మహి వీ రాఘవ్ డైరెక్షన్‌లో వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్-2. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు ఇండియాలోనే టాప్-3 ప్లేస్ దక్కించుకుంది. ఓటీటీల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన జాబితాలో టాప్-3లో నిలిచింది. ఈ విజయం పట్ల మహి వి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది.
ఈ సందర్భంగా మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను మీరంతా ఆదరించి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి విజయాలను సాధిస్తాయని మరోసారి రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది’’ అని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
సేవ్ ది టైగర్ రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతోసీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైయాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్- 3 సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ కోరింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment