Parampara
-
నీతా అంబానీ మరో గ్రాండ్ ఈవెంట్.. సంగీత దిగ్గజాలతో ‘పరంపర’
రిలయన్స్ ఫౌండేషన్ స్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మరో గ్రాండ్ ఈవెంట్‌కు తెరతీశారు. అనాదిగా వస్తున్న గురు శిష్య సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో 'పరంపర' అనే పేరుతో వారం రోజుల వేడుకను ప్రారంభించారు. భారతీయ శాస్త్రీయ సంగీతంలో సజీవ దిగ్గజాలు పద్మ విభూషణ్ పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ కార్తీక్ కుమార్, వారి శిష్యులు రాకేష్ చౌరాసియా, నీలాద్రి కుమార్‌లతో కలిసి నీతా అంబానీ జ్యోతి ప్రజ్వలన చేశారు. ధీరూభాయ్ అంబానీకి ఘన నివాళి కార్యక్రమంలో భాగంగా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అయిన నీతా అంబానీ తన గురువు, మామ దివంగత ధీరూభాయ్ అంబానీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గురువుల ఔన్నత్యాన్ని వివరించారు. పవిత్రమైన గురు పూర్ణిమ రోజున, మనకు మొదటి గురువులైన తల్లిదండ్రులను గౌరవించుకుందామని పిలుపునిచ్చారు. తనకు అత్యంత స్ఫూర్తిదాయకమైన గురువులలో ఒకరైన ధీరూభాయ్ అంబానీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. Mrs. Nita Ambani inaugurated, ‘Parampara’ a two day special celebration of the timeless guru-shishya legacy with a traditional lamp lighting ceremony accompanied by Pandit Hariprasad Chaurasia, Pandit Kartick Kumar & their illustrious disciples Rakesh Chaurasia and Niladri Kumar. pic.twitter.com/pTmWQk4f47 — Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) July 1, 2023 ఇదీ చదవండి: వైట్‌హౌస్‌లో మెరిసిన అంబానీ దంపతులు.. -
Parampara 2 Review: ఎమోషనల్ ఫ్యామిలీ రివేంజ్ డ్రామాగా 'పరంపర 2'..
టైటిల్: 'పరంపర 2' వెబ్ సిరీస్ నటీనటులు: నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని,రవి వర్మ, బిగ్‌బాస్ దివి తదితరులు కథ: హరి ఏలేటి మాటలు: హరి ఏలేటి, కృష్ణ విజయ్ ఎల్ సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్ ఎడిటింగ్: తమ్మిరాజు సంగీతం: నరేష్ కుమరన్ నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల విడుదల తేది: జులై 21, 2022 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎపిసోడ్స్ 5 గతేడాది విడుదలై సినీ లవర్స్‌ను, నెటిజన్లను విశేషంగా అలరించిన తెలుగు వెబ్ సిరీస్‌లలో ఒకటి 'పరంపర'. డిసెంబర్ 24, 2021న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సీజన్‌లోని రివేంజ్, ఎమోషన్స్‌ను ఇంకాస్తా పెంచుతూ రెండో సీజన్‌ను తాజాగా విడుదల చేశారు. యంగ్ హీరో నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన 'పరంపర 2' వెబ్ సిరీస్ జులై 21న విడుదలైంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్ సెకండ్ సీజన్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: తను ప్రేమించిన అమ్మాయి రచన (ఆకాంక్ష సింగ్) పెళ్లి సురేష్ (ఇషాన్)తో జరగడం సహించలేని గోపి కృష్ణ ఆపేందుకు విఫలయత్నం చేస్తాడు. పెళ్లిలో లైసెన్స్ లేని తుపాకీని వాడినందుకు గోపికి మూడేళ్లు జైలు శిక్ష పడుతుంది. అయితే బాబాయి నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) క్షమాపణ చెబితే బయటకు తీసుకువస్తానని గోపి తండ్రి మోహన్ రావు (జగపతి బాబు)కు చెబుతాడు. తండ్రి సారీ చెప్పమని అడిగిన గోపి ఇష్టపడడు. తర్వాత పరిచయమైన రత్నాకర్ (రవి వర్మ) ద్వారా బెయిల్‌పై బయటకొస్తాడు గోపి. అలా వచ్చిన గోపి ఏం చేశాడు? బాబాయి నాగేంద్ర నాయుడిపై రివేంజ్ తీసుకున్నాడా? తన తండ్రి స్థానాన్ని అతనికి దక్కేలా చేశాడా? గోపిని నాగేంద్ర నాయుడు, సురేష్ ఏ మేరకు ఎదుర్కోగలిగారు? అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'పరంపర 2' చూడాల్సిందే. విశ్లేషణ: పరంపర సీజన్ 2 అర్థం కావాలంటే ముందుగా సీజన్ 1 కచ్చితంగా చూడాల్సిందే. లేకుంటే ఆ పాత్రల ఎమోషన్‌ను అర్థం చేసుకోలేరు. ఇక మొదటి సీజన్‌తో పోల్చి చూస్తే సిరీస్ నిడివిని చాలా వరకు తగ్గించేశారు. దీంతో తొలి సీజన్లోలాగా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫాస్ట్‌గా స్టోరీ వెళ్తుంది. స్క్రీన్‌ప్లే, నేరేషన్ రేసీగా ఉన్న తొలి సీజన్ చూసిన ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉంటుంది. డైరెక్ట్‌గా రెండో సీజన్ చూసేవాళ్లకు మాత్రం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే మొదటి సీజన్‌లోని లోపాలని సరిచేసుకునేలా రెండో సీజన్ నిడివి విషయంలో డైరెక్టర్స్, రైటర్స్ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం స్లో అయినా తర్వాత నుంచి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక చివరి ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ప్రత్యేకంగా మూడో సీజన్ గురించే ఇచ్చే లీడ్ ఆకట్టుకునేలా ఉంది. ఎమోషన్స్‌తో కాకుండా ఆలోచనతో నాగేంద్ర నాయుడిని పడగొట్టేందుకు గోపి వేసే ప్లాన్స్ బాగున్నాయి. అయితే గోపి, నాగేంద్ర నాయుడి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ రన్నౌతుంటుంది. ఈ సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ ఇలాంటి తరహా సినిమాలు ఇప్పటికే చాలా రావడంతో కొంచెం రొటీన్ కథలా ఫీల్ అవ్వాల్సివస్తుంది. హరి ఏలేటి, కృష్ణ విజయ్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మాటలు తక్కువ ఉన్నా భావం ఎక్కువగా ఉంటుంది. కథలో కొన్ని లాజిక్స్ మిస్ చేశారనిపిస్తుంది. ఎస్పీ పరశురామ్, జెన్నీ మిస్సింగ్‌లపై క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వాటిగురించి తర్వాతి సీజన్లో చెప్పొచ్చేమో. ఇది చదవండి: ఇప్పుడే ప్రారంభమైన అసలు 'పరంపర'.. మొదటి సీజన్ రివ్యూ.. ఎవరెలా చేశారంటే? నవీన్ చంద్ర కెరీర్‌కు ఈ పాత్ర ఎంతో ఉపయోగపడేలా ఉంది. గోపి పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశాడు. ఎమోషన్, ఆవేశం, ఆలోచనలను కళ్లతో చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. ఇక జగపతి బాబు, శరత్ కుమార్‌లు తమ యాక్టింగ్‌తో అదరగొట్టారు. సింపుల్‌గా మంచి వ్యక్తిగా ఉంటూనే కొడుకు కోసం ఏమైన చేసే తండ్రిగా పవర్ఫుల్ నటన కనబర్చారు జగపతి బాబు. కొన్ని సీన్లలో ఆయన స్టైలిష్ యాక్టింగ్ అలరిస్తుంది. అలాగే శరత్ కుమార్ కూడా స్టైలిష్ లుక్‌లో విలన్‌గా మెప్పించారు. ఇక ఆకాంక్ష సింగ్, ఆమని, ఇషాన్, కస్తూరి తమ పాత్రల పరిధిమేర నటించారు. రెండో సీజన్లో రవి వర్మ, బిగ్‌బాస్ దివి పాత్రలు కొత్తగా వచ్చాయి. రవి వర్మ పాత్ర కనిపించింది కాసేపైన ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దివి పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. ఇక ఫైనల్‌గా చెప్పాలంటే స్టోరీ రొటీన్‌గా ఉన్న ఆసక్తికరమైన పొలిటికల్ మూమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్ డ్రామాతో 'పరంపర 2' ఆకట్టుకుంటుంది. -సంజు (సాక్షి వెబ్‌డెస్క్) -
ఆ సినిమా కోసం నాలుగేళ్లుగా గెడ్డం తీయలేదు : శరత్ కుమార్
‘థియేటర్ లకు జనాలను రప్పించాలంటే ఇప్పుడు శ్రమ పడాల్సి వస్తోంది. పాన్ ఇండియా ఆర్టిస్టులను పెడుతున్నారు. అలాగే మంచి ప్రమోషన్ చేయాలి. కానీ ఓటీటీ అలా కాదు. కొంత ప్రమోషన్ చేసి మంచి కంటెంట్ చూపిస్తే...ఆడియెన్స్ ఇంట్లోనే కూర్చొని చూస్తారు’అని ప్రముఖ నటుడు శరత్ కుమార్ అన్నారు. ఆయన నటించిన తాజా వెబ్ సిరీస్ ‘పరంపర’ సీజన్2. గతేడాది డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీక్వెల్ ఇది. ఈ వెబ్ సిరీస్ లో శరత్ కుమార్‌తో పాటు జగపతిబాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించారు.. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు.నేటి(జులై 21)ఈ కొత్త డిరీస్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా నటుడు శరత్ కుమార్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు... ►నా కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చాలా చేశాను. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్ లో చేస్తున్నాను. ఈ పాత్ర పూర్తిగా విలనీతో ఉండదు. మరొకరి వల్ల ఎదిగాడనే పేరును తట్టుకోలేడు. అదొక్కటే అతని సమస్య. మొత్తానికి భిన్నమైన సమస్య. నాకు నచ్చని మోహన్ రావు అనే వ్యక్తి కొడుకు వచ్చి ఎదిరించినప్పుడు మా మధ్య అసలైన గొడవ మొదలవుతుంది. ►ఈ వెబ్ సిరీస్ లో నాయుడు అనే పాత్రలో నటిస్తున్నాను. మోహన్ రావు (జగపతిబాబు) కొడుకు గోపి(నవీన్ చంద్ర) నాయుడును ఎదిరించినప్పుడు ఏం జరుగుతుందని అనేది ఈ సెకండ్ సీజన్ లో చూస్తారు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఒక్కో సందర్భంలో ఒక్కో పాత్ర హైలైట్ అవుతూ ఉంటుంది. ►పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం నాలుగేళ్లు గెడ్డం లుక్ అలాగే ఉంచుకోవాల్సివచ్చింది. అదే గెటప్ లో ఈ వెబ్ సిరీస్ లో నటించాను. ఈ టీమ్ అందరితో పనిచేయడం సంతోషంగా ఉంది. దర్శకులు విజయ్, విశ్వనాథ్, హరి, కెమెరా మెన్ ..ఇలా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశారు. నేనూ కంఫర్ట్ గా ఫీలయ్యాను. ఆర్టిస్టులు కూడా ఆమని, జగపతిబాబు, ఆకాంక్ష, నవీన్ చంద్ర ..బాగా నటించారు. కంటెంట్ బాగుంది కాబట్టి అంతా ఆకట్టుకునేలా నటించారు. ► కథ, మా క్యారెక్టరైజేషన్స్ ముందే డిజైన్ చేసి ఉంచారు కాబట్టి దర్శకులు ఎంతమంది అయినా నటించేప్పుడు కన్ఫ్యూజన్ లేదు. ఆ పాత్ర ఎలా ఉండాలో అలాగే చేసుకుంటూ వెళ్లాం. టీమ్ అంతా పూర్తి కోఆర్డినేషన్ తో పనిచేసింది. ► థియేటర్ లో రెస్పాన్స్ సులువుగా తెలిసిపోతుంది. సినిమా బాగుందా బాగా లేదా అని కలెక్షన్స్ చెబుతాయి. ఓటీటీలో కంటెంట్ బాగుందంటే మీడియా స్పందనను బట్టే తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కూడా బాగుందా బాగా లేదా అని చెబుతుంటాయి. ► గతంలో సీనియర్ నటులు పాత్రలను అర్థం చేసుకుని, దర్శకులు చెప్పినదాన్ని బట్టి నటించేవారు. ఇవాళ మాలాంటి నటులకు ఎన్నో రిఫరెన్స్ లు తీసుకునే అవకాశం, ప్రపంచ సినిమాను చూసి స్ఫూర్తి పొందే వీలు ఉంది. గతంలో అలా లేదు. ► మనకున్న బడ్జెట్ పరిమితుల్లో మంచి కథను చెబితే వెబ్ సిరీస్ లు కూడా మంచి ప్రాఫిట్ వస్తాయి. ఘన విజయాలు సాధిస్తాయి. అందులో ప్రజలకు ఏదో ఒక మంచిని చెప్పాలనే ప్రయత్నమూ మన కథలు, పాత్రల ద్వారా చేయవచ్చు. పరంపర 2 లో నా పాత్రకు మంచి డైలాగ్స్ ఉంటాయి. పర్మార్మెన్స్ కు అవకాశం ఉంది కాబట్టి ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది అనిపిస్తోంది. ►ఇప్పుడు సినిమాల్లో విలన్ అంటే అర్థం మారిపోయింది. చూపించే విధానం ఛేంజ్ అయ్యింది. నా దృష్టిలో మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు అనేది వాళ్ల ఆలోచించే కోణంలో ఉంటుంది. ఎవరికి వారే మేము హీరోనే అనుకుంటారు. ఇంట్లో వాళ్లను దూషించినప్పుడు మాత్రమే నాకు బాగా కోపమొస్తుంది. ►ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న వారుసుడు సినిమాలో నటిస్తున్నాను. పొన్నియన్ సెల్వన్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే లారెన్స్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాను. -
పరంపర సీజన్-2 వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే..
పరంపర..గతేడాది నెటిజన్లను విపరీతంగా ఆకర్షించిన వెబ్‌సిరీస్‌లలో ఇది ఒకటి. డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సీజన్‌కు కొనసాగింపుగా రెండవ సీజన్ రాబోతుంది. పరంపర-2గా వస్తున్న వెబ్‌సిరీస్ జులై21 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. యంగ్ హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్‌సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయ్యింది. దీంతో సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు.నాయుడు, గోపి మధ్య మొదలైన యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందో ఊహించని మజిలీలతో ఆసక్తి రేపుతున్న "పరంపర సీజన్ 2" ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఎవరికోసమో మొదలుపెట్టిన యుద్ధం.. దేనికోసం అనే ప్రశ్న దగ్గర ఆగితే.. దానికి అసలైన సమాధానమే "పరంపర" సీజన్ 2. పాయింట్ బ్లాంక్ కి భయపడకుండా, ఎదురువెళ్ళి తెగబడే ఓ యువకుడి ధైర్యం ప్రపంచానికి వినిపించిన ఒక కొత్త స్వరం ఈ సీజన్-2. ప్రేమ, ప్రతీకారాల మధ్య నమ్మిన సిద్ధాంతం ఎవరిని ఎటు నడిపించిందో.. ఏ బంధాన్ని ఏ తీరానికి చేర్చిందో తెలుసుకోవాలంటే "పరంపర" సీజన్ 2 చూడాల్సిందే. సో డోంట్ మిస్. పరంపర సీజన్-2ని డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. https://bit.ly/3cue9Vc -
పరంపర సీజన్ 2 టీం స్పెషల్ ఇంటర్వ్యూ
-
తండ్రి కోసం కొడుకు చేసే యుద్ధమే ఈ సిరీస్: నవీన్ చంద్ర
Naveen Chandra About His Role In Parampara 2: హీరో, విలన్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్.. ఇలా పాత్ర ఏదైనా నటుడిగా మెప్పిస్తుంటారు నవీన్ చంద్ర. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ ఆయన పేరు తెచ్చుకుంటున్నారు. నవీన్ చంద్ర 'గోపీ' పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'పరంపర'. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్‌లో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా సిరీస్ విశేషాలను పంచుకున్నారు నవీన్ చంద్ర. - పరంపర వెబ్ సిరీస్ మొదటి భాగం చాలా పెద్ద హిట్ అయ్యింది. తొలి భాగంతో పాటు సెకండ్ సీజన్ కూ అప్పుడే సన్నాహాలు ప్రారంభించాం. అందుకే ఇంత త్వరగా సెకండ్ సీజన్ ను మీ ముందుకు తీసుకురాగలిగాం. దీనికి ఆర్కా మీడియా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ముందు చూపే కారణం. ఫస్ట్ సీజన్ హిట్టయితే తప్పకుండా సెకండ్ సీజన్ కు క్రేజ్ ఉంటుందని వాళ్లు సరిగ్గానే అంచనా వేశారు. - ఈ వెబ్ సిరీస్ లో గోపి అనే పాత్రలో నటించాను. పొలిటికల్ రివేంజ్ డ్రామా ఇది. నా క్యారెక్టర్ ఈ సెకండ్ సీజన్ లోనే పవర్ ఫుల్ గా మారుతుంది. ఫస్ట్ సీజన్ లో శరత్ కుమార్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈ సీజన్ లో నేను అతని మీద పైచేయి సాధిస్తాను. తన తండ్రి నుంచి లాక్కున్న అధికారం, పేరు ప్రతిష్టలను తిరిగి నాన్నకు ఇచ్చేందుకు ఓ కొడుకు చేసిన యుద్ధమే ఈ వెబ్ సిరీస్. తండ్రిని పరాజితుడిగా చూడలేకపోతాడు గోపి. నాన్న కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించేందుకు ఫైట్ చేస్తుంటాడు. - ఈ వెబ్ సిరీస్ లో ఆరేడు పాత్రలు చాలా బలంగా ఉంటాయి. నాకు ఇలాంటి కథలంటే చాలా ఇష్టం. హీరోకు స్కోప్ ఉండి మిగతా పాత్రలు తేలిపోతే అందులో ఆసక్తి ఉండదు. అన్ని క్యారెక్టర్స్‌కు నటించేందుకు అవకాశం ఉండాలి. అప్పుడే కథ బాగుంటుంది. మొదటి సిరీస్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సిరీస్ ను ఇంకా జాగ్రత్తగా అన్ని ఎమోషన్స్ కలిపి చేశాం. - రామ్ చరణ్ మా సిరీస్ ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. స్టార్స్ తో ప్రమోషన్ చేస్తే దాని రీచింగ్ వేరుగా ఉంటుంది. కోవిడ్ వల్ల థియేటర్స్ కు దూరమైన ప్రేక్షకులు ఓటీటీని ఎక్కువగా ఆదరించడం మొదలుపెట్టారు. మధ్యలో మళ్లీ థియేటర్లకు వెల్లారు. ఇప్పుడు ఓటీటీపై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంటెంట్ ఎక్కడున్న వాళ్ల ఆదరణ దక్కుతుందని నా నమ్మకం. - నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదులుకోను. నా మొదటి చిత్రం 'అందాల రాక్షసి'తో గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ తో 'అరవింద సమేత వీర రాఘవ'లో నటించినప్పుడు మరోసారి ఫేమ్ అయ్యాను. ఎన్టీఆర్ ఆ సినిమా ఫంక్షన్ స్టేజీ మీదే నా పాత్ర గురించి, నెను ఎంత బాగా నటించాను అనేది చెప్పారు. అది ఇండస్ట్రీలో బాగా రీచ్ అయ్యింది. - నేను విలన్ పాత్రల్లో నటించినా మీ విలనీ బాగుంది అంటారు. గ్రే క్యారెక్టర్స్ చేసినా బాగుంటుంది అని చెబుతుంటారు. ప్రేక్షకుల నుంచి వచ్చేది స్పందన నిజాయితీగా ఉంటుంది. నేను అది ఎక్కువగా తీసుకుంటాను. సోషల్ మీడియా ద్వారా కూడా అన్నా, మీ క్యారెక్టర్ బాగుంది అని కామెంట్స్ చేస్తుంటారు. 'విరాటపర్వం'లో నా రోల్ పెంచాల్సింది అనే కామెంట్స్ వచ్చాయి. - నటుడిని అయ్యేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నాలో నటన మీద ఎలాంటి ఇష్టం ఉందో, ఇప్పటికీ అదే ఆసక్తి , ఉత్సాహం ఉన్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా వెబ్ సిరీస్ ఏది చేసినా నటుడిగా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను. -
కోల్పోయిన జీవితం తిరిగి కావాలి.. స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో 'పరంపర 2'
Parampara 2 Web Series Trailer: తెలుగు వెబ్ సిరీస్‌లలో ఘన విజయం సాధించిన వాటిలో 'పరంపర' ఒకటి. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సిరీస్ అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా 'పరంపర సీజన్ 2' వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్సరీస్ సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసి, టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్‌కు ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. 'ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర నుంచి లాక్కున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి' అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్‌గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది. మూడు జెనరేషన్స్కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ రూపొందగా, స్ట్రాంగ్ ఎమోషన్స్‌తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ ఆశాభావం తెలిపింది. పొలిటికల్, రివేంజ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'పరంపర 2' జులై 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
ఐఎమ్‌డీబీ రేటింగ్ ఇచ్చిన 10 బెస్ట్ తెలుగు వెబ్ సిరీస్‌లు..
Top 10 Best Telugu Web Series As Per IMDB Rating: కరోనా కాలంలో ఎంటర్టైన్మెంట్కు సరైన వేదికలుగా మారాయి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు. లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో విభిన్నమైన కథలతో మూవీ లవర్స్‌కు ఎంతో చేరువయ్యాయి. ఓటీటీల్లో స్ట్రీమ్ అయిన చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లంటే పెట్టింది పేరుగా బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్ సిరీస్‌లు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ సీన్ మారింది. వెబ్ సిరీస్‌లు తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకనిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. తెరకెక్కించడమే కాకుండా తెలుగు నేటివిటికి తగినట్లుగా మలిచి మంచి హిట్ కూడా అందుకుంటున్నారు. ఈ వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి ఓటింగ్ తీసుకుని వాటికి రేటింగ్ నిర్ణయిస్తుంది ఐఎమ్‌డీబీ వెబ్సైట్. ఈ రకంగా ఐఎమ్‌డీబీ రేటింగ్‌ను బట్టి ప్రేక్షకులను మెచ్చిన టాప్ 10 తెలుగు వెబ్ సిరీస్‌లు ఏంటో ఓ లుక్కేద్దామా ! చదవండి: వెబ్ సిరీస్‌లతో ఆకట్టుకున్న స్టార్ హీరోలు వీరే.. 1. లూజర్-8.8 రేటింగ్ (జీ5) 2. కుడి ఎడమైతే-8.4 రేటింగ్ (ఆహా) 3. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ-8.4 రేటింగ్ (జీ5) 4. కొత్త పోరడు-8.3 రేటింగ్ (ఆహా) 5. తరగతి గది దాటి-8 రేటింగ్ (ఆహా) 6. గాడ్ ఆఫ్ ధర్మపురి-7.8 రేటింగ్ (జీ5) 7. పరంపర-7.6 రేటింగ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్) 8. మస్తీస్-7.2 రేటింగ్ (ఆహా) 9. చదరంగం-7.1 రేటింగ్ (జీ5) 10. బ్యూటీ అండ్ ది బేకర్-7 రేటింగ్ (ఆహా) చదవండి: అమ్మో జాంబీలు.. నిద్రలోనూ వెంటాడే వెబ్ సిరీస్‌లు.. -
పరంపర వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: పరంపర కథ: హరి యేలేటి దర్శకత్వం: కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్ నేపథ్య సంగీతం: నరేష్ కుమారన్ ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల: 24 డిసెంబర్ 2021 బాహుబలి చిత్ర నిర్మాణ సంస్థ 'ఆర్కా మీడియా' వెబ్ సిరీస్ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. కృష్ణ విజయ్, విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వెబ్ సిరీస్ పరంపర. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఆర్కా మీడియా ఒక వెబ్ సిరీస్ తీస్తుందనే వార్తలు వినిపించడంతో 'పరంపర'పై అనేక అంచనాలు ఏర్పడ్డాయి. మురళి మోహన్, జగపతి బాబు, శరత్ బాబు వంటి, ఆమని వంటి సీనియర్ నటీనటుమణులతో తెరకెక్కిన 'పరంపర' మొదటి నుంచే మంచి బజ్ క్రియేట్ చేసింది. అలాగే హాట్‌స్టార్ ఒరిజినల్స్ మొదటిసారిగా చేసిన తెలుగు వెబ్ సిరీస్ ఇది కావడం విశేషం. యాక్షన్, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు ఎంత వరకు ఆకట్టుకుందో చూద్దాం. కథ: రాజకీయం, పవర్, మోసం, కుటుంబం విలువలు వంటి అంశాలతో రూపొందించిన వెబ్ సిరీస్ పరంపర. విశాఖ జిల్లాకు చెందిన వీర నాయుడు (మురళి మోహన్) ప్రజల మనిషి. రాజకీయాల్లో తనదైన శైలిలీ పట్టు సాధిస్తూ ప్రజలకు అండగా నిలుస్తాడు. వీర నాయుడికి మోహన రావు (జగపతి బాబు), నాగేంద్ర నాయుడు (శరత్ కుమార్) ఇద్దరు కుమారులు. రాజకీయాలు, ప్రజలను ఆదుకోవడం వంటి పనులను పెద్ద కుమారుడైన మోహన రావుకు కట్టబెడుతూ ప్రాముఖ్యతనిస్తాడు వీర నాయుడు. ఇది చూసిన నాగేంద్ర నాయుడుకు ఈర్శ్య, ద్వేషం కలుగుతాయి. దీంతో ఎలాగైన తాను కింగ్‌మేకర్‌గా అవ్వాలనుకుంటున్న నాగేంద్ర నాయుడికి తన తండ్రి మరణం మంచి అవకాశంగా మారుతుంది. ఈ ఒక్క సంఘటనతో రాజకీయ, వ్యాపార వ్యవహారాలన్ని నాగేంద్ర నాయుడి చేతుల్లోకి వెళతాయి. అక్కడినుంచి నాగేంద్ర నాయుడి ఆధిపత్యం కొనసాగుతోంది. సెంటిమెంట్‌తో తన తండ్రిని పక్కన పెట్టి బాబాయ్ అధికారం చేజిక్కించుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు గోపి (నవీన్ చంద్ర). ఎలాగైన తిరిగి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడతాడు. ఇందుకోసం నాగేంద్ర నాయుడితో అంతర్యుద్ధానికి తెర లేపుతాడు గోపి. ఈ యుద్ధాన్ని కాలేజీ ప్రెసిండెట్ ఎన్నికల్లో నాగేంద్ర నాయుడు కుమారుడు సురేష్ (ఇషాన్)తో పోటీకి దిగుతాడు. అక్కడినుంచి నాగేంద్ర నాయుడితే గోపి యుద్ధం ప్రారంభమవుతుంది. అయితే ఈ యుద్ధంలో గోపి గెలిచాడా ? అధికారాన్ని చేజిక్కుంచుకున్నాడా ? అతనికి ఎదురైన పాత్రలు తనపై ఎలాంటి ప్రభావం చూపాయి ? అనేదే కథ. విశ్లేషణ: కథ అంత కొత్తగా అనిపించదు. అన్నదమ్ముల మధ్య ఉండే ఆధిపత్య పోరు, కుటుంబం కన్నా రాజకీయం ముఖ్యమనిపించే కథలు ఇది వరకు చాలానే చూశాం. అయితే కథను ఆవిష్కరించిన విధానంలో మాత్రం దర్శకులు విజయం సాధించారు. నాగేంద్ర నాయుడిపై అటాక్‌తో 'ప్రారంభం' అనే ఎపిసోడ్‌తో ప్రారంభమవుతుంది 'పరంపర' వెబ్ సిరీస్. ఈ యాక్షన్ సీన్‌తోనే పాత్రల పరిచయం చేస్తూ గోపి మోటివ్ను చూపించారు దర్శకులు. పొలిటికల్ డ్రామా, అధికారానికి ఉన్న శక్తిని చూపిస్తూనే కుటుంబం విలువలు, ఎమోషన్‌ను బాగా చూపించారు. రాజకీయం, అధికారమే తప్ప దేన్ని పట్టించుకోని అత్యంత కఠినమైన పాత్ర నాగేంద్ర నాయుడిది. అలాంటి పాత్ర కూడా ఎమోషనల్ అయి వెంటనే ఈర్శ్య కలగడం వంటి సీన్లతో అహంకారం ముందు ప్రేమ ఎలా నిలవలేదో చూపించి ఆకట్టున్నారు. హరి యేలేటి కథ అందించిన ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. మొదటి కృష్ణ విజయ్. ఎల్ డైరెక్ట్ చేయగా మిగతా ఎపిసోడ్లన్నింటిని విశ్వనాథ్ అరిగెల, హరి యేలేటి డైరెక్ట్ చేశారు. అయితే వెబ్ సిరీస్ నిడివి కొంచెం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అన్ని ఎపిసోడ్లు కలిపి సుమారు ఐదున్నర గంటలకుపైగా ఉంటుంది. కాకపోతే వెబ్ సిరీస్ ప్రారంభం నుంచి ఎంగేజింగ్‌గా తీశారు. అస్సలు బోర్ కొట్టదు. నాగేంద్ర నాయుడు, గోపి మధ్య పోటీ, నాగేంద్ర నాయడిపై గెలవాలని గోపి చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి. మోహన రావును నాగేంద్ర నాయుడు ఎంత తొక్కిపెట్టిన తిరగబడక పోవడం, మోహన రావుపై నాగేంద్ర నాయుడి ఈర్శ్యకు గల కారణాలను బానే ప్రజెంట్ చేశారు. చివరి రెండు ఎపిసోడ్లు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ప్రేక్షకులు నిరాశ పడతారు. అయితే క్లైమాక్స్ మాత్రం క్లైమాక్స్‌లా ఉండదు. ఇంకా వెబ్ సిరీస్ కొనసాగుతుందేమో అనే ఫీలింగ్‌ను క్రియేట్ చేస్తుంది. వెబ్ సిరీస్‌కు ఇదే ఆరంభం మాత్రమే అనే హింట్ ఇచ్చేందుకే దర్శకులు క్రైమాక్స్ అలా ప్లాన్ చేశారేమో అని తెలుస్తోంది. క్లైమాక్స్‌తో అసలు కథ ఇంకా మిగిలే ఉందని, ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కూడా రానుందని అర్థమైపోతుంది. అక్కడక్కడ కొన్ని అడల్ట్ కంటెంట్ సీన్లు ఉంటాయి. ఇవి కాస్త ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఇబ్బంది కలిగిస్తాయి. సిరీస్‌లో పాత్రల మధ్య వచ్చే సంభాషణలు, డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే: నలుగురికి సహాయపడే పాత్రలో మురళి మోహన్, జగపతి బాబు చక్కగా ఒదిగిపోయారు. సాధారణంగా కుటుంబంలో పెద్ద కుమారుడి డామినేషన్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్‌లో చిన్న కుమారుడు నాగేంద్ర డామినేషన్, నెగెటివ్ పాత్ర అయిన నాగేంద్ర నాయుడిగా శరత్ కుమార్ వెల్ సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. మోహన రావును తొక్కిపెట్టి కపటధారిగా ఆకట్టుకున్నారు. అలాగే మోహన రావు, నాగేంద్ర నాయుడు యుక్త వయసు పాత్రల్లో శ్రీతేజ్, ప్రవీణ్ యండమూరి మంచి నటనతో మెప్పించారు. మోహన రావు భార్య, గోపి తల్లి భానుమతిగా ఆమని నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బాబాయ్ అధికారాన్ని అంతం చేయాలనే గోపి పాత్రతో నవీన్ చంద్రకు మంచి ఛాలెంజింగ్ రోల్ దక్కిందని చెప్పుకోవచ్చు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు నవీన్ చంద్ర. అప్పటివరకు సైలెంట్‌గా ఉండి చివరిలో పూర్తి వ్యూహాత్మకంగా వ్యవహరించే సురేష్ పాత్రలో ఇషాన్ (రోగ్ ఫేమ్) నటించి పర్వాలేదనిపించాడు. రచనగా హీరోయిన్ ఆకాంక్ష ఆకట్టుకోగా.. గోపి లవర్‌గా జెన్నీ పాత్రలో తన అందాలతో గ్లామర్‌ను యాడ్ చేసింది నైనా గంగూలి. నాగేంద్ర నాయుడి అధికారానికి నలిగిపోయే ఇందిరా పాత్రలో కస్తూరి తనదైన పరిధిలో ఆకట్టుకుంది. నరేశ్ కుమరన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. అక్కడక్కడ వచ్చే పాటలు సన్నివేశాలకు అవసరం లేదనిపిస్తాయి. కథ కొత్తగా అనిపించకపోయిన టేకింగ్ మాత్రం థ్రిల్లింగ్ అనుభూతిని ఇస్తుంది. మొత్తంగా చూసుకుంటే 'పరంపర'ను చూసి కొనసాగించవచ్చని చెప్పుకోవచ్చు. -
అందాల ఆకాంక్ష సింగ్ ఫోటోలు
-
డిజిటల్ స్ట్రీమింగ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది
‘‘ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. టాలీవుడ్‌లోనూ ఎన్నో ఒరిజినల్ ప్రొడక్షన్స్ క్రియేటివ్‌గా కథలు చెప్పేందుకు ముందుకు వస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని నాగార్జున అన్నారు. ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో తెలుగు ఒరిజినల్ డ్రామా సిరీస్ ‘పరంపర’, నాగార్జున హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ త్వర లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ప్రెసిడెంట్ అండ్ హెడ్ సునీల్ రాయన్ మాట్లాడుతూ– ‘‘ఇండియాలో ది బెస్ట్ కంటెంట్ ఇచ్చేందుకు ముందుంటాం. ‘‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌తో తెలుగు ఇండస్ట్రీ అసోసియేట్ అవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ అంబాసిడర్, హీరో రామ్‌చరణ్. ‘పరంపర, 9 అవర్స్, ఝాన్సీ, బిగ్ బాస్ లైవ్’ వంటి వాటిని దేశవ్యాప్తంగా చూపించబోతున్నాం’’ అన్నారు ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ప్రెసిడెంట్ అండ్ హెడ్ సునీల్ రాయన్. -
ఊరికి పరంపర
చెట్టు ఎంత ఎదిగినా వేళ్లను వదిలిపెట్టదు. తాను ఎదుగుతున్న కొద్దీ వేళ్లను కూడా అంతగా విస్తరించుకుంటుంది. మహావృక్షంగా మారిన తర్వాత ఊడలను దించుకుంటుంది. మరి.. మనుషులం? మన మూలాలను పుటుక్కున తెంచేసుకుంటున్నాం. ‘ఎంత ఎత్తుకి ఎదిగినా పాదాలు ఉండాల్సింది నేల మీదనే’ అనే చిన్న సూత్రాన్ని మర్చిపోతున్నాం. ‘‘అది గుర్తు చేయడానికే ‘పరంపర’ కల్చరల్ ఆర్గనైజేషన్‌ను స్థాపించాం.. అంటున్నారు డాక్టర్ శ్రీనాగి, శశికళ. దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ‘‘తమిళనాడు, కర్ణాటక వాళ్లు సంస్కృతికి దూరం కారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా సరే.. ఏడాదిలో ఒకసారి వారి సొంత ప్రదేశాలకు చేరిపోతారు. అందరూ కలిసి సంగీతం, నాట్యాలతో వాళ్ల సంప్రదాయ రీతులను ప్రదర్శించుకుంటారు. ఇక్కడ ప్రదర్శకులు వేరు, ప్రేక్షకులు వేరు కాదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక కళలో ప్రవేశం ఉంటుంది. చిన్నదో పెద్దదో ఏదో ఒక బాధ్యత తీసుకుంటారు. ఒకరు ప్రదర్శిస్తుంటే మిగిలిన వాళ్లు ప్రేక్షకులైపోతారు. సాంస్కృతిక వేడుకలు పూర్తయిన తర్వాత తిరిగి తమ తమ ఉద్యోగాలకు వెళ్లిపోతారు. ఐదేళ్ల కిందట ఒక స్నేహితురాలి ఆహ్వానంతో బెంగళూరుకెళ్లినప్పుడు వాళ్ల సంప్రదాయం, సంస్కృతిని పరిరక్షించుకుంటున్న తీరు తెలిసింది. తెలుగువాళ్లకు అలవాటు చేద్దామనిపించింది’’ అన్నారు డాక్టర్ శ్రీనాగి. మనకూ వేదికలు.. వేడుకలు ‘‘మనదైన శాస్త్రీయ సంగీత కచేరీలు, సంప్రదాయ నాట్యరీతులు ఉన్నాయి. వాటిని ప్రదర్శించడానికి హైదరాబాద్‌లో రవీంద్రభారతి, శిల్పకళావేదిక వంటి వేదికలూ ఉన్నాయి. ప్రతి పట్టణంలోనూ ఇలాంటి వేదికలూ ఉండనే ఉన్నాయి. అయితే కళాభిరుచి ఉన్న వాళ్లను మాత్రమే ఆకర్షిస్తాయవి. సంస్కృతి గురించి ఏమీ తెలియని వారికి కూడా మన సంస్కృతి మూలాల దగ్గరకు తీసుకురావాలంటే మాకు కనిపించిన మార్గం ఒక్కటే. ఆ కార్యక్రమాలను వారి ముంగిటకు తీసుకెళ్లడమే. అందుకే నాలుగేళ్ల నుంచి కళాసాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను తీసుకున్నాం’’ అని పరంపర కల్చరల్ ఆర్గనైజేషన్ గురించి చెప్పారు శశికళ. డాక్టర్ శ్రీనాగి, శశికళ ఇద్దరూ తమవంతు బాధ్యతగా సామాజిక కార్యక్రమాలను నిర్వహింస్తుంటారు. ‘రోష్ని’ స్వచ్ఛంద సంస్థ స్థాపనలోనూ కీలకంగా వ్యవహరించారు శశికళ. రోష్ని సంస్థ ఆత్మహత్యకు పాల్పడే వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తుంది. జీవితం మీద ఆసక్తి కోల్పోకుండా చేస్తుంది. జీవితంలో కష్టాలుంటాయి, కానీ అవి జీవితానికి డెడ్ఎండ్లు కాదు, టర్నింగ్‌లు మాత్రమేననే మంచి మాటలతో నిరాశానిస్పృహలను తొలగించి జీవితేచ్ఛ కలిగిస్తుంటుంది రోష్ని సంస్థ. వీరిద్దరి స్నేహం ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల పరిరక్షణ బాధ్యతను తలకెత్తుకుంది. ‘పరంపర... నర్చరింగ్ కల్చర్’ అనే ట్యాగ్‌లైన్‌లోనే తామేం చెప్పదలుచుకున్నామో ఉందంటారు శ్రీనాగి, శశికళ. గుడిలోనే ఎందుకు? సాంస్కృతిక కార్యక్రమాలను గుడి ఆవరణలో నిర్వహించడం వెనుక బలమైన కారణాన్ని చెబుతున్నారీ మహిళలు. ‘‘ప్రతి ఊళ్లోనూ ఆలయం ఉంటుంది. గుడి ధార్మిక ప్రదేశమే. అయితే మతపరమైన పరిధితో గిరిగీసుకునే ప్రదేశం కాదు. ఆ గ్రామస్తు లందరికీ సమావేశ వేదిక. ఊరికి, ఊళ్లో వాళ్లకు సంబంధించిన ఏ అంశాన్నయినా గుడి ఆవరణలోనే చర్చించుకునేవాళ్లు. ఆ సంస్కృతిని గుర్తు చేయడానికే గుడి ఆవరణను ఎంచుకున్నాం. ఎక్కడెక్కడ ప్రాచీన ఆలయాలున్నాయో శోధించాం. శంషాబాద్ దగ్గర అమ్మపల్లె రామచంద్రస్వామి ఆలయం ఏడు వందల ఏళ్ల నాటిది. మనం గుజరాత్కెళ్లి చూసొచ్చే స్టెప్‌వెల్ కూడా ఉందీ ఆలయం సమీపాన. చాలామందికి అక్కడ అంత గొప్ప ప్రాచీన ఆలయం ఉందనే సంగతి కూడా తెలియదు. నాలుగేళ్లు మేము ఆ ఆలయంలో కూడా ఒక వేడుకను నిర్వహించడంతో ఇప్పుడు అక్కడికి భక్తులు ముఖ్యంగా పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది. భువనగిరిలోని అక్కన్న మాదన్నల ఆలయానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యం ఈతరం చాలా మందికి తెలియడమే లేదు. మా గుడి సంబరాల నిర్వహణకు ప్రాచీన, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలనే ఎన్నుకుంటున్నాం. కళాకారుల ఎంపికలో మేము ఇప్పటికే పేరు గడించిన వారి కోసం ప్రయత్నించడం లేదు. టాలెంట్ ఉండి పెద్దగా గుర్తింపునకు నోచుకోని వారి కోసం గాలించినంత పని చేస్తున్నాం. ఇదంతా స్వచ్ఛందంగా చేస్తున్న పని. ప్రదర్శనకు టికెట్ ఉండదు. వీలయినంత ఎక్కువ మందికి మన మూలాలను తెలియచేయడమే మా ఉద్దేశం. ఎవరైనా స్థానికంగా మాకు సహకరిస్తే వారి సహాయం తీసుకుంటున్నాం. మై హోమ్, బీవీఆర్, ఏఎమ్ఆర్ వంటి సంస్థలు కొంత వరకు ఆర్థిక తోడ్పాడునిస్తున్నాయి. గద్వాల్ కోటలో ‘పాతాళభైరవి’, ‘మాయాబజార్’ నృత్యనాటకాలను ప్రదర్శించాం. మహబూబాబాద్‌లో ‘నర్తనశాల’ ప్రదర్శించాం. ఆ ప్రదర్శన గురించి తెలిసిన వరంగల్ ఎమ్మెల్యే తర్వాతి ప్రదర్శన భద్రకాళి ఆలయంలో పెట్టమని అడిగారు. అలా ఎక్కడికక్కడ స్థానికంగా ఎవరైనా ముందుకు వచ్చి సహకరిస్తే మాకు కొంత బరువు తగ్గుతుంది. అలా లేనిచోట పూర్తి బాధ్యత మాదే. ఈ వేడుకలు ఈ రోజు (జనవరి 11న) మొదలయ్యాయి. ఏటా జనవరి నుంచి మార్చి వరకు సాగే ఈ కార్యక్రమాల్లో మాతో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఉన్న వాళ్లందరికీ ఇదే మా ఆహ్వానం’’ అన్నారు డాక్టర్ శ్రీనాగి, శశికళ. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి కార్యక్రమాల ‘పరంపర’: జనవరి 11 : కనకదుర్గ ఆలయం, విజయవాడ (ముగిశాయి) జనవరి 13 : భావ నారాయణ ఆలయం, బాపట్ల; జనవరి 16 : వేయి స్తంభాల గుడి, వరంగల్ జనవరి 19 : శ్రీ రామచంద్రస్వామి ఆలయం , అమ్మపల్లె, శంషాబాద్, హైదరాబాద్ జనవరి 27 : వేణుగోపాల స్వామి ఆలయం, అక్కన్నమాదన్న ఆలయం, భువనగిరి ఫిబ్రవరి 2 : వీరభద్రస్వామి ఆలయం, అప్పా సర్వీస్ రోడ్, నార్సింగి, హైదరాబాద్ ఫిబ్రవరి 22 : అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయం, మామిడిపల్లి, నిజామాబాద్ మార్చి 4 : ధర్మపురి క్షేత్రం, మియాపూర్, హైదరాబాద్ -
‘పరంపర’ప్రెస్ మీట్
-
‘పరంపర’కు ప్లాటినమ్ అవార్డ్
ఆర్ష సంప్రదాయానికి పూర్వవైభవం తేవాలనే లక్ష్యంతో స్వీయదర్శకత్వంలో మధు మహంకాళి రూపొందించిన చిత్రం ‘పరంపర’. నరేశ్, ఆమని జంటగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల విడుదల కానుంది. కాగా, ఇండోనేసియాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్ర అవార్డుల వేడుకలో ఈ చిత్రం ప్రదర్శితమైంది. అక్కడ ఈ చిత్రానికి ‘ప్లాటినమ్ అవార్డు’ లభించడం విశేషం. అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను, చితికి పోతున్న బంధాలను, బాంధవ్యాలను తిరిగి స్వాగతించడమే ప్రధానాంశంగా రూపొందించిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకోవడం ఆనందంగా ఉందని మధు మహంకాళి పేర్కొన్నారు. రావి కొండలరావు, సంతోష్, మనీషా, మాస్టర్ సాయితేజ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసన్నజైన్, సంగీతం: అర్జున్, కూర్పు: పరేష్ కాందార్, పాటలు: రాణిపులోమజాదేవి, నిర్మాణం: ధృతి మీడియా ప్రై.లిమిటెడ్. -
'పరంపర', 'దేవ్', 'మళ్లీ రాదోయ్ లైఫ్' చిత్రాల ఆడియో ఆవిష్కరణ
-
మూడు తరాల కథ
‘‘తండ్రీ, కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రం ఇది. చక్కని ఫీల్ ఉన్న సినిమా. ఇలాంటి మంచి చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది’’ అని సీనియర్ నరేశ్ చెప్పారు. మధు మహంకాళి దర్శకత్వంలో నరేశ్, ఆమని ముఖ్య తారలుగా రూపాదేవి మహంకాళి నిర్మించిన చిత్రం ‘పరంపర’. అర్జున్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నరేశ్ ఆవిష్కరించి, అతిథిగా పాల్గొన్న దర్శకుడు ప్రవీణ్ సత్తారుకి అందజేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మూడు తరాలకు చెందిన కథ ఇది. తన ముందు తరంవాళ్లు చేసిన తప్పును తాను చేయకూడదని తనకు జరిగిన నష్టం తన కొడుక్కి జరగకూడదని ఓ తండ్రి పడే తపనే ఈ చిత్రం’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇదే వేదికపై మరో రెండు చిత్రాల ఆడియో ఆవిష్కరణలు జరపడం విశేషం. అవి ‘దేవ్’, ‘మళ్లీ రాదోయ్ లైఫ్’. చార్మి ప్రధాన పాత్రలో ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో డా. శిల్ప రమేష్ రమణి ‘దేవ్’ నిర్మించారు. జెస్సీ గిఫ్ట్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఆవిష్కరించి, డిజిక్వెస్ట్ బసిరెడ్డికి అందించారు. ‘మళ్లీ రాదోయ్ లైఫ్’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రఘు బెల్లంకొండ నిర్మించారు. విజయ్ కురాకుల స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి, సునీల్‌కుమార్ రెడ్డికి ఇచ్చారు. -
పరంపర మూవీ స్టిల్స్, పోస్టర్స్
-
మానవతా విలువలకు పట్టం
అంతరించిపోతున్న సంస్కృతీ సంప్రదాయాలను, సన్నగిల్లుతున్న బాంధవ్యాలను తిరిగి స్వాగతించడమే ప్రధానాంశంగా తెరకెక్కిన చిత్రం - ‘పరంపర’. నరేశ్, ఆమని జంటగా నటించిన ఈ చిత్రాన్ని రూపాదేవి మహంకాళితో కలిసి మధు మహంకాళి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మహోన్నతమైన మానవతా విలువల నేపథ్యంలో సాగే కథాంశమిది. తెలుగు తెరపై ఇప్పటివరకూ ఇలాంటి ప్రయత్నం రాలేదని నమ్మకంగా చెప్పగలం. ఆర్ష సంప్రదాయానికి పూర్వవైభవం తేవడమే పరమావధిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇందులో నరేశ్, ఆమని పోటీ పడి నటించారు. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రావి కొండలరావు, సంతోష్, మనీషా, మాస్టర్ సాయితేజ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రసన్న జైన్, సంగీతం: అర్జున్, కూర్పు: పరేష్ కాందార్, పాటలు: రాణి పులోమజాదేవి, నిర్మాణం: ధృతి మీడియా ప్రై. లిమిటెడ్.