నాయా అని చాలామంది చూస్తారు. ఈసారి థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గర మూవీస్ అయితే ఏం లేవు. 'తంత్ర', 'వెయ్ దరువెయ్', 'షరతులు వర్తిస్తాయి' లాంటి చిన్న చిత్రాలే ఉన్నాయి. వీటిలో ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకుని నిలబడుతుందనేది చూడాలి. అదే టైంలో ఓటీటీలోకి మాత్రం మంచి క్రేజీ మూవీస్ వచ్చేశాయి. వీటిలో ఓ మూడు మాత్రం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి.
భ్రమయుగం.. మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమా, గత నెలలో థియేటర్లలో రిలీజై మలయాళం సెన్సేషన్ సృష్టించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడం, కాస్త ల్యాగ్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేదు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిపోతుంది. 1970ల్లో జరిగిన ఓ విచిత్రమైన కథతో 'భ్రమయుగం'.. మీరు ఓ లుక్కేసేయండి.
(ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
తెలుగులో వెబ్ సిరీసులు రావడం ఏమో గానీ అవి హిట్ అయిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. కానీ ఈ కామెడీ ఎంటర్‌టైనర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు దీని రెండో సీజన్ కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. తొలి భాగాన్ని మించి ఉందని టాక్ అయితే వచ్చేసింది. మరి కామెడీ సిరీస్ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేయండి.
ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన తమిళ సినిమా 'మిషన్ చాప్టర్-1'. అరుణ్ విజయ్-అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్ల సమస్య కారణంగా తెలుగు వెర్షన్ వాయిదా వేసుకున్నారు. తమిళంలో ఓ మాదిరి టాక్ తెచ్చుకున్న తండ్రి కూతుళ్ల డ్రామా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. సో అదన్నమాట విషయం. ఈ వీకెండ్‌లో చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఇవే కాస్తంత ఆసక్తి కలిగిస్తున్నాయి.
(ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ))
Comments
Please login to add a commentAdd a comment