
ప్రస్తుతం హిందీలో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్-2 కొనసాగుతోంది. ఈ రియాల్టీ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రియాలిటీ షో జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఆషికా భాటియా గత వారం ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మనీషా రాణితో పాటు ఆషికాను నామినేట్ చేయగా ఎలిమినేట్ అయింది ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆషికా తన అలవాట్లపై సంచలన కామెంట్స్ చేసింది. తనకు సిగరెట్, మద్యం తాగే అలవాటు ఉందని కుండబద్దలు కొట్టింది. ఈ విషయం మా అమ్మకు తెలుసని మరో బాంబు పేల్చింది.
(ఇది చదవండి: బిగ్‌బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే! గ్లామర్‌కు ఢోకానే లేదుగా!)
ఆషిక మాట్లాడుతూ.. 'నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ విషయం గురించి మా అమ్మకు తెలుసు. అందుకే నేను ఎవరి అభిప్రాయాలను పట్టించుకోను. మా అమ్మకు తెలిసినప్పుడు ఇతరుల మాటలను పట్టించుకోను. నేను ధూమపానం చేస్తాను.. కానీ ఈ విషయాన్ని మా అమ్మ వద్ద దాచలేదు. ప్రజలు అవసరమైన దానికంటే అనవసర విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.' అని చెప్పుకొచ్చింది.
ఆషిక మాట్లాడుతూ.. 'నేను ఆరు నెలల క్రితమే ఆల్కహాల్, ఎనర్జీ డ్రింక్స్ మానేశాను అని గతంలో కూడా చెప్పా. గతంలో వాటిని నేను ఎక్కువగా తాగేదాన్ని. అందుకే స్మోకింగ్ అలవాటు గురించి అంతగా పట్టించుకోలేదు. స్మోకింగ్‌తో నాకు ఎలాంటి సమస్యలు లేవు.' అని అన్నారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడంపై ఆషికా స్పందించింది. ఎలిమినేట్ అయినందుకు నిరాశ చెందలేదు, కానీ నామినేషన్ ప్రక్రియ గురించి బాధపడ్డానని తెలిపింది. ఎందుకంటే కేవలం రెండు నామినేషన్లు మాత్రమే వచ్చాయి.. ఇది అన్యాయమైనప్పటికీ.. ఇదంతా ఆటలో ఒక భాగం.. చివరికి ఎవరైనా వెళ్లిపోవాల్సిందే అన్నారు. ఈసారి నా వంతు వచ్చిందని ఆషికా తెలిపింది.
(ఇది చదవండి: బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది: జేడీ చక్రవర్తి)
Comments
Please login to add a commentAdd a comment