Season 2
-
ఓటీటీలోనే టాప్ సిరీస్.. రెండో సీజన్ చూసేందుకు సిద్ధమా?
ఓటీటీల్లో వందలకొద్దీ సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. కానీ వీటిలో ఎక్కువమందికి రీచ్ అయినవి కొన్నే ఉంటాయి. అలాంటి ఓ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్'(Squid Game). తొలుత కొరియన్ భాషలో తీసినప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. తెలుగు, తమిళ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ దీన్ని డబ్ చేశారు. అలా ఓటీటీలో (OTT) అత్యధికంగా చూసిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. ఇప్పుడు దీని రెండో సీజన్ గురువారం (డిసెంబర్ 26) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) తెలుగులోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తొలి సీజన్లో అసలేం జరిగింది? రెండో సీజన్లో ఏం జరగొచ్చు?(ఇదీ చదవండి: సినిమాల్ని వదిలేద్దాం అనుకుంటున్నా: డైరెక్టర్ సుకుమార్)ఒక్కమాటలో ఈ సిరీస్ గురించి చెప్పాలంటే.. అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థికంగా ఇక లేవడం కష్టమనే స్థితిలో ఉన్న పేదలను ఒక చోట చేర్చి.. వారితో ఆటలు ఆడిస్తుంటే బాగా డబ్బునోళ్లు వీళ్లని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వినడానికి చిన్న కథలా అనిపిస్తున్నా ఒక్కసారి సీజన్ మొదలెడితే పూర్తయ్యేదాకా చూడకుండా ఉండలేరు. కథ ప్రారంభం కాగానే దర్శకుడు ఏం చెప్పాలనుకొంటున్నాడో అర్థమవుతుంది. కానీ ఏం జరుగుతుందో ఉహించలేం!జీవితంలో అన్ని కోల్పోయిన 456 మందిని గుర్తుతెలియని వ్యక్తులు.. ఓ రహస్య దీవికి తీసుకెళ్తారు. వీళ్లకు రెడ్ లైట్ గ్రీన్ లైట్, గోళీలాట, టగ్ ఆఫ్ వార్ లాంటి పిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. మొత్తం ఆరు పోటీలు ఇందులో గెలిస్తే 45.6 బిలియన్ కొరియన్ వన్ (మన కరెన్సీ ప్రకారం 332 కోట్లు) సొంతం చేసుకోవచ్చు. గేమ్స్ సింపుల్‌గానే ఉంటాయి కానీ ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ అవుతారు. ఇక్కడ ఎలిమినేట్ అంటే ప్రాణాలు తీసేస్తారు. తొలి గేమ్ ఆడుతున్నప్పుడు గానీ అందరికీ ఈ విషయం తెలియదు. అలాంటి ప్రాణాంతకమైన ఆటలను పూర్తి చేసింది ఎవరు? చివరకు ప్రైజ్‌మనీ గెలిచింది ఎవరు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)మనుషులు నిజరూపాల్ని, స్వభావాలు బయటపెట్టిన సిరీస్ ఇది. తన వరకు వస్తే ఎంత మంచోడైనా సరే తాను చస్తానని తెలిస్తే ఎంతకు తెగిస్తాడు అనే ఒక్క లైన్ మీద కథను గ్రిప్పింగ్‌గా నడిపించడం అనేది స్క్రిప్ట్ సత్తానే. మరీ ముఖ్యంగా గోళీలాటలో అద్భుతమైన ఎమోషనల్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ గురించి చెప్పడం కంటే చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ ఎపిసోడ్ చివరిలో ఆటగాళ్లు ఎంత మానసికంగా కుంగిపోతారో, ప్రేక్షకుడి మనసు కూడా అంత బరువెక్కుతుంది.ఈ సిరీస్ చూడటం మొదలుపెట్టినప్పుడు ఏ పాత్ర గురించి మనకు తెలీదు. ప్రత్యేక అంచనాలు ఏం ఉండవు. కాని ఒక్కసారి సిరీస్ చూడటం మొదలుపెడితే ఏకబిగిన చూసేస్తారు. సిరీస్ చివరి ఎపిసోడ్ అంటే క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు.. అసలు ఎందుకు ఇలాంటి ప్రాణాంతక ఆటలు ఆడించాల్సి వచ్చిందో గేమ్ సృష్టికర్త చెబుతుంటాడు. హీరోకి అతడు మాట్లాడుతుంటే.. అది చెప్పినట్లు కాకుండా సమాజ స్వభావంపై వారి అభిప్రాయాల్ని చెబుతూ మనకు ప్రశ్నలను రేకెత్తిస్తారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. జానీ మాస్టర్ రియాక్షన్?)ఈ సిరీస్‌లోని కొన్ని పాత్రలు సొంతవాళ్లనే మోసం చేసుకొనే పరిస్థితులు వస్తాయి. మోసంతో పాటు స్నేహం, సహకారం, త్యాగం.. ఇలా అన్ని ఎమోషన్స్ అద్భుతంగా కుదిరేశాయి. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈ సిరీస్‌లోని పాత్రలన్నీ మన చుట్టూ కనిపించే మనుషుల్లాగే ఉంటాయి. ఇది కూడా సిరీస్ ప్రపంచవ్యాప్తంగా హిట్ కావడానికి కారణమని చెప్పొచ్చు.తొలి సీజన్లో చివరగా ఒక్కడు మిగులుతాడు. ప్రైజ్‌మనీతో బయటకొస్తాడు. ఇప్పుడు రెండో సీజన్ ట్రైలర్లోనూ మళ్లీ అతడే కనిపించాడు. అయితే ప్రాణాలు పోతాయని తెలిసినా హీరో రావడం బట్టి చూస్తుంటే ఈసారి అందరితో కలిసి గేమ్స్ ఆడుతూనే.. దీని తెర వెనక ఉన్న వాళ్ల వాళ్ల నిజ స్వరూపాల్ని బయటపెట్టడం లాంటివి చేస్తాడేమో అనిపిస్తుంది. తొలి సీజన్‌కి మించి ఈసారి ఎక్కువ భావోద్వేగ భరిత సీన్స్ ఉండాలి. అప్పుడే సిరీస్ వర్కౌట్ అవుతుంది. చూడాలి మరి 'స్క్విడ్ గేమ్ 2'లో ఏముంటుందో?(ఇదీ చదవండి: ఎన్టీఆర్.. ఇంత సన్నబడ్డాడేంటి?) -
'ఈ గేమ్ ఆడితే అందరం చస్తాం'.. భయపెట్టిస్తోన్న టీజర్!
ప్రస్తుతం సినీ ప్రియులు ఓటీటీలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ సైతం సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ మరో క్రేజీ వెబ్ సిరీస్‌తో సిద్ధమైంది. 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కించుకుంది. కొరియన్లో తెరకెక్కించిన ఈ సిరీస్ ఇండియాలో క్రేజ్‌ను దక్కించుకుంది.ఈ వెబ్ సిరీస్ దక్కిన ఆదరణతో స్క్విడ్ గేమ్ సీజన్-2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా సీజన్-2 టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగులోనూ విడుదలైన ఈ టీజర్ మరింత ఆకట్టుకుంటోంది. గ్రీన్ లైట్, రెడ్ లైట్ వంటి గేమ్స్ ఈ సీజన్లో చూపించనున్నారు. టీజర్లో సన్నివేశాలు చూస్తుంటే హారర్ థ్రిల్లర్ లాంటి ఫీలింగ్ వస్తోంది. గేమ్‌లో పాల్గొన్న వారంతా ప్రాణాలతో బయటపడతారా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. కాగా.. ఈ స్క్విడ్ గేమ్ సీజన్- 2 డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
వరల్డ్ బెస్ట్ సిరీస్.. రెండో సీజన్ ఓటీటీ రిలీజ్ ఫిక్స్
ఓటీటీల్లో కొన్ని సినిమాలు లేదా వెబ్ సిరీసులు అనుహ్యంగా హిట్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'స్క్విడ్ గేమ్' ఒకటి. పేరుకే ఇది కొరియన్ సిరీస్. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ లవర్స్‌ని మెప్పించింది. 2021లో రిలీజైన తొలి సీజన్ అద్భుతమైన రికార్డులు సెట్ చేయగా.. ఇప్పుడు రెండో సీజన్ విడుదలకి సిద్ధమైంది. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేయడంతో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన బెస్ట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. చిన్నపిల్లలు ఆడుకునే ఆటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాయడం విశేషం. డబ్బు అవసరమున్న 456 మందిని ఓ ద్వీపానికి తీసుకొచ్చి ఉంచుతారు. వీళ్ల మధ్య చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ పెడతారు. పోటీల్లో గెలిచినోళ్లు తర్వాత దశకు వెళ్తుంటారు. మిగిలిన వాళ్లని నిర్వహకులు నిర్ధాక్షిణ్యంగా చంపేస్తుంటారు. చివరకు గెలిచిన ఒక్కరు ఎవరనేదే స్టోరీ.తొలి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచి రెండో సీజన్ మొదలవుతుంది. ఈసారి కూడా 456 మంది ఉంటారు. మళ్లీ వీళ్ల మధ్య కొత్త గేమ్స్ పెడతారు. మరి ఇందులోనూ హీరో గెలిచాడా? ఈసారి ఏమేం గేమ్స్ ఉండబోతున్నాయనేది టీజర్లో చూచాయిగా చూపించారు. ఇక ఏడాది చివరి వారంలో అంటే డిసెంబరు 26న సిరీస్ స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. మరి ఈ సిరీస్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు?(ఇదీ చదవండి: 27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?) -
ఓటీటీలోనే సూపర్ హిట్ వెబ్ సిరీస్.. రెండో సీజన్ రిలీజ్ ఫిక్స్
ఓటీటీల్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి లిస్టులో కచ్చితంగా ఉండే సిరీస్ 'స్క్విడ్ గేమ్'. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్.. ఊహించిన దానికంటే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా తీసిన రెండో సీజన్‌కి సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు. అలానే మూడో సీజన్ గురించి కూడా అప్డేట్ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం)ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ వెబ్ సిరీసుల్లో 'స్క్విడ్ గేమ్' ఒకటి. తొమ్మిది ఎపిసోడ్స్‌తో తీశారు. క్షణక్షణం టెన్షన్ అనిపించే థ్రిల్లింగ్ అంశాలతో దీన్ని తెరకెక్కించారు. అప్పట్లో వరల్డ్ మోస్ట్ పాపులర్ సిరీస్‌గా నిలిచింది. చిన్నచిన్న గేమ్లతోనే ఉండే ఈ స్క్విడ్ గేమ్‌లలో ప్రాణాలను కాపాడుకునేందుకు కంటెస్టెంట్లు చేసే పోరాటాన్ని చూపించారు.హ్వాంగ్ డాంగ్ హ్యుక్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ రెండో సీజన్‌ని ఈ ఏడాది డిసెంబరు 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. తొలి సీజన్‌లానే ఇప్పుడు తెలుగు డబ్బింగ్ కూడా ఉండనుంది. అలానే వచ్చే ఏడాది మూడో సీజన్ కూడా తీసుకొస్తామని, దీంతో సిరీస్‌కి ముగింపు ఇస్తామని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్) -
బాబాయ్- అబ్బాయి క్రేజీ సిరీస్.. సీక్వెల్ వచ్చేస్తోంది!
టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్‌సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గతేడాది రిలీజైన ఈ సిరీస్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ షేర్ చేసింది.రానా నాయుడు.. సీజన్ 2 షూటింగ్ ప్రారంభించినట్లు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి షూటింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే రానా, వెంకటేశ్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే సీజన్ 2 ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు ఆదరణ దక్కడంతోనే సీజన్-2ను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది.కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.Rana Naidu Season 2 is now f̶i̶x̶i̶n̶g̶ filming 🔥#RanaNaiduOnNetflix pic.twitter.com/5Xh5zq8nGU— Netflix India (@NetflixIndia) July 23, 2024 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్!
మహి వీ రాఘవ్ డైరెక్షన్లో వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ సీజన్-2. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ఈ సిరీస్‌కు ఇండియాలోనే టాప్-3 ప్లేస్ దక్కించుకుంది. ఓటీటీల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన జాబితాలో టాప్-3లో నిలిచింది. ఈ విజయం పట్ల మహి వి రాఘవ్ సంతోషం వ్యక్తం చేశారు. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తోంది. ఈ సందర్భంగా మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను మీరంతా ఆదరించి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి విజయాలను సాధిస్తాయని మరోసారి రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది’’ అని పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సేవ్ ది టైగర్ రెండు సీజన్స్ సూపర్ హిట్ కావడంతోసీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైయాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్- 3 సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ కోరింది. వారు పంపిన ఆలోచనలు, రచనలు బాగుంటే రచయిత, ఫిల్మ్ మేకర్స్ సహకారంతో దాన్ని మరింత మెరుగ్గా చేసి రూపొందిస్తామని పేర్కొన్నారు. -
నేను మద్యం, సిగరెట్లు తాగుతా.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 కొనసాగుతోంది. ఈ రియాల్టీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రియాలిటీ షో జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆషికా భాటియా గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మనీషా రాణితో పాటు ఆషికాను నామినేట్ చేయగా ఎలిమినేట్ అయింది ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆషికా తన అలవాట్లపై సంచలన కామెంట్స్ చేసింది. తనకు సిగరెట్, మద్యం తాగే అలవాటు ఉందని కుండబద్దలు కొట్టింది. ఈ విషయం మా అమ్మకు తెలుసని మరో బాంబు పేల్చింది. (ఇది చదవండి: బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్‌కు ఢోకానే లేదుగా!) ఆషిక మాట్లాడుతూ.. 'నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ విషయం గురించి మా అమ్మకు తెలుసు. అందుకే నేను ఎవరి అభిప్రాయాలను పట్టించుకోను. మా అమ్మకు తెలిసినప్పుడు ఇతరుల మాటలను పట్టించుకోను. నేను ధూమపానం చేస్తాను.. కానీ ఈ విషయాన్ని మా అమ్మ వద్ద దాచలేదు. ప్రజలు అవసరమైన దానికంటే అనవసర విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.' అని చెప్పుకొచ్చింది. ఆషిక మాట్లాడుతూ.. 'నేను ఆరు నెలల క్రితమే ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ మానేశాను అని గతంలో కూడా చెప్పా. గతంలో వాటిని నేను ఎక్కువగా తాగేదాన్ని. అందుకే స్మోకింగ్ అలవాటు గురించి అంతగా పట్టించుకోలేదు. స్మోకింగ్‌తో నాకు ఎలాంటి సమస్యలు లేవు.' అని అన్నారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంపై ఆషికా స్పందించింది. ఎలిమినేట్ అయినందుకు నిరాశ చెందలేదు, కానీ నామినేషన్ ప్రక్రియ గురించి బాధపడ్డానని తెలిపింది. ఎందుకంటే కేవలం రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి.. ఇది అన్యాయమైనప్పటికీ.. ఇదంతా ఆటలో ఒక భాగం.. చివరికి ఎవరైనా వెళ్లిపోవాల్సిందే అన్నారు. ఈసారి నా వంతు వచ్చిందని ఆషికా తెలిపింది. (ఇది చదవండి: బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది: జేడీ చక్రవర్తి) View this post on Instagram A post shared by 💕A A S H I K A B H A T I A 💕 (@_aashikabhatia_) -
Rana Naidu 2: గెట్ రెడీ..రానా నాయుడు సీజన్-2 వచ్చేస్తోంది
దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానాలు తొలిసారి కలిసి నటించిన వెబ్‌సిరీస్ రానా నాయుడు. ఇటీవల విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక వ్యూవర్ షిప్‌లోనూ రానా నాయుడు దూసుకుపోతుంది. ఓటీటీలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న రానా నాయడు ఇప్పుడు సీజన్-2తో వచ్చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఈ మేరకు గ్లింప్స్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. 'బాధపడకండి, మీ సమస్యలన్నీ సరిచేసేందుకు నాయుడులు తిరిగొస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 త్వరలో రాబోతోంది'.. అంటూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. కాగా కంటెంట్ పరంగా ఈ సిరీస్‌కు మంచి పేరొచ్చినా, అశ్లీలత, అసభ్యకర సన్నివేశాలతో విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. మరి సీజన్-2 ఏ విధంగా ఉండనుందన్నది చూడాల్సి ఉంది. Don’t worry, the Naidus are coming back to sort out all your kiri kiri ♥🔥#RanaNaidu season 2 is coming soon! pic.twitter.com/KVJDrIB5wH — Netflix India (@NetflixIndia) April 19, 2023 -
పింక్ విల్లా అవార్డ్స్ సీజన్-2 లో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ .. ఆకట్టుకుంటున్న ప్రోమో
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తోంది. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను అదే స్థాయిలో ఊర్రూతలూగిస్తోంది. తాజాగా సీజన్-2 లో మూడో ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో అమెరికాకు చెందిన డాక్టర్ శృతి నండూరి తన స్వరంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. -
Parampara 2 Review: ఎమోషనల్ ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా 'పరంపర 2'..
టైటిల్: 'పరంపర 2' వెబ్ సిరీస్ నటీనటులు: నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని,రవి వర్మ, బిగ్‌బాస్ దివి తదితరులు కథ: హరి ఏలేటి మాటలు: హరి ఏలేటి, కృష్ణ విజయ్ ఎల్ సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్ ఎడిటింగ్: తమ్మిరాజు సంగీతం: నరేష్ కుమరన్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల విడుదల తేది: జులై 21, 2022 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎపిసోడ్స్ 5 గతేడాది విడుదలై సినీ లవర్స్‌ను, నెటిజన్లను విశేషంగా అలరించిన తెలుగు వెబ్ సిరీస్‌లలో ఒకటి 'పరంపర'. డిసెంబర్ 24, 2021న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌లోని రివేంజ్, ఎమోషన్స్‌ను ఇంకాస్తా పెంచుతూ రెండో సీజన్‌ను తాజాగా విడుదల చేశారు. యంగ్ హీరో నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన 'పరంపర 2' వెబ్ సిరీస్ జులై 21న విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తను ప్రేమించిన అమ్మాయి రచన (ఆకాంక్ష సింగ్) పెళ్లి సురేష్ (ఇషాన్)తో జరగడం సహించలేని గోపి కృష్ణ ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు. పెళ్లిలో లైసెన్స్ లేని తుపాకీని వాడినందుకు గోపికి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అయితే బాబాయి నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) క్షమాపణ చెబితే బయటకు తీసుకువస్తానని గోపి తండ్రి మోహన్ రావు (జగపతి బాబు)కు చెబుతాడు. తండ్రి సారీ చెప్పమని అడిగిన గోపి ఇష్టపడడు. తర్వాత పరిచయమైన రత్నాకర్ (రవి వర్మ) ద్వారా బెయిల్‌పై బయటకొస్తాడు గోపి. అలా వచ్చిన గోపి ఏం చేశాడు? బాబాయి నాగేంద్ర నాయుడిపై రివేంజ్ తీసుకున్నాడా? తన తండ్రి స్థానాన్ని అతనికి దక్కేలా చేశాడా? గోపిని నాగేంద్ర నాయుడు, సురేష్ ఏ మేరకు ఎదుర్కోగలిగారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'పరంపర 2' చూడాల్సిందే. విశ్లేషణ: పరంపర సీజన్ 2 అర్థం కావాలంటే ముందుగా సీజన్ 1 కచ్చితంగా చూడాల్సిందే. లేకుంటే ఆ పాత్రల ఎమోషన్‌ను అర్థం చేసుకోలేరు. ఇక మొదటి సీజన్‌తో పోల్చి చూస్తే సిరీస్ నిడివిని చాలా వరకు తగ్గించేశారు. దీంతో తొలి సీజన్లోలాగా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫాస్ట్‌గా స్టోరీ వెళ్తుంది. స్క్రీన్‌ప్లే, నేరేషన్ రేసీగా ఉన్న తొలి సీజన్ చూసిన ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. డైరెక్ట్‌గా రెండో సీజన్ చూసేవాళ్లకు మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే మొదటి సీజన్‌లోని లోపాలని సరిచేసుకునేలా రెండో సీజన్ నిడివి విషయంలో డైరెక్టర్స్, రైటర్స్ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినా తర్వాత నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చివరి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మూడో సీజన్ గురించే ఇచ్చే లీడ్ ఆకట్టుకునేలా ఉంది. ఎమోషన్స్‌తో కాకుండా ఆలోచనతో నాగేంద్ర నాయుడిని పడగొట్టేందుకు గోపి వేసే ప్లాన్స్ బాగున్నాయి. అయితే గోపి, నాగేంద్ర నాయుడి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ రన్నౌతుంటుంది. ఈ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఇలాంటి తరహా సినిమాలు ఇప్పటికే చాలా రావడంతో కొంచెం రొటీన్ కథలా ఫీల్ అవ్వాల్సివస్తుంది. హరి ఏలేటి, కృష్ణ విజయ్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మాటలు తక్కువ ఉన్నా భావం ఎక్కువగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్ మిస్ చేశారనిపిస్తుంది. ఎస్పీ పరశురామ్, జెన్నీ మిస్సింగ్‌లపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వాటిగురించి తర్వాతి సీజన్లో చెప్పొచ్చేమో. ఇది చదవండి: ఇప్పుడే ప్రారంభమైన అసలు 'పరంపర'.. మొదటి సీజన్ రివ్యూ.. ఎవరెలా చేశారంటే? నవీన్ చంద్ర కెరీర్‌కు ఈ పాత్ర ఎంతో ఉపయోగపడేలా ఉంది. గోపి పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్, ఆవేశం, ఆలోచనలను కళ్లతో చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఇక జగపతి బాబు, శరత్ కుమార్‌లు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. సింపుల్‌గా మంచి వ్యక్తిగా ఉంటూనే కొడుకు కోసం ఏమైన చేసే తండ్రిగా పవర్ఫుల్ నటన కనబర్చారు జగపతి బాబు. కొన్ని సీన్లలో ఆయన స్టైలిష్ యాక్టింగ్ అలరిస్తుంది. అలాగే శరత్ కుమార్ కూడా స్టైలిష్ లుక్‌లో విలన్‌గా మెప్పించారు. ఇక ఆకాంక్ష సింగ్, ఆమని, ఇషాన్, కస్తూరి తమ పాత్రల పరిధిమేర నటించారు. రెండో సీజన్లో రవి వర్మ, బిగ్‌బాస్ దివి పాత్రలు కొత్తగా వచ్చాయి. రవి వర్మ పాత్ర కనిపించింది కాసేపైన ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దివి పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే స్టోరీ రొటీన్‌గా ఉన్న ఆసక్తికరమైన పొలిటికల్ మూమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్ డ్రామాతో 'పరంపర 2' ఆకట్టుకుంటుంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
పరంపర సీజన్ 2 టీం స్పెషల్ ఇంటర్వ్యూ
-
తండ్రి కోసం కొడుకు చేసే యుద్ధమే ఈ సిరీస్: నవీన్ చంద్ర
Naveen Chandra About His Role In Parampara 2: హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.. ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర 'గోపీ' పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పరంపర'. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ విశేషాలను పంచుకున్నారు నవీన్ చంద్ర. - పరంపర వెబ్ సిరీస్ మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్ కూ అప్పుడే సన్నాహాలు ప్రారంభించాం. అందుకే ఇంత త్వరగా సెకండ్ సీజన్ ను మీ ముందుకు తీసుకురాగలిగాం. దీనికి ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ముందు చూపే కారణం. ఫస్ట్ సీజన్ హిట్టయితే తప్పకుండా సెకండ్ సీజన్ కు క్రేజ్ ఉంటుందని వాళ్లు సరిగ్గానే అంచనా వేశారు. - ఈ వెబ్ సిరీస్ లో గోపి అనే పాత్రలో నటించాను. పొలిటికల్ రివేంజ్ డ్రామా ఇది. నా క్యారెక్టర్ ఈ సెకండ్ సీజన్ లోనే పవర్ ఫుల్ గా మారుతుంది. ఫస్ట్ సీజన్ లో శరత్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ సీజన్ లో నేను అతని మీద పైచేయి సాధిస్తాను. తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని పరాజితుడిగా చూడలేకపోతాడు గోపి. నాన్న కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించేందుకు ఫైట్ చేస్తుంటాడు. - ఈ వెబ్ సిరీస్ లో ఆరేడు పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నాకు ఇలాంటి కథలంటే చాలా ఇష్టం. హీరోకు స్కోప్ ఉండి మిగతా పాత్రలు తేలిపోతే అందులో ఆసక్తి ఉండదు. అన్ని క్యారెక్టర్స్‌కు నటించేందుకు అవకాశం ఉండాలి. అప్పుడే కథ బాగుంటుంది. మొదటి సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సిరీస్ ను ఇంకా జాగ్రత్తగా అన్ని ఎమోషన్స్ కలిపి చేశాం. - రామ్ చరణ్ మా సిరీస్ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టార్స్ తో ప్రమోషన్ చేస్తే దాని రీచింగ్ వేరుగా ఉంటుంది. కోవిడ్ వల్ల థియేటర్స్ కు దూరమైన ప్రేక్షకులు ఓటీటీని ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు. మధ్యలో మళ్లీ థియేటర్లకు వెల్లారు. ఇప్పుడు ఓటీటీపై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ ఎక్కడున్న వాళ్ల ఆదరణ దక్కుతుందని నా నమ్మకం. - నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదులుకోను. నా మొదటి చిత్రం 'అందాల రాక్షసి'తో గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత వీర రాఘవ'లో నటించినప్పుడు మరోసారి ఫేమ్ అయ్యాను. ఎన్టీఆర్ ఆ సినిమా ఫంక్షన్ స్టేజీ మీదే నా పాత్ర గురించి, నెను ఎంత బాగా నటించాను అనేది చెప్పారు. అది ఇండస్ట్రీలో బాగా రీచ్ అయ్యింది. - నేను విలన్ పాత్రల్లో నటించినా మీ విలనీ బాగుంది అంటారు. గ్రే క్యారెక్టర్స్ చేసినా బాగుంటుంది అని చెబుతుంటారు. ప్రేక్షకుల నుంచి వచ్చేది స్పందన నిజాయితీగా ఉంటుంది. నేను అది ఎక్కువగా తీసుకుంటాను. సోషల్ మీడియా ద్వారా కూడా అన్నా, మీ క్యారెక్టర్ బాగుంది అని కామెంట్స్ చేస్తుంటారు. 'విరాటపర్వం'లో నా రోల్ పెంచాల్సింది అనే కామెంట్స్ వచ్చాయి. - నటుడిని అయ్యేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నాలో నటన మీద ఎలాంటి ఇష్టం ఉందో, ఇప్పటికీ అదే ఆసక్తి , ఉత్సాహం ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా వెబ్ సిరీస్ ఏది చేసినా నటుడిగా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను. -
కోల్పోయిన జీవితం తిరిగి కావాలి.. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో 'పరంపర 2'
Parampara 2 Web Series Trailer: తెలుగు వెబ్ సిరీస్‌లలో ఘన విజయం సాధించిన వాటిలో 'పరంపర' ఒకటి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సిరీస్ అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా 'పరంపర సీజన్ 2' వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్సరీస్ సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి, టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్‌కు ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. 'ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర నుంచి లాక్కున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి' అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు జెనరేషన్స్కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందగా, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ ఆశాభావం తెలిపింది. పొలిటికల్, రివేంజ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'పరంపర 2' జులై 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
సరికొత్తగా రానున్న 'స్క్విడ్ గేమ్ 2'.. మరబొమ్మకు బాయ్‌ఫ్రెండ్ అట..
Squid Game Season 2 Official Announcement And Doll Has Boyfriend: ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' వినడానికి చిన్న పిల్లల ఆటల ఉన్నా చూసే ఆడియెన్స్‌ను ప్రతిక్షణం థ్రిల్లింగ్‌కు గురిచేసింది. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై నెంబర్ వన్ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. కొరియన్ భాషలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్‌లో 9 ఎపిసోడ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సిరీస్‌కు రెండో సీజన్ వస్తున్నట్లుగా డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రౌండ్స్ మరింత కొత్తగా, ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసేలా ఉండన్నున్నట్లు తెలిపారు. 'గతేడాది స్క్విడ్ గేమ్‌కు ప్రాణం పోసి ఓ సిరీస్ రూపంలో ఒకటో సీజన్‌గా తీసుకురావడానికి 12 ఏళ్లు పట్టింది. కానీ మోస్ట్ పాపులర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా అవతరించేందుకు 12 రోజులు మాత్రమే పట్టింది. స్క్విడ్ గేమ్‌ను ఇంతగా ఆదరించి ఘన విజయాన్ని అందించిన వరల్డ్‌వైడ్‌గా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక ఇప్పుడు జీ-హన్ రిటర్న్స్.. ది ఫ్రంట్ మ్యాన్ రిటర్న్స్.. సీజన్-2 వచ్చేస్తోంది. ఆ సూట్ ధరించి మేమ్ ప్రారంభించేందుకు డీడాగ్జి మళ్లీ తిరిగి రావొచ్చు. ఈసారి యంగ్ హీ (మరబొమ్మ)కి బాయ్‌ఫ్రెండ్‌గా 'కియోల్-సు' రానున్నాడు.' అని డైరెక్టర్ తెలిపారు. Hwang Dong-Hyuk writer, director, producer, and creator of @squidgame has a message for the fans: pic.twitter.com/DxF0AS5tMM — Netflix (@netflix) June 12, 2022 అయితే ఇందులో ఉన్న మరబొమ్మ (రోబోట్)కు బాయ్‌ఫ్రెండ్ ఉండటం అనే విషయంపై నెటిజన్స్ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. 'ఈ బొమ్మకు (రోబోట్) కూడా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా ? నమ్మలేకపోతున్నాను. నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నా' అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండో సీజన్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా వెల్లడించలేదు. Red light… GREENLIGHT! Squid Game is officially coming back for Season 2! pic.twitter.com/4usO2Zld39 — Netflix (@netflix) June 12, 2022 how come the doll in squid game has a boyfriend but im single https://t.co/ST4RFRhv77 — xin 🌱 FL!P that (@nagumowife) June 12, 2022 the squid games doll has a boyfriend & some of you guys are still single lol just saying https://t.co/gzJg971Swa — brooke (@brookeab) June 12, 2022 now??? imagine the squid game robot got a boo and ur still single 😭 https://t.co/jlA69DdFDc — jimin connoisseur ⁷ (@sunflowrmemory) June 12, 2022 Girlie got a boyfriend~ 💃🏽 pic.twitter.com/BNsyn4dGv7 — shera || (@ddiddirere) June 12, 2022 -
Panchayat season 2: మంచి మనుషులకు గట్టి దెబ్బలు
కోట్లాది అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ‘ఫులేరా’ అనే పల్లెటూళ్లో పంచాయతీ ఆఫీసులో ఆ ఆఫీసు ఉద్యోగికి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో మొదటి సీజన్ సాగితే ఇప్పుడు ముఖ్యపాత్రలకు గట్టి విరోధులు ఈ సీజన్లో కనిపిస్తారు. సహజత్వం, హాస్యం, అనుబంధంతో ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ అమేజాన్‌లో మళ్లీ ఒకసారి ప్రేక్షకులను బింజ్ వాచింగ్ చేయిస్తోంది. 8 ఎపిసోడ్ల సెకండ్ సీజన్ పరిచయం ఈ ఆదివారం. అదే ఊరు. అదే పంచాయతీ ఆఫీసు. వేరే గది తీసుకోకుండా ఆ పంచాయతీ ఆఫీసులోనే నివసించే ఉద్యోగి అభిషేక్. అతన్ని అభిమానంగా చూసుకునే పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆఫీసు అసిస్టెంట్ వికాస్... 2020లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు పాత దూరదర్శన్ సీరియల్స్‌లా అనిపించి దేశమంతా చూసింది. పంచాయత్ వెబ్ సిరీస్‌కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. సెకండ్ సీజన్ కోసం విన్నపాలు, ఒత్తిళ్లు తెచ్చారు. లాక్డౌన్ వల్ల ఆ పనులన్నీ ఆగిపోయి ఇప్పుడు పూర్తయ్యి ‘పంచాయత్ సీజన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. మళ్లీ అభిమానులను అలరిస్తోంది. ఫులేరాలో ప్రత్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఫులేరా’ అనే కల్పిత ఊరిలో జరిగినట్టుగా చెప్పే ఈ కథలో అందరూ మంచివాళ్లే. అమాయకులే. ఒకరికొకరు సాయం చేసుకునేవారే. కాని ఆ ఊరికి గ్రామ సచివాలయ ఉద్యోగిగా వచ్చిన అభిషేక్‌కు ఎం.బి.ఏ చదివి వేరే ఉద్యోగం చేయాలని ఎంట్రన్స్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ఊరి సర్పంచ్‌తో, ఉప సర్పంచ్‌తో, అసిస్టెంట్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. నిజానికి ఆ ఊరి సర్పంచ్ స్త్రీ (నీనా గుప్తా) అయినా సర్పంచ్ భర్త (రఘువీర్ యాదవ్) వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. అభిషేక్ (జితేంద్ర కుమార్) వారి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మొదటి సిరీస్‌లో సర్పంచ్ కూతురు ఉంటుంది కాని ఎక్కడా కనిపించదు. కాని ఈ సిరీస్‌లో ఆ కూతురు కనిపిస్తుంది. అభిషేక్‌తో స్నేహం చేస్తుంది. అయితే ఊరన్నాక ఒకరో ఇద్దరో ప్రత్యర్థులు ఉండకపోరు. ఈ ఊళ్లో కూడా ఒక ప్రత్యర్థి తయారవుతాడు. అతడే ఆ ఊరి టెంట్ హౌస్ ఓనర్. రాబోయే ఎన్నికలలో తన భార్యను నిలబెట్టి సర్పంచ్ భర్తగా చలాయించాలనుకుంటున్న ఆ టెంట్ హౌస్ ఓనర్ సర్పంచ్‌ను, సచివాలయ ఉద్యోగులను పరేషాన్ చేస్తుంటాడు. మరోవైపు ఆ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ కూడా సర్పంచ్‌ని అవమానిస్తుంటాడు. సర్పంచ్ తన కుమార్తె కోసం సంబంధం చూస్తే ఆ పెళ్లికొడుకు సైకోలాగా మారి ఆ అమ్మాయికి తెగ ఫోన్లు చేస్తుంటాడు. వీళ్లందరూ ప్రత్యర్థులే అయినా అభిషేక్, సర్పంచ్, ఉప సర్పంచ్, అసిస్టెంట్ నలుగురూ కలిసి ఆ సమస్యలను ఎలా దాటారు అనేవే ఈ ఎపిసోడ్స్. నవ్వొచ్చే ఎపిసోడ్స్ గత సిరీస్లోలానే ఈ సిరీస్‌లో కూడా నవ్వొచ్చే ఉదంతాలు ఎన్నో ఉంటాయి. ఊరికి మరుగుదొడ్లు అలాట్ అయినా కొందరు ఉదయాన్నే బయటకు వెళుతుంటారు. అలా కనిపిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ విజిట్‌కు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ముందు ఊరి సర్పంచ్‌ను ఎలాగైనా బద్నామ్ చేయాలని టెంట్ హౌస్ ఓనర్ ఒకతణ్ణి నువ్వు ఎలాగైనా చెంబు పట్టుకుని పొద్దున్నే కలెక్టరుకు కనిపించు అంటాడు. కలెక్టరు విజిట్‌కు వస్తే కనిపించాలని అతను, అతణ్ణి ఎలాగైనా ఆపాలని మిత్రబృందం చేసే ప్రహసనాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. గుడిలో టెంట్ హౌస్ ఓనర్ భార్య చెప్పులను పొరపాటున సర్పంచ్ భార్య తొడుక్కుని ఇంటికి వస్తుంది. తన చెప్పులు కనిపించని టెంట్ హౌస్ ఓనర్ భార్య సిసి టీవీలో చూసి సర్పంచ్ భార్యే దొంగ అని తెలుసుకుని పోలీస్ కేస్ పెడతానంటుంది. ఆ చెప్పులు ఆమె ఇంట్లో పడేయడానికి హీరో నానా విన్యాసాలు చేస్తాడు. అదీ నవ్వే. ఊరి రోడ్డు కోసం నిధులకు ఎంఎల్ఏ దగ్గరకు వెళితే ఆ ఎంఎల్ఏ ముందు ఎక్స్‌ప్రెస్ రైలును ఆపడానికి ధర్నా చేయమని పంపిస్తాడు. అక్కడ సర్పంచ్‌ను, ఉపసర్పంచ్‌ను పోలీసులు పట్టుకెళతారు. అదంతా చాలా సరదాగా ఉంటుంది. హీరోయిన్ను పెళ్లికొడుకు వేధిస్తూ ఉంటే ఆమె హీరో సాయం కోరుతుంది. అలాగే హీరోయిన్, హీరో పరిచయం పెంచుకునే సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. గంభీరమైన ముగింపు సాధారణంగా పంచాయత్ ఎపిసోడ్స్ అన్నీ సరదాగా ఉంటాయి. కాని ఈ సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌ను ఒక ఉదాత్త సన్నివేశంతో గంభీరం చేశాడు దర్శకుడు. ఆ సన్నివేశంతో ప్రేక్షకులందరూ కన్నీరు కారుస్తారు. మనసులు బరువెక్కుతాయి. సంతోషంతోపాటు దుఃఖమూ మనుషుల జీవితాల్లో ఉంటుందని చెప్పడానికి కాబోలు. ఇంకా పాత్రలు, వాటి గమ్యం పూర్తిగా తేలకుండానే ఈ సిరీస్ కూడా ముగుస్తుంది. అంటే సీజన్ 3కు కథ మిగిలించుకున్నారన్న మాట. ‘పంచాయత్’ బలం అంతా దాని సహజత్వం. సున్నితత్వం. హాస్యం. మానవ నిజ ప్రవర్తనలు. వీటిని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా, రచయిత చందన్ కుమార్ గట్టిగా పట్టుకోవడంతో సిరీస్ నిలబడింది. కథ ఉత్తరప్రదేశ్‌లో జరిగినా లొకేషన్ అంతా భొపాల్కు దగ్గరగా తీశారు. ఆ ఊరి వాతావరణమే సగం ఆకట్టుకుంటుంది. థియేటర్ చేసిన నటులు కావడం వల్ల అందరూ పాత్రలను అద్భుతంగా పండిస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం. ఇలాంటి జీవితాలు, పాత్రలు తెలుగు పల్లెల్లో ఎన్నెన్నో ఉంటాయి. గతంలో తెలుగులో కూడా మంచి సీరియల్స్ వచ్చేవి. ఇలాంటి కథలతో తెలుగులో కూడా వెబ్ సిరీస్ వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. పంచాయత్ చూడని వాళ్లు మొదటి సిరీస్, రెండో సిరీస్ హాయిగా చూడొచ్చు. హిందీలో మాత్రమే లభ్యం. -
వెల్కమ్ టు అడల్ట్‌హుడ్.. 30 వెడ్స్ 21 సీజన్-2 టీజర్ రిలీజ్
30 Weds 21 Web Series Season 2 Teaser Released: 2021లో యూట్యూబ్‌లో విడుదలై అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ 30 వెడ్స్ 21. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల అమ్మాయితో వివాహం అనే ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చింది ఈ సిరీస్. తొమిదేళ్ల ఏజ్ గ్యాప్‌తో పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో చూపించి ఆకట్టుకుంది. ఈ సిరీస్‌లో దంపతులుగా నటించిన చైతన్య, అనన్య జోడీ నెటిజన్లను బాగా అట్రాక్ట్ చేసింది. ఈ సిరీస్ ఎంతో హిట్ కావడంతో దీనికి కొనసాగింపుగా రెండో సీజన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సిరీస్‌కు రెండో సీజన్ ఫస్ట్ లుక్‌ను ప్రకటించిన మేకర్స్ సోమవారం 30 వెడ్స్ 21 రెండో సీజన్ టీజర్‌ను విడుదల చేశారు. ఇక మనిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు రావు అంటూ పృథ్వీ చెప్పే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. అనేక భావోద్వేగాల మధ్య కలిసిన మేఘన, పృథ్వీలు జంటగా ప్రేమ పక్షుల్లా విహరించడం, అనుభూతి చెందడం టీజర్లో చూపించారు. 'నాన్న బుజాల మీదెక్కి చూసే ప్రపంచానికి, మన కాళ్ల మీద నిలబడి చూసే ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది' అనే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ వెబ్ సిరీస్‌కు అసమర్థుడు, మనోజ్ పీ కథను అందించగా, పృథ్వీ వనం దర్శకత్వం వహించారు. -
‘30 వెడ్స్ 21’వెబ్‌సిరీస్ సీజన్-2 రెడీ.. ఫస్ట్‌లుక్ రిలీజ్
గతేడాది యూట్యూబ్‌లో విడుదలైన ‘30 వెడ్స్ 21’వెబ్‌సిరీస్ ఎంతలా పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 30 ఏళ్ల బ్యాచిలర్‌కు, 21 ఏళ్ల యువతిని ఇచ్చి పెళ్లి చేస్తే వారి మధ్య ఉండే భావేద్వేగాలు ఎలా ఉంటాయన్న కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దిన ఈ వెబ్‌సిరీస్ అప్పట్లో యూట్యూబ్‌ను షేక్ చేసింది. చైతన్య, అనన్య జోడి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో యూత్‌ని బాగా అట్రాక్ట్ చేసిన ఈ వెబ్‌సిరీస్ ఇప్పుడు రెండో సీజన్‌కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా సీజన్-2 సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్‌ను రేపు(జనవరి31)విడుదల కానుంది. This valentine's month, Meet our most loved married couple, Meghana and Prudhvi again 💝 Presenting the first look of #30Weds21 season 2 Teaser out on 31 Jan@ananyaontweet @IamChaitanyarao @prithvi_vanam@anuragmayreddy @SharathWhat @scaler_official pic.twitter.com/EahWAhhNLh — ChaiBisket (@ChaiBisket) January 30, 2022 -
భలే ప్లాన్
గాల్లో బెలూన్లు ఎగరేసి ఎంజాయ్ చేస్తున్నారు నిత్యామీనన్. ‘బ్రీత్’ వెబ్ సిరీస్ సీజన్ 2 షూటింగ్ పూర్తికావడమే ఈ ఆనందానికి కారణం. ‘‘బ్రీత్’ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. ఒకరినొకరం బాగా మిస్ అవబోతున్నాం అని చెప్పడానికి బాధగా ఉంది. ఇప్పటివరకు యాక్టింగ్‌లో నా బెస్ట్ టైమ్ ఇదేనని భావిస్తున్నాను’’ అన్నారు నిత్యా. ‘బ్రీత్’ సెకండ్ సీజన్లో అభిషేక్ బచ్చన్ నటించారు. ఫస్ట్ సీజన్లో మాధవన్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అన్నట్లు .. ఇంకో విషయం ఏంటంటే వెబ్‌సిరీస్‌లో నిత్యా నటించడం ఇదే తొలిసారి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌వైపు మళ్లిన నిత్యాకు చేతిలో సినిమాలు లేవనుకుంటే మాత్రం పొరపాటే. ‘మిషన్ మంగళ్’ సినిమాతో ఈ ఏడాదే బాలీవుడ్ డోర్ కొట్టిన ఈ బ్యూటీ సౌత్‌లోనూ మస్త్ బిజీగా ఉన్నారు. తమిళంలో సైకో, ది ఐరన్‌లేడీ (జయలలిత బయోపిక్) సినిమాలతో పాటు కొన్ని మలయాళ చిత్రాలు చేస్తున్నారు. అలాగే మరికొన్ని వెబ్ సిరీస్‌లో నటించడానికి కథలు వింటున్నారట. ఇలా సినిమాలు, డిజిటల్ సెక్టార్‌ని బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను భలేగా ప్లాన్ చేసుకుంటున్నారు నిత్యామీనన్. -
‘బిగ్‌బాస్ 2’లో నందమూరి హీరో?
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ రియాల్టీ షో ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. ఈ షోకు ఎంత క్రేజ్ వచ్చిందో పాల్గొన్న పార్టిసిపెంట్స్‌కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఇలాంటి రియాల్టీ షోలు కేవలం బాలీవుడ్ వాళ్లే కాదు మనోళ్లు కూడా రక్తికట్టించగలరని నిరూపించుకున్నారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ రెండో సీజన్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండో సీజన్‌కు నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సారి ఇంకొంచెం మసాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండో సీజన్లో పాల్గొనే వ్యక్తులు వీరే నంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అవి నిజం కాదంటూ ఆ షోలో మేము పాల్గొనడం లేదంటూ కొందరు ఇప్పటికే ప్రకటించారు. అయితే తాజాగా నందమూరి హీరో తారకరత్న ఈ షోలో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం మాత్రం రాలేదు. ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే బిగ్ బాస్ బృందం కానీ, తారకరత్న కానీ స్పందించేవరకు వేచి చూడాలి. -
‘బిగ్ బాస్ 2’ వంద రోజులు
ఉత్తరాదిలో ఘనవిజయం సాధించిన బిగ్‌బాస్ షో దక్షిణాదిలోనూ మంచి టీఆర్పీలు సాధించింది. ఈ షో తెలుగు వర్షన్ తొలి సీజన్‌కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సూపర్ హిట్ అయిన ఈ షో 70 రోజుల పాటు కొనసాగింది. తొలి సీజన్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో రెండో సీజన్‌ను మరింత భారీగా ప్లాన్చేస్తున్నారు నిర్వాహకులు. అయితే ఎన్టీఆర్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్ 2ను 100 రోజుల పాటు నిర్వహించనున్నారట. జూన్ 10 నుంచి రెండో సీజన్ షూటింగ్ ప్రారంభం కానుంది. అదే రోజు షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల వివరాలను వెల్లడించనున్నారు. -
బిగ్‌బాస్ సీజన్ 2 టీజర్ రెడీ
తమిళసినిమా : బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో గతేడాది ప్రసారమై విశేష ఆదరణ పొందింది. విశ్వనటుడు కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం పెద్ద ఎసెట్ అయ్యింది. అంతే కాదు నటి ఓవియ, జూలి, నటుడు ఆరవ్ బాగా ప్రాచుర్యం పొందారు. వారందరికీ ఇప్పుడు సినిమా అవకాశాలు వరిస్తున్నాయి. బిగ్‌బాస్ సీజన్– 2కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షోకు నటుడు కమలహాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన టీజర్లో ఆయన పాల్గొనగా ఈ నెల 3న స్థానిక ఏవీఎం స్టూడియోలో చిత్రీకరించారు. ఈ టీజర్‌ను శనివారం నుంచి విజయ్ టీవీలో ప్రసారం అవుతోంది. ఈ గేమ్ షో కోసం భారీ సెట్ నిర్మాణం, ఇందులో పాల్గొనే వారి ఎంపిక జరుగుతోందట. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 2 జూన్ 25 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ విజయ్ టీవీలో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 1 కంటే సీజన్ 2 మరింత బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. -
బిగ్‌బాస్ షోలో ఇప్పుడు మీరు కూడా ఆడొచ్చు..
సాక్షి, హైదరాబాద్ : గత ఏడాది తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వచ్చిన ఈ షో టీఆర్పీ రేటింగ్లను ఓ స్థాయికి తీసుకెళ్లింది. సెలబ్రిటీల ఆటతీరుతో అనుకున్న దానికంటే సూపర్ హిట్ అయింది. దీంతో నిర్వాహకులు రెండో సీజన్‌కు ప్రణాలికలు వేస్తున్నారు. అయితే ఈ సారి నిర్వాహకులు ఈ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. కార్యక్రమాన్ని మరింత ఆకర్షనీయంగా తీర్చిదిద్దడానికి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు, సాధారణ ప్రేక్షకులు సైతం ఇందులో పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీజన్2కు ఆడిషన్లు మొదలైనట్లు షో నిర్వాహకులు తెలియచేశారు. ఇందులో సామాన్యులు సైతం పాల్గొనే అవకాశం ఉందని తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. గత సీజన్లో వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇచ్చిన దీక్షాపంత్ ఉన్న వీడియోలో బిగ్‌బాస్ షోకి సామాన్యులకు స్వాగతం అంటూ ఓ వాయిస్ వినిపిస్తుంది. దానికి కొనసాగింపుగా ఇంకో వీడియోను సైతం నిర్వాహకులు విడుదల చేశారు. ఈ వీడియోలో ఇంట్లో ఏపని చేయని ఓ యువకుడు ఉదయాన్నే లేచి అన్నిపనులు చేస్తుంటాడు. అది చూసిన కుటుంబ సభ్యులు తనకు ఏమైందంటూ ఆలోచిస్తుంటారు. అదే సమయంలో బిగ్‌బాస్ షోలో సామాన్యులకు అవకాశం అంటూ ఓ ప్రకటన వస్తుంది. అంటే ఇప్పుడు బిగ్‌బాస్ హౌస్‌లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా సందడి చేయబోతున్నారన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి. -
బిగ్‌బాస్-2.. హోస్ట్ దొరికాడు
సాక్షి, సినిమా : బుల్లితెర షో బిగ్ బాస్ మొదటి షో సక్సెస్ కావటంతో 2 సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ దఫా సీజన్‌కు హోస్ట్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ మధ్య మరికొందరు స్టార్ల పేర్లు తెరపైకి రాగా.. తాజాగా ఎన్టీఆర్ ఈ షో నుంచి దాదాపు అవుట్ అన్నది కన్ఫర్మ్ చేస్తూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం త్రివిక్రమ్ సినిమా త్వరలో మొదలు కావటమే. దీంతో నిర్వాహకులకు ఎన్టీఆర్ సారీ చెప్పేశాడని.. నేచురల్ స్టార్ నానిని సదరు ఛానెల్ సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కృష్టార్జున యుద్ధం తర్వాత నాని నాగ్‌తో మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికే అవకాశం ఉండటంతో షో నిర్వహణకు వీలుంటుందని నాని కూడా భావిస్తున్నాడంట. దీంతో సెకండ్ సీజన్‌కు నాని దాదాపు ఖరారు అయినట్లేనని ఆ కథనాల సారాంశం. అయితే ఈ వార్తపై ఛానెల్ నుంచిగానీ, నాని తరపు నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ సీజన్-2 పార్ట్-2
-
ఎరీనా వన్ యూత్ ఫెస్ట్ సీజన్-2 పార్ట్-1
-
మళ్లీ సమ్మోహనం
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మరోసారి సమ్మోహన పరిచేందుకు నాగార్జున సిద్ధమయ్యారు. ‘మా’ టీవీ చరిత్రలోనే అద్భుతమైన రేటింగ్స్ సాధించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సిరీస్ ఈ సోమవారం నుంచే మొదలు కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకూ వారానికి అయిదు రోజులు రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా మా టీవీ చైర్మన్ ఎన్. ప్రసాద్ మాట్లాడుతూ -‘‘నమ్మలేని విధంగా జీవితాన్ని మార్చేసే షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. విజ్ఞానాన్ని అందించడం ద్వారా సామాజికంగా మంచి మార్పుని తీసుకొచ్చే సమర్థత ‘మా’ టీవీకి ఉందనడానికి నిదర్శనం లాంటి షో ఇది’’ అని చెప్పారు.