కడుపుబ్బా నవ్వించిన వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌.. అప్పుడే స్ట్రీమింగ్‌! | Save The Tigers S2 is on its way, First Season for Free Until March 10 | Sakshi
Sakshi News home page

OTT: పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన తెలుగు సిరీస్‌కు సీక్వెల్‌.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆసక్తికర ట్వీట్‌

Published Wed, Feb 28 2024 7:14 PM | Last Updated on Wed, Feb 28 2024 7:34 PM

Save The Tigers S2 is on its way, First Season for Free Until March 10 - Sakshi

ఓటీటీలో థ్రిల్లర్‌, క్రైమ్‌, హారర్‌ కంటెంట్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లేదంటే కమర్షియల్‌ చిత్రాలు తారసపడుతుంటాయి. కామెడీ షోలు కనిపిస్తాయి కానీ సినిమాలు చాలా తక్కువగా రిలీజ్‌ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో తెలుగులో 'సేవ్‌ ది టైగర్స్‌' అనే వెబ్‌ సిరీస్‌ రిలీజైంది. ఇది గతేడాది హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, కృష్ణ చైతన్య ప్రధాన పాత్రలు పోషించగా వీరి భార్యల పాత్రల్లో సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి నటించారు.

తేజ కాకుమాను దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్‌ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయింది. ఆ సిరీస్‌ చూసినంతసేపు జనాలు వారి టెన్షన్‌ పక్కనపెట్టి కడుపుబ్బా నవ్వారు. ఈ క్రమంలో ఈ సూపర్‌ హిట్‌ సిరీస్‌కు సీక్వెల్‌ ప్రకటించింది హాట్‌స్టార్‌. ముగ్గురు హీరోలు జైల్లో ఉన్నట్లుగా ఆ మధ్య పోస్టర్‌ వదిలింది.

సీజన్‌ 2 గురించి బుధవారం ఆసక్తికర పోస్ట్‌ చేసింది హాట్‌స్టార్‌. మొదటి సీజన్‌ను మార్చి 10 వరకు ఫ్రీగా చూడొచ్చని ఆఫర్‌ ఇచ్చింది. ఇది చూసిన జనాలు.. మార్చి రెండో వారంలో మొదటి సీజన్‌ చూడమంటున్నావంటే తర్వాతి వారంలో సీక్వెల్‌ రిలీజ్‌ చేస్తావన్నమాట అంటూ ఎవరికి వారు డిసైడ్‌ అయిపోతున్నారు.

చదవండి: Shriya Saran: నేను తల్లిని.. అయినా అలాగే చూస్తారు.. అది చూసి నా భర్త..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement