పరంపర సీజన్‌-2 వచ్చేసింది, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే.. | Parampara Season 2 To Start Streaming On Hotstar On This Date | Sakshi
Sakshi News home page

Parampara Season 2: ఆ సస్పెన్స్‌ తెలియాలంటే పరంపర-2 చూడాల్సిందే..

Published Thu, Jul 21 2022 8:51 AM | Last Updated on Thu, Jul 21 2022 11:55 AM

Parampara Season 2 To Start Streaming On Hotstar On This Date - Sakshi

పరంపర..గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయిన ఈ వెబ్‌సిరీస్‌ మొదటి సీజన్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌కు కొనసాగింపుగా రెండవ సీజన్‌ రాబోతుంది. పరంపర-2గా వస్తున్న వెబ్‌సిరీస్‌ జులై21 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.

పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ మొదటి సీజన్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో సెకండ్‌ పార్ట్‌ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న "పరంపర సీజన్ 2" ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే "పరంపర" సీజన్ 2. పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం ఈ సీజన్‌-2. ప్రేమ, ప్రతీకారాల మధ్య నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే "పరంపర" సీజన్ 2 చూడాల్సిందే. సో డోంట్ మిస్.

పరంపర సీజన్‌-2ని డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. https://bit.ly/3cue9Vc

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement