Parampara 2 Web Series Trailer Released By Ram Charan - Sakshi
Sakshi News home page

Parampara 2 Web Series: రామ్‌ చరణ్‌ చేతులమీదుగా 'పరంపర 2' ట్రైలర్‌..

Published Fri, Jul 8 2022 3:09 PM | Last Updated on Fri, Jul 8 2022 4:12 PM

Parampara 2 Web Series Trailer Released By Ram Charan - Sakshi

Parampara 2 Web Series Trailer: తెలుగు వెబ్‌ సిరీస్‌లలో ఘన విజయం సాధించిన వాటిలో 'పరంపర' ఒకటి. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సిరీస్‌ అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ వెబ్‌ సిరీస్‌కు సీక్వెల్‌గా 'పరంపర సీజన్‌ 2' వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్‌సరీస్‌ సీజన్‌ 2 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ రిలీజ్‌ చేసి, టీమ్‌ అందరికీ బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్‌కు ఎల్‌. కృష్ణ విజయ్‌, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వం వహించారు. ఈ వెబ్‌ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. 

'ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర నుంచి లాక్కున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి' అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు జెనరేషన్స్‌కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందగా, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ ఆశాభావం తెలిపింది. పొలిటికల్, రివేంజ్‌, యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన 'పరంపర 2' జులై 21 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement