బిగ్‌బాస్‌ సీజన్‌ 2 టీజర్‌ రెడీ | Kamal Haasan BIgg Boss Season 2 Teaser Out | Sakshi
Sakshi News home page

Published Sun, May 13 2018 9:21 AM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

Kamal Haasan BIgg Boss Season 2 Teaser Out - Sakshi

తమిళసినిమా : బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో గతేడాది ప్రసారమై విశేష ఆదరణ పొందింది. విశ్వనటుడు కమలహాసన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించడం పెద్ద ఎసెట్‌ అయ్యింది. అంతే కాదు నటి ఓవియ, జూలి, నటుడు ఆరవ్‌ బాగా ప్రాచుర్యం పొందారు. వారందరికీ ఇప్పుడు సినిమా అవకాశాలు వరిస్తున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌– 2కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షోకు నటుడు కమలహాసనే వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌లో ఆయన పాల్గొనగా ఈ నెల 3న స్థానిక ఏవీఎం స్టూడియోలో చిత్రీకరించారు.

ఈ టీజర్‌ను శనివారం నుంచి విజయ్‌ టీవీలో ప్రసారం అవుతోంది. ఈ గేమ్‌ షో కోసం భారీ సెట్‌ నిర్మాణం, ఇందులో పాల్గొనే వారి ఎంపిక జరుగుతోందట. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో సీజన్‌ 2 జూన్‌ 25 నుంచి సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ విజయ్‌ టీవీలో ప్రసారం కానున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షో సీజన్‌ 1 కంటే సీజన్‌ 2 మరింత బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement