మరో క్రేజీ హిట్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. మొన్నీమధ్య థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మూడు వారాలు తిరక్కుండానే సినీ ప్రేమికుల్ని అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో నెటిజన్స్ అలెర్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది?
ఫిబ్రవరిలో మలయాళ ఇండస్ట్రీ వరస హిట్స్ కొట్టింది. ప్రేమలు, భ్రమయుగం, మంజుమల్ బాయ్స్.. ఇలా వారానికొకటి చొప్పున అద్భుతమైన సక్సెస్ అందుకున్నాయి. వీటిలో మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' మూవీ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాలంలోనూ బ్లాక్ అండ్ వైట్ కలర్‌లో తీసి సాహసం చేశారు. అలానే కేవలం మూడే పాత్రలతో దాదాపు రెండున్నర గంటల సినిమా చూపించారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
హారర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా తొలుత మలయాళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది జరిగిన వారానికే అంటే ఫిబ్రవరి 23న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేశారు. ఇక్కడ ఓ తరహా ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సోని లివ్ ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు.
'భ్రమయుగం' కథ విషయానికొస్తే.. 17వ శతాబ్దంలో మలబారు తీరం. ఓ రాజ్యంలో రాజు దగ్గర గాయకుడిగా పనిచేసే దేవన్(అర్జున్ అశోకన్).. అడవిలో తప్పిపోయి కుముదన్ పొట్టి (మమ్ముట్టి) ఉంటున్న ఇంటికి చేరుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఆశ్రయం పొందుతాడు. అయితే ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూసినా సరే దేవన్ అక్కడి నుంచి బయటపడలేకపోతాడు. చివరకు ఏమైంది? ఇంతకు పొట్టి ఎవరు? అనేది స్టోరీ.
(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)
The iconic Mammootty stars in Bramayugam, a black and white masterpiece, shrouded in mystery and horror! Get ready for a cinematic experience unlike any other. Streaming on Sony LIV from March 15th.#Bramayugam #SonyLIV #BramayugamOnSonyLIV #Bramayugam starring @mammukka pic.twitter.com/os5y2t8hLH
— Sony LIV (@SonyLIV) March 6, 2024
Comments
Please login to add a commentAdd a comment