టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో వచ్చిన వెబ్‌సిరీస్ రానా నాయుడు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా గతేడాది రిలీజైన ఈ సిరీస్‌కు అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ షేర్ చేసింది.
రానా నాయుడు.. సీజన్ 2 షూటింగ్ ప్రారంభించినట్లు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. దీనికి సంబంధించి షూటింగ్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే రానా, వెంకటేశ్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే సీజన్ 2 ప్రేక్షకుల ముందుకురానున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌కు ఆదరణ దక్కడంతోనే సీజన్-2ను ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది.
కాగా.. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు రూపొందించారు. ఈ సిరీస్‌తో రానా, వెంకటేశ్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించారు.
Rana Naidu Season 2 is now f̶i̶x̶i̶n̶g̶ filming 🔥#RanaNaiduOnNetflix pic.twitter.com/5Xh5zq8nGU
— Netflix India (@NetflixIndia) July 23, 2024
Comments
Please login to add a commentAdd a comment